కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సుమిత్ర ప్రశ్నలు-పెంచిన ప్రేమ-జ్యోత్స్నపై దీప ఫైర్‌-నిజం చెప్పేద్దామ‌ని పారు-జ్యో మరో కుట్ర

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 7 ఎపిసోడ్ లో సుమిత్రను చూస్తూ దశరథ బాధ పడతాడు. ఏమైందని  సుమిత్ర ప్రశ్నలు వేస్తుంది. మరోవైపు జ్యోత్స్నపై దీప ఫైర్ అవుతుంది. నిజం చెబుదామని పారు అంటుంది. జ్యోత్స్న స్కామ్ గురించి బయటపెట్టొద్దని శ్రీధర్ కు కార్తీక్ చెప్తాడు.

Published on: Jan 7, 2026, 06:42:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 7 ఎపిసోడ్ సుమిత్రను ఇలా చూడటాన్ని తట్టుకోలేకపోతున్నా. తను ఏ తప్పు చేసిందని? తనను అర్థం చేసుకోకుండా ఆ రోజు మాటలతో హింసించి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణమయ్యా. తను వెళ్తే కానీ విలువ తెలియలేదు. ఇప్పుడు తనకే ముప్పు వచ్చింది. ఎలా తట్టుకోవడం? అని దశరథ బాధపడతాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

సుమిత్ర ప్రశ్నలు

ఈ వ్యాధి గురించి ఎలారా తనకు చెప్పేది అని దశరథ ఏడుస్తుండగా సుమిత్ర కళ్లు తెరుస్తుంది. ఎందుకు అందరు కన్నీళ్లు పెట్టుకున్నారు? ఏం జరుగుతోంది? దీప నువ్వైనా చెప్పు. కార్తీక్ ను చూస్తావేంటీ? ఏవండీ మీకు ఏమైంది? ఎవరికి ఏమైంది? ఏదో నన్ను చావుకు దగ్గరగా ఉన్న మనిషిలా చూస్తున్నారని సుమిత్ర ప్రశ్నలు వేస్తుంది. నీరసంగా ఉండటంతో కళ్లు తిరిగి పడిపోయావు. డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పిందని కార్తీక్ చెప్తాడు.

కార్తీక్ ధైర్యం

నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఎందుకో మీరు అంత దూరం అవుతారని, మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నట్లు కలలు వస్తున్నాయి. జ్యోత్స్న పెళ్లి నా కల. తన పెళ్లి అయ్యే వరకు బతికే ఉంటా. నా ప్రాబ్లెం గురించి సుమిత్రకు చెప్పనని మాట ఇవ్వండని అంటూనే సుమిత్ర మళ్లీ పడిపోతుంది. అత్తకు ఏం కాదు. అత్త ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డువేస్తామని కార్తీక్ ధైర్యం చెప్తాడు.

జ్యో వార్నింగ్

బయటకు వెళ్లి దీప ఏడుస్తుంది. సగం దరిద్రాలకు కారణం ఇదే గ్రానీ ముందు దీన్ని బయటకు గెంటేయ్ అని పారిజాతంతో జ్యోత్స్న చెప్తుంది. నీ కన్నతల్లికి ఏదో రోగం వచ్చినట్లు గుక్క పెట్టి ఏడుస్తున్నావ్? నీ ఓవరాక్షన్ చూసి డాక్టర్ కూడా నువ్వే సుమిత్ర కూతురు అనుకుంటుందని పారు అంటుంది. అనుకుంటే ఏమైంది? అని దీప అనగానే, విసిరేసిన విస్తరాకులాంటి బతుకు నీది. అవసరానికి మించి ఆశపడకు. మా ఫ్యామిలీకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని జ్యో వార్నింగ్ ఇస్తుంది.

పెంచిన ప్రేమ

ఇది నీ ఫ్యామీలీనా? సుమిత్రమ్మ ఎన్ని రోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో నీకు తెలుసా? ఏ రోజైనా పట్టించుకున్నావా? నేను ఈ ఇంటి మంచి కోరుకునే మనిషిని అని దీప అంటుంది. నీ కారణంగా సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు పైకే పోతుందని పారు అంటుంది. మీకు ఎవరి మీద ప్రేమలు ఉండవు. మనిషి సంకల్పం ముందు చావు కూడా తలవంచాల్సింది. సుమిత్రమ్మకు ఏం కాదని దీప అంటుంది.

నీలాంటిది కోరుకుంటే నా తల్లి చస్తుందని జ్యో అనగానే దీప కోపంతో ఊగిపోతుంది. తల్లి మీద కన్నప్రేమ లేకపోయినా పెంచిన ప్రేమైనా ఉండాలి కదా. తల్లి బిడ్డను పెంచుతుంది కదా నేను ఆ ప్రేమ గురించి అంటున్నానని దీప సీరియస్ అవుతుంది. జ్యోను లోపలికి లాక్కెళ్తుంది పారు. ఇప్పుడు మనం మూసుకుని కూర్చోవాలి. తిట్టినా, కొట్టినా బుద్ది లేదని పారు అంటుంది.

నిజం చెప్పేద్దామని

నేను సొంత కూతురు అయితే కదా బోన్ మ్యారోను ఇచ్చేది అని జ్యో అంటుంది. ఇప్పుడు నాకు భయమేస్తుందని పారు కంగారు పడుతుంది. పిల్లల విషయంలో పాపం చేశావు. కాలం మన మీద పగబట్టింది. తప్పించుకునే అవకాశం లేదని జ్యో అంటుంది. శివ నారాయణ కాళ్ల మీద పడి నిజం చెప్పే టైమ్ వచ్చిందనిపిస్తోందని పారు అంటుంది.

అప్పుడు నీకదే ఆఖరి రోజు అవుతుంది. నేను కన్నకూతురు కాదు. టెస్టులు చేయిస్తే దొరికిపోతా. నా భయం అమ్మకు వచ్చిన వ్యాధి కంటే పెద్దది అనిపిస్తుంది. ట్రీట్మెంట్ జరిగితే ఇప్పుడే మనం పోతాం. మనం తెగింపుతో నిర్ణయం తీసుకోవాలి. నేనో నిర్ణయం తీసుకున్నా. ఓటమిని ఒప్పుకోనని జ్యో ఏదో ప్లాన్ వేస్తుంది.

ఫ్రాడ్ చెప్పొద్దని

బయట ఉన్న శ్రీధర్ దగ్గరకు కార్తీక్ వస్తాడు. జ్యోత్స్న లక్కీ. జ్యోత్స్న ఆఫీస్ లో చేసిన స్కామ్స్ ఫైల్స్. ఇవి నా క్యాబిన్ లో పెట్టా. ఇంటి దొంగను మీ చెల్లెలు పట్టింది. ఆ దొంగ నా అల్లుడు. స్కామ్ మొత్తం పెన్ డ్రైవ్ లో కాపీ చేశాడని శ్రీధర్ చెప్తాడు. ఇదంతా జ్యోత్స్న చేసింది. కాశీ వీక్ పాయింట్ పట్టుకుని రెచ్చగొట్టింది. వైరా దగ్గర జీఎం పోస్టు ఇప్పించింది. కానీ జ్యో ప్లాన్ ఇది కాదు. ఫుడ్ కల్తీ చేయించి నిన్ను సీఈఓ పోస్టు నుంచి తప్పించడమని కార్తీక్ అన్నాడు.

జ్యో గురించి ఆలోచించను. పెద్దాయనకు నిజం చెప్తా. నిన్ను డ్రైవర్ ను చేసింది. ఇక ఎలా ఆగుతానని శ్రీధర్ అంటాడు. అత్త వైపు నుంచి ఆలోచించు. కూతురే తల్లిని కాపాడాలని డాక్టర్ చెప్పింది కదా. ఇప్పుడు మనవరాలి గురించి తెలిస్తే తట్టుకుంటాడా? అని కార్తీక్ ఆపుతాడు. అత్తకు బోన్ మ్యారో ఇవ్వాల్సింది జ్యోత్స్న కాదు, దీప. ఇప్పుడు జ్యో అసలు కూతురు కాదనే నిజం బయటపడుతుందని కార్తీక్ అనుకుంటాడు.

దీపను ఇంటి దగ్గర డ్రాప్ చేయ్. ఈ ఫైల్స్ గురించి మన ఇద్దరికి తప్ప ఇంకెవరికీ తెలియకూడదని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More