Karthika Deepam 2 Today Episode: ఆస్పత్రిలో శౌర్య- దీపను ఎప్పుడు ఎక్కడ చంపుతారో ఊహించలేవన్న జ్యోత్స్న- మాటలు విన్న దశరథ్

Karthika Deepam 2 Serial March 10th Episode: కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 10వ ఎపిసోడ్‌లో దీప ఉన్న ఆస్పత్రికి శౌర్యతో వస్తాడు శ్రీధర్. నిజం తెలిస్తే తాను చనిపోయి దీపను చంపేస్తానని దాసుతో జ్యోత్స్న అంటుంది. దీపను ఎప్పుడు ఎవరు చంపుతారో ఊహించలేవని వార్నింగ్ ఇస్తుంది జ్యో. ఆ మాటలు దశరథ్ వింటాడు.

Published on: Mar 10, 2026, 07:22:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో హాస్పిటల్‌కు వెళ్లిన కార్తీక్‌తో గైనకాలజిస్ట్ వచ్చారు, దీపకు టెస్ట్‌లు చేయాలట, మీ నాన్న, పాప వచ్చారు అని నర్స్ చెబుతుంది. శౌర్యను నాన్న ఎందుకు తీసుకొచ్చాడు అని లోపలికి వెళ్తాడు కార్తీక్.

కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 7వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 7వ తేది ఎపిసోడ్

అబద్ధం ఎందుకు చెప్పావ్

అమ్మ కావాలని శౌర్య ఏడుస్తుంటే నీకు కాల్ చేశాను. నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి తీసుకొచ్చానని శ్రీధర్ అంటాడు. నాన్నా అబద్ధం ఎందుకు చెప్పావ్ అని శౌర్య అడుగుతుంది. నిజమే చెప్పాను, అమ్మను చూసుకునేందుకే ఇక్కడ ఉంచారని కార్తీక్ అంటాడు. అమ్మా నీకు జ్వరం వచ్చిందా. లోపల ఉన్న బేబీకి కూడా జ్వరం వస్తుందా, తను ఏం వేసుకుంటుంది అని మాట్లాడిన శౌర్య బేబీ బొమ్మ ఇస్తుంది.

ఇంతలో గైనకాలజిస్ట్‌తో డాక్టర్ హారిక వస్తుంది. టెస్టులు చేయాలని హారిక అంటే.. మీరు ఎన్ని టెస్టులైన చేయండి. కానీ, తల్లి బిడ్డను కాపాడండి అని శ్రీధర్ అంటాడు. తల్లి బిడ్డను కాపాడటం ఏంటీ, వద్దనుకున్నారుగా. వద్దనుకున్నాకా కాపాడటానికి ఏముంటుంది అని గైనకాలజిస్ట్ అంటుంది. వద్దనుకోవడం ఏంటని శ్రీధర్ అంటాడు.

అదే టెస్టుల వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయన్నారు, అందుకే వద్దన్నాను అని కార్తీక్ అంటాడు. దాంతో ఏం చెప్పొద్దని గైనకాలజిస్ట్‌కు హారిక సైగ చేస్తుంది. అది శ్రీధర్ చూస్తాడు. డాక్టర్ గారు ఏదో చెబుతున్నారుగా, వద్దనుకున్నారు అనే మాట నాకు వేరేలా అర్థం అవుతుందని శ్రీధర్ అంటాడు. డాక్టర్ గారు మీరైనా చెప్పండి అని కార్తీక్ అంటే.. డాక్టర్ హారిక కవర్ చేస్తుంది.

డాక్టర్ హారికను మాటివ్వమన్న శౌర్య

శౌర్యను తీసుకెళ్లమని శ్రీధర్‌కు చెబుతాడు కార్తీక్. లోపల ఉన్న బేబీకి జ్వరం వస్తే మీరే చూసుకుంటారటగా. బేబీకి ఏం కానివ్వనని మాట ఇవ్వండని హారికను శౌర్య అడుగుతుంది. అలా అడగొద్దని శ్రీధర్‌తో శౌర్యను పంపిస్తాడు కార్తీక్. తర్వాత దీపకు టెస్టులు చేయాలని కార్తీక్‌ను పంపిస్తారు డాక్టర్స్.

మరోవైపు తనను ఎందుకు పిలిచావ్ అని, సాయం చేయాలనుకుంటున్నావా, నిజం చెప్పాలనుకుంటున్నావా అంటూ దాసుతో అరుస్తుంది జ్యోత్స్న. లేని భయాలు మోసుకుంటూ తిరుగుతున్నావ్. అలాంటివి పెట్టుకోకు అని దాసు అంటాడు. నేను నీ కూతురు కాదని చచ్చిపోయిన నీ భార్యపై ఒట్టు వేయు అని జ్యో అడిగితే.. దాసు షాక్ అవుతాడు.

నేను దశరథ్ కూతురు అని డాక్టర్ కన్ఫర్మ్ చేసింది. దాన్ని అంతా నమ్ముతున్నారు. నాకు కొద్దిగా డౌట్ ఉంది. ఇది అంతా అబద్ధం అని తెలిసి, నా వెనుక ఏదైనా చేస్తే మాత్రం అని జ్యో అంటే.. చంపేస్తావా, ఈ సారి బతకనివ్వను అంటావ్ అని దాసు అంటాడు. నేను ఎవరిని ఏం చేయను, కానీ, ఒకటి మాత్రం జరుగుతుంది. ఇప్పుడు మీరంతా కలిసి దీప స్థానం నాదని ప్రూవ్ చేస్తే నేను బతకను నాన్న చచ్చిపోతాను అని జ్యోత్స్న అంటుంది.

దీపను చంపేస్తాను

దానికి దాసు షాక్ అవుతాడు. ఆ మాటలు దశరథ్ వెంటాడు. కానీ, నేను చచ్చే ఒక్క నిమిషం ముందు అయినా దీపను చంపేస్తాను అని జ్యోత్స్న అంటుంది. దానికి దాసు, దశరథ్ ఇద్దరు షాక్ అవుతారు. మీరు దీపను కాపాడాలనుకున్నా కూడా నేను చచ్చాక దీపను బతకనివ్వను. నేను చస్తాను, దీపను బతకనివ్వను. దీపను చంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశాను, ఎక్కడ ఎప్పుడు దీపను ఎవరు చంపుతారో ఊహించలేవు అని జ్యోత్స్న అంటుంది.

దీప బతకాలంటే నేను బతికి ఉండాలి. నాకు ఏదైనా ప్రమాదం జరిగినా, దీప అసలైన కూతురు అని చెప్పిన దీప చచ్చినట్లే, నాకు ఏదైనా అయితే దీపను కాపాడలేరు. శివ నారాయణ మనవరాలి స్థానంలో నేనే ఉండాలి. అర్థమైందా అని వెళ్లిపోతుంది జ్యోత్స్న. మరోవైపు డాక్టర్ అన్న మాటల గురించి కాంచనకు చెబుతాడు శ్రీధర్. కార్తీక్ మన దగ్గర ఏదో దాస్తున్నాడనిపిస్తుందని శ్రీధర్ డౌట్ పడతాడు.

ఏదైనా సరే నువ్వు తప్పు చేశావనిపిస్తుంది. కార్తీక్ ఏదైనా చెబితే వెంటనే నమ్మేస్తావ్. నిజాలు బయటపడ్డాకే తెలుస్తుంది చాలా నష్టం జరిగిందని, జ్యోత్స్న అగ్రిమెంట్ నుంచి బయటపడేందుకు ఎన్ని మార్గాలు వచ్చిన వదిలేశాడు. అక్కడ ఎందుకు ఉన్నాడో ఇప్పటికీ తెలియదు, ఇప్పుడు బిడ్డ విషయంలో కూడా మనకు ఏదో తెలియనిది ఉంది అని శ్రీధర్ అంటాడు.

నా కొడుకును కూడా క్షమించను

అప్పుడు నా కోడలినే కాదు నా కొడుకును కూడా క్షమించను అని కాంచన అంటుంది. కాంచన అన్నంతపని చేస్తుంది. నిజమేంటో నేనే తెలుసుకుంటాను అని శ్రీధర్ అనుకుంటాడు. మరోవైపు నువ్వు నిజం చెప్పకుండా మేము ఎందుకు ఆపుతున్నావో అర్థమైందా అన్నయ్య అని జ్యో గురించి దశరథ్‌కు చెబుతాడు దాసు. అలా అని జ్యోని వదిలేస్తామా అని దశరథ్ అంటాడు.

ఇద్దరు వాదించుకుంటారు. ఇప్పుడే నిజం చెబుతానని దశరథ అంటే.. నువ్వు చెప్పిన గంటలోపే దీపను చంపేస్తుంది. మూర్ఖులతో ధర్మంగా యుద్ధం చేయలేమని, జ్యోత్స్న చేష్టలు కూడా కిరాతకంగా ఉంటాయని, జ్యోత్స్నకు అన్ని మా అమ్మ బుద్ధులే వచ్చాయి. మనం ఏం చేసిన దీపను కోల్పోతామని దాసు అంటాడు.

నా వల్ల నా కూతురు పడిన కష్టాలు చాలు. మౌనంగా ఉన్నా కూడా ప్రమాదమే దాసు. జ్యోత్స్న ఏదో చేసేదాకా నేను ఆగలేను. నా కూతురును నేను కాపాడుకుంటాను అని దశరథ్ ఆగ్రహంగా, ఆవేశంగా వెళ్లిపోతాడు. జ్యోత్స్న మనం అనుకున్నదానికి కంటే పెద్దగా ప్లాన్ చేసినట్లుంది. నువ్వు ఏం చేస్తావో అని భయంగా ఉందని దాసు అరుస్తుంటాడు.

దీపను నవ్వించిన కార్తీక్

మరోవైపు శౌర్య ఇచ్చిన బొమ్మను పట్టుకుని శౌర్య మాటలు తలుచుకుంటుంది దీప. కార్తీక్ వచ్చి సముదాయిస్తాడు. పోని ఇంటికి వెళ్దామా అని కార్తీక్ అంటే.. నిర్ణయం కఠినంగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండాలని, శ్రీధర్ మామకు డౌట్ వచ్చింది, అత్తయ్యకు చెప్పే ఉంటారని దీప అంటుంది. ముందు నువ్వు టిఫిన్ తిను అని తినిపిస్తాడు కార్తీక్. అన్ని విషయాల గురించి నచ్చజెబుతాడు.

అత్తకు ఏం కాదు. అప్పుడు మనమంతా సంతోషంగా ఉంటాం. శౌర్యకు పెద్ద ఫ్యామిలీ దొరుకుతుంది. అప్పుడు మనం గ్రూప్ ఫొటో తీసుకుందాం. దానికోసం నవ్వు అని దీపకు గిలిగింతలు పెడతాడు కార్తీక్. దాంతో దీప నవ్వేస్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More