కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: నిజం చెప్పిన డాక్ట‌ర్‌- క‌న్న కూతురే బోన్ మ్యారో ఇవ్వాలని- జ్యోత్స్న గుట్టు బయటపడే సమయం ఇదే

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 6 ఎపిసోడ్ లో అసలు ఏం జరిగిందో చెప్పమంటూ కార్తీక్ ను చెంపపై కొడతాడు శివ నారాయణ. సుమిత్ర రక్తం వాంతి చేసుకుని పడిపోతుంది. డాక్టర్ వచ్చి అందరికీ నిజం చెప్తుంది. కన్న కూతురు బోన్ మ్యార్ ట్రాన్స్ ప్లంటేషన్ డోనర్ అని డాక్టర్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. 

Published on: Jan 06, 2026 6:47 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 6 ఎపిసోడ్ లో డాక్టర్ హారికకు కాల్ చేశా. నువ్వు చెప్తావా? నన్ను చెప్పమంటావా? కార్తీన్ మీతో ఏం చెప్పలేదా అని అడిగారు. ఈ పాటికే చెప్పి ఉండాలన్నారు. కార్తీక్ తో ఒకసారి మాట్లాడమన్నారు. ఇప్పుడు చెప్పు డాక్టర్ నీతో ఏం చెప్పారు. మా దగ్గర ఎందుకు దాచావు? నిజం చెప్పమని కార్తీక్ ను శివ నారాయణ అడుగుతాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

శివ నారాయణ ప్రశ్న

నా కొడుక్కు గానీ కోడలికి గానీ ఏదో జరిగింది, అదేంటో చెప్పు అని శివ నారాయణ అడుగుతాడు. అవును ఒక నిజం దాచా. నువ్వు తట్టుకోలేవనే చెప్పలేదు తాత. నువ్వు కంగారు పడకు. ఏం జరిగిందో చెప్తా వినండని కార్తీక్ అంటుండగానే సుమిత్ర వస్తుంది. నువ్వు, దశరథ మెడికల్ టెస్టులు చేయించుకున్నారు కదా ఇద్దరిలో ఒకరికి సమస్య ఉంది. అది కార్తీక్ గాడు మన దగ్గర దాచాడని సుమిత్రతో పారిజాతం అంటుంది.

కార్తీక్ కు చెంపదెబ్బ

ఎవరికి ఏం కాలేదు? నేను ఏ నిజం దాచలేదని కార్తీక్ అంటాడు. మాతో ఆటలాడుకుంటున్నావా? అని సీరియస్ అవుతాడు శివ నారాయణ. ఛాన్స్ దొరికింది కదా అని శివ నారాయణను రెచ్చగొడుతుంది పారు. అప్పుడే జ్యోత్స్న ఫ్రాడ్ ఫైల్స్ తో శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. జ్యోత్స్న ఇప్పుడు నీతో నేను ఆడుకుంటానని అనుకుంటూ లోపలికి వస్తాడు.

కానీ లోపల నా కొడుక్కి ఏమైందో లేదో చెప్తావా లేదా అని కార్తీక్ కాలర్ పట్టుకుంటాడు శివ నారాయణ. మా ఆయనకు ఏమైందో చెప్పరా అని సుమిత్ర కూడా అడుగుతూ దగ్గుతుంది. చెప్తావా లేదా? అని కార్తీక్ ను శివ నారాయణ కొడతాడు. అది శ్రీధర్ చూస్తాడు. సుమిత్ర దగ్గుతూ కింద పడిపోతుంది. చేతికి అంటుకున్న రక్తాన్ని చూసి అందరూ షాక్ అవుతారు.

కాంచన ఆలోచన

మరోవైపు కార్తీక్ మాటల గురించి ఆలోచిస్తూ కాంచన పరధ్యానంగా ఉంటుంది. వాడేదో విషయం చెప్పడానికి మమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. వాడు ఆనందాన్ని అందిరికీ పంచుతాడు. బాధ కలిగించే విషయం నాన్చుతాడు. ఏదో ముంచుకొస్తుంది అని భయపడుతున్నానని అనసూయతో కాంచన అంటుంది. కార్తీక్ చెప్పడానికి ఆలోచిస్తున్నాడంటే ఏదో పెద్ద విషయమే అని అనసూయ చెప్తుంది.

డాక్టర్ నిజం

డాక్టర్ వచ్చి సుమిత్రను టెస్ట్ చేస్తుంది. నా భార్య గురించి నా దగ్గర ఏ నిజం దాచావని కార్తీక్ ను దశరథ అడుగుతాడు. కంగారు పడకుండా ఎలా ఉండమంటావ్ బావ. డాక్టర్ నీతో ఏం చెప్పింది. నా భార్యకు ఏమైందని కార్తీక్ కాలర్ పట్టుకుంటాడు దశరథ. అప్పుడే డాక్టర్ వచ్చి ఎంత అడిగినా కార్తీక్ చెప్పడు. రిపోర్ట్స్ కోసం దశరథ వచ్చినప్పుడు ఆయన పట్ల భార్యపై ప్రేమ చూశా. తట్టుకోలేరని కార్తీక్ కు మాత్రమే సుమిత్ర హెల్త్ కండీషన్ గురించి చెప్పా. ఆమెను రెండు రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్పా. సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్ చెప్తుంది.

బోన్ మ్యారోతో

ట్రీట్మెంట్ చేస్తే నయమయ్యే స్టేజ్ లోనే ఆవిడ హెల్త్ కండీషన్ ఉంది. సుమిత్రకు బోన్ మ్యారో ట్రాన్స్ ప్లంటేషన్ చేసి మనం కాపాడుకోవచ్చు. సుమిత్రకు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉన్నారా? అని డాక్టర్ అడుగుతుంది. లేదు డాక్టర్ ఒక కూతురు ఉందని దశరథ అంటాడు. ఈవిడను చూడగానే సుమిత్ర కూతురని అనుకున్నా అని దీపను చూసి డాక్టర్ హారిక అంటుంది. ఆవిడ దీప, కార్తీక్ భార్య. జ్యోత్స్న సుమిత్ర కూతురు అని శివ నారాయణ చెప్తాడు.

జ్యోకు షాక్

సుమిత్రను కాపాడేది జ్యోత్స్న. రక్త సంబంధీకులే ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలి. బోన్ మ్యారోను కన్న కూతురైన జ్యోత్స్న ఇవ్వాలి. డోనర్ ఇంట్లోనే ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. జ్యోత్స్న కన్న కూతురు కాబట్టి కచ్చితంగా మ్యాచ్ అవుతుంది. కన్న కూతురు కాకపోతేనే మ్యాచ్ కాదని డాక్టర్ హారిక్ చెప్పడంతో జ్యో, పారు షాక్ అవుతారు. మీరంతా ధైర్యంగా ఉండి సుమిత్రకు నిజం చెప్పమని డాక్టర్ సూచిస్తుంది.

అత్తకు ఏం కాదు

నేను ఏమనుకుని వచ్చాను? ఇక్కడ ఏం జరిగింది? డెస్టినీ అంటే ఇదేనేమో అని శ్రీధర్ అనుకుంటాడు. సారీ కార్తీక్ అనవసరంగా నిన్ను కొట్టా నన్ను క్షమించు అని శివ నారాయణ అడుగుతాడు. నువ్వు కోపంతో కొట్టలేదు తాత, నీ కొడుక్కి ఏమైపోతుందోనని కొట్టావని కార్తీక్ అంటాడు. అత్తకు ఏదో జరుగుతుందన్న బాధ మామయ్య. డాక్టర్ చెప్పింది ఇదే మామయ్య. అత్తకు ఏం కాదని కార్తీక్ అంటాడు.

ఇప్పటివరకు ఈ నిజాన్ని ఎలా మోశావ్? కళ్లలో నీళ్లు కనిపించకుండా ఎలా మోశావ్? నిన్ను ఏమనాలో కూడా అర్థం కావడం లేదని కార్తీక్ ను పట్టుకుంటారు దశరథ, శివ నారాయణ. అత్తలో ధైర్యం నింపి ఈ విషయం అత్తకు చెప్పాలి. అప్పటివరకూ ఈ విషయం అత్తకు చెప్పకండని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.