కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: హంతకులుగా మిగిలిపోతామన్న దీప-కార్తీక్ ఎమోష‌న‌ల్‌-డాక్ట‌ర్‌తో జ్యోత్స్న‌ను చూసిన దాసు ఆవేశం

కార్తీక దీపం 2 టుడే ఫిబ్రవరి 16 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. బిడ్డ మీద ఆశలు వదులుకోవాలని అత్తయ్యకు చెప్పమని  కార్తీక్ ను దీప అడుగుతుంది. తాను చెప్పలేనని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. కాశీ దగ్గర దాసు నోరు జారుతాడు. డాక్టర్ తో జ్యోత్స్నను చూసి ఆవేశపడతాడు. 

Published on: Feb 16, 2026, 07:08:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 16 ఎపిసోడ్ లో.. పుట్టబోయే బిడ్డ మీద ఆశలు పెంచుకోవద్దని అత్తయ్యతో నువ్వే చెప్పాలని కార్తీక్ తో దీప చెప్తూ ఏడ్చేస్తుంది. నా వల్ల కాదు దీప. ఎవరితో ఏం చెప్పమంటున్నావో తెలుసా? అమ్మ మనకు పుట్టబోయే బిడ్డపై ప్రేమ పెంచుకుంది. ఇప్పుడు చెప్తే తట్టుకోగలదా? అని కార్తీక్ అంటాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

ఛాన్స్ ఉంటుందా?

జ్యోత్స్న మీద అనుమానం వచ్చి మామయ్య నన్ను హాస్పిటల్ తీసుకెళ్లాడు. కానీ డాక్టర్ నిజం చెప్పలేదు. అయితే మామయ్య వెళ్లిపోయాక ఆపరేషన్ తర్వాత బిడ్డ బతికేందుకు ఛాన్స్ ఉంటుందా అని డాక్టర్ ను అడిగా. ఆశలు వదిలేసుకోవాలని డాక్టర్ చెప్పింది. ఆ మాట విన్న తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు దీప అని కార్తీక్ ఫీల్ అవుతాడు.

కార్తీక్ ఎమోషనల్

శౌర్య ఏమో బిడ్డకు ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తుంది. మా అమ్మ ఏమో బిడ్డ క్షేమం కోసం పూజలు చేస్తుంది. ఇప్పుడు చెప్పు దీప మా అమ్మకు ఎలా చెప్పాలని కార్తీక్ అడుగుతాడు. చెప్పాలి బావ లేదంటే ఆశలను చిదిమేసిన హంతకులుగా మిగిలిపోతామని దీప అంటుంది. నా వల్ల కాదు నేను చెప్పలేను. నన్ను క్షమించు దీప అని దీప ఒడిలో కార్తీక్ పడుకుంటాడు.

నోరుజారిన దాసు

దాసు వచ్చి కాశీని కలుస్తాడు. అప్పుడు నా బుద్ధి సరిగ్గా పనిచేయక మాట్లాడానని కాశీ చెప్తాడు. స్వప్న విడాకులు కావాలంటుంది. నేను నా భార్యను వదులుకోలేనని కాశీ అంటాడు. మా అమ్మ చేసిన పాపానికి నా పిల్లల జీవితాలు ఇలా తయారయ్యాయి అని దాసు నోరు జారుతాడు. నానమ్మ ఏం చేసింది? నేనొక్కడినే కదా నీకు ఉంది. మరి పిల్లలు అని అంటున్నావేంటీ? నా తోడబుట్టిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? అని కాశీ అడుగుతాడు. మీ అమ్మ బాగోగులు మా అమ్మ చూసుకోలేదని బాధతోనే ఇలా అన్నానని దాసు నిజం చెప్పకుండా కవర్ చేస్తాడు.

పెద్దమ్మకు బ్లడ్ క్యాన్సర్. జ్యోత్స్నక్కనే కదా బోన్ మ్యారో ఇచ్చేది. శాంపిల్స్ రెండో సారి మ్యాచ్ అయ్యాయి. డాక్టర్ హారిక వచ్చి నేరుగా చెప్పిందని కాశీ అనగానే దాసు షాక్ అవుతాడు. జ్యోత్స్న సుమిత్ర కూతురు కాదు కదా మరి శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయని దాసు కంగారుగా వెళ్లిపోతాడు. మరోవైపు డాక్టర్ హారికను జ్యోత్స్న కలుస్తుంది.

జ్యోత్స్న ప్రశ్నలు

ఇప్పుడు ఏం జరుగుతుందో కార్తీక్ కు తెలియడం మంచిది అని కార్తీక్ కు డాక్టర్ కాల్ చేసి లైన్లో పెడుతుంది. నా బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కావడం ఎంత వరకు నిజం డాక్టర్ అని జ్యో అడుగుతుంది. డాక్టర్ కాల్ కట్ చేస్తుంది. నేనే వెళ్లి జ్యోత్స్నను ఆపాలి. జ్యోత్స్న నువ్వెవరో బయటపడే టైమ్ వచ్చిందని కార్తీక్ వెళ్తాడు. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని అబద్దం చెప్పారా? ఎవరైనా చెప్పించారా? అని డాక్టర్ ను జ్యో అడుగుతుంది.

ఆవేశంతో దాసు

నువ్వు సుమిత్ర కూతురివే కదా అని డాక్టర్ అడుగుతుంది. అప్పుడే దాసు హాస్పిటల్ కు వస్తాడు. నువ్వే సుమిత్ర కూతురివి అయినప్పుడు ఏ రిపోర్ట్ అబద్దమో, ఏ రిపోర్ట్ నిజమో నీకు తెలియదా? ఇలా వచ్చి అడుగుతున్నావంటే నీకు డౌట్ ఉందని డాక్టర్ అంటుంది. సెకండ్ టైమ్ శాంపిల్స్ మ్యాచ్ అవడానికి ఏం చేశారో చెప్పమని జ్యో అడుగుతుంది. మిమ్మల్ని చూస్తుంటే మీ అమ్మ ప్రాణాలు కాపాడటం ఇష్టం లేదని తెలుస్తుందని డాక్టర్ అంటుంది.

డాక్టర్ తో జ్యోత్స్నను చూసి దాసు.. ఈ డాక్టర్ జ్యోత్స్నకు అమ్ముడుపోయిందని అనుకుంటాడు. నేను వచ్చిన విషయం ఎవరితో చెప్పకండని డాక్టర్ ను జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. డాక్టర్ మీదకు ఆవేశంగా వెళ్తున్న దాసును కార్తీక్ ఆపుతాడు.

కాంచన కోపం

దీపపై కాంచన కోప్పడుతుంది. ఈ రోజు గుడికి వెళ్లాలి, నీ పేరు మీద పూజ చేయించాలనుకున్నా. కానీ ఆశపడ్డది జరగకుండా చేశారు. నా ఆశలన్నీ నా కోసం కాదు పక్కవాళ్ల కోసం పెట్టుకుంటా. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందని కాంచన అంటుంది. అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు.

మీ చిన్న నాయినమ్మ అందరి కోసం స్వీట్లు చేసి పంపించిందని శౌర్యకు శ్రీధర్ ఇస్తాడు. కానీ కాంచనకు ఇస్తే తీసుకోదు. అమ్మతో నానమ్మ మాట్లాడటం లేదని శౌర్య చెప్తుంది. దీప కోసం కావేరి స్వీట్స్ చేసిందని శ్రీధర్ అంటాడు. ఇచ్చారు కదా ఇక వెళ్లండని చెప్పి కాంచన లోపలికి వెళ్లిపోతుంది. చెప్పు దీప ఏమైందని శ్రీధర్ అడుగుతాడు. చిన్న గొడవ మీ గురించే అని దీప చెప్తుంది.

డాక్టర్ హారికకు అన్ని తెలుసు. నీకే కొన్ని తెలియాలని దాసుతో కార్తీక్ అంటాడు. మా మామయ్యకు జరిగింది చెప్పండని డాక్టర్ ను కార్తీక్ అడుగుతాడు. జ్యోత్స్న వచ్చి అడిగిన విషయాలన్నీ కార్తీక్ కు డాక్టర్ చెప్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More