Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్‌లో కొత్త హీరో.. జ్యోత్స్నకు మొగుడయ్యేది అతడేనా? తొలి పరిచయంలోనే ఫైర్
Karthika Deepam 2: తెలుగులో పాపులర్ సీరియల్ అయిన కార్తీక దీపం 2లో ఓ కొత్త హీరో ఎంట్రీ ఇచ్చాడు. బ్రహ్మముడి ఫేమ్ శ్రీకర్ కృష్ణ ఇప్పుడు కార్తీక దీపం 2లో కూడా నటిస్తున్నాడు. అతని ఎంట్రీతో సీరియల్ ఊపు మరింత పెరగడం ఖాయమని అంటున్నారు.
Karthika Deepam 2: రసవత్తరంగా సాగుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేందుకు కొత్త క్యారెక్టర్ లో ఓ నటుడు వచ్చేశాడు. బ్రహ్మముడి సీరియల్ లో రాహుల్ గా ఆడియన్స్ ను ఎంటర్ టైన చేస్తున్న శ్రీకర్ కృష్ణ ఇప్పుడు కార్తీక దీపం 2 సీరియల్ లోకి కూడా వచ్చేశాడు. వస్తూనే ఫైర్ బ్రాండ్ జ్యోత్స్నపైనే ఫైర్ అయ్యాడు.

కార్తీక దీపం 2
తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ, రేటింగ్ లో టాప్ లో దూసుకెళ్తోంది కార్తీక దీపం 2 సీరియల్. ప్రస్తుతం ఈ సీరియల్ జ్యోత్స్న పెళ్లి చుట్టూ కథ సాగుతోంది. జ్యోకు నెల రోజుల్లో పెళ్లి చేస్తామని కార్తీక్, దీప ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త హీరో ఎంట్రీ ఆసక్తికరంగా మారింది.
జ్యోకు మొగుడేనా?
జ్యోత్స్న కోసం పెళ్లి కొడుకును వెతికే పనిలోనే కార్తీక్ ఉండగా.. సీరియల్ లో శ్రీకర్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో జ్యోకు కాబోయే మొగుడు అతనేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీరియల్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేందుకు, జ్యోత్స్న తిక్క కుదిర్చేందుకు కొత్త క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేశారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
బొమ్మ ఇవ్వకుండా
కార్తీక దీపం 2 సీరియల్ లో శ్రీకర్ కృష్ణ అడుగుపెట్టేశాడు. ఫస్ట్ సీన్ లోనే జ్యోత్స్నకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఓ టాయ్ షాపులో రొమాంటిక్ గా ఉన్న ఓ బొమ్మను జ్యో కొనాలనుకుంటుంది. అప్పటికే అది శ్రీకర్ తీసుకుంటాడు. షాప్ లో అదొక్కటే పీస్ ఉంటుంది. దీంతో ఆ బొమ్మ ఇవ్వాలని జ్యో ఎంతలా అడిగినా, డబ్బు ఆశ చూపినా శ్రీకర్ లొంగడు.
కార్తీక్ తండ్రిని కాపాడి
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో శ్రీకర్ మళ్లీ వచ్చాడు. హార్ట్ స్ట్రోక్ తోో కార్లోనే పడిపోయిన కార్తీక్ తండ్రి శ్రీధర్ ను శ్రీకర్ హాస్పిటల్ కు తీసుకెళ్తాడు. తన తండ్రి ప్రాణాలను కాపాడిన వ్యక్తిని కార్తీక్ కలవాలనుకుంటాడు. కార్తీక్, శ్రీకర్ ఎదురు పడతారు. కార్తీక దీపం 2 సీరియల్ లో శ్రీకర్ క్యారెక్టర్ పేరు ఇంకా రివీల్ చేయలేదు.
మల్టీ టాలెంటెడ్
శ్రీకర్ కృష్ణ కేవలం నటుడు మాత్రమే కాదు, అతను మల్టీ టాలెంటెడ్. అతను రైటర్, డైరెక్టర్, యాంకర్, మెజీషియన్ కూడా. సొంత బ్యానర్ శ్రీకరం ప్రొడక్షన్ లో, తనే డైరెక్టర్ గా ‘ఓ టర్చర్ ప్రేమ’ అనే సినిమా తీస్తున్నాడు. కళ్యాణ వైభోగం సీరియల్ తో డెబ్యూ చేసిన శ్రీకర్.. శతమానం భవతిలోనూ యాక్ట్ చేశాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


