కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: నా బిడ్డేనా అని సుమిత్ర డౌట్- జ్యోత్స్న రహస్యాలు చెప్పేయాలని కార్తీక్- గుడిలో మీటింగ్
కార్తీక దీపం 2 టుడే ఫిబ్రవరి 18 ఎపిసోడ్ లో మామయ్యకు రిపోర్ట్స్ పంపించమని డాక్టర్ కు కార్తీక్ చెప్తాడు. ఉదయం గుడికి వెళ్లాలని, అన్ని రహస్యాలు బయటపడే రోజు వచ్చిందని దీపతో కార్తీక్ చెప్తాడు. కార్తీక్ ఏం చెప్పబోతున్నాడా? అని దశరథ నిద్ర పోకుండా ఆలోచిస్తూనే ఉంటాడు.
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 18 ఎపిసోడ్ లో.. కడుపుతో ఉన్న వాళ్లను చంపాలనుకున్నవాళ్లకు పెంచిన తల్లి ఒక లెక్కా, వదినను జ్యోత్స్న చంపేస్తుందని కార్తీక్ తో దాసు ఆందోళనగా చెప్తాడు. అప్పుడే కార్తీక్ కు డాక్టర్ హారిక కాల్ చేసి దశరథ్ హాస్పిటల్ కు వచ్చిన విషయం చెప్తుంది. మీ మామయ్య జ్యోత్స్న రిపోర్ట్స్ అడుగుతున్నారని డాక్టర్ చెప్తుంది.

రిపోర్ట్స్ పంపించమన్న కార్తీక్
రిపోర్ట్స్ మెయిల్ చేస్తా టైమ్ పడుతుందని చెప్పా. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు కార్తీక్. ఆయన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. ఒక ప్రాణం కాపాడటం కోసం నా వంతు సాయం చేయాలనుకున్నా కానీ నా వల్ల కావట్లేదు. ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నా అని డాక్టర్ హారిక చెప్తుంది. రిపోర్ట్స్ పంపించమని కార్తీక్ చెప్తాడు. నువ్వు యుద్ధానికి సిద్దమయ్యావని అర్థమవుతుంది అల్లుడు, ఆల్ ది బెస్ట్ అని దాసు అంటాడు.
గుడికి వెళ్లాలని
ప్రమిదలు, కొబ్బరికాయలు ఏం చేయమంటావు దీప? పక్కన పెట్టమంటావా? లేదా గుడిలో దీపాలు వెలిగిస్తావా? అని దీపను అనసూయ అడుగుతుంది. నువ్వు ఎన్ని చెప్పినా దీప మాట వినదు అక్క. గుడిలో చాలా మంది ఉంటారు కదా వాళ్లకు అవి ఇచ్చేయ్ అని కాంచన అంటుంది. అప్పుడే వచ్చిన కార్తీక్.. అవసరం లేదులే అమ్మ, దేవుడి కోసం తెప్పించిన సామాను అలాగే ఉంచు. రేపు దీప, నేను గుడికి వెళ్తున్నామని అంటాడు. నా భార్య నా మాట కాదనదని కార్తీక్ చెప్తాడు.
ఇప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది దీప. అన్ని బరువులు మీదేసుకుని తిరుగుతున్నారని మీ మీద కోప్పడతానే కానీ మీరు బాగుండటం కంటే నేను కోరుకునేది ఏముంది? అని కాంచన అంటుంది.
దశరథ షాక్
దశరథకు డాక్టర్ హారిక కాల్ చేసి రిపోర్ట్స్ మెయిల్ చేశానని చెప్తుంది. ఆ రిపోర్ట్స్ చూసి దశరథ షాక్ అవుతాడు. అప్పుడే కార్తీక్ నుంచి కాల్ వస్తుంది. రిపోర్ట్స్ వచ్చాయా మామయ్య అని కార్తీక్ అడుగుతాడు. మార్నింగ్ గుడికి రా మామయ్య అన్ని అక్కడే మాట్లాడుకుందాం. అత్తను ఆమె కూతురే కాపాడుకుంటుంది మామయ్య అని కార్తీక్ చెప్తాడు.
అసలైన కూతురు
అన్ని నీకు రేపు తెలుస్తాయి మరదలా. పడుకో ఉదయాన్నే లేవాలని దీపతో కార్తీక్ అంటాడు. బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయితే సమస్య తీరిపోతుందా? జ్యోత్స్న, పారిజాతం, నాన్న.. ఇలా అందరికీ రకరకాల అనుమాలున్నాయి. బ్లడ్ శాంపిల్ ఇచ్చింది నేనే అని ఎవరికి తెలిసినా ప్రాబ్లమే కదా. హాస్పిటల్ లో అమ్మను రేపే చేర్పించాల్సి వస్తే జ్యోత్స్నను దాటి అమ్మను ఎలా కాపాడుకోగలను? ఒకవేళ దొరికిపోయి దీప అసలైన కూతురు అని చెప్తే నమ్ముతారా? దాసు బాబాయి మనకోసం వస్తాడా? అని దీప అడుగుతుంది.
గుడిలో అన్ని విషయాలు
దాసు మామయ్య కూడా మనతోని రేపు గుడికి వస్తాడు. ఉదయం అన్ని విషయాలు చెప్తాను దీప. మనకు మంచి జరగబోతుంది. నాతో పాటు అందరూ టెన్షన్ లో ఉన్నారని తెలుసుకున్నా. భయమనేది ఊబిలాంటిది. పీకల్లోతు మునిగిపోయా. దీని నుంచి త్వరగా బయటపడాలి. మన బిడ్డ నీకు తల్లి రుణం తీర్చుకునే అవకాశం ఇస్తుంది. మనం జీవితాంతం కనిపించని రూపాన్ని కనిపించే అత్తలో చూసుకోవాలని కార్తీక్ చెప్తాడు.
నా బిడ్డేనా?
నేను చాలా సంతోషంగా ఉన్నా. నీ పెళ్లి చూస్తానని, పిల్లలతో ఆడుకుంటానని ఆనందంగా ఉన్నా. నువ్వు పుట్టిన తర్వాత చాలా సేపటి వరకు నేను స్పృహలో లేను. నాలుగైదు గంటల తర్వాత మెళకువ వచ్చింది. కళ్లు తెరవగానే ఊయలలో ఉన్న నిన్ను చూపించారు. నిన్ను చూసేసరికి ఇది నా బిడ్డేనా అనిపించింది. ప్రేమగా దగ్గరకు తీసుకున్నా. అప్పుడే మీ దాసు బాబాయికి కూతురు పుట్టి చనిపోయిందని చెప్పారు. పారిజాతం చేతుల్లోకి వెళ్లగానే నువ్వు ఏడుపు ఆపేశావంటా అని జ్యోత్స్నతో సుమిత్ర చెప్తుంది.
రహస్యాలు
రేపు నేను చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది. అది చేస్తే నాకు కొంత రిలీఫ్ దొరుకుతుంది. అందుకే ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్నానని సుమిత్రతో దశరథ అంటాడు. రేపటి వెలుగు ప్రశ్నలుగా మిగిలిపోయిన ఎన్నో అనుమానాలకు సమాధానాలు ఇవ్వబోతుందని జ్యోత్స్నతో దశరథ అంటాడు. నీ గురించి కొన్ని రహస్యాలు బయటపడబోతున్నాయని దశరథ అనుకుంటాడు.
ఏం జరుగుతుంది?
ఉదయం గుడిలో దశరథ, కార్తీక్ కలుసుకుంటారు. దాసును జ్యోత్స్న చంపాలనుకుంది. ఆ అవసరం ఏంటీ? శౌర్య, దీప మీద అటాక్ జరిగినప్పుడు దీప వచ్చి జ్యోత్స్నను కొట్టింది. ఎప్పటికప్పుడు జ్యోత్స్న ప్రవర్తన గమనిస్తూనే ఉన్నా. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని అన్నప్పుడు జ్యోత్స్న షాక్ అయింది. రిపోర్ట్స్ తెలుసుకోవాలని అనుకున్నా. కానీ తప్పుడు రిపోర్ట్స్ డాక్టర్ పంపింది. అసలు ఏం జరుగుతుంది? ఈ రిపోర్ట్స్ కు నీకు సంబంధం ఏంటీ? అని కార్తీక్ ను దశరథ అడుగుతాడు.
ఇదంతా నీకు తెలిసే జరుగుతుందని నాకు ఇప్పుడే అర్థమవుతోంది. నేను వివరాలు తెలుసుకోకుండా నేరుగా ఆపరేషన్ కు వెళ్లి ఉంటే మీరంతా కలిసి నా భార్యను చంపేసేవాళ్లే కదా అని కార్తీక్ తో దశరథ అంటాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


