Karthika Deepam 2 Today Episode: జ్యోత్స్న ప్రశ్నలు, డాక్టర్ మైండ్ గేమ్-దీప ఉన్నా లేనట్టేనన్న కాంచన-గుండెను పిండేసే సీన్

Karthika Deepam 2 Serial March 6th Episode: కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 6వ ఎపిసోడ్‌లో డాక్టర్ హారికను కలిసిన జ్యోత్స్న బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ గురించి చాలా ప్రశ్నలు అడుగుతుంది. కానీ, హారిక రివర్స్‌లో మైండ్ గేమ్‌తో సమాధానాలు ఇస్తుంది. బిడ్డను ఎలాగైనా కాపాడమని దశరథ దగ్గర కాంచన మాట తీసుకుంటుంది.

Mar 6, 2026, 07:39:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో డాక్టర్ హరికను జ్యోత్స్న వెళ్లి కలుస్తుంది. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఇవ్వాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. మా అమ్మను నేనే కాపాడాలి అని జ్యోత్స్న అంటుంది. ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినలే, ఫేక్ ఎప్పుడు ఫేక్ అని హారిక అంటుంది.

కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 6వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 6వ తేది ఎపిసోడ్

ప్రెగ్నెన్సీ వాళ్లు ఇవ్వొచ్చా

ఫేక్‌ను ఒరిజినల్ ఎంత చెప్పిన నిజమని నమ్మరు. నమ్ముతున్నట్లు నటిస్తారు అని హారిక అంటుంది. నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందని అనుకుంటుంది జ్యోత్స్న. బోన్ మ్యారో ఎవరైనా ఇవ్వొచ్చా, ఏజ్ లిమిట్ ఉంటుందా అని వరుసగా ప్రశ్నలు అడిగిన జ్యోత్స్న ప్రెగ్నెన్సీ వుమెన్ ఇవ్వొచ్చా అని అంటుంది. దాంతో జ్యోత్స్నకు అంతా తెలిసిపోయినట్లుందని సైలెంట్‌గా లేచి వెళ్లిపోతుంది హారిక.

మరోవైపు బిడ్డ వల్ల తల్లికి ఓ సమస్య ఉంది. ఎవరో ఒకరినే కాపాడే పరిస్థితి. బిడ్డకు తల్లికి ఇద్దరికి సమస్య ఉంది. ఇద్దరిలో ఎవరో ఒకరే క్షేమంగా ఉండాలి అని కార్తీక్ అంటాడు. ఇది ఇప్పుడు చెబుతున్నావా. ఇదంతా నీ వల్లే. నేను చెప్పినప్పుడు అది మా అన్న ఇంటికి పనికి వెళ్లకుండా ఉంటే అయిపోయేదిగా, ఎంత తల పొగరుగా వెళ్లింది. దీప నాకు ఏ ఆనందాన్ని మిగల్చేదు అని తిడుతుంది కాంచన.

ఎంత డబ్బు ఖర్చు అయిన ఇద్దరి ప్రాణాలు కాపాడదామని శివ నారాయణ అంటాడు. ఏం చేయలేమని దశరథ్ అంటాడు. ఇంత తెలిసాకా నేను ఇక్కడ ఉండలేను. నేను కూడా హాస్పిటల్‌కు వస్తానని కాంచన అంటుంది. ఇన్నాళ్లు దీని తల్లిదండ్రులు దొరకాలని దేవుడుని కోరుకున్నాను. కానీ, ఇప్పుడు కోరుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు వాళ్ల దగ్గరికి వెళ్తే వాళ్లు ఉండరు. ఆ దేవుడు తీసుకెళ్లిపోతాడు. నీ జాతకమే అంతా నచ్చింది ఉండదు అని అనసూయ అంటుంది.

తల్లికి దూరం చేసుకోవాలని ఉంటుందా

దాంతో దీప మరింత కుమిలిపోతుంది. అదంతా చేతులార చేసుకుందే అని కాంచన అంటుంది. దీపను ఎవరు అర్థం చేసుకోరా. ఓ తల్లికి మాత్రం బిడ్డను దూరం చేసుకోవాలని ఉంటుందా. బిడ్డ పోతే పర్వాలేదని నువ్వు అనుకోగలవా అని కాంచనను అంటాడు దశరథ్. మరోవైపు డాక్టర్ వెంట పడి ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్లు బోన్ మ్యారో చేయొచ్చా అని జ్యోత్స్న అంటుంది.

మీరు ఇప్పుడు ప్రెగ్నెంటా అని డాక్టర్ హారిక అడుగుతుంది. నాకు ఇంకా పెళ్లి కాలేదు. కానీ, అడిగిన దానికి సమాధానం కావాలని జ్యోత్స్న అంటుంది. మీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే వ్యక్తికి కాల్ చేస్తాను. దశరథ్ గారు. మీరు ఎప్పుడు హాస్పిటల్‌కు వచ్చిన కాల్ చేయమని అడిగారు. ఆయన కన్సర్న్ ఒప్పుకోకపోతే ఎలా అని కాల్ చేయబోతుంది హారిక.

దాంతో అవసరం లేదని జ్యోత్స్న అంటుంది. మీరంతా మైండ్ గేమ్ ఆడుతున్నారని అర్థమైంది, కానీ, ఎవరు ఆడుతున్నారో తెలియట్లేదు అని జ్యోత్స్న వెళ్లిపోతుంది. మరోవైపు ఇద్దరిలో ఎవరో ఒకరినే కోరుకోవాలి అని కార్తీక్ అంటాడు. పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ బిడ్డ లేదంటే మరోసారి మా అమ్మ చనిపోయినట్లే అనుకుంటానురా. చిన్నప్పుడు బాధ ఎలాగో తట్టుకున్నా. ఇప్పుడు అదంతా తట్టుకోలేను అని కాంచన అంటుంది.

దీప ఉన్న లేనట్లే

దీపను హాస్పిటల్‌లో జాయిన్ చేస్తానని కార్తీక్ అంటాడు. మీ ఇష్టంరా. ఏమైనా చేయండి. కానీ, బిడ్డకు ఇలా అవడానికి కారణం నేను చెప్పినట్లు దీప వినకపోవడమేరా. కాబట్టి బిడ్డకు ఏమైనా అయితే దీపను క్షమించను, దీప అనే మనిషి ఉన్నలేనట్లేరా అని కాంచన అంటుంది. కాంచన కాళ్ల ముందు మోకరిళ్లి కాళ్లు పట్టుకుని నేను అనుకుంది జరగాలని మీ ఆశీర్వాదం కావాలని దీప అంటుంది.

కాంచన చేయి తన తలపై చేయి వేసుకుని తానే ఆశీర్వదించుకుంటుంది. బిడ్డ జాగ్రత్తా.. నువ్వు కూడా అని కాంచన అంటుంది. తర్వాత దశరథ్ చేతిలో దీప చేయి పెట్టి దీపను నీ కూతురు అనుకో. బిడ్డ బాధ్యత నువ్వే తీసుకోవాలి. నా కొడుకు ఎలాగు నా మాట నిలబెడతాడు. ఆ మాటకు నువ్వే సాక్ష్యం. ఇప్పుడు నా కోడలిని నీ చేతిలో పెడుతున్నాను. డాక్టర్‌తో మాట్లాడి బిడ్డను కాపాడు అని కాంచన ఎమోషనల్‌గా మాట తీసుకుంటుంది.

నువ్వు మాట్లాడే ప్రతి మాట చాలా బరువుగా ఉందని దశరథ్ అంటాడు. ఇదంతా గుండెను పిండేసేలా చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. హాస్పిటల్‌కు దీపను కార్తీక్, దశరథ తీసుకెళ్తారు. అంతా ఏడుస్తుంటారు. నలుగురు వెళ్తున్నారు, ఎంతమంది తిరిగి వస్తారో తెలియదని కాంచన ఏడుస్తుంది. కాంచన మాటలు తలుచుకుంటూ దశరథ్ అలాగే కుమిలిపోతుంటాడు.

తలరాత అని సరిపెట్టుకుంటారు

కార్తీక్ వచ్చి హాస్పిటల్‌కు వెళ్దామంటాడు. అంతా బిడ్డ గురించే మాట్లాడుతున్నారు అని దశరథ్ అంటాడు. కార్తీక్ నచ్చ జెప్పుతాడు. అంతా విషయం తెలియక బాధపడుతున్నారు. తర్వాత నువ్వే సుమిత్ర కూతురు అని తెలిసి ఇదంతా రాత అని సరిపెట్టుకుంటారు. రేపు జనాభా లెక్కల వాడు వస్తే నాకు ఒక్కతే కూతురు శౌర్య అని చెబుతాను అని కార్తీక్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More