కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపే కన్నకూతురని తెలుసుకున్న దశరథ-తండ్రి గుండెపై వాలిపోయిన దీప‌- ఇక జ్యోత్స్నకు మూడిన‌ట్లే!

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 20 ఎపిసోడ్ లో జ్యోత్స్నపై కోపంతో కాశీ రగిలిపోతాడు. బావను కలవడానికి నాన్న వెళ్లాడని చెప్తాడు. మరోవైపు దీపే నీ కన్నకూతురు అని దశరథకు కార్తీక్ చూపిస్తాడు. తండ్రి గుండెలపై వాలిపోయి దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. జ్యోత్స్నను అరెస్ట్ చేయిస్తానని దశరథ వెళ్తాడు.

Published on: Feb 20, 2026, 07:13:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 20 ఎపిసోడ్ లో.. నేను చెప్పింది పూర్తిగా వినకుండా సగం నీ తెలివి తేటలు వాడి మీ మామయ్యకు డ్రైవర్ అయ్యావని కాశీతో జ్యోత్స్న అంటుంది. నువ్వు చెప్పింది పూర్తిగా విని ఉంటే జైల్లో ఉండేవాణ్ని. నా మీద జాలితో తాతయ్యతో మాట్లాడి నా మీద కేసు లేకుండా మామయ్య చేశాడని కాశీ చెప్తాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

స్వప్నను వదిలేసి

నీలా మనుషులను మోసం చేసి ఏమీ తెలియనట్లు ఉండలేను. నీ వల్లే నేను నా భార్యకు దూరమయ్యానని జ్యోత్స్నతో కాశీ అంటాడు. నీ దెబ్బకు మా అందరి జాతకాలు మారుతున్నాయని పారిజాతం కూడా అంటుంది. నాకు తెలియకుండా చిన్న తప్పు జరిగితే సరిదిద్దుకునే అవకాశం ఇవ్వరా? నీ ప్లేస్ లో నేను ఉంటే స్వప్నను వదిలేసి వేరేవాళ్లను పెళ్లి చేసుకునేదాన్ని అని జ్యోత్స్న చెప్తుంది.

నీకు ప్రేమ విలువ తెలియదు కాబట్టే మనుషులను తేలికగా వదులుకుంటావని కాశీ కౌంటర్ వేస్తాడు. మా నాన్న బావను కలుస్తానని చెప్పాడని కాశీ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. బావతో దాసు నా గురించి చెప్తే ఎలా అని జ్యో టెన్షన్ పడుతుంది.

దీపే కన్నకూతురు

దశరథను తీసుకెళ్లి జ్యోతుల మధ్య దీపంలా వెలిగిపోతున్న నీ కూతురును చూడా మామయ్య అని దీపను కార్తీక్ చూపిస్తాడు. దీపను చూసి దశరథ షాక్ అవుతాడు. దీపే నీ కూతురు మామయ్య అని కార్తీక్ చెప్తాడు. మా వదిన దగ్గర నుంచి మా అమ్మ దూరం చేసిన బిడ్డ దీపే అన్నయ్య అని దాసు కూడా చెప్తాడు. ఇన్ని రోజులు నిన్ను నాన్న అని పిలవలేక పని మనిషిగా మిగిలిపోయిన దీపే నీ కన్నకూతురు. నువ్వు నాన్నవి అని దీపకు తెలుసు అని కార్తీక్ వివరిస్తాడు.

నాన్న అనే పిలుపు

దశరథను చూసిన దీప.. చిన్నయ్యగారు మీరా అని పలకరిస్తుంది. చిన్నయ్య గారు కాదమ్మా నాన్న అని పిలవమ్మా అని దశరథ చెప్తాడు. కన్నతండ్రి మీద కన్న కూతురు కంటే అధికారం ఎవరికి ఉంటుందమ్మా అని ఎమోషనల్ అవుతాడు. నిజం చెప్పేశాను దీప. మీ నాన్నకు నువ్వే కూతురివి అన్న నిజం చెప్పేశాను. ఇక నాన్న అనే పిలుపును గొంతులో దాచుకోవాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా నాన్న అని పిలవొచ్చు అని కార్తీక్ చెప్పగానే దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది.

తండ్రి గుండెలపై

నువ్వు నా కన్నకూతురివే కదమ్మా. కళ్ల ముందే తిరుగుతూ అవమానిస్తున్నా ఎలా తట్టుకోగలిగావు? కన్నీటిని గుండెల్లో ఎలా మోశావమ్మా? నా తండ్రి మనసు కన్నబిడ్డ కోసం ఎంతగానో ఆరాటపడిందని దశరథ చెప్తాడు. మీ నుంచి నేను తెలియకుండానే దూరమయ్యా. తెలియకుండానే దగ్గరయ్యా. నన్ను ఫస్ట్ ‘అమ్మ దీప’ అని పిలిచావు నాన్న. అప్పుడు నన్ను పెంచిన తండ్రి గుర్తుకొచ్చాడని దశరథ గుండెలపై వాలిపోయి దీప ఏడుస్తుంది.

చంపాలనుకున్న జ్యోత్స్న

నేనే నిజం చెప్పొద్దన్నానని కార్తీక్ అంటాడు. ఎందుకు నిజాలు దాచారు? నాకు ఎందుకు చెప్పలేదు? అని దశరథ అడుగుతాడు. దీప, శౌర్యను చంపాలనుకుంది జ్యోత్స్ననే మామయ్య. దీప వారసురాలు అని తెలిసినప్పటి నుంచి దీపను ఆ ఇంటికి దూరం చేయాలనుకుంటుంది. బిడ్డలను మార్చిన సైదులును పారు చంపించింది. ఇప్పుడు జ్యోత్స్న అలాగే ప్రవర్తిస్తుంది. మిమ్మల్ని కాపాడుకోవాలని ఇంట్లోకి వచ్చామని కార్తీక్ చెప్తాడు. నిజం తెలిస్తే అత్త ఏమవుతుందోనన్న భయం మాకు ఇప్పటికే ఉందని కార్తీక్ అంటాడు.

అందరికి తెలియాలని

నిజం చెప్పాలనుకుంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్య. దీప ప్రెగ్నెంట్ అని తెలియగానే పుట్టబోయే బిడ్డకు కూడా ఆస్తి మీద హక్కు ఉంటుందని కాలు పెట్టి దీపను పడగొట్టాలని జ్యోత్స్న చూసిందని కార్తీక్ చెప్తాడు. ఇదంతా నాకు తెలియని వరకే జ్యోత్స్న ఆటలు. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులను తీసుకుని ఇంటికి వెళ్తా. ఎవరు చెప్పినా వినేదే లేదు. నా కూతురు ఎవరో ఈ రోజే అందరికీ తెలియాలని ఆవేశంగా దశరథ వెళ్తాడు.

నీ పాపం పండింది జ్యోత్స్న

ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు? దాసును ఏదో ఒకటి చేయడమే కరెక్ట్ అని జ్యోత్స్న అనుకుంటుంది. నువ్వు శివనారాయణ అసలు వారసురాలివి. ఓడిపోయింది నేను. నా దగ్గర కూడా నువ్వు నటిస్తున్నావని జ్యోతో పారు అంటుంది. బావ మొదలెట్టిన ఆటలోకి మనం వెళ్లామని జ్యో అంటుంది. చేసిన పాపాలకు నిన్ను పోలీస్ స్టేషన్ కు ఇప్పటికే సాగనంపేవాళ్లు. నువ్వు నా సొంత మనవరాలు కాదు అని ప్రూవ్ చేయడానికి డాక్టర్ హారిక ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. నీ పాపం పండిందని పారు అంటుంది.

దాసు కిడ్నాప్ గురించి ఎక్కడ బయటపడుతుందోననే భయంతో దాసును నాన్న అని పిలుస్తున్నావని పారు చెప్తుంది. కాశీ ఏం చెప్పాడో తెలుసు కదా. పిల్లలను మార్చి అంతకంటే పెద్ద పాపమే చేశావు గ్రానీ. పోలీసులు నీకోసం వస్తారు గ్రానీ అని జ్యోత్స్న చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More