కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: బిడ్డను చంపితే అత్తను చంపినట్లే- దీప ప్రాణాలు తీయాలనుకున్న జ్యోత్స్న- కార్తీక్‌కు దాసు నిజం

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 17 ఎపిసోడ్ లో సుమిత్ర కూతురు దీప అని చెప్పేయాలని కార్తీక్ కు డాక్టర్ చెప్తుంది. తనను కిడ్నాప్ చేసింది, దీపను చంపాలనుకుంది జ్యోత్స్న అని కార్తీక్ కు దాసు చెప్పేస్తాడు. జ్యోత్స్న రిపోర్ట్స్ కావాలని డాక్టర్ ను దశరథ అడుగుతాడు. 

Published on: Feb 17, 2026, 07:29:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే ఫిబ్రవరి 17 ఎపిసోడ్ లో.. జ్యోత్స్న తన దగ్గరకు ఎందుకు వచ్చిందనే విషయాన్ని కార్తీక్, దాసుతో డాక్టర్ హారిక చెప్తుంది. కార్తీక్ మీరు చాలా అలర్ట్ గా ఉండాలి. జ్యోత్స్నకు డౌట్ స్టార్ట్ అయింది. నిజం తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. రేపు ఆపరేషన్ చేసేటప్పుడైన దీప గురించి చెప్పాల్సిందే అని డాక్టర్ అంటుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

అదే సొల్యూషన్

దీపే సుమిత్ర ఒరిజినల్ డాటర్ అని అందరికి చెప్పడమే సొల్యూషన్. మీరు ఈ ప్రాబ్లెం ఎలా సాల్వ్ చేస్తారేమోనని భయంగా ఉందని డాక్టర్ అంటుంది. ఇది ఎప్పుడు బయటపడుతుందోనని నాకు భయంగానే ఉంది. కానీ మా అత్త కోసం ఇంకొన్ని రోజులు చెప్పకుండా ఉండాలని కార్తీక్ అంటాడు. కార్తీక్ చెప్పకపోతే నేను చెప్తానని దాసు అనుకుంటాడు. అల్లుడు ఆ పని ఈ రోజే చేద్దాం పదా అని దాసు ఆవేశంగా వెళ్లిపోతాడు.

జ్యో అబద్దం

డాక్టర్ హారికను కలిశాను కానీ ఈ విషయం ఇంట్లో చెప్పకు అని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. అక్కడే ఉన్న దశరథ ఎందుకు? అనేసరికి జ్యో షాక్ అవుతుంది. శివనారాయణ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు జ్యోత్స్న హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం ఎందుకు ఉంది నాన్న? ఆ విషయం ఇంట్లో తెలియకూడదని అనుకుందని దశరథ అంటాడు. డాక్టర్ ఇచ్చిన టైమ్ కంటే ముందే ఆపరేషన్ చేస్తారేమోనని అడగడానికి వెళ్లానని జ్యో అబద్దం చెప్తుంది.

హారికకు కాల్

ఆ విషయం నాతో చెప్తే నేనూ వచ్చేవాణ్ని కదా. నీ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి, త్వరలోనే ఆపరేషన్. నేను హ్యాపీగానే ఉన్నా. కానీ నువ్వే కొంత బెంగ పెట్టుకున్నావు. అది నీ ముఖంలో కనపడుతోంది. అది భయమా? ఒకసారి హారికకు ఫోన్ చేసి నువ్వు తనను ఏం అడిగావోనని నేను అడుగుతానని దశరథ అంటాడు. నా మీద నమ్మకం లేకపోతే కాల్ చేయ్ డాడీ అని జ్యో అంటుంది.

జ్యోత్స్నకు శివనారాయణ సపోర్ట్ చేస్తాడు. తల్లికి నిజం చెప్పాలనుకోవడం, ట్యాబ్లెట్స్ డస్ట్ బిన్ లో వేయడం లాంటి తప్పులను జ్యోత్స్న చాలా చేసిందని దశరథ అంటాడు. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని తెలిశాక జ్యోత్స్నను నమ్ముతున్నానని శివనారాయణ చెప్తాడు. నాకు చాలా అనుమానాలు ఉన్నాయని దశరథ అనుకుంటాడు.

పెద్ద ప్రాబ్లం

నా విషయంలో తల్లిని కార్తీక్ ప్రశ్నించాడంటే ఆశ్చర్యంగా ఉంది. నాకు అవకాశం దొరికిన ప్రతిసారి కాంచనను క్షమించమని అడుగుతూనే ఉంటా. బంధాన్ని నిలబెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలైనా చేస్తా. మీరేదో చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లున్నారు. అందుకే కార్తీక్ మాటతో ముడిపెట్టాడు. కార్తీక్ తల్లితో అన్న ఆ మాట వెనుక ఏదో ఉందని దీపను శ్రీధర్ అడుగుతాడు.

అత్తను చంపినట్లే

ఏం లేదు మామయ్య అని దీప నిజం దాచేస్తుంది. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ జాగ్రత్త. కాంచన చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకుంది. కడుపులో ఉన్న బిడ్డకు ఏం జరిగినా కాంచన భరించలేదు. కార్తీక్ లాంటి భర్తనిచ్చిన అత్తకు నీ బిడ్డనిచ్చావంటే రుణం తీర్చుకున్నట్లే. పొరపాటున బిడ్డకు ఏమైనా జరిగితే మీ అత్తను నువ్వు చంపినట్లేనని శ్రీధర్ అంటాడు.

జ్యోత్స్న కిడ్నాప్

అసలు నీకేమైంది మామయ్య. ఇన్ని రోజులు ఎక్కడున్నావ్? అని దాసును కార్తీక్ అడుగుతాడు. నా కూతురు నన్ను కిడ్నాప్ చేసింది అల్లుడు అని నిజాన్ని దాసు చెప్పేసరికి కార్తీక్ షాక్ అవుతాడు. ఇద్దరు రౌడీలకు మస్కా కొట్టి తప్పించుకొని వచ్చా. జ్యోత్స్నకు ఈ విషయం తెలిసే ఉంటుంది. అందుకే జ్యోత్స్న నా కూతురు అనే నిజం అందరికీ చెప్పేస్తా అల్లుడు అని దాసు అంటాడు.

దీపను చంపాలని

ఇప్పుడు నువ్వు చెప్పొద్దు. నేను చూసుకుంటా మామయ్య అని దాసును కార్తీక్ ఆపుతాడు. కడుపుతో ఉన్న దీపను చంపాలనుకుంది జ్యోత్స్ననే. ఆ రౌడీలను పంపించింది జ్యోత్స్న. చెప్పు అల్లుడు వదిలేద్దామంటావా? అని దాసు అడుగుతాడు.

రిపోర్ట్స్ కావాలన్న దశరథ

మరోవైపు డాక్టర్ హారికను దశరథ కలుస్తాడు. జ్యోత్స్న మీ కన్నకూతురు కాదనుకుంటున్నారా? అని డాక్టర్ అడుగుతుంది. నాకు జ్యోత్స్న రిపోర్ట్స్ కావాలి. శాంపిల్స్ మ్యాచ్ కాని రిపోర్ట్స్, శాంపిల్స్ మ్యాచ్ అయిన రిపోర్ట్స్ కావాలని దశరథ అడుగుతాడు. మీరు సడెన్ గా వచ్చి రిపోర్ట్స్ అడుగుతున్నారంటే నా ట్రీట్మెంట్ మీద నమ్మకం లేదా అని హారిక ప్రశ్నిస్తుంది.

సెకండ్ ఒపీనియన్ కోసం జ్యోత్స్న రిపోర్ట్స్ తీసుకుని వేరే డాక్టర్ ను కలవాలనుకుంటున్నా అని దశరథ చెప్తాడు. రిపోర్ట్స్ ఇప్పుడు మీ చేతికి ఇవ్వలేను. ఇప్పుడు నాకు ఆపరేషన్ ఉంది. మీకు మెయిల్ చేస్తానని హారిక తప్పించుకుంటుంది. తొందరగా పంపించండని దశరథ వెళ్లిపోతాడు.

అత్త ఆరోగ్యం

మరోవైపు జ్యోత్స్న అంతు చూడాలనిపిస్తుంది కదా అని కార్తీక్ తో ఆవేశంగా దాసు మట్లాడతాడు. అనిపిస్తుంది కానీ నీ కోపం, ఆవేశం తప్పితే అవతలి వాళ్లను అర్థం చేసుకోవా? అత్త ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుసా నీకు? అని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More