Karthika Deepam 2 Today Episode:వాట్ ఏ ట్విస్ట్-బ్యాగ్‌లో ఇటుకలు-కార్తీక్ దెబ్బకు వైరా షాక్-దీప ముందే బావకు జ్యో హగ్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 24 ఎపిసోడ్ లో వైరాను చంపేస్తానని గన్ పట్టుకుని ఆవేశంతో వెళ్తున్న తాతను కార్తీక్ ఆపుతాడు. బ్యాగ్ లో ఇటుకలు ఉండటం చూసి వైరా షాక్ అవుతాడు. కార్తీక్ డబ్బు మార్చిన విషయాన్ని పారు చెప్తుంది. కొడుక్కి బుల్లెట్ తగలడంతో శ్రీధర్ బాధపడతాడు.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో తన ప్రాణాలకు తెగించి మరీ జ్యోత్స్నను కార్తీక్ కాపాడతాడు. కానీ అలా చేసినందుకు కార్తీక్ మాటలు పడాల్సి వస్తుంది. జ్యోత్స్నపై సుమిత్ర అమితమైన ప్రేమ కురిపిస్తోంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 24 ఎపిసోడ్ లో చూసేయండి.

శివ నారాయణ ఆవేశం
ఆ వైరాకు శివ నారాయణ అంటే ఏంటో చూపిస్తా. దశరథ కారు తీయ్. శివ నారాయణ ఆత్మ గౌవరం ఏంటో చూపిస్తా. నువ్వు నా మనవడివి కదా. నీకు బుల్లెట్ తగిలితే నాకు బాధ ఉండదా? గాయానికి గాయమే సమాధానం అని చేతిలో గన్ తో వైరా దగ్గరకు వెళ్లేందుకు శివ నారాయణ ఆవేశపడతాడు.
తాతను ఆపిన కార్తీక్
తాతను అడ్డుకుని చేతిలో నుంచి గన్ ను కార్తీక్ తీసుకుంటాడు. ఆకలితో ఉన్న సింహం కంటే పగతో ఉన్న పాము ప్రమాదకరమైంది. వైరా కూడా అలాంటివాడే. తప్పించుకున్నాడంటే మళ్లీ దొరకడం కష్టం. చట్టప్రకారం శిక్షించాలని శివ నారాయణను కార్తీక్ కూల్ చేస్తాడు. పగతోనే వైరా నా కూతురిని కిడ్నాప్ చేశాడని, యాక్షన్ తీసుకోమ్మని పోలీసులకు దశరథ చెప్తాడు.
శ్రీధర్ ఫోన్
మరోవైపు నీ కొడుకు బుల్లెట్ కు ఎదురెళ్లి మరీ జ్యోత్స్నను కాపాడాడు. కార్తీక్ చేతికి బుల్లెట్ తగిలింది అల్లుడు అని పారిజాతం ఫోన్లో చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. వెంటనే శివ నారాయణ ఇంటికి శ్రీధర్ బయల్దేరతాడు. కార్తీక్ ను చూస్తూ ఇప్పుడు మీ అమ్మకు ఏం చెప్పాలిరా? నా కూతురు అయితే ఒకటి, నువ్వైతే ఒకటా అని సుమిత్ర అంటుంది.
రావొద్దని చెప్పినా
అప్పుడే శ్రీధర్ కంగారుగా వస్తాడు. దశరథ రావొద్దని చెప్పినా కార్తీక్ ను తీసుకుని పారు వెనకాలే వెళ్లింది. మీరు ఇన్వాల్వ్ అయ్యారు డబ్బు పోయింది. పోతే పోయిందిలే. కానీ జ్యోత్స్నను చంపాలనుకున్నాడు. ఆ బుల్లెట్ కార్తీక్ కు తగిలిందని శ్రీధర్ కు శివ నారాయణ జరిగింది చెప్తాడు. ఫ్యామిలీ కష్టపడి సంపాదించిన డబ్బును వదులుకోవద్దని ఫైట్ చేశానని జ్యోత్స్న అంటుంది.
వైరాకు షాక్
సీన్ వైరా దగ్గరకు మారుతుంది. బ్యాగ్ ను చూస్తూ వైరా తెగ బిల్డప్ ఇస్తాడు. జ్యోత్స్నకు వాటా ఇవ్వకుండా, కార్తీక్ కు, పోలీసులకు దొరక్కుండా రూ.30 కోట్లు కొట్టేశారా అని అసిస్టెంట్ కు వైరా గొప్పగా చెప్తాడు. అమ్మా ధనలక్ష్మి అంటూ బ్యాగ్ ఓపెన్ చేసిన వైరా షాక్ అవుతాడు. అందులో ఇటుకలు ఉంటాయి. నువ్వు దరిద్రుడివి అనేందుకు ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంటుంది బాస్ అని వైరా అసిస్టెంట్ నవ్వుతాడు.
జ్యోత్స్న మళ్లీ వెన్నుపోటు పొడిచింది. దాన్ని వదిలిపెట్టను. అసలు డబ్బు ఎలా మాయమైందిరా? అని వైరా కోపంతో ఊగిపోతాడు. కార్తీక్ మాయగాడు బాస్. రాళ్లు మన చేతిలో పెట్టి, డబ్బు కొట్టేశాడని అసిస్టెంట్ చెప్తాడు. మరోవైపు బ్యాగ్ లో రాళ్లు పెట్టిన విషయం పారు చెప్పడంలో ఇటు ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఫైట్ మధ్యలో కార్తీక్ డబ్బు మార్చేశాడని పారు చెప్తుంది.
కార్తీక్ కు జ్యో హగ్
గోనె సంచిలో ఉన్న డబ్బును పారు ఇంట్లోకి తీసుకొస్తుంది. అది చూసి జ్యోత్స్న నోరెళ్లబెడుతుంది. వైరాను నువ్వు గుర్తు పట్టాలి కదా జ్యోత్స్న అని కార్తీక్ అడుగుతాడు. చెప్తే చంపేస్తానన్నాడు, అందుకే తెలిసినా చెప్పలేదని జ్యోత్స్న కవర్ చేస్తుంది. వైరా నిన్ను ఎక్కడ కిడ్నాప్ చేశాడని కార్తీక్ అడుగుతాడు. జరిగింది ఒక పీడకల అని మర్చిపోదాం. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. థ్యాంక్స్ బావ అని కార్తీక్ ను జ్యో హగ్ చేసుకుంటుంది.
వెనకాలే ఉన్న దీపను చూసి జ్యో కన్ను కొడుతుంది. దీపకు మండిపోతుంది. నేను చచ్చిపోతానని నాకు ఏ బాధ లేదు. కానీ ఆ క్షణం కూడా మా మమ్మీయే గుర్తుకొచ్చింది అని జ్యోత్స్న ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది. రాతను ఎవరూ తప్పించలేరు, కొన్ని ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతాయని జ్యోకు దీప కౌంటర్ వేస్తుంది.
కాంచన కన్నీళ్లు
సీన్ కార్తీక్ ఇంటికి మారుతుంది. జ్యోత్స్న కోసం నువ్వు ప్రాణాలు పోగొట్టుకుంటావా? అని కార్తీక్ పై కాంచన అరుస్తుంది. నిన్ను ఎవడ్రా వెళ్లమని చెప్పిందని కాంచన బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇదంతా నేను అత్త కోసమే చేశానమ్మా. మన ఫ్యామిలీ కోసం మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు అని కార్తీక్ అంటాడు.
శ్రీధర్ బాధ
శ్రీధర్ కు చెమటలు పడతాయి. దెబ్బ నాకు తగిలితే నొప్పి నీకు వస్తుందేంటి మాస్టారూ అని కార్తీక్ అడుగుతాడు. పారిజాతం అత్తయ్య ఫోన్ చేసి నీకు బుల్లెట్ తగిలిందని చెప్పగానే, నిన్ను చూసేవరకు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు రా. పిల్లల ముఖాల మీద నవ్వులు చూడాలనుకుంటాం కానీ గాయాలు కాదు. మరోసారి తొందరపాటు పనులు చేయనని మాటివ్వమని శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు. కార్తీక్ ఒట్టు వేస్తాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


