కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: మీరు హంతకులని కార్తీక్, దీపపై దశరథ ఫైర్- అత్త‌ చనిపోయినా ఓకేనా- మామ‌య్య‌కు కార్తీక్ ప్ర‌శ్న

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 2 ఎపిసోడ్ లో కడుపులో బిడ్డ ప్రాణం ఎలా తీస్తారని కార్తీక్, దీపపై దశరథ ఫైర్ అవుతాడు. హంతకులు అంటూ మండిపడతాడు. అత్త చనిపోయినా ఓకేనా? అని మామయ్యను కార్తీక్ ప్రశ్నిస్తాడు. మరోవైపు సుమిత్ర ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది.

Published on: Mar 2, 2026, 07:22:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 2 ఎపిసోడ్ లో.. నా కూతురు కడుపులో బిడ్డను చంపడానికి ఎవర్రా నువ్వు? అని కార్తీక్ పై దశరథ ఫైర్ అవుతాడు. అసలు తల్లివేనా నువ్వు? కడుపులో బిడ్డ చచ్చిపోయినా పర్వాలేదని డాక్టర్ కు చెప్తావా. ఆ మాట అనడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అని దీపపైనా మండిపడతాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

మీరు హంతకులు

పుట్టిన తర్వాత నిన్ను చంపాలనుకున్న పారిజాతం పిన్నికి, ఇప్పుడు నీకు తేడా ఏంటీ? ఇద్దరూ హంతకులే అని దీపపై దశరథ కోప్పడతాడు. నువ్వు కూడా హంతకుడివేరా. ఏదో ఒకటి చేసి బిడ్డల ప్రాణాలను కాపాడుకునే అమ్మానాన్నలను చూశా. కానీ మీలాంటి అమ్మానాన్నలను చూడలేదు. నేను ఇక్కడకు రావడం మంచిదైంది. లేకపోతే నా కూతురు కడుపులో బిడ్డను చంపేసేవాడివి అని కార్తీక్ తో దశరథ అంటాడు.

అత్త చచ్చిపోయినా

అత్త చచ్చిపోయినా ఓకేనా, చెప్పు మామయ్య. అత్త ప్రాణాలు కాపాడటానికి వేరే దారి ఉంటే నా బిడ్డను ఎందుకు వదులుకుంటా? నీ భార్యను కాపాడటానికి మరో ఆప్షన్ చెప్పు మామయ్య అని దశరథను కార్తీక్ అడుగుతాడు. నేనేదో బలవంతంగా దీపను ఒప్పించి బిడ్డ ప్రాణాలు తీసే మనిషిలా కనిపిస్తున్నా. నేనూ మనిషినే మామయ్య. నాకు కలలు, ఆశలు ఉండవా? నా కన్నబిడ్డను చేతుల్లోకి తీసుకోవాలని అనుకోనా? అని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు.

కళ్లముందే

నా కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలు తీయొద్దని దశరథ అడుగుతాడు. అయితే అత్త చచ్చిపోయినా ఫర్వాలేదని చెప్పు అని కార్తీక్ అడగడంతో దశరథ షాక్ అవుతాడు. మా అత్తను నేను వదులుకోలేను. చెప్పు మామయ్య, అత్త చచ్చిపోయినా ఫర్వాలేదా? నీ భార్య పట్ల నీకు బాధ్యత లేదా మామయ్య? నిన్నే నమ్ముకుని బతుకుతున్న నీ భార్య నీ కళ్ల ముందే చచ్చిపోయినా ఫర్వాలేదా? అని కార్తీక్ అడుగుతాడు.

దశరథ ఎమోషనల్

అత్త చూపించే ప్రేమ కోసం నా బిడ్డ ప్రాణాలే కాదు నీ ప్రాణాలు ఇచ్చినా తప్పు లేదు. నా బిడ్డ చనిపోతుందని నేనేంత బాధపడాలి? నా భార్య ఎంత బాధపడాలి? రక్తంతో ముడిపడ్డ పేగు బంధాన్ని రక్తం పంచిన తల్లి కోసం త్యాగం చేస్తుందంటే నువ్వు, నేను నీ కూతురి కాళ్ల మొక్కాలి మామయ్య అని కార్తీక్ అనడంతో దశరథ కూలబడి ఏడ్చేస్తాడు. సుమిత్ర లేకపోతే నేను బతకలేను. నా భార్యను నేను చంపుకోలేను. మీ పాదాలకు దండం పెట్టాలని ఉందని దశరథ ఎమోషనల్ అవుతాడు.

నువ్వు మా దగ్గరకు ఎందుకు వచ్చావు? ఈ తండ్రిని ఎందుకు కలిశావ్ అమ్మ? ఇన్నాళ్లు కష్టాలు భరించావు. ఇవి చాలవి అన్నట్లు మరో కష్టం మోసేందుకు రెడీ అయ్యావు. నువ్వు నా కన్న కూతురివా నా కన్న తల్లివా? నీ కాళ్లు మొక్కాలని ఉందమ్మా అని దీపతో దశరథ అంటాడు.నేను ఎవరి కోసం ఎవరిని వదులుకోలేను. మనం ఏదో ఒకటి చేద్దాం. ఇద్దరిని కాపాడుదామని దశరథ ఫీల్ అవుతాడు.

ఆపరేషన్ కు రెడీ

ఇంటికి వెళ్లి అత్తను చూసి నిర్ణయం తీసుకో మామయ్య అని దశరథను కార్తీక్ పంపిస్తాడు. కార్తీక్, దీప కలిసి డాక్టర్ హారిక దగ్గరకు వెళ్తారు. మీ మామయ్య ఏమన్నారు? మీరు ఏం నిర్ణయించుకున్నారు? అని డాక్టర్ అడుగుతుంది. మీరు ఆపరేషన్ కు రెడీ చేయండి అని కార్తీక్ చెప్తాడు. మీ మామయ్య వచ్చి ఏం గొడవ చేయడు కదా? జరిగేది అంతా ముందు మన ముగ్గురికే తెలుసు. ఆ తర్వాత దాసు మామయ్యకు చెప్పారు. ఇప్పుడు దశరథకు చెప్పారు. తర్వాత శివ నారాయణ కు చెప్తారా? అని డాక్టర్ అడుగుతుంది.

మేం అత్తను కాపాడాలని అనుకున్నాం. ఆపరేషన్ కు దీప రెడీగా ఉంది డాక్టర్ అని కార్తీక్ చెప్తాడు. అయితే దీపను హాస్పిటల్ లో అడ్మిట్ చేయాలని డాక్టర్ చెప్తుంది. సరే అడ్మిట్ చేస్తా డాక్టర్, అన్ని నేను చూసుకుంటానని కార్తీక్ అంటాడు.

సుమిత్ర రక్తం వాంతులు

మరోవైపు ఇంట్లో సుమిత్ర రక్తం వాంతులు చేసుకుంటుంది. అది చూసి దశరథ కంగారు పడతాడు. నేను చచ్చిపోతానా? ఆపరేషన్ వరకు కూడా నేను బతకనా? అని సుమిత్ర అడుగుతుంది. జ్యోత్స్న వచ్చి క్లీన్ చేస్తానని అంటే, నువ్వు ముట్టుకోకు నేను క్లీన్ చేస్తానని దశరథ అంటాడు. కార్తీక్, దీప వస్తారు. డాక్టర్ కు కాల్ చేసి సుమిత్రను ఎప్పుడు అడ్మిట్ చేయాలో అడుగు అని దశరథకు శివనారాయణ చెప్తాడు.

దీప బిడ్డ క్షేమంగా ఉందన్నారా? డాక్టర్ ఏం చెప్పారని సుమిత్ర అడగ్గానే కార్తీక్, దీప, దశరథ ఫీల్ అవుతారు. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు సుమిత్ర, నువ్వు పడుకో అని దశరథ చెప్తాడు. కళ్లు మూస్తే మళ్లీ తెరుస్తానో లేదోనని భయమేస్తుంది. అయినా నన్ను కాపాడుకోవడానికి నా కూతురు ఉంది కదా అని సుమిత్ర నిద్రపోతుంది. డాక్టర్ తో మాట్లాడి వెంటనే ఆపరేషన్ కు ఏర్పాటు చేయించమని దశరథకు శివనారాయణ చెప్తాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More