Karthika Deepam 2 Today Episode: దశరథ కూతురు కాదా? వైరా ప్రశ్నతో జ్యో మైండ్ బ్లాక్..30 కోట్లు ఇచ్చేందుకు రెడీ.. ట్విస్ట్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 22 ఎపిసోడ్ లో జ్యోత్స్న కిడ్నాప్ డ్రామా సాగుతూనే ఉంటుంది. తన కూతురికి ఏమైనా అవుతుందేమోనని దాసు భయపడతాడు. జ్యోత్స్నను తీసుకురావడానికి రూ.30 కోట్లతో దశరథ బయల్దేరుతాడు.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న కిడ్నాప్ డ్రామాతో కథ మలుపు తిరిగింది. ఓ వైపు సుమిత్ర బాధపడుతుంది. దీపపై ఆమె సీరియస్ అవుతుంది. దీంతో జ్యోత్స్నను ఇంటికి తీసుకొచ్చే బాధ్యత తనదేనని కార్తీక్ చెప్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 22 ఎపిసోడ్ లో చూసేయండి.

దాసు భయం
జ్యోత్స్న డ్రామా ఆడుతుందని అనుకున్నా. కానీ కూతురి మీద ఆశలు వదిలేసుకోమని కిడ్నాపర్ చెప్పడంతో జ్యోత్స్న నిజంగానే చచ్చిపోతుందేమోనని భయంగా ఉందని దాసు బాధ పడతాడు. నీకేనా, నాకు ప్రేమ లేదు అనుకున్నావా? ఈ భుజాల మీద ఎత్తుకుని పెంచా. జ్యోత్స్న నీ కూతురు అని తెలిసినా తనపై నా ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు. రూ.30 కోట్లు ఏంటీ, నా యావదాస్తి అడిగినా రాసి ఇస్తానని దశరథ అంటాడు.
నీ కూతురా?
ఎలాగైనా నా కూతురిని కాపాడు అన్నయ్య అని దాసు అంటుండగా శివ నారాయణ వస్తాడు. నీ కూతురిని కాపాడాలా? అని శివ నారాయణ అడుగుతాడు. కానీ కార్తీక్ కవర్ చేస్తాడు. పోలీసులను తీసుకొచ్చి తప్పు చేశానని దాసు మామయ్య ఫీల్ అవుతున్నాడు. అందుకే బాధలో ఏదో మాట్లాడాడని కార్తీక్ చెప్తాడు. దాసును బాధ పడొద్దని చెప్పి శివ నారాయణ లోపలికి వెళ్లిపోతాడు.
పారుకు అనుమానం
దాసు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి పారిజాతానికి అనుమానం వస్తుంది. ఒరేయ్, నిజం చెప్పరా. అది నీ కూతురే కదా. నాతో అబద్ధం చెప్పావ్ కదా అని పారు అడుగుతుంది. అమ్మా, నీకు బాధ లేదా? నాకూ అలాంటి బాధే ఉంది. అన్నయ్య, వదిన ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోగలమా? జ్యోత్స్న అన్నయ్య కూతురే అమ్మ అని దాసు చెప్తాడు.
సుమిత్ర బాధ
పొద్దున శివ నారాయణ ఇంటికి పోలీసులు వస్తారు. కిడ్నాపర్ గురించి ఏం తెలియలేదని చెప్తారు. డబ్బులు తీసుకురండి, నేనే వెళ్లి నా కూతురిని తెచ్చుకుంటానని దశరథను సుమిత్ర అడుగుతుంది. అన్ని ఏర్పాట్లు చేశానని దశరథ అంటాడు. అప్పుడే డబ్బు తీసుకుని శ్రీధర్ వస్తాడు. కిడ్నాపర్ దగ్గరకు వేరే టీమ్ పంపిస్తామని పోలీసులు చెప్తే, సుమిత్ర బాధతో కోప్పడుతుంది.
పోలీసులకు రిక్వెస్ట్
జ్యోత్స్నను తీసుకొచ్చే బాధ్యత నాది అన్నావ్? ఎక్కడ్రా నా కూతురు? అని కార్తీక్ పై సుమిత్ర మండిపడుతుంది. దయచేసి నా కూతురిని చంపకండని పోలీసులను సుమిత్ర రిక్వెస్ట్ చేస్తుంది. నా కూతురిని కళ్ల ముందుకు తీసుకు వచ్చాక మీరు ఏమైనా చేసుకోండని అంటుంది. ప్లీజ్ మీరు దీంట్లో జోక్యం చేసుకోకండని సుమిత్ర చెప్తుంది.
సొంత కూతురివేనా?
సీన్ కట్ చేస్తే జ్యోత్స్న టిఫిన్ తింటుంది. టిఫిన్ బాలేదని జ్యో అంటుంది. ఫోన్ చేసి డబ్బులు అడగమని వైరాకు జ్యో చెప్తుంది. ఇప్పుడు రాహు కాలమని అసిస్టెంట్ చెప్పడంతో వైరాపై జ్యోత్స్న సీరియస్ అవుతుంది. కాల్ చేసి క్యాష్ రెడీగా ఉందేమో అడగమని చెప్తుంది. నువ్వు అసలు దశరథ సొంత కూతురివేనా? అని వైరా అడుగుతాడు. అవన్నీ ఎందుకు అని జ్యో అంటుంది.
డబ్బుతో దశరథ
దశరథకు వైరా కాల్ చేస్తాడు. పక్కన పోలీసులను పెట్టుకుని డ్రామాలు ఆడింది చాలు. నాకు ఎవరి గొంతు వినపడినా నీ కూతురి గొంతు కోస్తానని వైరా అంటాడు. నువ్వు అడిగిన డబ్బు రెడీ చేశానని దశరథ చెప్తాడు. ముందు డబ్బు తీసుకుని బయల్దేరు, ఎక్కడికి రావాలో చెప్తానని వైరా కాల్ కట్ చేస్తాడు. దశరథ ఒక్కడే డబ్బు తీసుకుని వెళ్తాడు.
పోలీసులతో కలిసి దశరథ కారును దాసు ఫాలో అవుతాడు. స్కూటీపై కార్తీక్, పారు కూడా స్టార్ట్ అవుతారు. మరోవైపు నేను డాడీతో వెళ్లిపోతే నా వాటా ఎలా తీసుకోవాలని వైరాను జ్యో అడుగుతుంది. ఇంకా ఆలోచించలేదని వైరా చెప్తాడు. ఆడదాని నోరు ఆటం బాంబ్ లాంటిది. నన్ను మళ్లీ బకరా చేయవ్ కదా అని వైరా అడుగుతాడు.
కారు తీసుకొని
స్కూటీపై కార్తీక్ తో పారు కామెడీ చేస్తుంది. జ్యోత్స్న గురించి మనకెందుకు? నువ్వు దీప మొగుడివి. నిన్ను కాపాడుకుంటారా అని పారు అంటుంది. అత్త కోసమైనా జ్యోత్స్నను సేఫ్ గా ఇంటికి తీసుకెళ్లాలని కార్తీక్ చెప్తాడు. వైరా కాల్ చేసి చెప్పడంతో దశరథ కారు పక్కకు ఆపుతాడు. కారుకు దూరంగా వెళ్లమని దశరథకు వైరా చెప్తాడు. వేరేవాళ్లు కారును తీసుకొని వెళ్లిపోతారు.
ఆ వెంటనే పోలీసులు దశరథను కార్లో ఎక్కించుకుని, ఆ కారును ఫాలో అవుతారు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


