కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కాశీ తాచుపాము- జ్యోత్స్న‌తో ఆడుకుంటున్న దాసు- నిజాన్ని క‌నిపెడతానని- బిడ్డ‌పై కార్తీక్ ఆశలు

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 26 ఎపిసోడ్ లో స్వప్నను ఒక్క ఛాన్స్ ఇవ్వమని కాశీ అడుగుతాడు. కానీ తాచుపాముతో కాశీని పోల్చిన స్వప్న ఫుల్ ఫైర్ అవుతుంది. మరోవైపు జ్యోత్స్నను దాసు కన్ఫ్యూజ్ చేస్తాడు. బిడ్డపై ఆశలు వదుకోలేదని కార్తీక్ ఫీల్ అవుతాడు. 

Feb 26, 2026, 06:59:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 26 ఎపిసోడ్ లో.. ఒక తాచుపాము చావు బతుకుల్లో ఉంది. పక్కనే వెళ్లే వ్యక్తి జాలి పడ్డాడు. మరో వ్యక్తి ఏమో వద్దురా వదిలేయ్ అన్నాడు. కానీ అతను పాము గాయాన్ని నయం చేశాడు. పాముకు పాలు పోసి, గుడ్డు పెట్టాడు. అప్పుడే పాము కాటు వేయడంతో అతను చచ్చిపోయాడు. అలాంటి తప్పు నేను చేయనని కాశీతో స్వప్న అంటుంది.

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

ప్లాన్ ఉందన్న స్వప్న

పాము కాటు వేసినట్లే నువ్వు నన్ను బాధపడేలా చేస్తావని కాశీపై స్వప్న ఫైర్ అవుతుంది. అక్క, కార్తీక్ బావ.. దశరథ, సుమిత్ర గొడవలు పెట్టుకున్నారు. మళ్లీ కలిసిపోయారు. ఒక్క ఛాన్స్ ఇవ్వొచ్చు కదా అని కాశీ అడుగుతాడు. నువ్వు ఇలా రిక్వెస్ట్ చేయడం వెనుక కూడా ఏదో ఒక ప్లాన్ ఉండొచ్చని స్వప్న అంటుంది. మన ఇద్దరం కలిసి బిజినెస్ చేసుకుందామని కాశీ అడుగుతాడు. ఏమో నన్ను కూడా ఫుడ్ పాయిజన్ కేసులో ఇరికిస్తావేమోనని స్వప్న కోప్పడుతుంది.

జ్యోత్న్స వార్నింగ్

మరోవైపు నువ్వు ఇక తప్పించుకోలేవంటూ దాసుకు జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది. నాకే బంధనాలు లేవు. ఇక నేను ఏమైపోయినా పర్వాలేదని దాసు అంటాడు. ఇన్ని రోజులు దీప ఎవరు అనేది అందరికీ చెప్పాలనేవాడివి. ఇప్పుడు నిజం చెప్పేశావా? దీప గురించి తెలిస్తే ఎలా బిహేవ్ చేస్తారో డాడీ అలాగే చేస్తున్నాడు. నేను నిజంగా దశరథ కూతురినా? నువ్వే నా తండ్రివి. దీపే సుమిత్ర కూతురు. డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్తుంది? అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది.

షాకిచ్చిన దాసు

నువ్వే మా వదినకు ప్రాణదాతవి. ఇప్పటికే చాలా పాపాలు చేశావు. ఇక చాలు ఆపేయ్. దశరథ అన్నయ్యను దీప షూట్ చేశారని చెప్పారుగా. అది కూడా నీ పనే అని నా డౌట్ అని దాసు షాకిస్తాడు. నేను దశరథ కూతురినా? నీ కూతురినా? అని దాసును జ్యోత్స్న అడుగుతుంది. నిజాన్ని నువ్వే కనిపెట్టు అని దాసు బదులిస్తాడు. నువ్వు అలా చూస్తూ ఉండు నాన్న అన్నీ చెప్తాను అని జ్యోత్స్న చిటికెలు వేస్తుంది. అప్పుడే వచ్చిన పారిజాతం జ్యోత్స్నపై సీరియస్ అవుతుంది.

కార్తీక్ భయం

మామయ్యను కంట్రోల్ చేయడం నా వల్ల కావట్లేదు. ఎక్కడ నిజం చెప్పేస్తాడోననే భయంగా ఉంది. కుబేర ఫొటో దగ్గరకు వెళ్లి ఏడుస్తుంటే మీ నాన్న కొత్తగా కనిపించాడు. జ్యోత్స్నకు కచ్చితంగా అనుమానం వచ్చిందని దీపతో కార్తీక్ అంటాడు. సారీ బావ నిన్ను ఇబ్బంది పెడుతున్నా. నా వల్లే నీకు కష్టాలు. మా అమ్మనాన్న కోసం నేను ఏమైనా చేయొచ్చు. కానీ నువ్వు నాకోసం అన్ని చేస్తున్నావు బావ అని దీప అంటుంది.

బిడ్డపై ఆశలు

అత్తను కాపాడి నిన్ను ఆ ఇంటి వారసురాలి స్థానంలో నిలబెట్టాలి. కానీ జ్యోత్స్న, పారిజాతం ఏం చేస్తారోనని భయంగా ఉంది. ఆపరేషన్ టైమ్ లో ఎవరికి తెలియకుండా జ్యోత్స్న స్థానంలో నిన్ను ఉంచడమనేది చాలా రిస్క్. కడుపులో బిడ్డకు ఏమైనా అయితే బాధ నుంచి తేరుకోవడం అంత సులువు కాదు దీప. బిడ్డపై ఆశలు వదులుకోలేదని కార్తీక్ ఫీల్ అవుతాడు.

అమ్మను కాల్చేస్తాడు

నువ్వు నన్ను కలవడం చూస్తే శివనారాయణకు అనుమానం వస్తుంది. అప్పుడు నీ గురించి ఆయనకు తెలుస్తుంది. నీకు ఎలాగో డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి నువ్వ సేఫ్ అవుతావు. బిడ్డలను మార్చినందుకు శివనారాయణ ఊరుకుంటాడా? లైసెన్స్ డ్ ఫొటోతో అమ్మను కాల్చేస్తాడు అని జ్యోత్స్నతో దాసు అనగానే పారిజాతం భయపడుతుంది. జ్యోత్స్న సుమిత్ర కూతురు అని పారు అరుస్తూనే ఉంటుంది.

నా మనవరాలిని వెతకాలని దాసుతో పారు అంటుంది. మీరు ప్రపంచం అంతా వెతికినా అది దొరకదు అని జ్యో అనగానే, నువ్వు దాన్ని చంపేశావా? అని పారు కంగారు పడుతుంది. అసలైన మనవరాలిని నేనే. ఇది నీ టైమ్ నాన్న. నేను ఎవరి కూతురినో కనుక్కుంటానని జ్యో చెప్తుంది.

పారును ఇరికించిన కార్తీక్

మార్నింగ్ జ్యోత్స్న, పారు ధ్యానం చేస్తారు. మళ్లీ ఫ్రెండ్స్ లా కలిసిపోదామని ప్రామిస్ చేసుకుంటారు. ధ్యానం చేస్తున్న పారు ముందుకు కార్తీక్ వస్తాడు. ఏంటి పారు ఇంత పొద్దునే మెడిటేషన్ చేస్తున్నావ్? అని కార్తీక్ అడుగుతాడు. టెన్షన్ పోవడానికి అని పారు చెప్తుంది. ఎప్పుడు చేయని పారు మెడిటేషన్ చేస్తుంది, ఎందుకంటే మనశ్శాంతి పోయిందని చెప్తుంది. కొన్ని చెప్పుకోలేమని అంటుంది. అవేంటో తెలియాలని శివనారాయణ ముందు పారును కార్తీక్ ఇరికిస్తాడు.

ఎందుకు నీకింత ఒత్తిడి? దాసు మామయ్యను కిడ్నాప్ చేసిన దాని గురించా? అని కార్తీక్ అంటాడు. దాసు కిడ్నాప్ ఏంట్రా అని శివనారాయణ అడుగుతాడు. దాసు మామయ్య కనిపించకుండా పోవడానికి కారణం ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని పారు టెన్షన్ పడుతుందని కార్తీక్ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.