కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న ట్రాప్‌లో ఫ్యామిలీ- మ‌రో హాస్పిట‌ల్లో దీప‌కు టెస్టులు-కార్తీక్ టెన్ష‌న్‌-ట్విస్ట్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 11 ఎపిసోడ్ లో కీలక మలుపు చోటు చేసుకుంటుంది. అదిరే ట్విస్ట్ నెలకొంటుంది. జ్యోత్స్న మాటలను నమ్మి ఫ్యామిలీ అంతా ట్రాప్ లో పడుతుంది. దీపకు వేరే హాస్పిటల్లో టెస్టులు చేయించేందుకు ప్లాన్ వేసి తీసుకెళ్తారు.

Published on: Mar 11, 2026, 07:06:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 11 ఎపిసోడ్ లో.. హాస్పిటల్లో దీపను నవ్వించేందుకు కార్తీక్ ప్రయత్నిస్తాడు. అప్పుడే కార్తీక్ కు శివ నారాయణ కాల్ చేసి ఒకసారి కలవాలని అంటాడు. మార్నింగ్ కలుస్తానని చెప్తాడు. అయితే జ్యోత్స్న చెప్పడంతోనే శివ నారాయణ కాల్ చేస్తాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

మోసం చేస్తున్నారని

కడుపులో బిడ్డ గురించి కార్తీక్, దీప అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? అని జ్యోత్స్నను శివ నారాయణ అడుగుతాడు. అది నిరూపించేందుకు నాకో అవకాశం ఇవ్వమని అడుగుతున్నా. దీప, కార్తీక్ కలిసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ముఖ్యంగా కాంచన అత్త ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు. ఆవిడకు అన్యాయం జరిగితే పట్టించుకోవా తాత అని జ్యోత్స్న అడుగుతుంది.

శివనారాయణ ప్లాన్

ఈ ఇంటి గురించి ఆలోచించే మనుషుల్లో దీప, కార్తీక్ ముందుంటారు. అలాంటి వాళ్లపై జ్యోత్స్న నింద వేసింది. ఇది అబద్ధమైతే పనిష్మెంట్ మీకు అని పారిజాతాన్ని కూడా కలిపి శివ నారాయణ అంటాడు. నువ్వు చెప్పింది తప్పని తేలితే భయపడేలా పనిష్మెంట్ ఇస్తానని జ్యోత్స్నకు శివ నారాయణ వార్నింగ్ ఇస్తాడు.

దీప ఉమ్మడి శత్రువు కదా. అందుకే పగ తీర్చుకోవడం కోసం నీకు సపోర్ట్ చేస్తున్నానని జ్యోతో పారిజాతం అంటుంది. అందరికీ ఎండింగ్ కార్డు వేసే గేమ్ నేను మొదలెడతా. బోనులో దీప, బావను నిలబెడతానని జ్యోత్స్న అంటుంది.

పనిమనిషిగా పుట్టి

కాంచన ఇంటికి జ్యోత్స్న వెళ్తుంది. నువ్వెందుకు వచ్చావ్? ఉద్దేశం మంచిదైతే ఎప్పుడైనా రావొచ్చు. మనసు నిండా విషం పెట్టుకుని మాటల్లో అమృతం నింపుకొనే వాళ్లను దూరం పెడతానని కాంచన అంటుంది. అదే నేను పని మనిషి అయి ఉంటే నీ కొడుకు తాళి కట్టేవాడు. నువ్వు గుడి కట్టేదానివి. వచ్చే జన్మలో కచ్చితంగా పనిమనిషిగా పుట్టి నీ కొడుకుతో తాళి కట్టించుకుంటానని జ్యోత్స్న అంటుంది.

దీపను అవమానించేలా

నీ కోడలు కావాలంటే కొన్ని అర్హతలు ఉంటాయని దీపను అవమానించేలా జ్యోత్స్న మాట్లాడుతుంది. కాంచనకు కోపం వచ్చి జ్యోత్స్నను బయటకు వెళ్లమంటుంది. నీ కోడలు, కొడుకు ఆడుతున్న నాటకం గురించి చెప్పాలనే వచ్చా అత్తా. నాకు అనుమానం ఉంది. మా తాతకు అనుమానం ఉంది. మీరు సరే అంటే నిజం నీకు తెలిసేలా చేస్తానని జ్యోత్స్న అంటుంది.

మీకు నిజం తెలియాలంటే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. దీప కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ గురించి ఆలోచించండి. ఒకవేళ నాదే తప్పు అయితే మీరు ఏమన్నా పడేందుకు నేను రెడీ. దీప కడుపులో బిడ్డ మీద మా డాడీ కూడా ఆశలు పెట్టుకున్నాడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఏది నిజమో, ఏది అబద్ధమో నిరూపిస్తానని జ్యోత్స్న అడుగుతుంది. ఏం చేస్తావో చేయ్. కానీ నా కొడుకు, కోడలు బాధపడితే అసలు ఊరుకోనని కాంచన అంటుంది.

ఫ్యామిలీ ప్లాన్

శౌర్య మెట్లపై నుంచి పడిపోయిందని దీపకు ఎవరో కాల్ చేసి చెప్తారు. మరోవైపు కార్తీక్, శివ నారాయణ కార్లో వెళ్తుంటారు. కార్తీక్ ఫోన్ శివ నారాయణ చేతిలో ఉంటుంది. దీప కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. శౌర్య కింద పడ్డ విషయాన్ని శ్రీధర్ కు దీప చెప్తుంది. దీపను స్కూల్ కు తీసుకెళ్తానని మరో హాస్పిటల్ కు శ్రీధర్ తీసుకొస్తాడు. అక్కడే కార్తీక్, శివ నారాయణ, జ్యోత్స్న, కాంచన, పారిజాతం ఉంటారు.

కార్తీక్ సీరియస్

శౌర్యకు ఏం కాలేదు. ముందు వచ్చిన పని చూడండని పారిజాతం అంటుంది. ఓ డాక్టర్ ను పిలిచి దీపను టెస్ట్ చేయమని జ్యోత్స్న అడుగుతుంది. కాంచన కూడా అదే మాట చెప్తుంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న మనిషిని తీసుకొచ్చి టెస్ట్ లు అంటారేంటీ అని కార్తీక్ సీరియస్ అవుతాడు.

దీపకు టెస్టులు

నా కోడలు కడుపులో పెరుగుతున్న బిడ్డకు ప్రాబ్లెం ఉందంటా. తల్లికి కూడా ప్రాబ్లెం ఉందని చెప్తున్నారు. తల్లి, బిడ్డలో ఒకరే బతుకుతారని చెప్పారు. కానీ ఇద్దరూ బతకాలి. డాక్టర్ మీరు టెస్ట్ చేసి చెప్పండని డాక్టర్ ను కాంచన అడుగుతుంది. దీపకు టెస్టులు చేయండని శివ నారాయణ కూడా చెప్తాడు. నా భార్యకు ఇక్కడ టెస్టులు చేయాల్సిన అవసరం లేదని కార్తీక్ అంటాడు.

అంటే కడుపులో బిడ్డ కారణంగా తల్లి ప్రాణాలకు ప్రమాదం లేదా అని పారిజాతం అంటుంది. బావ కంగారు చూస్తే దాచిన నిజం ఏదో బయటపడుతున్నట్లే ఉందని కార్తీక్ ను ఇరికించాలని జ్యోత్స్న చూస్తుంది. నా కోడలిని టెస్ట్ చేసి ప్రమాదం ఏ స్థాయిలో ఉందో చెప్పండని డాక్టర్ ను కాంచన అడుగుతుంది.

కార్తీక్ ఆవేశం

కార్తీక్ ఒప్పుకోడు. అయితే నువ్వు చెప్పింది అబద్ధం అని ఒప్పుకుంటావా? లేదా టెస్టులకు ఒప్పుకుంటావా? అని కార్తీక్ ను కాంచన అడుగుతుంది. నేను టెస్టులు చేయిస్తే కూడా సేమ్ రిపోర్ట్స్ రావాలి కదా అని కాంచన అంటుంది. ఎన్నిసార్లు టెస్టులు చేయించిన సేమ్ రిపోర్ట్స్ రావాలి కదా అని జ్యోత్స్న అంటే, కార్తీక్ ఆవేశంతో పిడికిలి బిగిస్తాడు.

శౌర్య కిందపడిందని అబద్ధం చెప్పి రప్పించడానికి బుద్ధి లేదా? ఏం జరిగినా మా జీవితాలకే నష్టమని కార్తీక్ అందరి మీద అరుస్తాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More