కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ఎవరు మీరంతా? మనుషులను గుర్తుపట్టని సుమిత్ర-వెక్కివెక్కి ఏడ్చిన ద‌శ‌ర‌థ‌-హాస్పిట‌ల్‌కు దీప‌

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 9 ఎపిసోడ్ లో మనుషులను గుర్తు పట్టకుండా సుమిత్ర పెద్ద షాక్ ఇస్తుంది. సుమిత్ర చనిపోతుందని దశరథ ఏడ్చేస్తాడు. కార్తీక్, దీప కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. హాస్పిటల్ వెళ్లిన దీప ఆపరేషన్ చేయమని డాక్టర్ ను అడుగుతుంది. 

Published on: Feb 9, 2026, 06:49:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 9 ఎపిసోడ్ లో.. సుమిత్ర ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. అప్పుడే కార్తీక్, దీప స్కూటీ మీద వస్తారు. అమ్మా టిఫిన్ చేశారా అని దీప అడిగితే, ఎవరమ్మా నువ్వు అని సుమిత్ర షాక్ ఇస్తుంది. అత్త తను దీప, నా భార్య అని కార్తీక్ అంటాడు. అత్త అని పిలుస్తున్నావ్, నువ్వు ఎవరు బాబు అని సుమిత్ర డబుల్ షాక్ ఇస్తుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

మీరు ఎవరు?

దశరథ వచ్చి.. సుమిత్ర మనం లోపలకి వెళ్దామని చేయి పట్టుకుంటాడు. కానీ మీరు ఎవరు? నా చేయి పట్టుకుంటున్నారని సుమిత్ర అంటుంది. నేను నీ భర్తను, ఇది మన ఇల్లు అని సుమిత్రను దశరథ లోపలికి తీసుకెళ్తాడు. మీ అమ్మకు మతి పోయినట్లుందే అని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. సుమిత్రకు ట్యాబ్లెట్ వేసి పడుకోబెడతాడు దశరథ.

గుర్తు పట్టడం లేదు

అత్తకు ఏమైంది? ఎవరిని గుర్తు పట్టడం లేదేంటీ? అని దశరథను కార్తీక్ అడుగుతాడు. దశరథ ఏడుస్తాడు. నేను డాక్టర్ తో మాట్లాడాను. వ్యాధి అనేది అందరిలో ఒకేలా ఉండదు. వయసు, శారీరక సామర్థ్యాన్ని బట్టి వేర్వేరుగా ఉంటుందని చెప్పింది. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడంతో బెంగ పెట్టుకుంది. మందులు వేసుకోవడం, భోజనం చేయడం మానేసింది. ఇప్పుడు మనుషులను గుర్తు పట్టడం లేదు. మీ అత్తను బతికించుకోవాలంటే వెంటనే ఆపరేషన్ చేయాలని దశరథ అంటాడు.

అత్త బతకదు

ఆపరేషన్ చేయించాలంటే శాంపిల్స్ మ్యాచ్ కావాలి. శాంపిల్స్ మ్యాచ్ కాలేదని డాక్టర్ చెప్పారు. మీ అత్త ఇక బతకదని నాకు తెలిసిపోయింది. ఇంట్లో ఎవరిని గుర్తు పట్టట్లేదు. మీరు పలకరించకపోతే గేటు దాటి వెళ్లిపోయేదేమో. ఇంత ఐశ్వర్యం ఉండి భార్యను కాపాడుకోలేని భర్తగా మిగిలిపోవడానికి ముందు జన్మలో నేను ఏం పాపం చేశాన్రా అంటూ ఏడ్చేస్తాడు దశరథ. నాన్న అంటూ దీప బాధపడుతుంది.

నేను నీ తండ్రిని కాకపోయినా కాళ్లు కడిగి కన్యాదానం చేసినందుకు ఆవేదనగా నాన్న అని పిలిచావు. ఈ నాన్న ఇంక బతకడమ్మా. సుమిత్రను కాపాడుకోవడానికి అవకాశం లేని స్థితిలో నేనున్నా. భార్యను బతికించుకోలేని భర్తగా మిగిలిపోవడం నేను తట్టుకోలేను. నాకే ముందు చావు రావాలని కోరుకుంటానని దశరథ ఎమోషనల్ అవుతాడు.

దీప కన్నీళ్లు

మామయ్య నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నానని కార్తీక్ అంటాడు. ఒక్క దేవతైనా మీ అత్తకు ఆయుష్షు ఇస్తే బాగుండు. మీ అత్త లేని బతుకు నాకు మాత్రం ఎందుకు? అని దశరథ ఏడుస్తాడు. దీప పక్కకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీ అత్త బతుకుతుందా? నువ్వు చెప్పరా అని కార్తీక్ ను అడుగుతాడు దశరథ. ముందు మనం బయటకు వెళ్లి మాట్లాడుకుందామని దశరథను కార్తీక్ తీసుకెళ్తాడు.

గాలి పటంలా

ఏంటి మామయ్య మగాడి జీవితం? జీవిత పోరాటంలో ఎంత పెద్ద యుద్ధానికైనా భయపడం. నిద్ర, సుఖం, ఆరోగ్యాన్ని త్యాగం చేస్తాం. కుటుంబం కోసం దేన్నైనా వదులుకుంటాం. అలాంటి కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే మగాడికి చెప్పేది ఆ ఇంటి ఆడదే. కానీ ఆ ఇంటి ఆడదానికే సమస్య వస్తే? భార్య నీరసంతో పడుకుంటే భర్త తీసుకునే ఊపిరి కూడా భారంగా ఉంటుంది. అలాంటిది శాశ్వతంగా నిద్ర పోతుంది అనుకుంటే ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోగలనని దశరథతో కార్తీక్ అంటాడు.

మగాడి జీవితంలో తనను సగం పంచుకున్న భార్య కూడా ఆకాశంలో గాలి పటం లాంటిదే మామయ్య. దారం తెగిపోవచ్చు. గాలి దూరాన్ని పెంచొచ్చు. ఇంకా ఏదైనా జరగొచ్చు కానీ మనం ప్రేమ వెంట పడతాం. ఎలాగైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తామని కార్తీక్ చెప్తాడు. అత్త నీతో లేదు, నీలో ఉంది. నువ్వు ఎప్పటికీ ఒంటరివాడివి కాదు మామయ్య అని దశరథతో కార్తీక్ చెప్తాడు.

హాస్పిటల్ కు దీప

దీప ఇంట్లో కనిపించదు. దీప ఎక్కడికి వెళ్లిందోనని కార్తీక్ కంగారు పడతాడు. మరోవైపు దీప హాస్పిటల్ కు వెళ్తుంది. నా తల్లి మనుషులను కూడా గుర్తు పట్టడం లేదు. ఇంకా లేటు చేస్తే ఆ మనిషి ఏమైపోతుందేమోనని భయంగా ఉంది. నా తల్లి రుణం తీర్చుకోవాలని దీప అంటుంది. ఒక ప్రాణం కోసం ఇంకో ప్రాణం పోతుందంటే నేను ఒప్పుకోను. కడుపులో ఊపిరి పోసుకున్న ప్రాణం గురించి ఆలోచించవా? నీ బిడ్డను నువ్వు తప్ప ఎవరూ కాపాడలేరు? అని డాక్టర్ హారిక చెప్తుంది.

హంతకురాలివి

నా తల్లిని బతికించుకోవడానికి నాక వేరే దారి లేదని దీప ఏడుస్తుంది. నీ తల్లిని కాపాడితే ప్రాణదాతవు అవుతావు. నీ బిడ్డను చంపితే హంతకురాలివి అవుతావు. అవి రెండు ఒకేసారి జరుగుతున్నాయి. ఇష్టంతో బిడ్డను చంపే తల్లిని నిన్నే చూస్తున్నానని డాక్టర్ అంటుంది. ప్లీజ్ డాక్టర్ ఆపరేషన్ చేయడానికి ఒప్పుకోండని డాక్టర్ చేతులు పట్టుకుని ఏడుస్తుంది దీప. నువ్వు బిడ్డను త్యాగం చేయాలనుకుంటున్నావని కార్తీక్ కు తెలుసా? నా బిడ్డను తీసేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారని అడిగితే నేనేం చెప్పాలని డాక్టర్ అడుగుతుంది.

సారీ దీప, నేను ఏ పాపం చేయలేను. నీ భర్త కూడా ఇందుకు ఒప్పుకోడు అని డాక్టర్ అంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More