Karthika Deepam 2 Today Episode: జ్యోత్స్న కిడ్నాప్ కుట్ర బయటపెట్టిన కార్తీక్.. సుమిత్రకు ప్రాణాపాయం.. దీపకు పీడకల
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 25 ఎపిసోడ్ లో సుమిత్ర, దశరథను జ్యోత్స్న చంపేసినట్లు దీప కల కంటుంది. మరోవైపు సుమిత్ర పరిస్థితి చూసి దశరథ ఫీల్ అవుతాడు. జ్యోత్స్న పెళ్లి కోసం సుమిత్ర కలవరిస్తుంది. శౌర్యను కిడ్నాప్ చేయించినందుకు జ్యోత్స్నకు కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు.
కార్తీక దీపం 2 టుడే మార్చి 25 ఎపిసోడ్ లో.. అమ్మా అంటూ నిద్రలో నుంచి దీప ఉలిక్కిపడి లేస్తుంది. ఏమైందని కార్తీక్ అడుగుతాడు. మా అమ్మను, నాన్నను జ్యోత్స్న చంపేసినట్లు కల వచ్చింది బావ. పదా ఆ ఇంటికి వెళ్దాం. అమ్మకు, నాన్నకు ఏమైనా జరిగితే కాపాడేది మనమే కదా అని దీప అంటుంది.

ఆ నిజం
ఇప్పుడు జ్యోత్స్న నమ్మకం లేని జీవితం బతుకుతుంది. ఇప్పుడు తను ఏం చేయదు. జ్యోత్స్న సుమిత్ర కూతురు కాదనే నిజం తెలిస్తే ఏమైనా చేస్తుందేమో. కానీ మనం లేదా డాక్టర్ హారిక మాత్రమే ఈ నిజం చెప్పాలి. ఈ రెండు జరగనప్పుడు జ్యోత్స్నకు నిజం తెలిసే అవకాశమే లేదు. అన్నీ మర్చిపో. ఇలా హాయిగా పడుకొని ఎన్ని రోజులైందో కదా. పడుకో అని కార్తీక్ చెప్పేసరికి దీప పడుకుంటుంది.
సుమిత్ర భ్రమ
మరోవైపు సుమిత్రకు దశరథ ప్రేమగా తినిపిస్తాడు. ఒక్కోసారి ఇదంతా నిజమేనా? కోమాలో ఉండి కల కంటున్నానా అనిపిస్తుంది. జ్యోత్స్నకు మంచి సంబంధం కుదిరినట్లు, పెద్ద పందిరి వేసి పెళ్లి చేసినట్లు అనిపిస్తుంది. అత్తారింటికి సాగనంపేటప్పుడు ఏడుస్తున్నానని అనిపిస్తుంది. మనం జ్యోత్స్నను ఇంట్లోనే పెట్టుకుందామా? ఇల్లరికం అల్లుడు వస్తాడా? అని సుమిత్ర అడుగుతుంది.
జ్యోత్స్న పెళ్లి కోసం
అప్పుడే జ్యోత్స్న వస్తుంది. నీ దగ్గరకు వస్తుంటే డాడీ నా మీద చిరాకు పడుతున్నాడు. నీకు దూరంగా ఉండమన్నాడు. అందుకే ఇక్కడ నిలబడ్డా అని సుమిత్రతో జ్యోత్స్న అంటుంది. డాడీ నన్ను నువ్వు ఎంతో ప్రేమగా చూసుకునేవాడివి, అప్పుడూ కోపం ఉండేదా? అని జ్యోత్స్న అడుగుతుంది. మా మీద నీకు ప్రేమ తగ్గిపోయిందని జ్యోత్స్నతో సుమిత్ర అంటుంది. పెళ్లి చేసుకోమ్మని అడుగుతుంది. ముందు నువ్వు కోలుకో, ఆ తర్వాత ఆలోచిద్దామని జ్యోత్స్న అంటుంది.
నేను జ్యోత్స్న పెళ్లి చూడలేనేమో అని సుమిత్ర అనుకుంటూ బాధపడుతుంది. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటీ అని దశరథ అడుగుతాడు. అసలు నాకేమైందని సుమిత్ర అనుకుంటుంది. మరోవైపు శివ నారాయణతో పారిజాతం ప్రేమగా మాట్లాడుతుంది. అప్పుడే వచ్చిన శ్రీధర్ సూపర్ అత్తయ్య అని విజిల్ కొడతాడు. వెనకాలే కాంచన, కార్తీక్, దీప వస్తారు.
దీపకు కంగ్రాట్స్
కంగ్రాట్స్ దీప, బిడ్డ విషయంలో నిర్ణయం వెనక్కిి తీసుకున్నావ్ కదా. అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంతలోనే నువ్వు కిందపడ్డావని విన్నామని జ్యోత్స్న అంటుంది. అప్పుడే డాక్టర్ హారిక వస్తుంది. సుమిత్రను రెగ్యులర్ చెకప్ చేయడానికి నేనే రమ్మన్నానని దశరథ చెప్తాడు. డాక్టర్, దశరథ, కార్తీక్, శివ నారాయణ కలిసి సుమిత్ర దగ్గరకు వెళ్తారు.
జ్యోత్స్న మా అమ్మ
చాలా థ్యాంక్స్ డాక్టర్. నేను బతుకుతానని అనుకోలేదు. మీరే కాపాడారని సుమిత్ర అంటుంది. మీరు నాకు హాస్పిటల్లోనే చెప్పారని డాక్టర్ అంటుంది. నాకు గుర్తులేదని సుమిత్ర బాధపడుతుంది. జ్యోత్స్న నా కూతురు కాదు, మా అమ్మ. మా అమ్మే నాకు ప్రాణం పోసిందని సుమిత్ర ఏడ్చేస్తుంది. అందరూ బయటకు వస్తారు.
మెంటల్ షాక్
సుమిత్ర ఇంతకుముందు ఉన్నట్లు లేదు. కొత్త మనిషిలా కనిపిస్తోందని దశరథ అంటాడు. సుమిత్ర మానసిక పరిస్థితి చాలా డెలికేట్ గా ఉంది. తను చచ్చిపోతానేమో అనే స్థితికి వెళ్లి వచ్చింది. అది మెంటల్ షాక్ లాంటిది. సుమిత్రకు జ్యోత్స్న అంటే చాలా ఇష్టం. తన పెళ్లి చూడకుండా చచ్చిపోతానేమో భయం మనసులో నాటుకుపోయింది. సుమిత్ర తట్టుకోలేని విషయాలు ఏవీ చెప్పకండి. జ్యోత్స్న గురించి సంతోషపెట్టే విషయాలు మాత్రమే చెప్పాలని డాక్టర్ హారిక క్లియర్ గా చెప్తుంది.
అత్త బాధ్యత
మా మమ్మీకి ఏదైనా ప్రాబ్లెం అయితే నేను జాగ్రత్తగా చూసుకోవాలి కదా. దీప కోసం అగ్రిమెంట్ కాదని మరీ వెళ్లిపోయావు బావ. అప్పుడు మా మమ్మీని నేనే చూసుకున్నా. ఏదైనా ఉంటే నాకు చెప్పండి డాక్టర్ అని జ్యోత్స్న అడుగుతుంది. అవసరం లేదు డాక్టర్, మా అత్తను మేం చూసుకుంటాం. ఆ బాధ్యత మాకు ఉంది. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే అత్త నీతో పాటు రాదు కదా. అత్త ఇక్కడే ఉండాలి కదా. మేం కూడా అత్తను చాలా జాగ్రత్తగా చూసుకుంటామని కార్తీక్ కౌంటర్ ఇస్తాడు.
కార్తీక్ ప్రశ్నలు
జ్యోత్స్నను పక్కకు తీసుకెళ్లి కార్తీక్ మాట్లాడతాడు. నా మీద నీకు అనుమానం ఏంటీ? పారును వీడియో తీయమని ఇంటికి ఎందుకు పంపించావ్? దీప రూమ్ ముందు పారును ఎందుకు కాపలా పెట్టావ్? శౌర్యను కిడ్నాప్ చేయించింది నువ్వే అని నాకు తెలుసు. నీకు ఏదైనా అనుమానం ఉంటే అడిగేయ్. ఎందుకు దీపను, నన్ను అనుమానంగా చూస్తావ్? ఎవరి స్థానం పర్మినెంట్ కాదు మరదలా అని కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు.
ఈ రోజు మనది అయినట్లే రేపు వేరేవాళ్లది కావొచ్చు. అప్పుడు మన కాళ్ల కింద భూకంపం రావొచ్చు. నీకేదైనా అనుమానం ఉంటే స్ట్రెయిట్ గా అడుగు. 24 గంటలు నా ఫోన్ ఆన్ లోనే ఉంటుంది. కాల్ చేయ్ నీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తానని కార్తీక్ చెప్పి వెళ్లిపోతాడు. బావ నువ్వు ఎన్ని చెప్పినా నా అనుమానాలు నాకున్నాయి. నా జాగ్రత్తలు నాకున్నాయని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


