Karthika Deepam 2 Today Episode: బావతోనే పెళ్లి- జ్యోత్స్న నిజస్వరూపం బయటపెట్టిన కార్తీక్-జ్యో చెంప పగలకొట్టిన సుమిత్ర
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 30 ఎపిసోడ్ లో జ్యోత్స్న నిజ స్వరూపాన్ని బయటపెట్టేలా కార్తీక్ ఆడిన డ్రామా సక్సెస్ అవుతుంది. బావనే పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న అందరి ముందు అరుస్తుంది. జ్యోను దీప, సుమిత్ర లాగిపెట్టి కొడతారు.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో నెల రోజుల్లోపూ జ్యోత్స్నకు పెళ్లి చేస్తానని కార్తీక్ ఛాలెంజ్ చేయడం ఆసక్తి రేపుతోంది. పెళ్లి కొడుకు డ్రామాతో జ్యోకు షాకిస్తాడు కార్తీక్. పారు, దీపతో కలిసి జ్యోను బుట్టలో పడేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 30 ఎపిసోడ్ లో చూసేయండి.

చావు దెబ్బ
మీ కోసం అందమైన చీరను పారుతో తెప్పించి, అన్ని వివరాలు చెప్పించి పెళ్లి చూపులు అరెంజ్ చేస్తే మీరు ఆశ్చర్యపోతారేంటీ పెద్ద మేడం అని జ్యోత్స్నకు మండిపోయేలా కార్తీక్ మాట్లాడతాడు. ఎంత పెద్ద ప్లాన్ చేశావ్ బావ అని జ్యో అనుకుంటుంది. మీరంతా కలిసి నన్ను బుక్ చేశారా? చావు దెబ్బ కొట్టావు బావ అని తనను తానే అసహ్యించుకుంటుంది.
అబ్బాయి నచ్చలేదని
మీ అందరికీ పెళ్లి చూపులు అనేది ముందే తెలుసా? నాకు చెప్పాల్సిన బాధ్యత లేదా? అని తండ్రి, తాత, తల్లిని జ్యోత్స్న అడుగుతుంది. కార్తీక్ చెప్తా అన్నాడు. నువ్వే కదా ఆ బాధ్యత వాడికి ఇచ్చిందని శివ నారాయణ చెప్పడంతో జ్యో నోరు మూసుకుంటుంది. అబ్బాయి నచ్చాడా అని అడిగితే సుమిత్ర, దశరథ, శివ నారాయణ, పారు ఓకే అంటారు. కానీ జ్యో మాత్రం నచ్చలేదని అరుస్తుంది.
సంబంధాలు చూడొద్దని
నచ్చలేదంటే నచ్చలేదు, కారణాలు ఏముంటాయ్? అని జ్యో అంటుంది. పెళ్లి చూపులకు వచ్చిన వ్యక్తిని పేరు అడిగి మరీ నచ్చలేదు, వెళ్లిపోమ్మని జ్యో చిరాకుగా అంటుంది. మన దగ్గర ప్లాన్- బి ఉంది. మరో సంబంధం ఉందని కార్తీక్ అంటాడు. నువ్వు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా నాకు నచ్చవు బావ. నాకు సంబంధాలు చూడకు అని జ్యోత్స్న ఆవేశపడుతుంది. రేయ్ పోరా బయటకు అని జ్యో అంటుంది.
కార్తీక్ డ్రామా
ఈ అమ్మాయి తిడుతుందేంటీ? ఈ డైలాగ్ లు సీను పేపర్లో లేవు కదా అని వినోద్ చెప్పగానే కార్తీక్ తల పట్టుకుంటాడు. వాళ్ల డ్రామా బయటపడుతుంది. జ్యోత్స్న మనసులో ఏముందో మీకు తెలియాలి కదా, అందుకే పారుతో కలిసి ఈ పెళ్లి చూపులు నాటకం ఆడామని కార్తీక్ చెప్తాడు. పిఠాపురం నుంచి ఆర్టిస్ట్ ను రప్పించానని వినోద్ కు డబ్బులు ఇచ్చి పారు పంపించేస్తుంది.
జ్యోను ఇరికించేసి
బాల్ ఇప్పుడు నా కోర్టులో లేదు. నెల రోజుల్లో పెళ్లి జరగాలని, లేదంటే పెళ్లి యోగం లేదని పంతులు చెప్పాడు. అందుకే పెద్ద మేడానికి మంచి సంబంధం చూడాలనుకున్నా. కానీ అనుమానం వచ్చింది. అందుకే ఈ పెళ్లి డ్రామా. ఇదే నిజమైన సంబంధం అయి ఉంటే, జ్యోత్స్న మాటలకు అందరి పరువు పోయేదని అత్త సుమిత్రతో కార్తీక్ అంటాడు. ఇదే నీ అసలైన కూతురు, అసలైన స్వభావం. ఆమె మనసులో ఏముందో అడుగత్తా అని కార్తీక్ చెప్తాడు.
ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావ్ జ్యోత్స్న. నీ మనసేంటో నాకు ఈ రోజు తెలియాలి. నీ అంతట నువ్వే చెప్పాలి. నీ మనసులో ఏముందో చెప్పు జ్యోత్స్న అని సుమిత్ర అడుగుతుంది.
స్వప్నపై కోపం
సీన్ కావేరి ఇంటికి మారుతుంది. స్వప్నపై కావేరి కోపంతో ఉంటుంది. నిశ్చితార్థానికి రెడీ అన్నావు కదా, రెండు రోజుల్లో జరిపించేస్తాం. అప్పటివరకూ నాకు దూరంగా ఉండు. కాశీ కంటే మంచి భర్త దొరకడు అని కూతురితో కావేరి అంటుంది. నాన్న మంచోడే కదా, మరి ఇదే విషయం కాంచన పెద్దమ్మ ఎందుకు చెప్పట్లేదు. ఆమెను తప్పు పట్టడం కాదు. ఆవిడకు నచ్చినట్టుగానే ఉంది. నాకు నచ్చినట్లుగా నేను ఉండాలని అనుకుంటున్నానని స్వప్న చెప్తుంది.
కాశీకి అవకాశం
జీవితంలో ఎవరైనా తప్పులు చేస్తారు. కాశీకి అవకాశం ఇవ్వాలి కదా అని కావేరి అడుగుతుంది. నేను మళ్లీ భర్త పోస్టు ఇవ్వలేనని స్వప్న చెప్తుంది. అప్పుడే శ్రీధర్ వచ్చి.. కాశీ అందరి లాంటి మామూలు మనిషే. కానీ వాడు నాకంటే ఉత్తముడు. వద్దనుకున్న భార్య కళ్లముందే ఉన్నా మరో ఆడదాని వైపు కన్నెత్తి చూడటం లేదు. మగాడికి నిజమైన బలహీనత ఆడది. ఇంకా టైమ్ ఉంది కదా ఆలోచించుకో. నీ సంతోషం కోసం ఏమైనా చేస్తానని అంటాడు.
బావతోనే పెళ్లి
ఇటు శివ నారాయణ ఇంట్లో జ్యోత్స్న ఏం చెప్తుందోనని అందరూ చూస్తుంటారు. పంతులు చెప్పిన జాతకం నమ్మితే, నెల రోజుల్లో నా పెళ్లి జరుగుతుంది. నా మనసులో బావ ఉన్నాడు. నేను బావను తప్పా ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నేను బావతోనే బతుకుతా అని జ్యోత్స్న కుండబద్ధలు కొడుతుంది. జ్యో మాటలకు అందరూ షాక్ అవుతారు. దీంతో జ్యో నిజ స్వరూపం బయటపడుతుంది.
నేనే కార్తీక్ భార్యను
నాకు నచ్చినట్లు నేను బతుకుతా. బావనే పెళ్లి చేసుకుంటానని జ్యో మళ్లీ చెప్తుంది. నీ బావ నా భర్త అని దీప సీరియస్ గా అంటుంది. అంతకంటే ముందు బావే నా భర్త అని అందరూ నాతో చెప్పారు. నిన్ను బావకు భార్యగా నేను గుర్తించడం లేదు. బావ నా మెడలో కూడా తాళి కడతాడని జ్యో అంటుంది. నా మెడలో తాళి ఉన్నంతవరకు నేనే కార్తీక్ భార్యను అని దీప చెప్తుంది.
అయితే ఈ తాళిని తెంపి, నా మెడలో కట్టించుకుంటానని దీప మంగళసూత్రాన్ని జ్యోత్స్న పట్టుకుంటుంది. వెంటనే దీప లాగిపెట్టి కొడుతుంది. నా ముందే నా కూతురిని కొట్టడానికి ఎంత ధైర్యం? ఆ పని చేయాల్సింది నేను కదా అని జ్యోను సుమిత్ర కూడా కొడుతుంది.
దీప మెడలో కార్తీక్ తాళి కట్టకపోయి ఉంటే వాడిని నీ భర్తను చేసేదాన్ని. నా మెడలో తాళి తెంపి వేరొకరు కట్టుకుంటానంటే నేను ఊరుకుంటానా? దీప కూడా అంతే అని సుమిత్ర అంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


