కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: స్వప్నను తాళి తీసేయమన్న శ్రీధర్- ఏమాత్రం తగ్గని కూతురు- బిడ్డను చంపడానికి దీప పర్మిషన్

కార్తీక దీపం 2 సీరియల్ ఫిబ్రవరి 2వ ఎపిసోడ్‌లో తాళి తీసేయమని కూతురు స్వప్నతో అంటాడు శ్రీధర్. దానికి షాక్ అవుతుంది స్వప్న, కావేరి. భర్తే బారమైనప్పుడు తాళి ఎందుకంటాడు. దానికి ఏమాత్రం తగ్గకుండా రివర్స్ కౌంటర్ ఇస్తుంది స్వప్న. కావేరి ఒంటరిగా అందరికి దూరంగా వెళ్లిపోతానంటుంది.

Published on: Feb 07, 2026 7:34 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కూతురు స్వప్నతో శ్రీధర్ చేయి పట్టుకుని మాట్లాడుతాడు. కాశీ గురించి అయితే వద్దంటుంది స్వప్న. కాశీ ఎవరు. నేను నా కూతురు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దానికి ముందు మెడలో తాళి తీసి పక్కన పెట్టు అని శ్రీధర్ అంటాడు.

కార్తీక దీపం 2 సీరియల్ ఫిబ్రవరి 7వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ ఫిబ్రవరి 7వ తేది ఎపిసోడ్

తాళి తీసి పక్కన పెట్టు

దాంతో స్వప్న, కావేరి ఇద్దరు షాక్ అవుతారు. మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని కావేరి అంటుంది. నా కూతురు గురించి. కాశీని వద్దంటే పెళ్లి చేసుకోడానికి ఆగిందా, ఇప్పుడు కలవమంటే వింటుందా. నువ్వు ఎవరి కోసం తగ్గొద్దు. తాళి తీసి పక్కన పెట్టు. భర్తనే వద్దనుకున్నప్పుడు తాళి ఎందుకమ్మా. భర్తే బారంగా మారినప్పుడు తాళి ఎందుకు. నీకు అన్ని తెలుసు. నీకు జీవితం గురించి చెప్పాలా అని శ్రీధర్ అంటాడు.

విడిపోతానంటున్నావ్. విడాకులు కావాలంటున్నావ్ కదా. ఇలాంటి వాటికి సొసైటీ బాగా సపోర్ట్ చేస్తుంది. విడాకులు తర్వాత చూద్దాం. ముందు అయితే మెడలో తాళి తీసేయమ్మా అని పట్టుపడతాడు శ్రీధర్. పోని మీ అమ్మ సహాయం తీసుకో. నీ కూతురు సౌభాగ్యాన్ని తెంపేయ్ కావేరి అని శ్రీధర్ అంటాడు. అంతా అవాక్కవుతారు. మన తెలివైన కూతురుకు సౌభాగ్యం గట్టి పరకలాంటిదే అని శ్రీధర్ అంటూనే ఉంటాడు.

పెద్దమ్మ నిన్ను క్షమించగలదా. మనిషికి ఒక న్యాయం ఉండదు. నన్ను అడిగినట్లే పెద్దమ్మను అడిగితే నా బాధ మీకు అర్థం అయ్యేది అని ఏమాత్రం తగ్గకుండా మాట్లాడుతుంది స్వప్న. స్వప్న వెళ్లిపోతుంది. దాంతో ఎందుకు అలా మాట్లాడుతున్నారని కావేరి అంటే.. ముల్లును ముల్లుతోనే తీయాలి అని శ్రీధర్ అంటుంది.

దూరంగా వెళ్లిపోతాను

అక్క, మీరు కలిస్తే స్వప్న, కాశీ కలుస్తారు. అది నేను మీ జీవితంలో లేకుంటేనే జరుగుతుంది అని కావేరి అంటుంది. చచ్చిపోను. కానీ, మీ జీవితం నుంచి దూరంగా వెళ్లిపోతాను. కాంచన అక్క కోసం ఇదైనా చేస్తాను. మీకు చెప్పకుండా వెళ్లిపోతాను. అప్పుడు అక్క మీరు ఉంటారు. అల్లుడు కూతురు కూడా కలుస్తారు అని కావేరి అంటుంది.

నాకు ఇద్దరు కావాలి. స్వప్న గురించి కార్తీక్, కాంచన చూసుకుంటారు. కాకపోతే స్వప్నకు భర్త విలువ తెలిసేలా చేయాలి అని శ్రీధర్ అంటాడు. మరోవైపు కార్తీక్, దీప డాక్టర్ చెప్పిందే తలుచుకుంటూ బాధలో ఉంటారు. కాంచన చెప్పిన దాని గురించి ఆలోచిస్తారు. అమ్మకు నిజం తెలియదు కాబట్టి అలానే అంటుంది. నిజం చెబితే అంటుందా అని కార్తీక్ అంటాడు.

శౌర్య అంటే నాకు ఎంతో ప్రేమ. పుట్టని కూతురు మీదే అంత ప్రేమ ఉన్నప్పుడు నాకు పుట్టేబోయే బిడ్డ మీద ఎంత ఉంటుంది. కానీ, అది పుట్టాలి కదా. దాని దృష్టిలో మనం అసలు అమ్మనాన్నలమేనా. ఏం చేయాలో తెలియట్లేదు. ఏ కన్ను పొడుచుకులేను అని కార్తీక్ అంటాడు. నేను నీకేం ఇవ్వలేదు. ఈ బిడ్డను నీకు ఇస్తే సంతోషంగా ఉంటావనుకున్నావా అని దీప అంటుంది.

తప్పు ఒప్పుకుంటారా

బిడ్డను చింపేయడానికి పర్మిషన్ అడుగుతున్నావా. మన దగ్గర ఏ సమాధానం లేదు. నన్ను ఏది అడగకు అని కార్తీక్ అంటాడు. మరోవైపు జ్యోత్స్నకు పారిజాతం తినిపిస్తుంది. మా నాన్న ఇంత వయోలెంట్‌గా రియాక్ట్ అవ్వడం ఎప్పుడు చూడలేదు, భయం వేసింది అని జ్యోత్స్న అంటుంది. నా అంచనాలు పటాపంచలు చేశాడు. దశరథ్‌పై శివ నారాయణ ఆవహించాడే. నాకూ భయం వేసిందని పారు అంటుంది.

ఇంతలో శివ నారాయణ వస్తాడు. పారును అంటాడు. నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యేవిగా అంటాడు శివ నారాయణ. మరి ఈసారి మ్యాచ్ కాకపోతే. తప్పు మీదని ఒప్పుకుంటారా అని పారిజాతం అంటుంది. మ్యాచ్ కావని ఎలా చెబుతున్నావ్ అని శివ నారాయణ అంటాడు. ఓరి దేవుడా ఇలా నోరు జారాను ఏంటీ అని భయపడుతుంది పారు.

నిన్ను చూస్తే ఏదో కొత్త అనుమానం మొదలవుతుందా. నాకు తెలియకుండా ఏదైనా ఇంట్లో జరుగుతోందా. ఈసారి మ్యాచ్ కాకపోతే దశరథ్ ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పలేం. ఈ మాట వాడి ముందు అనకు అని శివ నారాయణ వెళ్లిపోతాడు. మనం బయటపడకూడదు అంటే రిపోర్ట్స్ రాకుండా చూడాలి. లేదా సుమిత్ర లేకుండా చేయాలి. ఆ రెండు ఎలాగు జరగవు అని పారిజాతం జ్యోతో అంటుంది.

గొంతు ఇన్ఫెక్షన్

మరుసటి రోజు ఉదయం దీప టిఫిన్ చేయకపోవడంపై కార్తీక్‌ను అడుగుతుంది. గొంతు ఇన్ఫెక్షన్‌ను ఉదాహరణగా చెబుతూ అది దీప మనసుకు అయిందని కార్తీక్ చెబుతాడు. ఇంతలో దీప వస్తుంది. దీప సంతోషంగా లేకపోవడంపై కాంచన తిడుతుంది. టిఫిన్ తినమని వారిస్తుంది. దాంతో దీప తింటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.