కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కాలేదన్న డాక్టర్- జ్యో స్మార్ట్ ఎస్కేప్, నిందలు- నిలదీసిన కాంచన!

కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 26వ ఎపిసోడ్‌లో డాక్టర్ ఇవాళ రాదని నమ్మకంగా జ్యోత్స్న వెళ్లిపోడానికి ట్రై చేస్తుంది. కానీ, అంతలోనే డాక్టర్ వస్తుంది. దానికి జ్యో భయపడిపోతుంది. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదని డాక్టర్ చెబుతుంది. దాంతో తెలివిగా డాక్టర్‌నే నిందించి తప్పించుకుంటుంది జ్యోత్స్న.

Published on: Jan 26, 2026, 07:23:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దాసును కిడ్నాప్ చేసిన రౌడీలతో మాట్లాడి వెనక్కి తిరిగిన జ్యోత్స్నకు పారిజాతం కనిపిస్తుంది. దాంతో జ్యో షాక్ అవుతుంది. ఎవరని అడిగితే ఫ్రెండ్ అంటుంది. ఎవరు ఆపలేరంటున్నావ్ అని పారు అంటుంది. ఏదో అలా కౌంటర్ ఇచ్చానని చెబుతుంది జ్యోత్స్న.

కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 26వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 26వ తేది ఎపిసోడ్

టార్చర్ పెడుతున్నారు

దాసు ఇంటికి రావడం నిజంగా చూశావా. కావాలనే అబద్ధం చెప్పావా అని పారిజాతం డౌట్ పడుతుంది. నా జీవితం తలకిందులు అవుతుంటే హెల్ప్ చేయకపోవడం మాని అందరూ టార్చర్ చేస్తున్నారు అని రివర్స్‌లో కోప్పడుతుంది జ్యోత్స్న. ముందు దీన్ని ఎలా కాపాడాలో ఆలోచించాలి అని పారిజాతం అంటుంది.

తర్వాత జ్యోత్స్న రెడీ అవుతుంటే ఎక్కడికే అని అడుగుతుంది పారిజాతం. నేను ఎక్కడికి వెళ్లానో తెలియదని చెప్పు. డాక్టర్ రాదు, రిపోర్ట్స్ రావు అని జ్యోత్స్న అంటుంది. దాంతో ఏం చేశావే అని షాక్ అవుతుంది పారిజాతం. ఇప్పుడే తెలియకపోవడం మంచిది అని జ్యోత్స్న వెళ్లిపోతుంది. జ్యోత్స్న కిందకు రాగానే డాక్టర్ వస్తుంది.

అది చూసి జ్యోత్స్న తెగ షాక్ అయిపోయి పైకి వెళ్తుంది. డాక్టర్ హారిక గారు వచ్చారు. జ్యోత్స్నను రమ్మనమని దీపకు శివ నారాయణ చెబుతాడు. పైకి వెళ్లి పారుతో డాక్టర్ వచ్చింది చెబుతుంది జ్యో. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డాక్టర్ ఇవాళ వేరే సర్జరీకి వెళ్లాలి. రిపోర్ట్స్ కూడా ఇవాళ రాకూడదు. ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు అని జ్యోత్స్న భయంతో వణికిపోతుంది.

కిందకు దూకేసి పారిపో

బాల్కనీలో నుంచి కిందకు దూకేసి పారిపో అని పారు అంటుంది. ఇంతలో దీప వచ్చి జ్యోత్స్నను తాతయ్య పిలుస్తున్నారని చెబుతుంది. మీరేంటీ వణికిపోతున్నారు అని పారును అంటుంది. చలి అని పారు అంటుంది. మిమ్మల్ని జారకుండా తీసుకెళ్తాను అని పారిజాతం చేయి పట్టుకుని కిందకు లాక్కెళ్తుంది దీప. చేసేదేం లేక జ్యోత్స్న కూడా కిందకు వెళ్తుంది.

అయిపోయింది. ఇక దాసు కూతురులా చచ్చేంత వరకు బతకాల్సిందే అని జ్యోత్స్న అనుకుంటుంది. జ్యో కిందకు వస్తుంది. నేను రేపు రావాల్సింది. కానీ కార్తీక్ ఇవాళే రమ్మన్నారు అని డాక్టర్ చెబుతుంది. జ్యోత్స్న బాధ చూడలేక రమ్మన్నాను అని కార్తీక్ పంచ్‌లు వేస్తాడు. మీ మనవరాలి గారి బ్లడ్ శాంపిల్స్ మీ కోడలికి మ్యాచ్ అవ్వలేదు అని డాక్టర్ చెబుతుంది.

దాంతో అంతా షాక్ అయి లేచి నిల్చుంటారు. తల్లితో మ్యాచ్ అవ్వకపోవడం ఏంటని కార్తీక్ అంటే.. రెండు మూడు సార్లు చెక్ చేశాం అని డాక్టర్ అంటాడు. అడ్డంగా దొరికిపోయామే జ్యోత్స్న అని పారిజాతం అనుకుంటుంది. మ్యాచ్ అవ్వకుంటే కన్నకూతురు కానట్లే అన్నారు అని కార్తీక్ అంటే.. అవును అని డాక్టర్ అంటుంది.

టెస్ట్‌లు సరిగా చేయడం రాదు

తప్పు మీ వైపు ఉంటే ఎన్నైనా అంటారు. శాంపిల్స్ మ్యాచ్ కాకుంటే తప్పు నాది కాదు టెస్ట్‌లు సరిగా చేయడం చేతకాని మీది. మొదటి నుంచే మీ ట్రీట్‌మెంట్ మీద నాకు నమ్మకం లేదు అని జ్యోత్స్న అంటుంది. అలా తెలివిగా డాక్టర్‌నే నిందించి జ్యోత్స్న తప్పించుకుంటుంది. హాస్పిటల్స్ డబ్బుల కోసం అబద్ధాలు చెబుతాయి అని పారిజాతం అంటుంది.

నావి అనుకుని బ్లడ్ శాంపిల్స్ వేరే వాళ్లతో కలిసిపోవచ్చు. దాని రిజల్ట్స్ ఇలా రావచ్చు అని జ్యోత్స్న అంటుంది. వీళ్లను నమ్ముకుని ట్రీట్‌మెంట్ చేయించి లాభం లేదు. మనం కెనడా వెళ్దాం. అక్కడ నా ఫ్రెండ్ ఉంటుంది. త్వరగానే మమ్మీ రికవరీ అవుతుంది అని జ్యోత్స్న అంటుంది. దేశం దాటే పారిపోవాలని స్కెచ్ వేశావ మరదలా అని కార్తీక్ అనుకుంటాడు.

జ్యోత్స్న.. హారిక గారు బెస్ట్ డాక్టర్. తప్పు జరిగి ఉండొచ్చు. కానీ మాట్లాడే విధానం ఇది కాదు. ట్రీట్‌మెంట్ ఎక్కడైనా ఇలాగే ఉంటుంది అని దశరథ్ అంటుంది. రిపోర్ట్స్ ఇచ్చి డాక్టర్ హారిక వెళ్లిపోతుంది. నా కూతురు పెళ్లి చూసే రాత లేనప్పుడు ఎవరు ఎంత తాపత్రయపడితే ఏం లాభం అని సుమిత్ర అంటుంది. దశరథ్ నచ్చ చెబుతాడు. అంతా ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోతారు.

ఏమైనా దాస్తున్నారా

మమ్మీకి ఏం కాదు డాడీ అని జ్యోత్స్న వెళ్లిపోతుంది. డాక్టర్ చెప్పింది నిజమా లేక పొరపాటు జరిగిందా అని దశరథ్ అనుమానిస్తాడు. మరోవైపు మీ ఇద్దరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని కాంచన నిలదీస్తుంది. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కాలేదని డాక్టర్ చెబితే అంతా అయోమయంగా చూస్తే మీరిద్దరు భయంగా చూశారు. అదే భయం పారిజాతం పిన్ని, జ్యోత్స్నలో కూడా చూశాను. వీళ్లిద్దరికి జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావని ముందే తెలుసండి అని కాంచన అంటుంది.

అలా ఎలా తెలుసు అని శ్రీధర్ అంటాడు. రిపోర్ట్స్ రాకముందే వీళ్లకు తెలుసు. పారిజాతం వాళ్లు ఎందుకు భయపడుతున్నారు. ఇదంతా చూస్తుంటే నా అన్నయ్య సొంత కూతురు జ్యోత్స్న కాదని ఎవరైనా చెబుతారేమో అనిపిస్తుంది అని కాంచన గట్టిగా నిలదీస్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More