కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ఇంట్లోంచి వెళ్లిపోతానన్న దశరథ్- జ్యోత్స్నను గండం నుంచి కాపాడే వ్యక్తికి పారిజాతం ఫోన్

కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 10వ ఎపిసోడ్‌లో సుమిత్రకు నిజం చెప్పాలని చూసిన జ్యోత్స్నను అంతా తిడతారు. జ్యోత్స్నను ఏమనకండి. నేను ఇంట్లో ఉండను. బయటకు వెళ్లిపోతాను అని దశరథ్ అంటాడు. సుమిత్ర ప్రాణాలు జ్యోత్స్న తీయాలనుకుందని కార్తీక్‌తో దీప అంటుంది. శ్రీధర్‌కు దాసు క్షమాపణలు చెబుతాడు.

Published on: Jan 10, 2026, 08:04:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అని నిజం చెప్పడంపై కాంచన తిడుతుంది. శివ నారాయణ కూడా తిడతాడు. దశరథ్‌ను ఏం అనకండి నాన్న. తల్లి జబ్బు పడితే అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా వెళ్లినప్పుడే జ్యోత్స్న ఏంటో అర్థమైంది. నేను ఇక ఈ ఇంట్లో ఉండను నాన్న అని దశరథ్ అంటాడు.

కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 10వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 10వ తేది ఎపిసోడ్

ఆ ఆశ కూడా పోయింది

ఇప్పటికే సగం భయంతో బతుకుతున్నాను. నా వాళ్లు అంతా నాతో ఉన్నారనిపించింది. కానీ, ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది. మీరంత చూశారు కాబట్టి నయమైంది. లేకపోతే ఏడుస్తున్న నా భార్యకు ఏమని చెప్పి ఓదార్చాలి. కూతురు పెళ్లి కోసం తల్లి పరితపిస్తుంటే తల్లి చావు కోసం కూతురు చూస్తుంది అని దశరథ్ అంటాడు.

నేను అంత కసాయిదాన్ని కాదు. రేపైనా మీరు చెప్పాల్సిందేగా అని జ్యోత్స్న అంటుంది. అందుకేనా పక్కన కూర్చుని చెబుతున్నావ్. పారు నువ్వైనా వద్దని చెప్పాలిగా అని కార్తీక్ అంటాడు. ఈ సలహా ఇచ్చింది పారిజాతమే అయింటుంది అని శివ నారాయణ అంటాడు. నేను కొద్దిరోజులు సుమిత్రను తీసుకుని బయటకెళ్తాను అని దశరథ్ అంటాడు.

మీరెందుకు నేనే వెళ్తాను అని జ్యోత్స్న అంటుంది. నీ తల్లిని కాపాడాల్సింది నువ్వే అని శివ నారాయణ అంటాడు. నీకు తల్లి మీద ఏమైనా ప్రేమ ఉందానే. అసలు నువ్వు మా వదిన కూతురువేనా. పెంచిన కూతురికి అయిన ప్రేమ ఉంటుంది. ఏదో ఒక తప్పు చేయడం నా వదినను బాధపెట్టడం అని కాంచన ఏడుస్తూ చెబుతుంది. పారిజాతం నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. జ్యోత్స్నకు దూరంగా ఉండు అని శివ నారాయణ అంటాడు.

గొప్పగా అర్థం చేసుకోరు

నీ పెళ్లి చూడాలనేది మీ అమ్మ కోరిక. అప్పటి వరకు అయినా ప్రాణాలతో ఉంచు అని దశరథ్ అంటాడు. మీరు ఇంతకన్న గొప్పగా నన్ను అర్థం చేసుకోలేరు అని వెళ్లిపోతుంది జ్యోత్స్న. తర్వాత కిచెన్‌లో జ్యోత్స్న కావాలనే ఇలా చేసింది. సుమిత్ర అమ్మ ప్రాణాలు తీయాలనుకుంది. జ్యోత్స్న కన్నకూతురు కాదు. టెస్ట్‌లు చేస్తే బయటపడుతుంది. జ్యోత్స్న, పారిజాతం పరిస్థితి ఏంటీ. కథ వెనక్కి వెళ్లి ఆగుతుంది. వాళ్లిద్దరికి నష్టం. అలా జరగకూడదనే ఇలా చేసిందని దీప అంటుంది.

అయితే పద నిజం చెప్పేద్దాం అని కార్తీక్ అంటాడు. మనకు టైమ్ లేదు. రెండు రోజుల్లో బోన్ మ్యారో రీప్లేస్ చేయాలి. అంతకుముందు ఇచ్చేవారి టెస్ట్‌లు చేయించాలి. చివరిగా బోన్ మ్యారో ఇచ్చేది నువ్వే. నువ్వే కన్నకూతురువి కాబట్టి. ఈ నిజం చెప్పకుండా ఇదంతా ఎలా చేయాలో నాకు తెలియదు అని కార్తీక్ అంటాడు.

ఏదో ఒక దారి దొరుకుతుంది. కానీ, జ్యోత్స్న, పారిజాతం అమ్మను ఏం చేయకుండా ఆపాలి అని దీప అంటుంది. మరోవైపు జ్యోత్స్ను తిడుతుంది పారిజాతం. ఇదే దీప చేస్తే ప్రేమ ఉందనేవారు. రేపు అయిన అమ్మకు నిజం తెలిస్తే తట్టుకుంటుందా. ఈ లాజిక్‌లు అడగకూడదు అని దబాయిస్తుంది జ్యోత్స్న. ఈ ఫ్యామిలీ అంతా నాకు అన్యాయం చేశారు. నన్ను నేను కాపాడుకోవాలి అని జ్యోత్స్న అంటుంది.

గండం నుంచి కాపాడే వ్యక్తి

నిన్ను కాపాడాలిగా అని ఒకరికి కాల్ చేస్తుంది పారిజాతం. ఎవరికి అని జ్యో అంటే నిన్ను గండం నుంచి బయటపడేసే వ్యక్తికి అని పారిజాతం అంటుంది. మరోవైపు శ్రీధర్ ఇంటికి దాసు వస్తాడు. కాశీ చేసిన తప్పుకు తను క్షమాపణ అడుగుతాడు. మీ జీవితాలను రోడ్డుకు లాగాడు నా కొడుకు. దేవుడు అనేవాడు ఉన్నాడు. అందుకే నిజం బయటపడింది. కానీ బాధ అంటే చాతకాని తండ్రిగా మిగిలిపోయాను. కన్న తండ్రిగా ఫెయిల్ అయ్యాను అని బాధపడతాడు దాసు.

నా కొడుకును ఇక తీర్చిదిద్దలేను. నా కొడుకును నువ్వే దారిలోకి తీసుకురా బావ. కొడుకు అయిన అల్లుడు అయినా నువ్వే బావ అని దాసు వెళ్లిపోతాడు. కాశీ గురించి, కూతురు గురించి ఆలోచించాలిగా అని కావేరి అంటుంది. నేను ఓ నిర్ణయం తీసుకున్నా. రేపు సాయంత్రం చెబుతాను అని శ్రీధర్ అంటాడు.

మరోవైపు అన్ దశరథ్‌ను ఓదారుస్తుంది కాంచన. శివ నారాయణ ఏడుస్తుంటాడు. సుమిత్ర అనారోగ్యం గురించి అంతా మాట్లాడుకుంటూ బాధపడుతుంటారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More