Karthika Deepam 2 Today Episode: జ్యోత్స్నకు వీడియో కాల్- ఫిట్టింగ్ పెట్టిన పారు- స్వప్నకు పెళ్లి చూపులు- కిందపడిన దీప!
Karthika Deepam 2 Serial March 24th Episode: కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 24వ ఎపిసోడ్‌లో కాంచన ఇంట్లో అంతా సంతోషంగా ఉంటారు. అదంతా వీడియో కాల్ ద్వారా జ్యోత్స్నకు చూపిస్తుంది పారిజాతం. అది శివ నారాయణ చూసి నిలదీస్తాడు. కార్తీక్ వచ్చి దొంగచాటుగా వీడియో తీస్తున్నావా అని అడుగుతాడు.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దీప కడుపులో బిడ్డ సేఫ్‌గా ఉందని తెలియడంతో కాంచన సంతోషిస్తుంది. ఇంతలో శౌర్య వచ్చి బేబీ ఎలా ఉందని అడుగుతుంది. నీ చెల్లి నీకోసం మళ్లీ వచ్చిందని బొమ్మ ఇస్తూ దీప చెబుతుంది. అమ్మమ్మ ఎలా ఉందని దశరథను అడుగుతుంది శౌర్య.

జ్యోత్స్నకు పారు వీడియో కాల్
నీకు అన్ని బాగా గుర్తుంటాయిగా అమ్మ, అమ్మమ్మ క్షేమంగా ఉన్నారని దశరథ అంటాడు. దీపను శౌర్య పట్టి లాగితే నొప్పితే అరుస్తుంది. దీపను రెస్ట్ తీసుకోమ్మని కార్తీక్ చెబుతాడు. దీప మెల్లిగా నడుస్తుంది. అదంతా పారిజాతం ఎవరికి తెలియకుండా వీడియో కాల్‌లో జ్యోత్స్నకు చూపిస్తుంది. దీప నడవడం చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది.
బిడ్డ సేఫ్‌గా ఉంటే దీప ఎందుకు నీరసంగా ఉందని శ్రీధర్ అడుగుతాడు. దీప కూడా నాలాగే నడుస్తుందేంటీ. ఇంతకీ సుమిత్ర కూతురు నేనా దీపనా అని జ్యోత్స్న డౌట్ పడుతుంది. మరోవైపు స్వప్న, కాశీ వాళ్ల దగ్గరికి వెళ్లి స్వీట్స్ పంచుతాడు దాసు. సుమిత్ర వదిన క్షేమంగా ఇంటికి వచ్చేసిందని, దీప కడుపులో బిడ్డ సేఫ్‌గా ఉందని రెండు గుడ్ న్యూస్‌లు చెబుతాడు దాసు.
దాంతో అంతా సంతోషిస్తారు. మూడో శుభవార్త కూడా ఉంది. అదేంటంటే నీకు మళ్లీ పెళ్లి చేయబోతున్నాం. శ్రీధర్ బావ నేను నీకో సంబంధం చూశాం. ఆ అబ్బాయి మాకు బాగా నచ్చాడు. అమ్మాయితో ముందుగా మాట్లాడాలని అబ్బాయి అన్నాడు. రేపు వచ్చి నీతో మాట్లాడుతాడు. దాన్ని పెళ్లి చూపులు అంటారు అని దాసు చెబుతాడు. దాంతో స్వప్న, కాశీ షాక్ అవుతారు.
స్వప్నకు పెళ్లి చూపులు
దీంట్లో ఏ మార్పు లేదు. రేపు అయితే పెళ్లి కొడుకు స్వప్నను చూసేందుకు వస్తున్నాడు. రెడీగా ఉండు స్వప్న అని దాసు చెబుతాడు. మరోవైపు క్వాలిటీ బాగా వచ్చిందా అని వీడియో గురించి అడుగుతుంది పారు. ఇంతలో వెనకాల శివ నారాయణ ఉంటాడు. ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. పారు షాక్ అవుతాడు. కాంచనను పరామర్శించేందుకు వచ్చానని పారు చెబుతుంది.
శివ నారాయణ, పారు గొంతు విని కార్తీక్ బయటకు వస్తాడు. ఏంటీ పారు చాటుగా నిలబడి వీడియో తీస్తున్నావా అని కార్తీక్ అంటాడు. నేనెందుకు వీడియో తీస్తాను. కాంచనను పరామర్శించేందుకు వచ్చాను. దీంట్లో బిడ్డ సేఫ్‌గా ఉందనే శుభవార్త తెలిసిందని చెబుతుంది పారు. దాంతో శివ నారాయణ సంతోషిస్తాడు. పారు, శివ నారాయణ లోపలికి వెళ్తారు.
నిర్ణయం వెనక్కి తీసుకుని మంచి పని చేశారని శివ నారాయణ అంటాడు. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏ దీప అని పట్టి లాగుతుంది పారు. దీప అరుస్తుంది. దాంతో కార్తీక్ కోప్పడుతాడు. చాలా నీరసంగా ఉంది. కాంచన అనుమానం రావట్లేదా. ఏ ఆపరేషన్ జరగకుండా దీప ఎందుకు నీరసంగా ఉంది. దీనికి కూడా ఎందుకు కారణం ఉంటుందిగా. సైలెంట్‌గా బిడ్డను వదిలించుకుని మీ అమ్మ కోసం బిడ్డ సేఫ్‌గా ఉందని అబద్ధం చెప్పావేమో అని పారిజాతం ఫిట్టింగ్ పెడుతుంది.
దీప కిందపడింది
అత్తయ్య కరెక్ట్‌గానే అడిగిందని, దీప ఎందుకు నీరసంగా ఉందని అంతా నిలదీస్తారు. దీప నీరసంగా ఉందన్న దానిపై పెద్ద రచ్చ జరుగుతుంది. దీప నీరసంగా ఉన్నదానికి, బిడ్డ క్షేమంగా ఉన్నదానికి ఏ సంబంధం లేదు అని కార్తీక్ అంటాడు. కానీ, నీరసంగా ఎందుకుందో తెలియాలిగా అని శివ నారాయణ అంటాడు.
అంతా అడిగేసరికి దీప కిందపడిందని అబద్ధం చెబుతాడు కార్తీక్. మేము బిడ్డను వద్దనుకున్నాం. మేము కాలుజారి దీప కిందపడింది. అదృష్టవశాత్తు వెనక్కి పడింది. అప్పుడే బిడ్డ మనల్ని కోరుకుంటుంది. అందుకే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం. అందుకే దీప నీరసంగా ఉంది అని కార్తీక్ అంటుంది. కార్తీక్ మాటలు వింటుంటే అబద్ధం చెబుతున్నట్లే ఉందని డౌట్ పడతాడు శివ నారాయణ.
పారు ఉన్నట్టుండి ఎందుకు ఊడిపడింది. జ్యోత్స్న ఏం పంపలేదుగా అని అనుమానిస్తాడు కార్తీక్. వదినను చూడాలని ఉందని కాంచన అంటే.. రేపు అందరిని తీసుకుని రా అని శ్రీధర్‌కు చెబుతాడు శివ నారాయణ. దీపే సుమిత్ర కూతురు అయి బోన్ మ్యారో ఇస్తే నాకు అనుమానం రాకుండా చేశారా. అందుకే నా జాగ్రత్తలో నేనున్నా. నేను నిజాలు ఎలా తేల్చాలో తెలుసు బావ అని జ్యో అనుకుంటుంది.
రిపోర్ట్స్ గురించి జ్యో ఆరా
ఒకరికి కాల్ చేసి రిపోర్ట్స్ ఆఫ్‌లైన్‌లో తీసుకుంటా. నా పేరు వివరాలు తెలియకూడదు. రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుంది. సుమిత్ర అసలు కూతురు ఎవరో అని జ్యోత్స్న అనుకుంటుంది. మరోవైపు నువ్వు దీప ముందు సరిగా కాపలా కాయలేదుగా, నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు అని పారును నిలదీస్తుంది జ్యోత్స్న. కొద్దిసేపు లేను అని పారు అంటుంది.
దాంతో షాక్ అవుతుంది జ్యోత్స్న. ఇద్దరు దీప నడవడం గురించి మాట్లాడుకుంటారు. కొద్దిలో మీ తాతకు దొరికిపోయేదాన్ని. ఇలాంటి సీక్రెట్ ఏజెంట్ పనులు చెప్పకు అని వెళ్లిపోతుంది పారిజాతం. మరింత కన్‌ఫ్యూజ్ చేశావ్ గ్రానీ, కానీ అన్ని విషయాలు తేలుస్తాను అని జ్యో అనుకుంటుంది.
మరోవైపు జ్యోత్స్న ఆలోచనల గురించి దీప టెన్షన్‌గా చెబుతుంది. ఇప్పుడు తను సుమిత్ర కూతురు అనుకుంటుంది, మన బిడ్డను భూమీదకు రాకుండా ఎవరు ఆపలేరు అని కార్తీక్ అంటాడు. కార్తీక్ భుజాలపై వాలి నా భయమంతా జ్యోత్స్న గురించే అని మనసులో అనుకుంటుంది దీప. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


