కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: తండ్రి ఒడిలో పడుకుని ఏడిపించిన స్వప్న- కార్తీక్‌ను నిలదీసిన తాత- ఒకేలా ఆలోచించిన దీప జ్యో!

కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 3వ ఎపిసోడ్‌లో తండ్రి ఒడిలో పడుకుని శ్రీధర్ బాధ గురించి చెబుతూ అందరు ఏడ్చేలా చేస్తుంది స్వప్న. కాశీ ఓడిపోయాడు నువ్వు గెలిచావ్ నాన్న అంటుంది. హాస్పిటల్ నుంచి వచ్చిన కార్తీక్‌ను రిపోర్ట్స్ గురించి నిలదీస్తాడు శివ నారాయణ. బాధను భరిస్తూ కన్నీళ్లను దిగమింగుకుంటాడు కార్తీక్.

Published on: Jan 3, 2026, 08:02:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో మీ నాన్న తప్పు చేశాడని నీకు అనిపిస్తుందా అని స్వప్నను అడుగుతాడు శ్రీధర్. కాశీ తప్పు చేశాడు. అతని బుద్ధి మారిపోయిందని స్వప్న అంటుంది. అయినా శ్రీధర్ బాధపడుతుంటాడు. దాంతో తండ్రి ఒడిలో పడుకుని ఏడుస్తూ శ్రీధర్ బాధ గురించి చెబుతుంది.

కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 3వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 3వ తేది ఎపిసోడ్

నువ్వు గెలిచావ్, కాశీ ఓడిపోయాడు

మీ రెండో పెళ్లి బయట పడ్డాక నా జీవితం ఏమైపోతుందో అని భయపడ్డారు. ఇప్పుడు నాకోసం అలాగే బాధపడుతున్నారు. మేము అందరి ప్రేమ కోరుకుంటాం. మీ మీద మాకున్న ప్రేమను ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తాం. నేను పెట్టిన టెస్టుల్లో నువ్వే గెలిచావ్ నాన్న. కానీ, కాశీ ఓడిపోయాడు అని ఏడుస్తూ చెబుతుంది. ఆ మాటలు విని కావేరి కూడా ఏడుస్తుంది.

నమ్మకాన్ని కాశీ దించేసుకున్నాడు. నువ్వింకా మోస్తూనే ఉన్నావ్ అని స్వప్న ఏడిపిస్తుంది. మరోవైపు హాస్పిటల్ నుంచి కార్తీక్ వాళ్లు వస్తారు. సుమిత్రకు ఏ సమస్య లేదన్నారు. మనసు ప్రశాంతంగా ఉందని దశరథ్ వెళ్లిపోతాడు. కార్తీక్‌ను నిజంగానే ఏం పర్లేదా అని అడుగుతుంది దీప. మావయ్య చెప్పారుగా అని లోపలికి తీసకెళ్తాడు కార్తీక్.

దశరథ్ గురించి కార్తీక్‌ను కంగారుగా అడుగుతుంది సుమిత్ర. ఇంతలో శివ నారాయణ ఏమైందని అడుగుతాడు. ప్రతి ఆరు నెలలకు టెస్ట్‌లు చేయించుకోవాలిగా అని కార్తీక్ అంటే.. రిపోర్టులో ఏముందని శివ నారాయణ అడుగుతాడు. రక్తం తక్కువ ఉందని అబద్ధం చెబుతాడు కార్తీక్. అందరూ అంతే అని అడిగితే అంతే అని కార్తీక్ ఇబ్బందిగా చెబుతాడు.

రిపోర్ట్స్ చూపించురా

సరే రిపోర్ట్స్ ఇటువ్వురా. సెకండ్ ఒపినీయన్ తీసుకుందామని శివ నారాయణ అడుగుతాడు. మేము మూడో ఒపినీయన్ కూడా అడిగాం అని కార్తీక్ అంటాడు. సరే మెడిసిన్ ఇవ్వు. అవి దేనికి పనిచేస్తాయో చూస్తా అని శివ నారాయణ అడుగుతాడు. డీ విటమిన్ ట్యాబ్లెట్స్‌లో ఏముంటుంది తాత. మాకు తెలియదా అని కార్తీక్ అంటాడు. కానీ, నీ మొహం చూస్తే ఏదో దాస్తూ ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుందని శివ నారాయణ అంటాడు.

వాడికి ఏం బాధ ఉండదు లెండి. అంత నచ్చినట్లే జరుగుతుంది కదా. సొంత చెల్లి అయితే బామ్మర్దిని జైలు నుంచి తీసుకొచ్చేవాడు కదా అని పారిజాతం అంటుంది. చెప్పిందే ఎన్నిసార్లు చెబుతావ్. నీకు వాడుకోడానికి బంధాలు కావాలి. కానీ, వాడు బంధాల కోసం ఎంత దూరమైన వెళ్తాడు అని కార్తీక్ గురించి గొప్పగా చెబుతాడు శివ నారాయణ.

దానికి కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. రేయ్ కార్తీక్ నీ మాట నేను నమ్ముతారా అని శివ నారాయణ అంటాడు. కార్తీక్‌ను సోఫాలో కూర్చోబెడుతుంది సుమిత్ర. దశరథ్‌ను కూడా పక్కన కూర్చోమంటాడు శివ నారాయణ. నీకోసం పాయసం చేశానురా. నాకు అన్ని తినాలనిపిస్తుంది. అందరికి అన్ని వడ్డించి పెట్టాలనిపిస్తుంది. అందరిని చూడాలనిపిస్తుంది అని సుమిత్ర అంటుంది.

మిస్ అయిన జ్యోత్స్న ఫైల్స్

డాక్టర్ చెప్పినదానికి నువ్వు చెప్పినదానికి సరిపోయింది అత్త అని కార్తీక్ లోపలే ఏడుస్తుంటాడు. బావ మొహంలో అంత బాధ ఎందుకు అని దీప అనుకుంటుంది. బావ ఎందుకు సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నాడు అని జ్యోత్స్న అనుకుంటుంది. కార్తీక్‌కు సుమిత్ర తినిపిస్తుంది. బావ ఏదో దాస్తున్నాడు అని దీప, జ్యోత్స్న ఒకేలా ఆలోచిస్తారు.

ఆఫీస్‌లో జరిగింది అంతా గుర్తు చేసుకుంటాడు శ్రీధర్. కార్తీక్ నీకోసం ఏదైనా చేయాల్సి వచ్చిన రోజున కచ్చితంగా చేస్తాను. జ్యోత్స్న జాతకం మన చేతిలో ఉందిగా. మనవరాలి గురించి మావయ్యకు చెబితే ఆయనే చూసుకుంటాడు అనుకున్న శ్రీధర్ మొత్తం వెతుకుతాడు. ఎక్కడ కనిపించవు.

ల్యాప్‌ట్యాప్‌లో డేటా ఉంటుందిగా అని చూస్తే అదంతా ఖాళీగా ఉండటంతో శ్రీధర్ షాక్ అవుతాడు. ఫైల్స్ ఎవరో కావాలనే డిలీట్ చేసినట్లుంది. ఇది చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది. జ్యోత్స్సకు తప్ప ఎవరికి లేదు. జ్యోత్స్న ఆఫీస్‌కు వచ్చిందా. అసలు ఈ విషయం జ్యోత్స్నకు ఎలా లీక్ అయింది తల బాదుకుంటాడు శ్రీధర్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More