కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: అమ్మ కోసం అమ్మతనాన్ని పణంగా పెట్టిన దీప-జ్యోత్స్న నవరసాల నటన-కార్తీక్ వెటకారం-ఇంట్లోనే కాశీ

కార్తీక దీపం 2 టుడే ఫిబ్రవరి 12 ఎపిసోడ్ లో జ్యోత్స్న అమ్మవారు అని సుమిత్ర పొగిడేస్తుంది. కానీ తన భార్యకు దక్కాల్సిన ప్రశంసలు జ్యోత్స్నకు దక్కుతుంటే కార్తీక్ మండిపోతాడు. మరోవైపు కాశీ ఇంట్లోనే ఉంటాడని శ్రీధర్ స్పష్టం చేస్తాడు. 

Published on: Feb 12, 2026, 07:06:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే ఫిబ్రవరి 12 ఎపిసోడ్ లో.. రెండోసారి కూడా శాంపిల్స్ మ్యాచ్ కావని ముందే నీకు అనిపించిందా? పారిజాతం. నీకు ఎందుకు అనుమానం వచ్చింది? అని కార్తీక్ అడుగుతాడు. ఇదే విషయాన్ని శివనారాయణ కూడా అడుగుతాడు. అత్తయ్యను ఏం అనకండి మామయ్య. ఇప్పుడు నా కూతురు నాతో ఉందన్న ధైర్యం వచ్చింది. బతుకు మీద ఆశ కలిగింది. నాకు ఏం కాదని సుమిత్ర ఆనందపడుతుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

కూతురే అమ్మవారు

నా కూతురి పెళ్లి చూస్తానన్న నమ్మకం ఉంది. జ్యోత్స్న నాకొక మాట ఇస్తావా? రోజు ఉదయం నువ్వే నన్ను నిద్ర లేపుతావా? ఉదయం నిద్ర లేవగానే ఎదురుగా ఉన్న అమ్మవారి ఫొటో చూసి దండం పెట్టుకుని మంచం దిగుతా. ఈ రోజు నుంచి నా కూతురే అమ్మవారు. ఉదయం లేవగానే నేను నీ ముఖం చూడాలని సుమిత్ర ఎమోషనల్ అవుతుంది.

మాట వినని స్వప్న

స్వప్న లగేజీ సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్లిపొయేందుకు రెడీ అవుతుంది. ఒకప్పుడు కాశీ కావాలని ఇంట్లో నుంచి వెళ్లిపోయావు. ఇప్పుడు కాశీ వద్దని ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నావు. అప్పుడు మా మాట వినలేదు. ఇప్పుడు మా మాట వినడం లేదని స్వప్నతో శ్రీధర్ అంటాడు. కాశీ ఉన్న చోట నేను ఉండలేనని స్వప్న అరుస్తుంది. అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. నాకు డ్రైవర్ అవసరం ఉంది. అందుకే కాశీని డ్రైవర్ గా పెట్టుకున్నానని శ్రీధర్ చెప్తాడు.

ఇంట్లోనే కాశీ

నీ పెద్ద మనసుతో క్షమించలేవా? అని స్వప్నను కాశీ అడుగుతాడు. అదెప్పుడో సమాధి అయిపోయిందని స్వప్న చెప్తుంది. తోడు లేని జీవితం దారి తెలియక ఎడారిలో తప్పిపోవడం లాంటిదే. దారి తప్పామని తెలుసుకునే లోపే జీవితం అయిపోతుంది. చదువుకున్న డిగ్రీలు చేతిలో ఉంటే ఒంటరిగా బతకొచ్చని అనుకుంటున్నారు. మీరు బాగుండాలని మేం కోరుకుంటున్నాం. మనం నలుగురం కలిసే ఉందామని శ్రీధర్ చెప్తాడు. కాశీ ఉన్న చోట నేను ఉండలేనని స్వప్న మళ్లీ అంటుంది.

కాశీని కంపెనీ తరపున డ్రైవర్ గా పెట్టుకున్నా. నువ్వు వెళ్లిపోతే రోజూ నీ కోసం వస్తా. నువ్వు కనిపించడం లేదని పోలీస్ కంప్లయింట్ ఇస్తా. మీ అన్నయ్యకు చెప్తానని శ్రీధర్ అంటాడు. ఈ రోజు నుంచి ఇంట్లో నేను, నా భార్య, కూతురు, డ్రైవర్ కూడా ఉంటాడు. అదే ఫైనల్ అని శ్రీధర్ స్పష్టం చేస్తాడు.

కార్తీక్ కు కోపం

ఎవరు కూతురు? ఎవరి తల్లి? జ్యోత్స్నను అత్త పల్లకిలో మోస్తుంది. చట్టప్రకారం జ్యోత్స్నను అరెస్టు చేసి జైల్లో కూర్చోబెట్టాలి. న్యాయం ప్రకారం నిన్ను శివనారాయణ వారసురాలిగా కూర్చోబెట్టాలి. నీ కోసం ఏమైనా చేయాలనిపించింది. నువ్వే నా అత్త కూతురి అని చెప్పాలనుకున్నా. కానీ నేను ఏం చేయకుండా పోవడానికి కారణం జ్యోత్స్న. పారు భయాన్ని నటిస్తే, జ్యోత్స్న ప్రేమ నటిస్తోందని దీపతో కార్తీక్ అంటాడు.

నీ లాంటి కూతురు

నేను చేసే దానికి కీర్తి కిరీటాలు అవసరం లేదు బావ. నా తల్లి నవ్వుతూ ఉంటే చాలు. ఆ నవ్వే నేను కోరుకునే గౌరవ మర్యాదలు అని దీప అంటుంది. కానీ నేను కోరుకోవచ్చు కదా. అమ్మ కోసం అమ్మతనాన్ని పణంగా పెట్టిన కూతురిని ఏమనాలి దీప? నీలాంటి కూతురు ఎవరికైనా దొరుకుతుందా? అని కార్తీక్ అంటాడు. డాక్టర్ వచ్చినప్పుడు పారు గన్ తీసుకొచ్చిందని దీపతో కార్తీక్ చెప్తాడు.

గుడ్ న్యూస్

అప్పుడే శ్రీధర్, కాంచన వస్తారు. మీ అమ్మను వెంటనే తీసుకురమ్మని మీ తాతయ్య కాల్ చేశాడని కార్తీక్ కు శ్రీధర్ చెప్తాడు. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. డాక్టర్ వచ్చి చెప్పారు. త్వరలోనే సుమిత్రకు ఆపరేషన్ చేస్తారని శివనారాయణ చెప్తాడు. మా అమ్మ పరిస్థితి వదినకు రావొద్దని వేయి దేవుళ్లకు మొక్కుకున్నా. వదిన లేకపోతే ఈ ఇంటికి వెలుగే లేదు. ఈ రోజు మీ అందరి నవ్వులతో వెలిగిపోతుందని కాంచన చెప్తుంది.

ఎందుకు కన్ఫ్యూజన్

ఏం మేనకోడలా ముఖంలో భయం కనిపిస్తోంది. కన్ప్యూజన్ ఎందుకు? ఈ సారి ఎందుకు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని ఆలోచిస్తున్నావా? ఎందుకు హ్యాపీగా లేవు? అని జ్యోత్స్నను శ్రీధర్ అడగుతాడు. నేను హ్యాపీగా లేను. ఆపరేషన్ అంటే మమ్మీ స్కిన్ కట్ చేస్తారు కదా. అది తలుచుకుంటే బాధగా ఉందని జ్యోత్స్న అంటుంది.

అప్పుడు కార్తీక్ చప్పట్లు కొడతాడు. పెద్ద మేడం గారికి చిన్న మేడం గారి మీద ఉన్న ప్రేమ చూస్తే అమ్మ మీద నా ప్రేమ అనే టైటిల్ పెట్టి ఆరేడు వందల పుస్తకం రాయాలనిపిస్తోంది. నవరసాల గురించి మీరు వినే ఉంటారు. మీ ప్రేమలో కరుణ రసం మామూలుగా లేదని కార్తీక్ వెటకారంగా అంటాడు. ఇక పారుకు ఏ విషయంలో క్లారిటీ వచ్చిందని అందరూ అడుగుతారు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More