కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న దొంగ ఏడుపు కనిపెట్టిన దాసు- తల్లిని చంపేస్తావా అంటూ దశరథ ఫైర్- దీప ఆవేదన
కార్తీక దీపం 2 టుడే ఫిబ్రవరి 6 ఎపిసోడ్ లో తనను కాపాడాలని దాసును రిక్వెస్ట్ చేస్తుంది జ్యోత్స్న. కానీ దాసు ఒప్పుకోడు. మరోవైపు శౌర్య మీద దీప కోప్పడుతుంది. సుమిత్రను పట్టించుకోకపోవడంతో జ్యోత్స్నపై దశరథ సీరియస్ అవుతాడు. ఏ ప్రాణాన్ని వదులుకోవాలంటూ దీప బాధపడుతుంది.
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 6 ఎపిసోడ్ లో.. నేను సుమిత్ర కూతురు కాదనే మీరంతా కలిసి ప్రూవ్ చేయాలనుకుంటున్నారు కదా నాన్న అని దాసుతో జ్యోత్స్న మాట్లాడుతుంది. అంతా అయిపోయింది. మళ్లీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. బ్లడ్ శాంపిల్స్ ఇప్పించారు. రిజల్ట్ కూడా సేమ్. నువ్వయితే హ్యాపీ కదా అని జ్యోత్స్న అంటుంది.

మూర్ఖుడైన తండ్రి
దీపను ఆ ఇంటి వారసురాలిగా చూసేంతవరకూ నాకు హ్యాపీగా ఉండదని జ్యోత్స్నతో దాసు అంటాడు. లోకంలో ప్రతి ఆడపిల్లకు ఎంతో మంచి తండ్రి ఉన్నప్పుడు నీలాంటి మూర్ఖుడైన తండ్రి నాకు ఉండటం ఏంటీ? అని జ్యో ఆవేశపడుతుంది. దీపను కూతురుగా పొందిన అన్నయ్య అదృష్టవంతుడు. దీపను పెంచిన కుబేర్ అదృష్టవంతుడు. అలాంటి అదృష్టం నాకెందుకు కలగలేదని అనుకుంటున్నానని దాసు చెప్తాడు.
దొంగ ఏడుపు
కోటి మందిలో ఒకరికి ఉండే జాతకం నాది. అందుకే పనిమనిషి కూతురిగా పుట్టినా యజమానిగా బతుకుతున్నా. అమ్మ బతికి ఉంటే నా వైభవం చూసి ఎంత సంతోషపడేదో తెలుసా నీకు అని ఏడుస్తుంది జ్యోత్స్న. ఇప్పుడు నీకు దొంగ ఏడుపులు అవసరమా? నువ్వు అనుకున్నది మాత్రం జరగదని దాసు అంటాడు. ముందు శిక్ష మీ అమ్మకు, నీకు పడాలి. నేనేం తప్పు చేశా. దాసు కూతురునని ప్రపంచానికి పరిచయం చేసుకోలేనని జ్యో అంటుంది.
పాపాలు తెలియాలని
దీపకు తల్లి బతికే ఉన్నా, అమ్మ అనే పిలుపు చచ్చిపోయింది. ఈ జన్మలో చేసిన పాపాలు ఇదే జన్మలో కడుక్కోవాలి. దూరమైన బిడ్డను మళ్లీ ఆ ఇంటికి చేర్చాలి. అమ్మానాన్న పిలుపులు లేకుండా బతుకున్న దీపకు అమ్మానాన్నను ఇవ్వాలి. నీ పరిస్థితి ఏమవుతుందో నేను చెప్పలేను. నువ్వు చేసిన పాపాలన్నీ వాళ్లకు తెలియాలని జ్యోతో దాసు అంటాడు.
ప్లీజ్ నాన్న నువ్వు నన్ను కాపాడు. ఒక్కసారి ఆలోచించు, భార్య చనిపోయింది కూతురును నువ్వే చంపుతావా? నా తల్లి కళ్యాణి నిన్ను క్షమించదు నాన్న అని జ్యో అంటే, నువ్వు ఎప్పటికీ నా కూతురుగానే ఉంటావని దాసు అంటాడు. అది జరగదని జ్యో వెళ్లిపోతుంది.
సుమిత్రత్త గురించి
మరోవైపు దీపకు ఏమైందిరా? ఎందుకు ఏడుస్తుంది? మీరు ఏమైనా మాటలు అనుకున్నారా? అని కార్తీక్ ను కాంచన అడుగుతుంది. సుమిత్రత్త గురించి బాధపడుతుందని కార్తీక్ చెప్తాడు. కడుపుతో ఉన్న ఆడవాళ్లు త్వరగా తిని పడుకోవాలి. బిడ్డ ఆరోగ్యం కోసమైనా ఆలోచించాలి కదా అని కాంచన అంటుంది. శౌర్యను దీపకు భోజనం తీసుకెళ్లమని కాంచన చెప్తుంది.
శౌర్య పదేపదే అడిగేసరికి నేను తినను అని చెప్తున్నా కదా అని దీప కోప్పడుతుంది. శౌర్య భయంతో ప్లేట్ కింద పడేస్తుంది. తినకపోతే చచ్చిపోతానా అని దీప అంటుంది. సుమిత్ర గురించే అయితే నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. ఆవిడను కాపాడుకునేందుకు కన్న కూతురు ఉందని దీపతో అనసూయ అంటుంది.
దశరథ ఫైర్
నైట్ లేటుగా జ్యోత్స్న రావడంతో దశరథ ఫుల్ ఫైర్ అవుతాడు. చెప్పకుండా బయటకు వెళ్లాను అది తప్పా? అని అడుగుతుంది జ్యో. ఎప్పుడు వెళ్లడం వేరు, ఈ రోజు వెళ్లడం వేరు. దీప, కార్తీక్ ఇంటికి వెళ్లారు. నేను రెస్టారెంట్ కు వెళ్లా. నాన్న చెల్లి దగ్గరకు వెళ్లాడు. మరి సుమిత్రను ఎవరు చూసుకుంటారు. నువ్వు అమ్మను చూసుకోవాలా? లేదా? కన్నతల్లి కంటే నీ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు నీకు అని కోప్పడతాడు దశరథ.
తల్లి చనిపోవాలని
ట్యాబ్లెట్స్ డస్ట్ బిన్ లో కాదు మీ అమ్మకు ఇవ్వాలని దశరథ అంటాడు. మార్నింగ్ హాస్పిటల్ కు ఎందుకు చెప్పకుండా తీసుకెళ్లారని జ్యోత్స్న అడుగుతుంది. రెండుసార్లు ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు ట్రై చేశావ్. అందుకే చెప్పకుండా తీసుకెళ్లామని దశరథ అంటాడు. ఎవరైనా తల్లి చనిపోవాలని కోరుకుంటారా? అని జ్యో అంటే, నువ్వు కోరుకుంటావేమో, తల్లిని చంపేస్తావా అని దశరథ అంటాడు. దశరథ కోపంలో ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు లోపలికి వెళ్లమని శివనారాయణ అంటాడు.
కార్తీక్ దీపం
కార్తీక్ బాబు నీ మెడలో తాళి కట్టిన తర్వాత ఆరిపోయిన దీపం మళ్లీ వెలిగింది. అది కార్తీక్ బాబు దీపమైందని దీపతో అనసూయ అంటుంది. దీపను దగ్గరకు తీసుకుని ఏంటి నీ బాధ? శౌర్య మీద అరిచావంటే అంతకుమించిన బాధ ఏదో నీ లోపల ఉంది. నువ్వు ఎందుకు బాధపడుతున్నావో కార్తీక్ చెప్పేశాడని కాంచన అడుగుతుంది. అసలు బావ ఏం చెప్పాడు? నేను అత్తకు ఏం చెప్పాలి అని దీప ఆలోచిస్తుంది.
ఆ ప్రాణం కోసం
బావ చెప్పిన తర్వాత నేనేం చెప్తా అత్తయ్య, బావ మాటే నా మాట అని తెలివిగా చెప్తుంది దీప. నాకు తెలిసిన మనిషికి ఓ విచిత్రమైన పరిస్థితి వచ్చింది. కంటికి కనిపించే ప్రాణానికి ప్రమాదం ఉంది. తను ప్రాణం పెట్టుకున్న ఒక ప్రాణం వదులుకుంటే కంటికి కనిపించే ప్రాణానికి ప్రమాదం తప్పొచ్చు. ఏదో ఒక ప్రాణాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి అని దీప కాంచనను అడుగుతుంది.
కార్తీక్ పుట్టిన తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది. రెండు కాళ్లు పనిచేయవని చెప్పారు. అర్ధరాత్రి లేచి చచ్చిపోదామని అనుకున్నా. ఊయలలో పిల్లవాడి ఏడుపు వినిపించింది. వాడికోసం బతకాలని అనుకున్నా. కనిపించే ప్రాణాన్ని పోగొట్టుకుంటే కనిపించని ప్రాణానికి అర్థం ఏముంది అని కాంచన అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


