కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: వారసురాలు జ్యోత్స్న కాదు-నిజం చెప్పేస్తున్న దాసు-జ్యోకు ముచ్చెమ‌ట‌లు-అసలు గుట్టు రట్టు

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 12 ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది. అసలైన వారసురాలు ఎవరో తెలుసుకునేందుకు దాసును రప్పిస్తుంది పారిజాతం. ఆ విషయం చెప్పనని దాసు అంటాడు. వీళ్లు ఏదో ప్లాన్ వేశారని కార్తీక్ డౌట్ పడతాడు. జ్యోత్స్న తన కూతురనే నిజం చెప్పేస్తానని దాసు అంటాడు. 

Published on: Jan 12, 2026, 07:05:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 12 ఎపిసోడ్ లో జీవితంలో నిజాలను మోయడం చాలా కష్టం మామయ్య. అలా మోసి గుండె రాటుదేలిపోయింది. సుమిత్ర అత్త అంటే ఎవరు? కన్నతల్లి లాంటిది. అత్తకు కొడుకు లేడనే లోటు మేనల్లుడితో తీర్చుకుంది. ఇప్పుడు అత్తను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే లోపల ఎంత బాధగా ఉంటుందో ఆలోచించమని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

అత్తకు ఏం కాదు

అత్తకు మనమే ధైర్యం. అత్తకు ఏం కాదని ముందు మనం నమ్మాలని కార్తీక్ అంటాడు. అవును అన్నయ్య, నిండు నూరేళ్లు వదిన, నువ్వు కలిసే ఉంటారు. కూతురి పెళ్లి మీ చేతుల మీదుగా జరుగుతుంది. మనవల్లను చూస్తారు. వదినకు ఏం కాదన్నయ్యా అని దశరథకు చెప్తూ ఏడ్చేస్తుంది కాంచన.

దాసుతో మంతనాలు

దాసుతో పారిజాతం మాట్లాడుతుంది. సుమిత్ర గురించి తెలిసి కూడా ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నావు? విధిరాతను నువ్వు తప్పించొచ్చు. ఈ కథను మలుపు తిప్పగల సూత్రధారివి. నువ్వు ఇప్పుడు నీ కూతురిని కాపాడాలని పారిజాతం అడుగుతుంది. తల్లికి ఆరోగ్యం బాగోలేదనే బాధ కనిపించడం లేదు. భయం ఉంది. మెడికల్ టెస్టులు చేస్తే నిజం తెలిసిపోతుందేమోననే భయమని దాసు అంటాడు.

నీలాంటి తండ్రిని చూడలేదు. సమస్య కూతురు వరకూ రాకుండా ఏ తండ్రయినా నిలబడతాడు. కానీ నువ్వు, పోతే పోతుందిలే నాకెందుకు అనుకుంటున్నావని జ్యోత్స్న అనుకుంటుంది. కూతురు రోడ్డు మీద పడితే తండ్రిగా ఆదుకుంటా. ఇంట్లో చోటు ఇస్తానని దాసు అంటాడు. అలాంటి బతుకు బతకడం కంటే చావడమే మేలని జ్యో అంటుంది. దాసు ఇప్పుడు సాయం చేయాలి. మనమంతా ఒక్కటేనని పారు అంటుంది.

మధ్యలో దీప

మరి కాశీని ఎందుకు వదిలేశారని దాసు అడుగుతాడు. నువ్వు కూతురిని కాపాడు, ఇది దాసును కాపాడుతుందని పారు చెప్తుంది. అసలైన వారసురాలు బతికే ఉందన్నావు కదా అది నిజమేనా? అని పారు అడిగితే, దాసు నిజమే అని చెప్తాడు. ఆ వారసురాలు ఎక్కడుందని అడిగితే, అప్పుడు కాఫీ కప్ తో వస్తున్న దీపను చూసి ఇక్కడే ఉందని దాసు అంటాడు. వదిన ఎలా ఉందమ్మా. నువ్వు భయపడకు వదినకు ఏం కాదు. కన్నకూతురు ఉంది కదా కాపాడుకుంటుందని దీపతో దాసు అంటాడు. దాసును పిలిపించి ఏం మాట్లాడుతున్నారని దీప అనుకుంటుంది.

కార్తీక్ డౌట్

నువ్వు అసలు వారసురాలిని తీసుకురావాలి. అందుకే పిలిచా. వారసురాలు ఎక్కడుందో నీకు తెలుసా? వెంటనే ఇక్కడకు తీసుకురా అని పారు అడుగుతుంది. ఏం జ్యోత్స్న తీసుకురమ్మంటావా? అని దాసు అడుగుతాడు. దాసు బాబాయి వచ్చి బయట పారిజాతంతో మాట్లాడుతున్నాడు. జ్యోత్స్నకూడా ఉంది. ఏదో ప్లాన్ మొదలు పెట్టారని కార్తీక్ తో దీప చెప్తుంది. జ్యోత్స్న దాసు మామయ్య కూతురు. ఇది తెలియకుండా ఆపాలంటే అసలైన కూతురు రావాలి. జ్యోత్స్నకు నిజం తెలుసు కానీ పారుకు చెప్పదు. దాసు మామయ్య మాటిచ్చాడు కాబట్టి పారుకు చెప్పడని కార్తీక్ అంటాడు.

జ్యోత్స్ననే ఒప్పుకోవాలి

మనం దీన్ని ఆపాలంటే నువ్వు వెళ్లి మా అమ్మకు నిజం చెప్పాలని దీప అడుగుతుంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నువ్వే ఈ ఇంటి వారసురాలివని బయటపడటం తప్పదు మరదలా. జ్యోత్స్ననే నిజం ఒప్పుకోవాలని కార్తీక్ అంటాడు. మరోవైపు సుమిత్ర అసలైన కూతురు రాకపోతే నీ కూతురు అన్యాయమైపోతుందని దాసుతో బాధ నటిస్తుంది పారిజాతం. నీ దారి వేరు, నా దారి వేరమ్మా. నేను సాయం చేయలేనమ్మా. నేనేం చెప్పనమ్మా అని దాసు అడుగుతాడు.

పారు ప్లాన్

తెలిస్తే చెప్పు. అసలైన వారసురాలికి డబ్బిచ్చి సీక్రెట్ గా ఆపరేషన్ థియేటర్లో పడుకోబెడతాను. ఎవరో తెలియకపోతే వెతుకుదాం. జీవించాలంటే నాటకం ఆడాల్సిందే. నువ్వు సాయం చేయలేదో కళ్యాణి నిన్ను క్షమించదని పారిజాతం అంటుంది. జ్యోత్స్న ఎవరో నిజం చెప్పేయడమే పరిష్కారం. అసలైన వారసురాలు వచ్చి సుమిత్రను బతికించుకుంటుంది. నేనే జ్యోత్స్న ఎవరన్న నిజం చెప్పేశాననుకో, అప్పుడు ఏ భయం ఉండదు. ఈ రోజు చెప్పాల్సిందే అని దాసు అంటుండగా శివ నారాయణ వచ్చి ఏం చెప్పాలని అడుగుతాడు.

దాసు ద్రోహం

ఇంట్లోకు తీసుకెళ్లి దాసును చెప్పమని అడుగుతాడు శివ నారాయణ. చెప్పొద్దని జ్యోత్స్న దండం పెడుతుంది. నాన్నతో చెప్పడానికి ఇబ్బంది అయితే నాతో చెప్పు అని దశరథ అడుగుతాడు. ఈ విషయం అందరూ వినాల్సిందే. వీలైతే వదినను రమ్మనండి. దీపను పిలవండని దాసు చెప్తాడు. వదినను పలకరించి వెళ్లిపోకుండా ఈ పంచాయతీలు అవసరమా? పెద్దాయనకు బోలెడు పనులుంటాయి. దాసు నువ్వు వెళ్లిపో అని పారిజాతం అంటుంది.

అన్నయ్య నీకు నేను ఒక ద్రోహం చేశా. ఇప్పుడు నేను చెప్పినా మీరు నన్ను క్షమించరు. జ్యోత్స్న గురించి చెప్పాలనుకుంటున్నా అని దాసు అనడంతో జ్యోకు ముచ్చెటమలు పడతాయి. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More