కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కాంచనకు నిజం చెప్పేస్తున్న దశరథ- కార్తీక్, దీప టెన్షన్- జ్యోత్స్నను కన్నకూతురు కాదన్న దాసు

కార్తీక దీపం 2 టుడే ఫిబ్రవరి 24 ఎపిసోడ్ లో కడుపులో బిడ్డ ప్రాణాన్ని వదులుకోవాల్సి వస్తుందని దీప, కార్తీక్ ఎమోషనల్ అవుతారు. దాసు వచ్చి జ్యోత్స్న తన కన్నకూతరు కాదని డ్రామా ఆడతాడు. మరోవైపు కాంచనకు నిజం చెప్పేందుకు దశరథ వెళ్తాడు. నా కూతురే కాంచన కోడలైందని అంటాడు. 

Published on: Feb 24, 2026, 07:08:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 24 ఎపిసోడ్ లో.. అమ్మకు ఆపరేషన్ జరగాలి. అమ్మ బతకాలి. వాళ్లిద్దరు నిండు నూరేళ్లు కలిసి ఉండాలి. మన నుంచి వాళ్లు ఏం పొందారో మా నాన్నకు తెలుస్తుంది. కానీ మనం ఏం కోల్పోతామో మనకు మాత్రమే తెలుస్తుంది. ఇదే నా రాత. పుట్టగానే ఒక తల్లికి దూరమయ్యా. పుట్టకముందే నా బిడ్డ నాకు దూరమవుతుందని కార్తీక్ కు చెప్తూ దీప ఏడుస్తుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

గుండె రాయిలా

ఆపరేషన్ టైమ్ లో నాకు ఇవేవీ గుర్తుకు రావొద్దు. ఒక కన్నీటి చుక్క కూడా నేను కార్చొద్దు. నా గుండె రాయిలా మారిపోవాలి. ఇదే బావ నేను ఆ దేవుడిని కోరుకునేదని కార్తీక్ తో దీప చెెప్తుంది. నీ అంత ధైర్యంగా నేను ఉండలేను మరదలా. గుడిలో గంటల్లో, దీపాల్లో నా బిడ్డ ప్రాణమే కనిపించిందని కార్తీక్ ఫీల్ అవుతాడు. నన్ను క్షమించు బావ అని దీప ఏడ్చేస్తుంది.

నాన్న కాదు చిన్నాన్న

ఇక దాసు ఎంట్రీతో పారిజాతం ఆనందపడితేే, జ్యోత్స్న షాక్ అవుతుంది. నాన్న ఎక్కడికి వెళ్లిపోయావ్? అని జ్యో డ్రామా స్టార్ట్ చేస్తుంది. నాన్న అని కాదు చిన్నాన్న అని పిలవాలని దాసు అంటాడు. ఆ రోజు నువ్వు వదిలేసింది దశరథ కూతురిని కాదు, నీ కూతురిని అని దాసుతో పారిజాతం అంటుంది. నువ్వు దశరథ కూతురివే అని రిపోర్ట్స్ లో రాసి ఉందని జ్యోతో పారు అంటుంది.

నా కూతురు కాదు

నన్ను కిడ్నాప్ చేయడంలో జ్యోత్స్నను మెచ్చుకోవాలి. నన్ను ఇక నాన్న అని పిలవొద్దు జ్యోత్స్న. నువ్వు నా కూతురు అనే నిజం ఎక్కడ బయటపడుతుందోనని భయపడ్డావు. కానీ ఇప్పటివరకూ నాకే తెలియని నిజం ఏమిటంటే నువ్వు నా కూతురు కాదు. నీకు ఏ భయాలు లేవు. నువ్వు నా కూతురు అనేందుకు మా అమ్మ కాకుండా ఇంకా ఏ సాక్ష్యమైనా ఉందా అని దాసు అడుగుతాడు. నువ్వు బావను గుడిలో కలిశావు కదా అని దాసును జ్యో అడుగుతుంది.

ఇక భయాలు లేవు. నేను ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కన్నతల్లిని జాగ్రత్తగా కాపాడుకో అని దాసు అంటాడు. కార్తీక్ చెప్పేంతవరకు నేను ఏ నిజం బయటకు చెప్పనని అనుకుంటూ దాసు వెళ్లిపోతాడు.

వియ్యంకుడిగా

మరోవైపు కాంచన కంగారు పడుతుంది మా పిన్ని ఫోన్ చేసి కార్తీక్, దీపల గురించి అడిగింది. అప్పటి నుంచి నా ఎడమ కన్ను అదురుతుందని అనసూయతో కాంచన అంటుంది. కన్ను అదిరితే శుభమే అని అనసూయ అంటుంది. అప్పుడే దశరథ ఎంట్రీ ఇస్తాడు. నేను అన్నయ్యగా కాదు నీ వియ్యంకుడిగా వచ్చాను అని దశరథ అంటాడు. మామయ్య దీప విషయం అమ్మకు తెలియదని కార్తీక్ సైగ చేస్తాడు. దీంతో దశరథ నిజం చెప్పకుండా ఆగిపోతాడు.

మనం బలంగా అనుకుందే జరిగింది. మీ అమ్మ ఎడమ కన్ను అదిరిందంటే అటు పుట్టినింట్లోనో, మెట్టినింట్లోనే మంచి జరుగుతుందని శివనారాయణ అంటాడు. అవును, మంచి జరిగిందని దశరథ చెప్తాడు. అదేంటీ అని కాంచన అడుగుతుంది. గుడి నుంచి వచ్చిన తర్వాత దశరథలో విపరీతమైన మార్పు వచ్చిందని శివనారాయణ అంటాడు.

నమ్మని పారు

మనకు టైమ్ దగ్గరపడిందని మా డాడీ మాటలు చూస్తుంటే అర్థం కావడం లేదా గ్రానీ? నీకు కొన్ని నిజాలు తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. దీప ఎవరి కూతురో నీకు తెలుసా. హారతులు ఇచ్చి ఆహ్వానించడాలు, అతిథి మర్యాదలు చేయడాలు ఇవన్నీ మా డాడీ ఎందుకు చేస్తున్నాడో తెలుసా నీకు? ఎందుకంటే దీప.. అని జ్యోత్స్న ఆగిపోతుంది. వినేవాడు ఎర్రినాగన్న అయితే దశరథ కన్నకూతురు దీప అని చెప్తావ్. అలా చెప్తే నమ్ముతానా? ఏంటీ అని పారిజాతం అంటుంది.

దశరథ కొత్తగా

దీపకు, ఈ ఇంటి మనుషులకు సంబంధమే లేదని పారు అంటుంది. ఒక పక్క మా మమ్మీకి ఆపరేషన్ టైమ్ దగ్గరపడింది. ఇంకో పక్క దీప ఈ ఇంటికి దగ్గరపడుతుంది. కానీ నువ్వు మాత్రం మీ మనవరాలు ఎవరంటూ వెతుకుతున్నావని పారుతో జ్యో చెప్తుంది. జ్యోత్స్నే నా కన్నకూతురు, నీ సొంత మనవరాలని నా కొడుకైనా నాతో చెప్పాలి కదా. దశరథ బిహేవియర్ లో ఏదో కొత్త మార్పు కనిపిస్తోందని పారు అంటుంది.

ఆ మాట నిజం

గుడిలో ఏదో జరిగింది. ఆ ఆనందాన్ని చెల్లెలితో దశరథ పంచుకోవాలని అనుకుంటున్నాడు. అదేంటో నాకు తెలియాలని ఉంది. దశరథ గుడిలో ఏం జరిగిందో చెప్పమని శివనారాయణ అడుగుతాడు. పిల్లలకు పెళ్లిల్లు అయిపోతే వేరు కాకుండా, కలిసి ఉండేలా చూడమని అమ్మ చనిపోయే ముందు నాన్నతో చెప్పింది. దీంతో శ్రీధర్ ను ఇచ్చి నీకు పెళ్లి చేశాడని దశరథ అంటాడు. అందుకే నీ కూతురిని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసేలా మాట అనుకున్నామని కాంచన అంటుంది.

ఆ మాట మట్టిలో కలిసిపోలేదమ్మా. ఆ మాట నిజమైంది. నీ కోరిక తీరింది. నువ్వు కోరుకున్నట్లు నా కూతురే నీ ఇంటి కోడలైంది అని దశరథ చెప్తుండగా జ్యోత్స్న వస్తుంది. ఏంటీ డాడీ నీ కూతురు ఈ ఇంటి కోడలైందా అని జ్యో అడుగుతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More