కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: క‌ల‌ల‌న్నీ క‌న్నీరులా-కార్తీక్‌, దీప వ్య‌థ‌-పోరా అంటూ కాశీపై స్వ‌ప్న ఫైర్‌-జ్యోత్స్నకు భయం

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 4 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఓ వైపు కార్తీక్, దీప ఎమోషన్.. మరోవైపు స్వప్న ఆవేశం.. ఇంకోవైపు జ్యోత్స్న భయం.. ఇలా ఈ రోజు ఎపిసోడ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోరా బయటకు అంటూ కాశీపై స్వప్న ఫైర్ అవుతుంది. బిడ్డ కోసం కార్తీక్, దీప ఏడుస్తారు. 

Published on: Feb 4, 2026, 07:11:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 4 ఎపిసోడ్ లో.. అందరం కలిసి నీ బిడ్డతో ఆడుకుంటూ కాలం గడిపేస్తాం. దేవుడు వరమిచ్చాడు, అది జరిగిపోతుందని కార్తీక్ తో దశరథ అంటాడు. ఈ రోజు కాస్త తొందరగా ఇంటికి వెళ్తామని పర్మిషన్ అడుగుతాడు కార్తీక్. అగ్రిమెంట్ నీకు, జ్యోత్స్నకు మధ్య కానీ మన మధ్య కాదు. నువ్వు ఎప్పుడైనా రావొచ్చు, వెళ్లొచ్చు అని దశరథ చెప్తాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

ఈ తండ్రి ఉన్నాడని

మేం బాధపడతామని వీడు అబద్దం చెప్తాడు. దీప నువ్వు వీడిలా ఉండకు. నీకేదైనా ప్రాబ్లం వస్తే చెప్పుకోవడానికి ఈ తండ్రి ఉన్నాడని మర్చిపోకమ్మా. బిడ్డ జాగ్రత్తమ్మా అని దశరథ వెళ్లిపోతాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ కార్తీక్ కుప్పకూలిపోతాడు. దీప కూడా ఏడుస్తుంది.

కాంచన ఆలోచన

మరోవైపు విడాకులు కావాలన్న స్వప్నను ఎలా కన్వీన్స్ చేయాలోనని కాంచన ఆలోచిస్తుంది. మామయ్య మీరే స్వప్నను కన్వీన్స్ చేయగలరని కాశీ అడుగుతాడు. అదే చేతనైతే ఎప్పుడో చేసేవాణ్ని అని కాంచనను ఉద్దేశించి శ్రీధర్ అంటాడు. కావేరి అది నీ కన్నకూతురు నువ్ చెప్తే వింటుంది. ముందు వెళ్లి పిలువు. మీరు తండ్రిగా ఏం చెప్పాలో చెప్పండని శ్రీధర్ తో అంటుంది కాంచన.

కలిసి ఉండలేను

ఇంతమంది నీ జీవితం గురించి ఆలోచిస్తుంటే నువ్వెళ్లి లోపల కూర్చుంటావేంటీ? ఇదేనా నువ్వు మాకిచ్చే మర్యాదా? మీ అన్నయ్యను పిలవమంటావా? అని స్వప్నను కాంచన అడుగుతుంది. నాకు వంకాయ కూర ఇష్టం ఉండదు. నేను దాన్ని తినలేను. ఇప్పుడు కాశీతో నా జీవితం కూడా వంకాయ కూరలాగే ఉంటుంది. మీరంతా కలిసి ఇష్టం లేని కూర బలవంతంగా నా ప్లేట్లో వడ్డించినా నేను తినలేను. అలాగే ఈ మనిషితో కలిసి ఉండలేనని స్వప్న అంటుంది.

కాశీ ఎలా మారిపోయాడు?

మాటలు బాగానే నేర్చావు. భార్యాభర్తల బంధం కాగితం కంటే తేలికైందా? అని కాంచన అడుగుతుంది. నీకు నచ్చినప్పుడు మోసి, నచ్చనప్పుడు దించేయడం కాదు బంధమంటే అని శ్రీధర్ అంటాడు. నిన్నెవరు ప్రేమించి పెళ్లి చేసుకోమన్నారని కావేరి అడుగుతుంది. ఒకసారి కాశీని చూడు, నీ కోసం పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. భర్త స్థానంలో కొడుకు ఉంటే తల్లి వదిలేస్తుందా? తల్లిలా చేసే పని భార్యలా ఎందుకు చేయలేదు. వెంటనే క్షమించలేకపోతే కాస్త టైమ్ తీసుకో. మార్పు వచ్చిందని అనిపిస్తే అప్పుడు మళ్లీ నీ జీవితంలోకి ఆహ్వానించమని స్వప్నకు కాంచన చెప్తుంది.

పోరా బయటకు

సారీ పెద్దమ్మ. నేను కాశీతో కలిసి ఉండలేనని స్వప్న అంటుంది. నాకు నువ్వు కావాలి స్వప్న. నేను తప్పు చేశా, క్షమించు. నేను మారానని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? నీ కాళ్లు పట్టుకోమంటావా? అని కాశీ అడుగుతాడు. అందరిని ఒకేసారి తల దించుకునేలా చేశాడు. మరోసారి నేను మోసపోను. పోరా బయటకు, నాకు విడాకులు కావాలి అని గట్టిగా అరుస్తుంది స్వప్న. కాశీ ఆవేశంగా వెళ్లిపోతాడు.

పారు ప్రశ్నలు

తాత, డాడీ నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్తున్నారని నీకు ముందే తెలుసు కదా, మరి నాకు చెప్పొచ్చు కదా అని ఇంటికి రాగానే పారిజాతంపై సీరియస్ అవుతుంది జ్యోత్స్న. దాసు ఎక్కడున్నాడో చెప్పమని జ్యోను పారు అడుగుతుంది. డాడీకి నా మీద డౌట్ వచ్చింది కాబట్టే సీక్రెట్ గా తీసుకెళ్లి టెస్టులు చేయించారని జ్యో అంటుంది. దాసు గురించి నీకు తెలుసా లేదా? అని మళ్లీ పారు అడుగుతుంది. చంపేయ్ గ్రానీ, ఇలాగే మాటలతో చంపేయ్. నా ముఖం చూస్తుంటే అయ్యో పాపం ఇది తల్లి లేని పిల్ల అని అనిపించడం లేదా అంటూ మొసలి కన్నీళ్లు కారుస్తుంది జ్యో.

ఇవి ఒరిజినల్ కన్నీళ్లేనా? గ్లిజరిన్ వేసుకున్నావేమో అని పారు అడుగుతుంది. నాకు నా కొడుకు దాసు అంటే ప్రాణం. నా కంటికి కొడుకు కనిపించేంత వరకు ఎవరినీ నమ్మను. మీ తాత, తండ్రితో జాగ్రత్తగా ఉండు. ఏం చేయాలో నువ్వే ఆలోచించు అని పారు లోపలికి వెళ్లిపోతుంది. దాసు విషయం గ్రానీకి తెలియనివ్వకూడదు, తెలిస్తే చంపేస్తుందని జ్యో అనుకుంటుంది.

కలలన్నీ కన్నీరులా

మగాడి జీవితం గురించి చెప్తూ కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. నువ్వు తండ్రివి కాబోతున్నావని చెప్పగానే కొన్ని నిమిషాల పాటు పీల్చే ఊపిరి కూడా ఆగిపోయింది. నీ కంట్లో నా ప్రతిబింబంలా నీ కడుపులో నా ప్రతిరూపం పెరుగుతుంది. నా బిడ్డ కోసం ఎన్నో కలలు కన్నా. డాక్టర్ చెప్పిన మాట విన్నాక కలలన్నీ కన్నీరుగా మారిపోయాయి అని దీప భుజం మీద తలవాల్చి ఏడుస్తాడు కార్తీక్. అత్తను కాపాడాలంటే బిడ్డను వదులుకోవాలా? ఎలా దీప? వదులుకోవడానికి అదేమైనా వస్తువా, మన ఆరో ప్రాణమని కార్తీక్ అంటాడు.

నాకు బుర్ర పని చేయడం లేదు బావ. తల తిరుగుతోంది. ఇంటికి వెళ్దాం బావ. ఇక్కడే ఉంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతుందేమోననిపిస్తుందని దీప ఏడుస్తుంది. ఎవరికీ ఏం చెప్పకు? ఏం జరగనట్లే ఉండమని దీపకు చెప్తాడు కార్తీక్. నువ్వు ఉండగలవా అని కార్తీక్ ను దీప అడగడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More