కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: స్వ‌ప్న‌కు మ‌ళ్లీ పెళ్లి- శ్రీధ‌ర్‌ను చీకొట్టిన కాంచ‌న‌- బాధతో కుమిలిపోతున్న కార్తీక్, దీప

కార్తీక దీపం 2 టుడే ఫిబ్రవరి 5 ఎపిసోడ్ లో.. ఓ వైపు స్వప్న, కాశీ కోసం కాంచన, శ్రీధర్ గొడవపడతారు. మరోవైపు డాక్టర్ మాటలు చెప్పింది తలుచుకుంటూ, శౌర్య దగ్గరున్న బొమ్మను చూస్తూ కార్తీక్, దీప కుమిలిపోతారు. స్వప్నకు మళ్లీ పెళ్లి చేస్తానని శ్రీధర్ అంటే, కాంచన చీ కొడుతుంది. 

Published on: Feb 5, 2026, 07:10:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 5 ఎపిసోడ్ లో.. భర్తగా ఎలాగో బాధ్యతగా ఉండరు కానీ తండ్రిగానైనా ఉండాలి కదా. ముఖం మీదే స్వప్న చీ కొట్టడంతో కాశీ వెళ్లిపోయాడు. వాడిని తీసుకొచ్చింది నేనే కాబట్టి నన్ను అవమానించడంతో వచ్చేశానని శ్రీధర్ తో కాంచన అంటుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

కాంచన ఫైర్

నా పిల్లలకు తల్లులు వేరైనా లక్షణాలు మాత్రం ఒకేలా వచ్చాయని శ్రీధర్ అంటాడు. స్వప్నను కార్తీక్ తో పోల్చకండి. అలా పోల్చి నా కొడుకు స్థాయిని తగ్గించకండి. నా కొడుక్కి మూర్ఖత్వం లేదు. భార్యాభర్తలకు ఉండాల్సిన గౌరవం, నమ్మకం నా కొడుకు, కోడలి మధ్య ఉన్నాయి. నీ కూతురు, అల్లుడికే లేవు. స్వప్న ఎంత మూర్ఖంగా మాట్లాడుతుందో విన్నారు కదా. తండ్రిగా బాధ్యతతో కూతురిని దారిలో పెట్టాలని శ్రీధర్ పై ఫైర్ అవుతుంది కాంచన.

మళ్లీ పెళ్లి

స్వప్న పుట్టింట్లోనే ఉండిపోతే ఏం చేస్తారని కాంచన అడిగితే మరో పెళ్లి చేస్తానని శ్రీధర్ చెప్తాడు. ఛీ.. ఆడవాళ్ల మనసులు ఏటీఎం కార్డులు కావు నచ్చినట్లు వాడుకోవడానికి. జీవితాంతం ఏడ్చే పరిస్థితి నా కూతురికి రావొద్దని మాట్లాడేందుకు నేను వచ్చానని కాంచన సీరియస్ అవుతుంది. నీకు పుట్టనిదాన్ని కూతురు అనుకుంటున్నావు, మరి నన్ను భర్తగా ఎందుకు అనుకోవడం లేదు? నువ్వు చేయని పని నీ కూతురు చేయాలని కోరుకుంటున్నావు. నువ్వు చేసింది తప్పు అని ఎవరైనా అనకుండా ఉంటారా? అని శ్రీధర్ అంటాడు.

అప్పుడే నువ్వు చేస్తోంది తప్పేనమ్మా, అల్లుడు చెప్పింది కరెక్ట్ అని శివనారాయణ ఎంట్రీ ఇస్తాడు. మాట్లాడు కాంచన, పిల్లనిచ్చిన మామ భగవంతుడే కదా ఆయనే చెప్పారు తప్పని అని శ్రీధర్ అడుగుతాడు. నా తండ్రి ఆలోచనలో స్వార్థం ఉందని కాంచన అంటుంది. అప్పుడే వచ్చిన కార్తీక్.. మళ్లీ పంచాయితీ ఏంటీ మాస్టారూ? మా అమ్మను ప్రశాంతంగా ఉండనివ్వవా? అని అడుగుతాడు.

స్వప్న అలా కాదు

తండ్రిగా నా కూతురు జీవితానికి ఏం చేశానని ప్రశ్నించుకున్నా కానీ సమాధానం దొరకలేదు. వీళ్లిద్దరిని కలవమని చెప్పడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదనిపిస్తుందని శివనారాయణ అంటాడు. నీ కూతురికి పెళ్లి చేయించడంతో నీ బాధ్యత తీరిపోయింది. కానీ స్వప్న విషయం అలా కాదు. విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ భర్తను స్వప్న వద్దనుకుంటే మూడో పెళ్లి చేస్తారా? అని కాంచన అడుగుతుంది. మీరిద్దరు ఒకటవ్వండి, వాళ్లిద్దరు ఒకటి అవుతారని శివనారాయణ అంటాడు.

నా కూతురు అనుకున్నా

నా సవతి కూతురును నా కూతురు అనుకున్నా. నా సవతికి పుట్టింట్లో గౌరవం దక్కేలా చేశా. స్వప్నను ఇలాగే వదిలేస్తారా? అని కాంచన అడుగుతుంది. స్వప్న, కాశీని నువ్వే కలపాలి అమ్మ అని కార్తీక్ చెప్తాడు. ఇక దీప, కార్తీక్ నిన్న కూడా హాస్పిటల్ వెళ్లారు, అసలు ఏమైందని కాంచన అడుగుతుంది. నాకు సగం బెంగ దీప మీదే ఉంది. దీప కడుపులో ఉన్నది కాంచన వాళ్ల అమ్మ అని శివనారాయణ అనగానే డాక్టర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుని కార్తీక్, దీప ఏడుస్తారు. తలనొప్పిగా ఉంది పడుకుంటానని కార్తీక్ గదిలోకి వెళ్లిపోతాడు.

ముత్యాలగూడెంలో ఇల్లు అమ్ముదామని వెళ్లా. కార్తీక్ కు కాస్త సాయంగా ఉంటుందని అనుకున్నా. కానీ అనుకున్న రేట్ రాలేదని కాంచనతో అనసూయ చెప్తుంది. అనసూయ తెచ్చిన బొమ్మను అమ్మానాన్నకు చూపిస్తానని శౌర్య పరుగులు పెడుతుంది. చెల్లెమ్మ.. కార్తీక్, దీప ఎందుకు అలా ఉన్నారని అనసూయ అడుగుతుంది.

బాధ దాచుకుని

శౌర్య వచ్చి నాన్నకు నేనంటే ఇష్టం లేదా? అని అడుగుతుంది. నన్ను ముద్దు పెట్టుకోవట్లేదు. హోం వర్క్ చేయించడం లేదు. స్కూటీ మీద తిప్పడం లేదు. అంటే ఈ రౌడీ మీద ప్రేమ పోయినట్లే కదా అని శౌర్య అంటుంది. రౌడీ మీ నాన్నకు ఎప్పటికీ నీ మీద ప్రేమ ఉంటుంది, ఇలా నవ్వుతూనే ఉంటానని మనసులో బాధ దాచుకుని నవ్వుతాడు కార్తీక్.

బొమ్మను చూస్తూ

నాన్నను కళ్లు మూసుకోమని బొమ్మను ముందు పెడుతుంది శౌర్య. కళ్లు తెరిచి బొమ్మను చూసి కార్తీక్ ఇంకా బాధపడతాడు. ఈ బొమ్మను అమ్మ కోసం నానమ్మ తెచ్చింది. అమ్మ కడుపులో ఉన్న బిడ్డను ఈ బొమ్మలో చూసుకోవాలంటా. అమ్మ పొట్టలో నా చెల్లి ఉంది. ఈ బొమ్మ పట్టు పరికిణి వేసుకుని ఎంత అందంగా ఉందో. నా చెల్లికి కూడా ఇలాగే పట్టు పరికిణి వేసి అందంగా ముస్తాబు చేస్తా. నా చెల్లి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఆడుకుంటాను? చెప్పు నాన్న అని శౌర్య అడుగుతుంది. దీప ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

బయట ఉన్న కాంచన, అనసూయ దీప ఏడవడం చూసి ఏమైందోనని కంగారు పడతారు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More