Karthika Deepam 2 Today Episode: షాకిచ్చిన పంతులు-నెల రోజుల్లో జ్యో పెళ్లి జరగకపోతే అంతే సంగతి-సవతిని చేస్తావా-దీప ఫైర్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఏప్రిల్ 28 ఎపిసోడ్ లో జ్యోత్స్న జాతకం చూసిన పంతులు నెల రోజుల్లో పెళ్లి జరుగుతుందని చెప్తాడు. ఒకవేళ జరకపోతే మాత్రం కన్యగానే మిగిలిపోవాలని అంటాడు. మరోవైపు కాంచనకు అనుమానం వస్తుంది. జ్యోత్స్నను సవతిని చేస్తావా అని కార్తీక్ ను దీప అడుగుతుంది.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో దీప, పారిజాతంతో కలిసి ఆపరేషన్ జ్యోత్స్నను కార్తీక్ స్టార్ట్ చేస్తాడు. నెల రోజుల్లోపు జ్యోత్స్నకు పెళ్లి చేస్తానని డెడ్ లైన్ పెడతాడు. జాతకాలు చూపించేందుకు పంతులును పిలుస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 28 ఎపిసోడ్ లో చూసేయండి.

కాంచన డౌట్
కార్తీక్ ను డ్యూటీకి పంపించకుండా ఆపాల్సిందని కాంచనతో శ్రీధర్ అంటాడు. చెప్పలేని కారణాలు ఏవో ఉన్నాయని కాంచన డౌట్ పడుతుంది. కార్తీక్ తో జ్యోత్స్న అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకుంది కదా, దానితో దీపకు ఏదో సంబంధం ఉందని కాంచన అంటుంది. అవును, దీపకు హెల్త్ బాలేనప్పుడే కదా జ్యోత్స్న సంతకం పెట్టించుకుందని శ్రీధర్ చెప్తాడు.
అగ్రిమెంట్ వెనుక
కార్తీక్ డ్రైవర్ గా చేస్తుంటే దీప అడ్డుకోవం లేదు. ఆ ఇల్లును పుట్టినిళ్లుగా ఫీల్ అవుతుంది. నా అంచనా ప్రకారం కార్తీక్ ను దీప ఆ ఇంటికి వెళ్లకుండా ఆపాలి. కానీ అలా చేయలేదు. అందుకే దీప మీద నాకు అనుమానం ఉంది. అగ్రిమెంట్ వెనుక ఏదో ఉందని కాంచన అనుమానం వ్యక్తం చేస్తుంది. నీరసంగా కనిపిస్తున్నారు, డాక్టర్ దగ్గరకు వెళ్లమని శ్రీధర్ కు కాంచన గట్టిగానే చెప్తుంది.
పెళ్లి అయిపోవాలే
సీన్ శివ నారాయణ ఇంటికి మారుతుంది. జాతకాన్ని పంతులు చూస్తాడు. ఈ జాతకం ప్రకారం అమ్మాయికి ఈ పాటికే పెళ్లి అయిపోయి ఉండాలని పంతులు బాంబ్ పేలుస్తాడు. మా పెద్ద మేడం కుమారి అండి, శ్రీమతి కాదని కార్తీక్ అంటాడు. అయ్యో.. ఇది నా మనవరాలి జాతకం కాదు, నాది. పంతులు సరిగ్గా చెప్తాడో లేదోనని టెస్ట్ చేశానని పారు చెప్తుంది.
నెల రోజుల్లోపు
ఈ అమ్మాయి జాతకం ప్రకారం సరిగ్గా ఒక నెల రోజుల లోపు పెళ్లి జరుగుతుంది. మీరు అనుకోకపోయినా ఆగదు. ఉన్నది ఉన్నట్లుగా జరగాల్సిందే. ఒకవేళ నెల రోజుల్లో పెళ్లి జరగకపోతే జీవితాంతం కుమారిగానే మిగిలిపోతుందని పంతులు చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. బావకు పెళ్లాన్ని అవుతానని జ్యోత్స్న అనుకుంటుంది.
కార్తీక్ జాతకం
కార్తీక్ జాతకాన్ని కూడా పంతులుకు పారు చూపిస్తుంది. చాలా మంచి జాతకం. పది మందికి సాయం చేసే గుణం. కానీ అన్నీ కష్టాలే. అతని జీవితంలోకి వచ్చిన అమ్మాయిది కచ్చితంగా రాణి జాతకమే అని పంతులు చెప్తాడు. బావ జాతకంలో పెళ్లి రాత ఎలా ఉంటుంది? ఒక పెళ్లా, రెండు పెళ్లిళ్లా? అని జ్యోత్స్న అడుగుతుంది. పారు కోప్పడటంతో జ్యో నోరు మూసుకుంటుంది. జ్యోత్స్నకు అర్జెంటుగా సంబంధం చూడాలని శివ నారాయణ చెప్తే. సంబంధం వెతుక్కుంటూ వస్తుందని కార్తీక్ ఆన్సర్ ఇస్తాడు.
కాంచన ప్రశ్నలు
మరోవైపు శౌర్య, అనసూయ మధ్య సరదా గొడవ జరుగుతుంది. ఫుడ్ బాలేదని శౌర్య కంప్లైంట్ చేస్తుంది. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. నాన్న అని బుల్లెట్ తగిలిన చేతిని శౌర్య పట్టుకోవడంతో కార్తీక్ అబ్బా అని అరుస్తాడు. మొండివాళ్లతోనే అసలు సమస్యంతా అంటూ కాంచన మళ్లీ స్టార్ట్ చేస్తుంది. కార్తీక్, దీపను నానా మాటలు అంటుంది.
భగవంతుడు కొన్ని బంధాలనే మిగిల్చాడు. ఉన్నన్నాళ్లు అవి మనతోనే ఉండాలని కోరుకుంటామని కాంచన ఫీల్ అవుతుంది. నా కన్నతల్లిగా నాకు నీ మీద అన్ని హక్కులు ఉన్నాయని కార్తీక్ అంటాడు. ఆ హక్కుతోనే అడుగుతున్నా నిజం చెప్పు. జ్యోత్స్న ఇంతలా ఎందుకు నీ వెంట పడుతుంది? జ్యోత్స్న, దీప, నీకు మధ్య మాకు తెలియని కథ ఏదో జరుగుతుంది. దీప మీద ఎందుకు పగ సాధించాలి? పెళ్లయిన మగాడి వెంట జ్యోత్స్న ఎందుకు పడాలి? అని కాంచన వరుసగా ప్రశ్నలు వేస్తుంది.
పుట్టినిల్లు కోసం
పుట్టింటి కోసమే నీ కోడలు కష్టపడుతుంది. అదే, నీ పుట్టిల్లు కోసం అని కార్తీక్ కవర్ చేస్తాడు. తన కారణంగా విడిపోయిన ఈ రెండు కుటుంబాలను కలపాలని దీప ప్రయత్నిస్తోందని చెప్పి కార్తీక్ లోపలికి వెళ్లిపోతాడు.
కార్తీక్ మాటలు, పంతులు చెప్పిన దాన్ని తలుచుకుంటూ జ్యోత్స్న తెగ ఆలోచిస్తుంది. అప్పుడే ఓ ఫ్రెండ్ నుంచి జ్యోకు కాల్ వస్తుంది. మా డాటర్ నాలుగో బర్త్ డే, నువ్వు రావాలని ఆ ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తుంది. నేను చేసుకున్నప్పుడే నువ్వు పెళ్లి చేసుకుని ఉంటే, నీక్కూడా నాలుగేళ్ల పాపో బాబో ఉండేవాళ్లని ఫ్రెండ్ అంటుంది. మీ కోరిక నెల రోజుల్లోనే తీరుస్తానని జ్యోత్స్న చెప్తుంది. అప్పుడే పారు వస్తుంది. ఎందుకు టార్చర్ చేస్తున్నారని జ్యో లోపలికి వెళ్లిపోతుంది.
సవతిని చేస్తావా?
మరోవైపు కార్తీక్ గాయం పూర్తిగా మానిందని దీప చెప్తుంది. నీ చెల్లి ఉంది కదా, అదే జ్యోత్స్న. నువ్వే కదా ఓ సారి నా చెల్లెలాంటిది అన్నావ్ అని కార్తీక్ అంటాడు. అది నాకు చెల్లి కాదు అని దీప కోప్పడుతుంది. నా బావతో తాళి కట్టించుకుంటానని ఛాలెంజ్ చేసినప్పుడే నాకు శత్రువు అయింది. నాకు సవతిని చేస్తావా ఏంటా? అని దీప అడుగుతుంది.
పారిజాతం కాల్ చేసి నీ సవతి గురించి ఏం ఆలోచించావని దీపతో మాట్లాడుతుంది. జ్యోత్స్న పెళ్లి గోల సెటిల్ చేయాలని చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


