కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దశరథ్ ట్విస్ట్, తప్పించుకున్న జ్యోత్స్న- సుమిత్ర చనిపోయేలా కొత్త ప్లాన్- దాసు కాకి కథ!
కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 24వ ఎపిసోడ్‌లో సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తాడు కార్తీక్. ఒక కెమెరాలో ఏం కనిపించదు. ఇంకో కెమెరా చూస్తుంటే దశరథ్ వచ్చి ట్విస్ట్ ఇస్తాడు. అలా జ్యోత్స్న తప్పించుకుంటుంది. భోజనాల దగ్గర జ్యోత్స్న, పారు రచ్చ చేస్తారు. సుమిత్ర చనిపోయేలా, ఇల్లును ఏలేలా జ్యో కొత్త ప్లాన్ వేస్తుంది.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కార్తీక్ కిందకు వచ్చి ల్యాప్‌ట్యాప్ తీసుకుని సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తాడు. కెమెరా 2లో కనిపించదు. కెమెరా 1 చూడాలనుకుంటే అది పనిచేయట్లేదు అని దశరథ్ అంటాడు. నెల నుంచి పని చేయట్లేదు అని దశరథ్ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. నెల క్రితం కెమెరాను పాడు చేసింది నేనే. నాన్న రిపేర్ చేయకుండా మంచి పనిచేశాడు. అది తెలియక కంగారు పడ్డాను అని జ్యోత్స్న అనుకుంటుంది.

గ్రానీ పొరపాటు పడింది
అలా జ్యో తప్పించుకుంటుంది. సీసీ కెమెరా పని చేస్తే ఒక నిజం తెలిసేది అని పారు అంటే.. అవును అని కార్తీక్ అంటాడు. గ్రానీ పొరపాటు పడిందని జ్యోత్స్న వెళ్లిపోతుంటే వెనకే పారిజాతం వెళ్తుంది. దాసు గురించి అడిగితే నీకు బ్రెయిన్ పనిచేయట్లేదు. కళ్లజోడు మార్చు అని అరిచేసి వెళ్లిపోతుంది జ్యోత్స్న. నిజమేనా అని పారిజాతం అనుకుంటుంది. తర్వాత అంతా విందు భోజనానికి కూర్చుంటారు.
దీపను కూడా భోజనం చేయమని అంటారు. సుమిత్ర పక్కన కూర్చో అని దశరథ్ అంటాడు. కార్తీక్ కూడా చెప్పడంతో దీప కూర్చుంటాడు. దీపను వేరుగా చూడాలంటూ మిర్యాలు, బొప్పాయి విత్తనాల స్టోరీ చెప్పి అంటుంది జ్యోత్స్న. తలో మాట అనుకుంటూ శ్రీధర్‌ను అడ్డదారిలో ఫ్యామిలీలో చేరావు. ఇష్టం లేకపోయిన కాంచన వెనుక పడుతున్నావ్. నిజానికి నువ్వు రావాల్సింది కావేరితో అని పారిజాతం అంటుంది.
కావేరికి విడాకులు ఇస్తున్నావా
కావేరికి విడాకులు ఇస్తున్నావా అని పారిజాతం అంటే కార్తీక్ పారు అని కోపంగా అంటాడు. ఎందుకురా అరుస్తున్నావ్ అని పారునే గద్దిస్తుంది. పారిజాతంను శివ నారాయణ తిడతాడు. దీంట్లో కూడా విషం కలుపుతున్నావా అని వారిస్తాడు. నేను బతుకుతానని నాకు నమ్మకం లేదు. నా కూతురు పెళ్లి చూడాలన్నదే నా కోరిక. అంతవరకు అయినా ఉంటానో లేదో అనిపిస్తుందని సుమిత్ర అంటుంది.
అంతా బాధపడుతారు. నేను నిన్ను కాపాడుకుంటాను మమ్మీ. నీ కూతురు ఉండగా నీకు ఏం కాదు. తొందర్లోనే కోలుకుంటావ్. నా పెళ్లి చేస్తావ్. నా పిల్లలతో ఆడుకుంటావ్. నీ పిల్లలకు భోజనం తినిపిస్తావ్ అని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న భయపడకుండా ఇంత కాన్ఫిడెంట్‌గా చెబుతుందేంటీ అని కార్తీక్ అనుకుంటాడు. నా ప్లాన్ వేరే ఉంది బావ అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది.
మనవరాలికి సుమిత్ర భోజనం
ఇంతలో శౌర్య వచ్చి టెర్రస్‌పై ఆడుకుంటున్నట్లు చెబుతుంది. శౌర్యకు అన్నం తినిపిస్తుంది సుమిత్ర. నీ మనవరాలికి భోజనం తినిపిస్తావన్న మాట ఇంత త్వరగా నిజమవుతుందని అనుకోలేదని జ్యోత్స్న అనుకుంటుంది. మరోవైపు జ్యోత్స్న దగ్గర ప్లాన్ ఉందని కార్తీక్‌తో దీప డౌట్‌గా అంటుంది. మరోవైపు జ్యోని పారిజాతం అడుగుతుంది.
నీకు చెప్పను గ్రానీ. ఎవరికి తెలియకుండా నేను దాచిన డబ్బంతా నా వేరే అకౌంట్‌లో చాలా సేఫ్‌గా ఉంది. నేను ఇంట్లోంచి పోయానంటే నాకోసం వెతుకుతారు. దీపే వారసురాలు అని చెప్పడానికి దాసు రాడు. సుమిత్రను బతికించడానికి నేను రాను. అమ్మ చచ్చిపోతుంది. ఆ తర్వాత ఎలా రావాలో ఇంటిని ఎలా ఏలాలో నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
దీపను ఏం చేయకు
మరోవైపు కార్తీక్‌కు ఫోన్ వచ్చి వెళ్లిపోతాడు. తర్వాత రౌడీకి కాల్ చేసి దాసుతో స్పీకర్‌లో మాట్లాడుతుంది. తెల్లారేలోపు చస్తావని దేవుడు చెబితే నిద్రపోకుండా రాత్రి చీకటిని చూస్తు నవ్వుకున్న కాకి కథ చెప్పిన దాసు.. నేను నిజం చెప్పకుంటే ఇంకెవరికి తెలియదు అనుకుంటున్నావా. నిజం ఉదయించే సూర్యుడు లాంటిది. నీ అంతట నువ్వే వారసురాలు ఎవరో చెప్పి తప్పు సరిదిద్దుకుంటే మంచిది లేకుంటే ఎలా ఉంటుందో నీకు తెలియదు అని దాసు అంటాడు.
మీ అమ్మ చేసిన తప్పును నేను సరిదిద్దుతాను అని జ్యోత్స్న అంటే.. దీపను ఏం చేయకు అని దాసు అంటాడు. నన్నెవరు ఆపలేరు నాన్న అని కాల్ కట్ చేస్తుంది. వెనక్కి తిరిగిన జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


