కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ఇంట్లోంచి పారిపోయిన జ్యోత్స్న- రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న కార్తీక్- నిలదీసిన తాత, తండ్రి!

కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 8వ ఎపిసోడ్‌లో సుమిత్ర రోగం, దీప మాటలు గుర్తు చేసుకున్న జ్యోత్స్న భయంతో వణికిపోతుంది. బట్టలు సర్దుకుని దొంగలా పారిపోతుంది. కానీ, గుమ్మం దగ్గర కార్తీక్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాడు. శివ నారాయణ, దశరథ్ వచ్చి నిలదీస్తారు. సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అని కాంచనకు తెలుస్తుంది.

Published on: Jan 8, 2026, 08:24:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీపను శ్రీధర్ ఇంటికి తీసుకొస్తాడు. ఏమైందని కాంచన అడుగుతుంది. దీప ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. పంతులు గారు చెప్పిన గండం వచ్చేసింది. సుమిత్రను చుట్టుముట్టుంది అని దీప అంటే.. చెల్లెమ్మకు బ్లడ్ క్యాన్సర్ అని శ్రీధర్ చెబుతాడు.

కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 8వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 8వ తేది ఎపిసోడ్

కడుపులో బిడ్డ తట్టుకోలేకపోవచ్చు

రోగం ఎంత తట్టుకోలేమో చికిత్సను కూడా అంతే తట్టుకోలేం. అది విని చెల్లెమ్మ తట్టుకోగలదా. తనను అంతా ప్రిపేర్ చేస్తున్నారని శ్రీధర్ అంటాడు. కన్నతల్లికి కష్టం వచ్చినట్లుగా దీప ఎలా తల్లడిల్లిపోతుందో అని కాంచన అంటుంది. నువ్వే మీ అన్నయ్యకు ధైర్యం చెప్పాలని కాంచనకు, నీ బాధ కడుపులో ఉన్న బిడ్డ తట్టుకోలేకపోవచ్చు. ఎక్కువగా బాధపడకు అని శ్రీధర్ చెప్పి వెళ్లిపోతాడు.

మరోవైపు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ గురించి తెగ వణికిపోతుంది జ్యోత్స్న. ఈ గండం నుంచి బయటపడాలంటే ముందు ఇంట్లోంచి బయటపడాలి అని బట్టలు సర్దుకుంటుంది జ్యోత్స్న. లగేజ్ పట్టుకుని హాల్లోకి వస్తుంది. ఎవరి కంట పడకుండా వెళ్లిపోవాలి అనుకున్న జ్యోత్స్న ఇంటి తలుపులు తీస్తుంది. అక్కడ కార్తీక్ ఉంటాడు. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న.

ఈ టైమ్‌లో బ్యాగ్‌తో బయలుదేరారు. అంటే పారిపోతున్నారు అని కార్తీక్ అడుగుతాడు. జ్యోత్స్న చేసిన తప్పులను ఇన్‌డైరెక్ట్‌గా అంటాడు. ఏ తప్పులు చేయకపోతే దొంగల పారిపోతున్నారు అని కార్తీక్ అంటాడు. నేనేం పారిపోవట్లేదని జ్యో అంటే.. మరి ఇంట్లో ఎవరికైనా చెప్పారా అని కార్తీక్ అడిగుతాడు. నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని జ్యోత్స్న అంటుంది.

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం

నాకు కూడానా అని శివ నారాయణ వస్తాడు. కనీసం నాకైనా చెప్పొచ్చుగా అని దశరథ్ అంటాడు. ఈ టైమ్‌లో ఎవరికి చెప్పకుండా ఎందుకు బ్యాగ్‌తో వెళ్తున్నావ్ అని కార్తీక్ అంటాడు. బావ నన్ను అడ్డంగా ఇరికించావ్ కదా అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. హాల్లో నిలబెట్టి జ్యోత్స్నను నిలదీస్తారు. అమ్మ పరిస్థితి తెలిసి పారిపోతున్నావంటే ఏమనుకోవాలి. అసలు నువ్వు కూతురువా కాదా అని శివ నారాయణ గట్టిగా అడుగుతాడు.

ఇంతలో పారిజాతం వచ్చి ఏమైందని అడుగుతుంది. ఇంట్లోంచి వెళ్లిపోమ్మని సలహా ఇచ్చింది నువ్వే కదా అని శివ నారాయణ అంటాడు. నాకు ఏం తెలియదు అని పారు అంటుంది. లగేజ్ సర్దుకుని ఇంట్లోంచి పారిపోతుంటే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని కార్తీక్ అంటాడు. ఏమే నిజమా అని పారు నిలదీస్తుంది. భయంతో పారిపోవాలనికుంది. కానీ, కార్తీక్ గాడి కంట్లో పడకుండా పారిపోవచ్చుగా అని పారు మనసులో అనుకుంటుంది.

నా కూతురు ఇలా తయారైంది ఏంటీ నాన్న. డాక్టర్ చెప్పింది మర్చిపోయావా. నువ్వు చాలా అవసరం అని. సుమిత్రను నువ్వు ఎప్పుడు సంతోషపెట్టలేదు. నీ వల్ల ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకుంది. నీ పెళ్లి గురించే మాట్లాడుతుంటుంది. నీ పెళ్లి గురించి ఎంత ఆలోచిస్తాం అని దశరథ్ అంటాడు.

వెళ్లిపోడానికి కారణం ఏంటీ

నా భార్యకు ఇలాంటి వ్యాధి రావడం ఏంటీ. పరిష్కారం లేకపోతే నా గుండె ఆగిపోయేదు. కానీ, పరిష్కారం నువ్వని చెప్పారు. నా భార్య బతుకుతుందని నమ్మకం కలిగింది. మమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్తున్నావంటే మేము ఏమనుకోవాలి. నీకు తల్లి అంటే ఇష్టం లేదా అని దశరథ్ ఆవేదనగా చెబుతాడు.

అసలు నువ్వు వెళ్లిపోడానికి కారణం ఏంటో చెప్పు అని శివ నారాయణ, దశరథ్ నిలదీస్తారు. మమ్మీ గురించి ఆలోచించి రూమ్‌లో కూర్చుంటే ఏదో భయంగా అనిపించింది. వెంటనే ఆలోచించకుండా చేశాను అని జ్యోత్స్న చెబుతుంది. జ్యోత్స్న, పారిజాతం ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు శివ నారాయణ. నీకు నిజం చెప్పాలి తాత. అప్పటివరకు జ్యోత్స్న ఇలాంటి వేషాలు వేస్తూనే ఉంటుంది అని కార్తీక్ మనసులో అనుకుంటాడు.

కార్తీక్ ఇంటికి వెళ్తాడు. దీప ఏడుస్తూనే ఉంటుంది. అది చూసిన కార్తీక్ ఓదారుస్తాడు. కడుపులో బిడ్డ పరిస్థితి ఏంటీ అని అడుగుతాడు. నా అంత అదృష్టవంతురాలు లేదు బావ తనకు జరిగింది చెబుతుంది దీప. నాకు పుట్టినవాళ్లు తన అమ్మమ్మ దగ్గర పెరగాలని అనుకున్నా, కానీ, ఇలా అన్ని అడ్డు పడుతున్నాయని దీప అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More