Karthika Deepam 2 Today Episode: జ్యోత్స్నకు దీప అదిరిపోయే కౌంటర్-ఆస్తి కోసం దశరథ మాస్టర్ ప్లాన్-పారిజాతం ఆట కట్టించేలా!
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 28 ఎపిసోడ్ లో జ్యోత్స్నకు దీప అదిరిపోయే కౌంటర్ వేస్తుంది. ఆస్తి కోసం దశరథ వేసిన ప్లాన్ ను దీప, కార్తీక్ కు చెప్తాడు. పారిజాతానికి చెక్ పెట్టేందుకు దాసుతో కలిసి కార్తీక్ ప్లాన్ వేస్తాడు.
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో.. నాకు సొంతమయ్యేలోపు నువ్వు గెలుచుకుపోతావు దీప. నేను ఎంత గొప్పగా ఆడినా నీ ముందు ఓడిపోతూనే ఉన్నానని జ్యోత్స్న కోపంగా చెప్తుంది. నేను కుటుంబాన్ని గెలిపించాలని అనుకుంటున్నా కాబట్టి గెలుస్తున్నానని దీప సమాధానం చెప్తుంది. నీకు భయం లేదని తెలుసు దీప కానీ, భయం రప్పిస్తానని జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది.

దీప కౌంటర్
అమ్మానాన్న నీ పెళ్లి చూడాలని కలలు కంటున్నారు. నువ్వు ఈ చిన్నపిల్లల ఆట ఆపేసి పెళ్లి చేసుకుంటే నువ్వు ఏది కోరుకుంటున్నావో అది దొరుకుతుంది. అదే మనశ్శాంతి. అది నీకు చాలా అవసరం. ఒకసారి పెళ్లి గురించి ఆలోచించమని జ్యోత్స్నకు దీప కౌంటర్ వేస్తుంది.
కాశీ కోపం
మరోవైపు దాసుపై కాశీ ఫైర్ అయ్యాడు. సర్వనాశనం చేశావు. స్వప్న కోసం కాకపోతే నేను ఇక్కడ డ్రైవర్ గా ఎందుకు చేస్తా? నువ్వు పెళ్లి కొడుకును తీసుకొస్తే స్వప్న ఓకే అనకుండా ఏం అంటుంది? అని కాశీ కోప్పడతాడు. స్వప్న పెళ్లి తర్వాత నీ పెళ్లేరా అని దాసు అంటాడు. నేను స్వప్నను ఎప్పుడూ వదులుకోవాలని అనుకోలేదు. మీరంతా కలిసి నా బతుక్కి అర్థం లేకుండా చేశారని కాశీ ఫీల్ అవుతాడు.
దాసు సలహా
ఇదంతా నీ మంచి కోసమేరా. మేం ఏదో ఒకటి చేయకపోతే మీరు ఇలాగే ఉంటారు. నీ మీద కోపంతో పెళ్లికి స్వప్న సరే అంది కానీ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదురా. విడాకుల కాగితాలపై సంతకం చేసిన తర్వాత నువ్వు కనిపించకుండా పోతే తన భర్త తనతో లేడనే బాధ ఉండేది. కానీ నువ్వు కళ్ల ముందే ఉన్నావు. ఇక బాధ ఎందుకు ఉంటుంది? స్వప్నకు తనలో ఉన్న ప్రేమను గుర్తు చేయమని కొడుక్కి దాసు సలహానిస్తాడు.
కార్తీక్ ప్లాన్
అప్పుడే దాసుకు కార్తీక్ కాల్ చేస్తాడు. ఓ మంచి పని చేయాలి మామయ్య. ఈ సారి ఓ అబద్ధాన్ని నిజమని చెప్పు అని దాసుకు కార్తీక్ ఓ ప్లాన్ చెప్తాడు. చెప్పాను కదా మామయ్య షాక్ అవుతావని, ఇక శంఖం పూరించు మామయ్య అని కార్తీక్ చెప్తాడు. పారిజాతాన్ని ఆడుకోవడం కోసం కార్తీక్ ఈ ప్లాన్ వేస్తాడు.
15 నెలల్లో పిల్లలా?
ఇక సీరియస్ గా ఉన్న జ్యోత్స్నకు జ్యూస్ ఇస్తూ పారిజాతం వెటకారంగా మాట్లాడుతుంది. ఇదంతా మీ అమ్మానాన్న వేసిన స్కెచ్ లా ఉందని పారు అంటుంది. బావనే రెచ్చగొట్టి వీలునామా మార్పించి ఉండొచ్చు కదా అని జ్యో అంటుంది. నువ్వు పెళ్లి చేసుకుని, పిల్లలను కంటే ఆస్తి మొత్తం నీకే కదా అని పారు చెప్తుంది. 15 నెలల్లో పెళ్లి చేసుకుని, పిల్లలను కనడానికి నేనేమైనా మిషన్ హా అని జ్యోత్స్న కోప్పడుతుంది.
ఆస్తి మాకెందుకు?
మరోవైపు నువ్వు చేసిన పని నాకు నచ్చడం లేదు నాన్న అని దశరథతో దీప అంటుంది. ఏంటి మామయ్య ఆస్తి మాకు రాయడం ఏంటీ? జ్యోత్స్నను అలా రెచ్చగొడతావేంటీ? చేసే ముందు మాతో చెప్పాలి కదా. మొత్తానికి పెద్ద గొడవ చేశావని కార్తీక్ విసుక్కుంటాడు. నా భార్య గురించి, నా కూతురి కడుపులో బిడ్డ గురించి ఎంతలా నలిగిపోయానో నాకే తెలుసని దశరథ అంటాడు.
మూడు విషయాలు
సుమిత్ర గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నా. జ్యోత్స్న అసలైన కూతురు కాదని చెప్పి గెంటేయొచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. కానీ అది నా కూతురే. చిన్నప్పటి నుంచి అలాగే పెంచా. జ్యోత్స్నను వదులుకోలేను. సుమిత్ర కోరిక తీర్చకుండా ఉంలేను. నా కూతురికి న్యాయం చేయాలి. అందుకే మూడు విషయాల కోసం ఆలోచించి వీలునామా మార్చి రాయించానని దశరథ అంటాడు.
జ్యోత్స్న ఏదైనా
15 నెలల్లోపు జ్యోత్స్న పెళ్లి చేసుకుని, పిల్లలను కనకపోయినా ఆస్తి తనకే ఇచ్చేయ్ నాన్న. మనషుల కోసం నేను ఆస్తులను వదులుకుంటానని దీప చెప్తుంది. నీ కోసం కార్తీక్ చేసింది అదే కదమ్మా. మనిషికి కావాల్సింది ఆనందం. ఇది అర్థం గాక జ్యోత్స్న తప్పుల మీద తప్పులు చేస్తోంది. నాకే హాని తలపెట్టొచ్చు కదా. ఏదో ఒక రోజు జ్యోత్స్నకు నిజం తెలుస్తుంది. తండ్రినే చంపాలనుకున్న మనిషికి నన్ను ఏదో ఒక చేయడం ఒక లెక్కా అని దశరథ అంటాడు.
కోపం వస్తుందని
జ్యోత్స్న నా కూతురు కాదన్న నిజం ఎప్పటికీ నా నోటితో చెప్పలేనేమోనని అనిపిస్తుంది. నువ్వు (దీప) ఉండాల్సిన స్థానంలో జ్యోత్స్న ఉంది. నిన్ను పనిమనిషి, అనాథ అని అంటున్నారు. నాకు కోపం వస్తుంది. ఒకవేళ నాకు ఏమైనా అయినా ఆస్తి మీకే వస్తుందని దశరథ ఫీల్ అవుతాడు. జ్యోత్స్న పెద్ద ప్లాన్ లోనే ఉందని కార్తీక్ అంటాడు.
నీ భార్య, పిల్లలకు
రాత్రి కార్తీక్, దీపతో వీలునామా గురించి కాంచన మాట్లాడుతుంది. కూతురు పెళ్లి చేసుకుంటుంది కాబట్టి ఓ కండీషన్ పెట్టి అన్నయ్య వీలునామా రాశాడు. అది జరగకపోతే ఆస్తి మీకు రాయడం ఏంటీ? మేనల్లుడి కుటుంబం అంటే మీరే కదా, ముఖ్యంగా నీ భార్య, పిల్లలకు ఆస్తి చెందుతుందని రాశాడని కాంచన అంటుంది.
జ్యోత్స్నకు బుద్ధి వచ్చి పెళ్లి చేసుకుంటే మీరందరూ హ్యాపీనే కదా అని కార్తీక్ అంటాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


