కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపను చంపాలనుకుంది జ్యోత్స్ననే- వణికిపోయిన జ్యో- డాక్టర్‌తో దీప నిజం చెప్పిన కార్తీక్
కార్తీక దీపం 2 సీరియలు టుడే జనవరి 28 ఎపిసోడ్ లో దీపను చంపాలనుకుంది జ్యోత్స్ననే అని కార్తీక్, దీప, దశరథ అనుమానపడతారు. శ్రీధర్ ఈ విషయం తెలిసి కంగారు పడతాడు. జ్యోత్స్ననే అని కార్తీక్ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. దీంతో జ్యో వణికిపోతుంది. డాక్టర్ దగ్గరకు కార్తీక్, దీప వెళ్తారు.
కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 28 ఎపిసోడ్ లో ఇంతకుముందు దీపను చంపినవాళ్లే మళ్లీ వచ్చి ఉంటారా? జైల్లో ఉన్నవాడు తన మనుషులను పంపిస్తున్నాడా? అని కాంచన కంగారు అడుగుతుంది. ఇది నరసింహ చేసింది కాదమ్మా అని కార్తీక్ చెబుతుండగా శౌర్య వస్తుంది. శౌర్య ముందు ఏం మాట్లాడొద్దని కార్తీక్ అనడంతో అందరూ సైలెంట్ అయిపోతారు.

మిస్ అయిందని
మన ఇంట్లోకి వచ్చి చంపాలనుకున్నాడంటే అవతలి వాళ్లకు తీరని పగైనా ఉండాలి లేదా నువ్వు అడ్డుగానైనా ఉండాలని కాంచన దీపతో అంటుంది. అలాంటి వాళ్లు ఒక్కరే ఉన్నారు జ్యోత్స్న అని అనుకుంటుంది దీప. మరోవైపు జ్యోత్స్నకు కాల్ చేసి జస్ట్ లో మిస్ అయిందని రౌడీ చెప్తాడు. వాళ్లు నిద్రలేచారు మేడం, తప్పించుకున్నామని చెప్తాడు. డెన్ కు వెళ్లిపోండి మనం తర్వాత మాట్లాడుకుందామని జ్యో చెప్తుంది. వెనక్కి తిరిగి చూస్తే దశరథ ఉంటాడు.
జ్యో అబద్దం
ఎవరు ఫోన్లో? మళ్లీ తప్పించుకుంది ఎవరు? నిన్నే జ్యోత్స్న అడిగేది అని దశరథ అంటాడు. కెనడాలో నా ఫ్రెండ్ ఉందని చెప్పాగా తనే ఫోన్ చేసింది. మా మమ్మీకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించాలని అక్కడ డాక్టర్ కు రిపోర్ట్స్ చూపించమని అడిగా. డాక్టర్ అపామింట్మెంట్ రెండో సారి మిస్ అయింది. అందుకు ఇలా అన్నానని జ్యో అబద్దం చెప్తుంది. తల్లి మీద నాకు ప్రేమ ఉందని అంటుంది. శాంపిల్స్ మ్యాచ్ అవుతాయని కాన్ఫిడెన్స్ తో ఉన్నా కానీ డాక్టర్ డిసప్పాయింట్ చేసిందని జ్యో అంటుంది.
కొన్నిసార్లు తప్పులు జరుగుతాయమ్మా. వాటిని ముందు సరిదిద్దాలి. ఎన్నో ఏళ్ల నుంచి పెంచుకున్న నమ్మకం ఒక్క తప్పుతో పోతుందా జ్యోత్స్న. కొన్నిసార్లు నమ్మకపోవడం కూడా రిస్కే. నేనైతే ఒక ఛాన్స్ ఇస్తా. ఈ సారి మిస్టేక్ జరగదమ్మా అని దశరథ వెళ్లిపోతాడు. ఆ దీప చచ్చుంటే ముందు ఆ దాసుగాడికి బుద్ధి వచ్చేది. మా మమ్మీ బతకడానికి ఆల్టర్నేట్ ఉండదు కాబట్టి ప్రాబ్లెం సాల్వ్ అయ్యేదని జ్యో అనుకుంటుంది.
శ్రీధర్ కంగారు
మార్నింగ్ కాంచనకు ఫోన్ చేసి టిఫిన్ చేశావా? అని అడిగాడు శ్రీధర్. దీపను ఎవరో చంపాలనుకున్నారు. రాత్రి ఇంటికి వచ్చారని కాంచన చెప్తుంది. అక్కడ ఉండొద్దని చెప్పా. గతంలో కూడా ఇలాగే జరిగింది. దొంగతనం కోసం వచ్చి దొరికిపోతామేమోనని కూడా చేసి ఉంటారని శ్రీధర్ అంటాడు. మేం గుడికి ఇప్పుడు రామని చెప్పేసి కాంచన కాల్ కట్ చేస్తుంది.
కడుపుతో ఉన్న ఆడదాన్ని చంపాలనుకున్నారంటే ఆలోచించరా. మరోసారి ప్రమాదం రావొద్దంటే గడప దాటకూడదని కాంచన అంటుంది. తల్లినే కంటికి రెప్పలా కాపాడుకున్నవాన్ని. బిడ్డకు ఏమైనా జరగనిస్తానా? ఈ నాన్న ఇప్పటి నుంచే బిడ్డకు కాపలాగా ఉన్నాడని కార్తీక్ చెప్తాడు. శౌర్యను డ్రాప్ చేసి వెళ్తామని కార్తీక్, దీప బయల్దేరతారు.
పోలీస్ కంప్లయింట్
మరోవైపు శివ నారాయణ ఇంటికి శ్రీధర్ వెళ్తాడు. పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లయింట్ ఇవ్వకుండా దీపపై మర్డర్ ఆటెంప్ట్ జరిగిందని మాకు వచ్చి చెప్తావేంటీ శ్రీధర్ అని శివ నారాయణ అడుగుతాడు. దశరథ నువ్వు వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మను అని శివ నారాయణ అంటే.. అవసరం లేదని కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. అసలు చంపడానికే వచ్చాడని మీరు ఎలా చెప్తారని పారిజాతం అడుగుతుంది. జ్యోత్స్న మీద దశరథకు అనుమానం వస్తుంది.
వణికిపోయిన జ్యోత్స్న
నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? అని శివ నారాయణ అడిగితే జ్యోత్స్నను చూస్తాడు కార్తీక్. వాళ్లెవరో తెలిసింది. ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలిసింది. జ్యోత్స్న అని కార్తీక్ అనగానే అందరూ షాక్ అవుతారు. భయంతో జ్యో వణికిపోతుంది. నిన్ను పిలిచాను అంతే. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలుసని చెప్పడానికి పిలిచాను అంతే. ఎవరిని వదలను అని అంటాడు కార్తీక్. దాసుకు, జ్యోత్స్నకు, దీపకు ఏదో సంబంధం ఉందని దశరథ అనుకుంటాడు.
దీపకు, నాకు కొంతమంది వ్యాపారానికి సంబంధించిన రహస్యాలు తెలిశాయి. అందుకే చంపాలనుకుంటున్నారు. కానీ వాళ్ల రహస్యాలు బయటపడే రోజు వచ్చిందని వాళ్లకు తెలియదు. పోలీస్ కంప్లెయింట్ వద్దు. నేనే శిక్షిస్తానని కార్తీక్ అంటాడు. ఇదంతా వైరా చేశాడేమోనని శివ నారాయణ, దశరథ, శ్రీధర్ అనుకుంటారు.
డాక్టర్ దగ్గరకు
జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ అవలేదని డాక్టర్ చెప్పినప్పటి నుంచి సుమిత్ర ఇంకా డల్ అయింది. తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని దశరథ అంటాడు. కార్తీక్, దీప హాస్పిటల్ కు వెళ్తారు. కన్నతల్లికి కన్నకూతురు శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా. ఇక్కడ నిజం ఏంటంటే జ్యోత్స్న సుమిత్ర కూతురు కానే కాదని డాక్టర్ స్పష్టం చేస్తుంది.
జ్యోత్స్న కాకుండా బ్లడ్ రిలేటివ్ ఎవరైనా ఉంటే సేవ్ చేయొచ్చా. దీప ఉంది. తనే మా అత్తను కాపాడగలదని డాక్టర్ కు కార్తీక్ చెప్తాడు. దీపను ఎందుకు చంపాలనుకున్నావే అని జ్యోత్స్నను పారిజాతం అడుగుతుంది. నీ బుద్ధి ఎలాంటిదో నాకు తెలియదా? అసలు నిజాలు తెలుస్తాయని కార్తీక్ మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ దొరికిపోయామని పారు అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












