కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ఒట్టుతో తండ్రిని ఆపిన దీప- దాసును క్షమించిన దశరథ- జ్యోత్స్నలో వణుకు- బయటకు పంపని శివ నారాయణ

కార్తీక దీపం 2 సీరియల్ ఫిబ్రవరి 21వ ఎపిసోడ్‌లో దశరథ్ నిజం చెప్పేందుకు వెళ్తుంటే తాను చచ్చినంత ఒట్టు అని ఆపుతుంది దీప. దాంతో ఆగిపోతాడు దశరథ్. దాసును దశరథ అసహ్యించుకుంటే తను పడిన వేదన గురించి కార్తీక్ చెబుతాడు. కార్తీక్, దీప గుడికి వెళ్లారని, దశరథ ఇంట్లో లేడని తెలిసి జ్యోత్స్న వణికిపోతుంది.

Feb 21, 2026, 07:46:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో నువ్వు నన్ను నమ్మిన నమ్మకపోయిన నేనే నీ మనవరాలిని అని తెలుస్తుంది. కానీ, ఆలోపు కథ ముగుసిపోతుంది. దాని నుంచి మనం బయటపడాలంటే దాసు బావను కలవకూడదు. కార్తీక్ బావ ఎక్కడ ఉన్నాలో తెలుసుకోవాలి అని జ్యోత్స్న అంటుంది.

కార్తీక దీపం 2 సీరియల్ ఫిబ్రవరి 21వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ ఫిబ్రవరి 21వ తేది ఎపిసోడ్

కార్తీక్ దీప గుడికి వెళ్లారు

దాంతో కాంచనకు కాల్ చేసి దీప, కార్తీక్ ఇంకా రాలేదు. ఏమైనా ఆరోగ్య సమస్య అని ఆరాలు తీస్తుంది పారిజాతం. కార్తీక్ దీప గుడికి వెళ్లారని చెప్పి కాల్ కట్ చేస్తుంది కాంచన. అదే విషయం జ్యోకి చెప్పిన పారిజాతం దాసును కలవడానికి గుడికి వెళ్లారంటావా.. ఇంట్లో ఇంకో మనిషి కూడా కనిపించట్లేదు. అతను కూడా గుడికి వెళ్లాడా మీ నాన్న దశరథ అని పారు అంటుంది.

దాంతో జ్యో ఊయల కుప్పకూలి కూర్చొంటుంది. తెగ వణికిపోతుంటుంది జ్యోత్స్న. నువ్వు చెప్పిన ఆట ఇది కాదు కదా అని పారిజాతం అంటుంది. మరోవైపు దశరథ ఆవేశంగా వస్తుంటే కార్తీక్, దీప ఆపుతారు. తొందరపడి ఏ తప్పు చేయకూడదు. సుమిత్ర అత్తకు జ్యో అంటే ప్రాణం. ఇప్పుడు నీ కూతురు కాదంటే తట్టుకోగలదా. రిపోర్ట్స్ మ్యాచ్ కాకుంటే దీపతో చేయించి అవి జ్యోవి అని చెప్పించా. డాక్టర్ కూడా మన మనిషే అని కార్తీక్ అంటాడు.

నేను వినను. సుమిత్రకు నేను ఏదోలా చెప్పుకుంటా అని దశరథ అంటాడు. దాసు ఆపాలని చూస్తే నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. అంతా కలిసి నా కూతురుకు అన్యాయం చేశారు. ఏం జరిగితే అది జరగని. నేను విషయం చెబుతాను దశరథ్ అంటాడు. మనకు నిజం తెలిసిందని తెలిస్తే జ్యో ఎంతకైన తెగిస్తుంది. ఇప్పుడు శౌర్య నా కూతురు కాదంటే నాకు ఎలా ఉంటుందని సుమిత్ర గురించి చెబుతుంది దీప.

నేను చచ్చినంత ఒట్టే

నా మాట విను నాన్న. నువ్వు నిజం చెప్పావంటే నేను చచ్చినంత ఒట్టే. నేనే చెప్పేంతవరకు ఈ నిజం ఎవరికి చెప్పకూడదు అని దీప దశరథ్‌తో ఒట్టేయించుకుంటుంది. ఏంటమ్మా నీకు నువ్వే గీత గీసుకుంటావా. కష్టాలు ఇంకా తెచ్చుకుంటావా అని దశరథ్ అంటాడు. ఇప్పుడు ఆలోచించాల్సింది అమ్మ గురించి. నాకంటే నాకు అమ్మే ముఖ్యం. ఒట్టు గుర్తుపెట్టుకో నాన్న అని దీప అంటుంది.

దాంతో ఒట్టుపై కోప్పడుతాడు దశరథ్. నిన్ను ఒకసారి దూరం చేసుకుంది చాలు. మరోసారి దూరం చేసుకోలేను. నీ ఒట్టుకు కట్టుబడి ఉంటాను. కానీ, ప్రళయాన్ని ఏ ఒట్టు ఆపదు. నీకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అని దశరథ్ అంటాడు. దాసును దశరథ్ తిడితే.. కాళ్లు పట్టుకుంటాడు. అయినా అసహ్యించుకుంటాడు దశరథ్.

దాసు సైడ్ నుంచి జరిగినవన్నీ చెబుతాడు కార్తీక్. చావు అంచుల వరకు, జ్యో కిడ్నాప్ అన్ని చెబుతాడు కార్తీక్. నీకు సొంత తమ్ముడు ఉన్న ఇంతలా ఆలోచించడు. దాసు మావయ్యకు కూడా అన్యాయం జరిగింది. తన కూతురుని తనకు దూరం చేసింది పారు. దాసు మావ ఈ కథను మొదలైనప్పటి నుంచి మోస్తున్నాడు. పారిజాతం కన్నవాడికి కూడా అన్యాయం చేసిందని కార్తీక్ అంటాడు.

దాసును క్షమించిన దశరథ్

నన్ను క్షమించు అన్నయ్య. నేను లక్ష్మణుడినో కాదో నాకు తెలియదు. కానీ, నువ్వు మాత్రం నాకు రాముడివే. నన్ను దూరం చేయకు అన్నయ్య అని వేడుకుంటాడు దాసు. కోపంలో నాలుగు మాటలు అన్నాను. పట్టించుకోకురా అని దశరథ్ దాసును క్షమిస్తాడు. ఇక అంతా సంతోషమే అని కార్తీక్ అంటాడు.

మరోవైపు శ్రీధర్ అకౌంట్స్ చూపిస్తాడు శివ నారాయణ. అది చూసిన జ్యోత్స్న దశరథ్ గురించి ఆలోచిస్తుంది. శ్రీధర్ శివ నారాయణ ఇద్దరు కాశీ, స్వప్న గురించి మాట్లాడుకుంటారు. స్వప్నను సూటిపోటి మాటలతో బాధపెట్టలేను. పంతం కోసం ప్రాణం వదిలేయగలదు. ఈ జెనరేషన్ పిల్లలు తనకు నచ్చని పని జరిగితే సూసైడ్ చేసుకుంటున్నారు అని శ్రీధర్ అంటాడు.

నాకంటే మెచ్యూర్‌గా ఆలోచించావ్ అని శివ నారాయణ మెచ్చుకుంటాడు. ఇదంతా నా కొడుకును చూసే నేర్చుకున్నా అని శ్రీధర్ అంటాడు. జ్యో దగ్గరికి వచ్చి పారు నేనే ఒంటరిదాన్ని అయిపోయాను అంటుంది. నువ్వే నాకు పెద్ద శత్రువులా మారావని జ్యో అంటుంది. నిజం తెలిస్తే నాకే ఎఫెక్ట్ సరే పదా. దాసును కనిపెట్టి ఆపాలి అని పారిజాతం అంటుంది.

పారు, జ్యోకి షాక్

పారు, జ్యో వెళ్తుంటే శివ నారాయణ ఆపుతాడు. దశరథ్ వచ్చే వరకు జ్యోని ఎక్కడికి వెళ్లొద్దన్నాడు అని శివ నారాయణ చెబుతాడు. దాంతో జ్యోత్స్న షాక్ అయి వెనక్కి వెళ్తారు. శ్రీధర్ వెళ్లిపోతాడు. మరోవైపు కార్తీక్, దీప, దీప కడుపులో బిడ్డపై అర్చన చేయిస్తాడు దశరథ్. కార్తీక్‌ను లాగి కడుపులో బిడ్డ గురించి చెబుతుంది దీప. ఇది కూడా చెబుతాను అని కార్తీక్ అంటాడు.

వద్దు. నాన్న ఇప్పుడే సంతోషంగా ఉన్నారు. ఇప్పుడే చెప్పి బాధపెట్టకు అని కార్తీక్‌తో దీప అంటుంది. కార్తీక్ ఆగిపోతాడు. తన ఆనందాన్ని అంతా పంతులుకు చెబుతాడు దశరథ్. దాసు వెళ్తానంటాడు. మన ఇంటికి వెళ్దాం పద దీప అని దశరథ్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More