కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న నీ కన్నకూతురు కాదు.. బాంబ్ పేల్చిన కార్తీక్..దశరథకు తెలిసిన నిజం..దాసు కన్నబిడ్డ
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 19 ఎపిసోడ్ లో ఓ రహస్యం గుట్టు వీడుతుంది. జ్యోత్స్న గురించి దశరథకు కార్తీక్, దాసు నిజాలు చెప్పేస్తారు. జ్యోత్స్న దశరథ కూతురు కాదని, దాసు కన్నకూతురనే సీక్రెట్ బయట పెట్టేస్తారు. బిడ్డలను మార్చింది పారు అని కూడా చెప్తారు. అసలు కూతురిని చూపిస్తామని అంటారు.
కార్తీక దీపం 2 టుడే ఫిబ్రవరి 19 ఎపిసోడ్ లో.. ఏం చెప్పాలనుకుంటున్నావని కార్తీక్ ను దశరథ నిలదీస్తాడు. అత్తకు ఏం కాదు మామయ్య అని కార్తీక్ అంటాడు. అప్పుడే కార్తీక్ చెప్పేది నిజమే అన్నయ్య అని దాసు ఎంట్రీ ఇస్తాడు. అవును అన్నయ్య, జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కాలేదని దాసు అంటాడు.

జ్యోత్స్న కన్నకూతురు కాదు
జ్యోత్స్న వదినను కాపాడలేదు. కానీ కార్తీక్ ఉండగా ఏం కాదు. సంజీవని పర్వతాన్ని ఎత్తుకొచ్చిన హనుమంతుడు అన్నయ్య వీడు. వదిన ప్రాణాలు కాపాడతాడని దాసు అంటాడు. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావడం లేదు కదా అని దశరథ అడుగుతాడు. ఎన్ని సార్లు చేసినా జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావు అన్నయ్య అని దాసు చెప్తాడు. ఎందుకంటే జ్యోత్స్న నీ కన్నకూతురు కాదు కాబట్టి అని కార్తీక్ కుండబద్ధలు కొడతాడు.
నా భర్తగా అనుకోలేను
ఇంట్లో అందరూ టిఫిన్ చేస్తుంటే శ్రీధర్ కాశీని కూడా పిలుస్తాడు. కూర్చోమని అంటాడు. అప్పుడే స్వప్న కుర్చీలో నుంచి లేస్తుంది. డ్రైవర్ తో టిఫిన్ చేయడానికి నాకు ప్రాబ్లం లేదు. కానీ ఈ మనిషి పక్కన కూర్చుని తినలేను. డ్రైవర్ కారు దగ్గర ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్ అయితే ఆఫీస్ లో ఉండాలి. నా భర్తగా ఈ మనిషిని అనుకోలేను. ఈ వ్యక్తితో కలిసి తినలేనని స్వప్న ఫైర్ అవుతుంది.
నువ్వు ఇంత వీక్ పర్సన్ అని తెలియలేదు. ఒకరు మనకు వద్దనుకున్నప్పుడు వదిలేయాలి. అతను ఎలా ఉంటే ఏంటీ? నువ్వు ప్రతిసారి ఇలాగే వెళ్లిపోతావా? అని స్వప్నను కాశీ అడుగుతాడు. నేను డ్రైవర్ ను నాకు లిమిట్స్ ఉంటాయని కాశీ నేలపై కూర్చుంటాడు. తనను నీ భర్త అనుకోవడం లేదు కదా టిఫిన్ పెట్టమని శ్రీధర్ చెప్తాడు. తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టిన స్వప్న లేచి పైన కూర్చొని కాశీని తినమంటుంది.
ఎలా నమ్మాలి?
జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు మామయ్య అని కార్తీక్ అంటాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ కార్తీక్. నా భార్య ప్రసవించాక బిడ్డను మొదట తీసుకుంది నేనే. ఆ రోజు నుంచి నా చేతుల మీదుగానే, నా కళ్ల ముందే పెరిగిందిరా. అది తప్పులు చేసి ఉండొచ్చు. శాంపిల్స్ మ్యాచ్ కాకపోవచ్చు. కానీ జ్యోత్స్న నా కూతురే కాదంటే నేను ఎలా నమ్మాలిరా అని దశరథ అడుగుతాడు.
బిడ్డలను మార్చింది పారు
అత్త ప్రసవించిన కాసేపటికే బిడ్డలను మార్చేశారు. నీ కూతురు అంతస్తులు దిగి నేలకు చేరుకుంది. మరొకరి కూతురు నీ కూతురు స్థానంలో ఊయలలోకి చేరుకుందని కార్తీక్ చెప్తాడు. బిడ్డలను మార్చాల్సిన అవసరం ఎవరికి ఉందిరా? అని దశరథ అడుగుతాడు. మా అమ్మ అన్నయ్య అని దాసు చెప్తాడు. అవును మామయ్య తాత మీద పగతో పారునే బిడ్డలను మార్చేసింది. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసింది దాసు మామయ్య అని కార్తీక్ చెప్తాడు.
దాసు కూతురు
బిడ్డలను కళ్ల ముందే మార్చినా ఏం చేయలేని అసమర్థుడిలా చూస్తు ఉండిపోయిన వాణ్ని నేనే అన్నయ్య అని దాసు చెప్తాడు. జ్యోత్స్న దాసు మామయ్య కూతురు అని కార్తీక్ మరో షాక్ ఇస్తాడు. నా కూతురు చచ్చిపోయిందని అమ్మ నాటకం ఆడింది. నాకు, కళ్యాణికి పుట్టిన కూతురే జ్యోత్స్న. తను కావాలనే నా బిడ్డను నీ ఇంటి వారసురాలిని చేసిందని దాసు చెప్తాడు. తనను అవమానించిన కుటుంబంపై పారు పగ తీర్చుకోవాలని ఇలా చేసింది. సొంత మనవరాలు కాబట్టే జ్యోత్స్నపై పారు ప్రేమ చూపిస్తోందని కార్తీక్ వివరిస్తాడు.
నీ సొంత కూతురు కాదని జ్యోత్స్నకు కూడా తెలుసు. ఈ నిజం చెప్పొద్దని దాసు మామయ్య దగ్గర జ్యోత్స్న ఒట్టు తీసుకుంది. ఈ నిజం ఎక్కడ చెప్పేస్తాడో అని కన్నతండ్రినే చంపాలనుకుందని కార్తీక్ చెప్తాడు. వెంటనే మామయ్య అని పిలిచే అర్హత నీకు లేదురా అని కార్తీక్ పై దశరథ సీరియస్ అవుతాడు.
డ్రైవర్ గా కాశీ
ఈ ఆస్తి అంతా నాదే అనుకున్నా. ఏదో ఒక రోజు ముసలోడిని, వాడి కొడుకును గెంటేసి హాల్లో పెద్ద ఊయలలో కాలు మీద కాలు వేసుకుని ఊగుదామని అనుకున్నానని పారిజాతం అనుకుంటుంది. అప్పుడే శివనారాయణ వస్తాడు. రత్నాల కోసం వెతుక్కుంటూ వజ్రాన్ని పారేసుకున్నానండీ అని పారు అంటుంది. శ్రీధర్ తో వచ్చిన కాశీని చూసి ఎందుకు వచ్చావని పారు అడుగుతుంది.
భార్య చీ కొట్టింది, మామ తోసేశారని జ్యోత్స్న అంటుంది. నేను పొమ్మనడం నువ్వు చూశావా? అని శ్రీధర్ అడుగుతాడు. కాశీని డ్రైవర్ గా పెట్టాం. కాశీ పని వెనుక ఓ ప్రయోజనం ఉందని శివనారాయణ చెప్తాడు. నాన్న కనిపించాడని కాశీ చెప్పడంతో జ్యో షాక్ అవుతుంది.
కూతురిని చూపిస్తా
ఈ నిజాలన్నీ నీకు ఎప్పుడు తెలుసు? అన్నీ తెలిసి ఏం తెలియనట్లు మా మధ్యనే తిరుగుతున్నావు. మరి నా కూతురు ఎవరు? తను ఎవరో మీకు తెలుసా? అసలు బతికి ఉందా? మా పిన్ని చంపేసిందా? అని దశరథ అడుగుతాడు. బతికే ఉంది. ఇక్కడే ఉంది. నీ కోసం నీ కూతురిని కూడా తీసుకొచ్చా మామయ్య. కొన్ని నిజాలు చూపిస్తాను అని కార్తీక్ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












