కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: శ్రీధర్ చేతికి జ్యో ఫ్రాడ్ ఫైల్స్-అమ్మ గురించి దీప ఒట్టు-మాట మార్చిన కార్తీక్-తాత ప్రశ్నలు
కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 5 ఎపిసోడ్ లో జ్యోత్స్న ఫ్రాడ్ ఫైల్స్ మిస్ అయ్యాయని శ్రీధర్ కంగారు పడతాడు. ఆ ఫైల్స్ కాశీ కప్ బోర్డులో దొరకడంతో షాక్ అవుతాడు. మరోవైపు సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అనే విషయాన్న దాచి, చిన్న సమస్య అని దీపకు చెప్తాడు కార్తీక్. శివ నారాయణ డాక్టర్ కు కాల్ చేస్తాడు.
కార్తీక దీపం 2 టుడే జనవరి 5 ఎపిసోడ్ లో సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అనే విషయాన్ని తలుచుకుంటూ కార్తీక్ బాధపడతాడు. నీ బాధ నాకు అర్థమవుతూనే ఉంది బావ. హాస్పిటల్ కు వెళ్లి వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉన్నావు. హాస్పిటల్లో ఏం జరిగిందో చెప్పు. రిపోర్ట్ గురించి అడిగితే తడబడుతున్నావు. మా అమ్మ వైపు ఎందుకు చూడలేకపోయావు. ఏమైంది? బావ అని అడుగుతుంది దీప.

ఫైల్స్ మిస్సింగ్
మా నాన్న కూడా ఏమీ తెలియనట్టు ఉన్నాడు. చెప్పు బావ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. అమ్మకు ఏమైనా అయిందా? అని దీప అడుగుతుంది. అయింది, కానీ మీ అమ్మకు కాదు, నీకు. ఎవరికి ఏమైనా అయితే నీకు చెప్పకుండా ఉంటానా? నువ్వు జాగ్రత్తగా ఉండాలని కార్తీక్ అంటాడు. అప్పుడే శ్రీధర్ కాల్ చేసి ఆఫీస్ లో అకౌంట్ ఫైల్స్, జ్యోత్స్న తప్పు చేసిందని నిరూపించే ప్రూఫ్స్ మిస్ అయ్యాయని చెప్తాడు.
నాన్నపై నమ్మకం
ఆఫీస్ లో నా క్యాబిన్ లోనే పెట్టానని శ్రీధర్ అంటాడు. ల్యాప్ టాప్ పాస్ వర్డ్ ఎలా తెలిసింది? ఇది నీ నిర్లక్ష్యం కారణంగానే జరిగింది. జ్యోత్స్న ఎలాగో ఆఫీస్ కు వెళ్లదు. మరి ఇది ఎవరు చేశారో కనిపెట్టమని కాల్ కట్ చేస్తాడు కార్తీక్. అప్పుడే కాంచన వచ్చి మీ నాన్న ఇంకా ఆఫీస్ కు వెళ్తున్నాడా? అని అడుగుతుంది. నాన్న రిజైన్ చేస్తానని చెప్పినా తాతయ్య వద్దన్నాడని కార్తీక్ చెప్తాడు.
మా నాన్నకు మీ నాన్న మీద బాగానే నమ్మకం ఉందని కాంచన అంటుంది. ఆ నమ్మకం నీకు లేదా అని కార్తీక్ అడిగితే, లేకుండానే పోలీస్ స్టేషన్ కు వచ్చానా? అని కాంచన ప్రశ్నిస్తుంది. నీ భర్త అయితేనే కదా మా నాన్న అయింది. కొన్ని బంధాలు మారవని కార్తీక్ అంటాడు. షుగర్ వచ్చిన పేషెంట్ స్వీట్ కు ఎలా దూరంగా ఉంటాడో ఇది కూడా అంతే. నా మనసుకు పడని వాటిని దూరంగా పెడతానని చెప్పి కాంచన వెళ్లిపోతుంది.
కప్ బోర్డులో ఫైల్స్
కప్ బోర్డులో కాశీ బట్టలు చూసి స్వప్న ఫీల్ అవుతుంది. ఒకప్పుడు నువ్వు నా పక్కన లేకపోతే బతకలేనేమో అనుకున్నా. కానీ ఇప్పుడు నీ బట్టలు కూడా నా బట్టల పక్కన ఉంచడం నాకు నచ్చట్లేదని అనుకున్న స్వప్న వాటిని అక్కడి నుంచి తీసేద్దామనుకుంటుంది. అప్పుడే ఫైల్స్, పెన్ డ్రైవ్ బయటపడతాయి. ఇవి జ్యోత్స్న రెస్టారెంట్ ఫైల్స్ నాన్నకు ఇచ్చేద్దామని శ్రీధర్ కు ఇచ్చేస్తుంది స్వప్న.
జ్యోత్స్న కారణం
స్వప్న ఇచ్చిన ఫైల్స్, పెన్ డ్రైవ్ చూసి శ్రీధర్ షాక్ అవుతాడు. అల్లుడి ఘనకార్యాలు బయటపడుతున్నాయని ల్యాప్ టాప్ కు పెన్ డ్రైవ్ పెట్టి చూస్తాడు. సిస్టమ్ లో డిలీట్ చేసిన ఫైల్స్ అన్నీ ఇందులో కాపీ చేశాడు. జ్యోత్స్న అకౌంట్లో చేసిన ఫ్రాడ్ అంతా బయటకు తీసి ఫైల్ రెడీ చేశా. దీని గురించి కాశీకి, నాకు మాత్రమే తెలుసు. కార్తీక్ కు తర్వాత చెప్పా. నా అల్లుడు నా నమ్మకాన్ని అమ్మేశాడు. జ్యోత్స్న తప్పు చేసిందని ప్రూఫ్స్ తన దగ్గర పెట్టుకున్నాడు. అసలు కల్ ప్రిట్ వైరా కాదు జ్యోత్స్న అని శ్రీధర్ చెప్తాడు.
ఆలోచనలో కార్తీక్
నా అల్లుడు, మేనకోడలు కలిసి మోసం చేశారు. ఇదంతా జరగడానికి కారణమైన మనిషికి అందరిలోనే బుద్ధి చెప్పడానికి అని శ్రీధర్ వెళ్లిపోతాడు. స్కూల్ లో పేరెంట్స్ మీటింగ్ ఉంది ప్రిపేర్ గా ఉండమని శౌర్య చెప్పడంతో కార్తీక్ మళ్లీ ఆలోచనలో పడతాడు. శౌర్య, కాంచన, దీపకు టిఫిన్ తినిపిస్తాడు కార్తీక్. జీవితం కొన్నిసార్లు ఊహించని షాక్ లు ఇస్తుంది. మనిషి బలంగా తట్టుకుని నిలబడాలని కార్తీక్ అంటాడు. కానీ అత్త గురించి చెప్తే మాత్రం తట్టుకోలేవని లోపలే అనుకుంటాడు కార్తీక్.
దీప ఒట్టు
బావ నిజం చెప్పకపోతే నా కడుపులో ఉన్న మన బిడ్డ మీద ఒట్టేనని దీప అంటుంది. నిజాన్ని నువ్వు భరించలేవు దీప. డాక్టర్ చెప్పినట్లు అత్తకు ఒంట్లో బాలేదు. చిన్న ఆరోగ్య సమస్య. హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. ప్రాణాలకు ప్రమాదం అయ్యేదే అయితే నీతో చెప్పకుండా ఉంటానా అని అసలు విషయం దాచి తడబడతాడు కార్తీక్. చిన్న సమస్యకు నువ్వు ఇంతలా ఆలోచించవు బావ. అమ్మకు ఏం కాదు కదా అని దీప అడుగుతుంది. ఏం కాదంటాడు కార్తీక్.
నువ్వు ఏదైనా మర్చిపోయావా? కార్తీక్ అని శివ నారాయణ అడుగుతాడు. నీకు గుర్తు చేయాల్సిందే. ఇవి దశరథ, సుమిత్రల మెడికల్ రిపోర్ట్స్. నువ్వు కావాలనే మర్చిపోయావు. దీంట్లో ఏముందో తెలియొద్దని అనుకున్నావా. నేను ఎవరినీ అంత ఈజీగా నమ్మను. డాక్టర్ కు ఫోన్ చేశా. డాక్టర్ హారిక ఏం చెప్పారో నువ్వు చెప్తావా? నన్ను చెప్పమంటావా? అని శివ నారాయణ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


