కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దాసును దాచిపెట్టింది నువ్వే- జ్యోత్స్న‌కు పారు షాక్- కార్తీక్ ప్లాన్- శ్రీధర్ ఎమోషనల్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 30 ఎపిసోడ్ లో దాసు కనిపించడం లేదని పోలీస్ కంప్లయింట్ ఇద్దామని జ్యోత్స్నతో పారు అంటుంది. నువ్వే దాచిపెట్టావని జ్యోకు పారు షాక్ ఇస్తుంది. మరోవైపు కాశీని స్వప్న క్షమించాలని అడిగినట్లుగానే, తనను కూడా క్షమించాలని కాంచనను అడుగుతూ ఎమోషనల్ అవుతాడు శ్రీధర్. 

Published on: Jan 30, 2026, 07:07:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 30 ఎపిసోడ్ లో పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని, నా కొడుకు కనిపించడం లేదని కంప్లయింట్ ఇవ్వాలని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. తాయిత్తు తెగిపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వాడిని ఎవరో ఏమో చేశారనిపిస్తుంది. నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావ్? నా కొడుకును ఎవరో కిడ్నాప్ చేశారని కంప్లయింట్ ఇస్తానని పారు షాక్ ఇస్తుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

నీ మీదే అనుమానం

జ్యోత్స్న ముఖంలో రంగులు మారుతున్నాయి. నిజంగానే దాసును దాచిపెట్టలేదు కదా అని పారిజాతం అనుకుంటుంది. నీ మీదే అనుమానంగా ఉంది. నువ్వే నీ తండ్రిని దాచిపెట్టావని చెప్తానని పారు అనడంతో జ్యోత్స్న మళ్లీ షాక్ అవుతుంది. కానీ నా కొడుకు కనిపించడం లేదు వెతకండని పోలీసులతో అంటానని పారు చెప్తుంది. నేనెక్కడికి రాను, నేను ప్రాబ్లమ్ లో ఉంటే నా తండ్రి పట్టించుకున్నాడా? అని జ్యోత్స్న అంటుంది.

తప్పించుకున్న జ్యో

అవతలి వ్యక్తి ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడే ఇలాంటి పోలిక వస్తుంది. అయితే దాసు గురించి నీకేం తెలియదు కదా పోలీస్ స్టేషన్ కు వెళ్దాం పదా అని పారు అంటుంది. నేను రానని జ్యో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు శ్రీధర్ ను ఇంటికి పిలుస్తుంది కాంచన. కాశీ ఎక్కడున్నాడని అడుగుతుంది. చేసిన తప్పుకు శిక్ష ఉంటుంది కాంచన. కాశీ పిరికివాడు కాబట్టి పారిపోయాడని శ్రీధర్ అంటాడు.

కాశీని చూసిన శ్రీధర్

అప్పుడే కాశీని పిలుస్తుంది కాంచన. గుర్తుపట్టలేనట్లుగా అయిపోయిన ఈ మనిషిని చూస్తే తెలియట్లేదా మనిషి మారాడో లేదోనని. స్వప్పకు ఫోన్ చేస్తే ఇంటికి రావొద్దని చెప్పిందంటానని కాంచన వివరిస్తుంది. నువ్వేం అంటావో చెప్పమని కాంచనను అడుగుతాడు శ్రీధర్. మనిషి జీవితం సముద్రంలో పడవ ప్రయాణం లాంటిది. గొడవలు వచ్చాయని జీవితం వదిలేస్తామా? కాశీ తప్పు తెలుసుకున్నాడు. స్వప్నతో కలిసి బతకాలనుకుంటున్నాడు. తన నిజాయతీ నిరూపించుకుంటాడని కాంచన చెప్తుంది.

నాకూ అవకాశం

కాశీ, స్వప్న మధ్య అపార్థాలు తొలగిపోయి కలిసి ఉండాలని కోరుకుంటున్నావా కాంచన. అయితే కాశీకి ఒక అవకాశం ఇవ్వాలంటావు కదా. శభాష్ కాంచన. భార్య నమ్మకాన్ని కోల్పోయిన కాశీకి ఒక అవకాశం ఉండాలని అనుకున్న నువ్వు, నీ నమ్మకాన్ని కోల్పోయిన నాకు ఒక అవకాశం ఇవ్వాలని ఎందుకు కోరుకోవడం లేదని శ్రీధర్ అంటాడు. నాతో కలిసి బతకడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నన్ను నీ భర్తగా అంగీకరించగలవా? అని శ్రీధర్ ప్రశ్నలు వేస్తాడు.

పారుతో ప్లాన్

నీ కొడుకు కనబడకుండా పోవడానికి, నువ్వు అనుమానపడ్డ మనిషికి సంబంధం ఉందని నీకు అర్థమైందా పారు అని కార్తీక్ అడుగుతాడు. దాసు మామయ్య గురించి రెండు రోజుల కంటే ఎక్కువ ఆలోచించలేను. మరి ఎవరు పట్టించుకోవాలని కార్తీక్ అడుగుతాడు. నేనే, ఏం చేయాలో చెప్పమని కార్తీక్ తో అంటుంది పారు. నీ మనవరాలి మీద ఓ కన్నేసి ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో కనిపెట్టమని పారుకు చెప్తాడు కార్తీక్. పారుతో ప్లాన్ వేస్తాడు.

ఒకటే జీవితం

కార్తీక్, దీప ఇంటికి వెళ్లేసరికి కాంచన, శ్రీధర్, కాశీ ఉంటారు. తన తప్పు తెలుసుకున్న కాశీని స్వప్నతో కలపాలని మీ అత్తయ్య గారు నన్ను ఇక్కడికి రప్పించారు. కాశీ విషయంలో ఆలోచించినట్లే నా విషయంలో ఎందుకు ఆలోచించడం లేదని నేను అడిగా. ఇప్పుడు సమాధానం చెప్పమను. నాది ఒకటే ప్రాణం, ఒకటే జీవితం. కాంచనను నన్ను క్షమించమను. స్వప్నను కాశీని క్షమించమని నేను ప్రాధేయపడతానని శ్రీధర్ దీపతో అంటాడు.

శ్రీధర్ ఎమోషనల్

దీపను నువ్వు వద్దన్నావా? కడుపులో బిడ్డను వదులుకోగలవా? అని కార్తీక్ ను శ్రీధర్ అడిగితే, వదులుకోనని కార్తీక్ సమాధానం చెప్తాడు. కాశీలాగే నేనూ తప్పు చేశా. ఒకలాంటి తప్పు కాదు కానీ అక్కడ కూడా ఇక్కడిలాగే భార్యాభర్తలు విడిపోయారు. కాశీది మారిన మనసు అయితే నాది కూడా మారిన మనసే. కాశీకి క్షమాభిక్ష ఉంటే నాకూ ఉండాలి. ప్రాణం పోయినా బతికి ఉండే బంధం మాది. నా ఆవేదనకు అర్థం లేదంటారా చెప్పండని శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు.

కార్తీక్ నువ్వు చెప్పు, నా మార్పులో ఉన్న నిజాయతీలో అర్థం లేదా. దీప నువ్వు చెప్పు. భార్య చనిపోతే చితికెక్కే భర్త ప్రేమ నా కథలో చూస్తారు. అందరి కాపురాలు బాగుండాలని కోరుకుంటావు కాంచన. మరి నీ కాపురంలో సమస్య వస్తే ఎవరు కన్నీళ్లు కార్చాలి? అని శ్రీధర్ ఫీల్ అవుతాడు.

కలిసి ఉండాలని

నాకు అమ్మ కాకముందే నీకు భార్య. అంతకంటే ముందు ఒకాయనకు కూతురు. మొదటగా ఆడది. ఆమెకు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. మీ నిర్ణయాలు మీకే వదిలేస్తున్నా. కానీ మీ కొడుకుగా మీరు కలిసి ఉండాలనే కోరుకుంటున్నానని కార్తీక్ అంటాడు. నా కొడుకే నా నిర్ణయాన్ని గౌరవించినప్పుడు నేను గౌరవించకపోతే బాగుండదు కదా. పూర్తిగా మానేసిన దాన్ని మళ్లీ మొదలెట్టలేనని కాంచన చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More