కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: గుండె పగిలే బాధ-బిడ్డ ప్రాణాలు తీసేందుకు కార్తీక్, దీప ఓకే-నిజం చెప్పేస్తానన్న డాక్టర్
కార్తీక దీపం 2 టుడే ఫిబ్రవరి 10 ఎపిసోడ్ లో కార్తీక్, దీప గుండె పగిలే బాధను అనుభవిస్తారు. కడుపులో బిడ్డను చంపుకోవడానికి సిద్ధమవుతారు. ఆపరేషన్ కు రెడీ అంటారు. కానీ నిజం చెప్పేస్తానని సుమిత్ర దగ్గరకు డాక్టర్ వెళ్తుంది. నిజం తెలిసిన డాక్టర్ ను బతకనివ్వను అని పారిజాతం గన్ తీసుకుంటుంది.
కార్తీక దీపం 2 టుడే ఫిబ్రవరి 10 ఎపిసోడ్ లో.. తల్లి కాంచనకు కాల్ చేసి దీప వచ్చిందా? అని కార్తీక్ అడుగుతాడు. రాలేదని కాంచన చెప్తుంది. అప్పుడే హాస్పిటల్ నుంచి డాక్టర్ కాల్ చేసి దీప ఇక్కడే ఉంది, త్వరగా రమ్మని చెప్తుంది. కార్తీక్ కంగారుగా వెళ్తాడు.

కార్తీక్ షాక్
హాస్పిటల్ కు వచ్చేముందు నాకు చెప్పాలి కదా. ఎక్కడికి వెళ్లావని వెతకాలి. ఇంత అర్జెంట్ గా వచ్చి డాక్టర్ ను కలవాల్సిన అవసరం ఏముంది? అత్తకు ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది కదా అని కార్తీక్ అంటాడు. సరిపోదు బావ, ఆపరేషన్ చేయించకపోతే అమ్మ చనిపోతుందని దీప ఏడుస్తుంది. దీప తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు బిడ్డ ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధపడిందని డాక్టర్ చెప్పగానే కార్తీక్ షాక్ అవుతాడు.
కనిపించే ప్రాణం
ప్లీజ్ బావ నేను ఒప్పుకుంటున్నానని డాక్టర్ కు చెప్పు. నాకు వేరే దారి లేదు బావ. నన్ను క్షమించు. నా తల్లి కోసం నా ప్రాణాలు వదలాల్సి వచ్చినా ఇంత బాధపడేదాన్ని కాదు. బిడ్డను వదులుకోవడానికి సిద్ధపడ్డాను అంటే నా ఆలోచనలో ఒక తల్లిగా ఎన్నిసార్లు చచ్చిపోయి ఉంటానో ఆలోచించు బావ. కనిపించని ప్రాణం కోసం కనిపించే ప్రాణం తీయలేను బావ అని దీప అంటే కార్తీక్ ఏడుస్తాడు.
శౌర్యకు ఏం చెప్పాలి?
ఏం చెప్పాలి దీప? అత్త ఆరోగ్య పరిస్థితి చూడగానే హాస్పిటల్ కు వచ్చేశావు. కానీ నువ్వు అడుగుతుంటే నా కూతురు శౌర్య గుర్తుస్తొంది. బొమ్మకు పట్టు పరికిణి వేసి నా చెల్లి కూడా ఇలాగే ఉంటుందా? అని అడిగింది. ఇంతకంటే బాగుంటుందని చెప్పా. ఇప్పుడు నీ చెల్లిని నేను చంపేశా అని దానికి చెప్పమంటావా? మా అమ్మకు ఏం చెప్పాలి? అని కార్తీక్ ఫుల్ ఎమోషనల్ అవుతాడు.
ఆపరేషన్ చేయమని
ప్లీజ్ బావ మా అమ్మను కాపాడు అని కార్తీక్ కాళ్లను దీప పట్టుకుంటుంది. నాకు జన్మనిచ్చిన తల్లి కోసం ఈ ప్రాణాన్ని వదులుకోలేనా బావ. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ప్లీజ్ నా తల్లిని బతికించు బావ అని దీప అడుగుతుంది. నువ్వు ఎంత అడిగినా కార్తీక్ ఒప్పుకోడు దీప అని డాక్టర్ అంటే, ఒప్పుకుంటున్నాను డాక్టర్ అని కార్తీక్ చెప్తాడు. సుమిత్ర అత్త నాకు తల్లిలాంటిదే. ప్లీజ్ వెంటనే ఆపరేషన్ కు ఏర్పాట్లు చేయండని కార్తీక్ అడుగుతాడు.
నిజం చెప్పేస్తానని డాక్టర్
ఫ్యామిలీ కోసం బిడ్డను త్యాగం చేస్తున్నారా? చేతులెత్తి దండం పెట్టాలని ఉంది. సుమిత్ర ఫ్యామిలీకి నిజమే చెప్పాలి. నేను చెప్తా. ఏం జరుగుతుందో చెప్పడానికి సుమిత్ర ఇంటికి వెళ్తున్నానని డాక్టర్ హారిక వెళ్తుంది.
గన్ తీసుకున్న పారు
అన్ని అనర్థాలకు కారణం నువ్వే. బ్లడ్ శాంపిల్స్ ఎలా ఇచ్చావో ఏమో అని జ్యోత్స్నపై శివ నారాయణ సీరియస్ అవుతాడు. అది చెప్పడానికే నేను వచ్చా. అందరిని పిలవండి మీకో నిజం చెప్పాలని డాక్టర్ హారిక చెప్తుంది. జ్యోత్స్న తప్పించుకోవాలని చూస్తుంది. కానీ జ్యోత్స్నను అక్కడే ఉండమని డాక్టర్ చెప్తుంది. పారిజాతం గదిలోకి వచ్చి గన్ తీసుకుంటుంది. నిజం తెలిసిన డాక్టర్ ను వదలను అని జ్యోతో పారు అంటుంది.
శాంపిల్స్ మ్యాచ్
దీపను ముందుకు రమ్మని డాక్టర్ పిలుస్తుంది. రిపోర్ట్స్ కు, దీపకు సంబంధం ఉంది. తల్లికి, బిడ్డకు ఉన్న సంబంధం. మీ కూతురు బ్లడ్ శాంపిల్స్ ఒకటికి రెండు సార్లు టెస్ట్ చేశాం. సుమిత్ర కూతురి శాంపిల్ మ్యాచ్ అయింది అని డాక్టర్ ట్విస్ట్ ఇస్తుంది. సుమిత్ర కన్నకూతురి శాంపిల్ మ్యాచ్ అయ్యాయి అని డాక్టర్ మళ్లీ చెప్తుంది.
జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అంటా, నీకేం కాదు సుమిత్ర అని దశరథ సంతోషంగా చెప్తాడు. కానీ పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. పారిజాతం చేతుల్లో నుంచి గన్ కిందపడితే జ్యోత్స్న తీసి దాస్తుంది. ఆపరేషన్ త్వరలోనే ఉంటుంది. ఏది ఎప్పుడు చేయాలో మిమ్మల్ని గైడ్ చేస్తానని డాక్టర్ చెప్తుంది.
కన్నకూతురిలా
మరి దీపకు, శాంపిల్స్ కు ఉన్న సంబంధం ఏంటీ? అని శివ నారాయణ అడుగుతాడు. కొందరి మీద మనం పెంచుకునే ప్రేమ రక్తబంధానికి మించి ఉంటుంది. తల్లి లాంటి మీ మీద కూతురు లాంటి దీప అలాంటి బంధాన్నే పెంచుకుంది. రిపోర్ట్స్ గురించి దీప ఎంతగానో ఎదురు చూసింది. తనముందే రిపోర్ట్స్ గురించి చెప్పాలనుకున్నా అని డాక్టర్ చెప్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












