Karthika Deepam 2 Today Episode: కార్తీక్‌కు తప్పిన ప్రమాదం, శౌర్యను కాపాడిన తండ్రి- మత్తులో జ్యోత్స్న-దీపకు పారు కాపలా!

Karthika Deepam 2 Serial March 19th Episode: కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 19వ ఎపిసోడ్‌లో శౌర్య కిడ్నాప్ గురించి తెలిసి దీప వెళ్లిపోవాలని చూస్తుంది. డాక్టర్ హారిక వచ్చి బలవంతంగా లోపలికి పంపించేస్తుంది. దీపకు కాపలాగా పారిజాతంను పెడుతుంది జ్యోత్స్న. కార్తీక్‌కు దీప కాల్ చేసి శౌర్య గురించి అరుస్తుంది.

Published on: Mar 19, 2026, 07:10:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శౌర్య కిడ్నాప్ అయిన విషయం పారిజాతం చెప్పడంతో దీప కంగారుగా బయలుదేరుతుంది. ఇంతలో డాక్టర్ ఎదురై నువ్వెక్కడికి వెళ్తున్నావ్, సుమిత్ర గారు వచ్చేశారు. నువ్వు ఇక్కడే ఉండాలని అంటుంది.

కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 19వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 19వ తేది ఎపిసోడ్

పారు ప్రశ్నల వర్షం

అది విన్న పారిజాతం సుమిత్ర ఆపరేషన్‌కు దీప ఇక్కడ ఉండటానికి కారణం ఏంటీ అని పారిజాతం అడుగుతుంది. డాక్టర్ హారిక తటాపటాయిస్తూ కార్తీక్ ఎక్కడ అని అడుగుతుంది. లేడు వెళ్లిపోయాడు అని పారిజాతం అంటుంది. దాంతో హారిక తెగ టెన్షన్ పడిపోతుంది. పారిజాతం ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది.

దీప వెళ్తానంటుంది. ఎక్కడికి వెళ్లేది లేదు. మనం అనుకుంది జరుగుతుంది. లోపలికి వెళ్లు అని బలవంతంగా గదిలోకి దీపను పంపించేస్తుంది డాక్టర్ హారిక. బయటకు వచ్చిన హారికను పారు మళ్లీ అవే ప్రశ్నలు అడుగుతుంది. గైనకాలజిస్ట్ అంటూ ఏదోటి చెప్పి అందరూ నన్ను ప్రశ్నించేవాళ్లే. మా సమస్యలు మాకుంటాయి అని అరిచేసి వెళ్లిపోతుంది.

ఇంతలో జ్యోత్స్న వచ్చి అంతా ఓకేనా అని అడుగుతుంది. పారిజాతం ఓకే అని దీపను ఇక్కడే ఉంచింది డాక్టర్ అని చెబుతుంది. దీప ఎక్కడికి వెళ్లకుండా కన్నేసి చూడు అని జ్యోత్స్న అంటుంది. సరేనని చెప్పి శౌర్య గురించి అడుగుతుంది పారిజాతం. ఆపరేషన్ అయ్యేవరకు శౌర్య బావకు దొరకదు అని జ్యోత్స్న అనేసి వెళ్లిపోతుంది.

జ్యోత్స్ననే ఇదంతా చేస్తుంది

కార్తీక్‌కు దీప కాల్ చేసి శౌర్య గురించి కోపంగా అడుగుతుంది. పారిజాతం చెప్పిందని చెబుతుంది. ఇదంతా జ్యోత్స్న ప్లాన్ అని అప్పుడే డౌట్ వచ్చిందనుకున్న కార్తీక్ శౌర్యకు ఏం కాదు. నా కూతురుకు ఏం కానివ్వను. ఇప్పుడు మీ అమ్మ గురించి ఆలోచించు. జ్యోత్స్ననే మనల్ని ఆపేందుకు ఇవన్నీ చేస్తుందని కార్తీక్ అంటాడు.

పారుతో కలిసి గట్టిగా ప్లాన్ చేసింది. నా కూతురుకు ఏం కాదని నేను మాటిస్తాను నీ తల్లికి ఏం కానివ్వను అని నువ్వు మాటిస్తావా. ముందు ఆపరేషన్ కానివ్వు అని కార్తీక్ అంటాడు. మాటిస్తున్నాను అని దీప అంటుంది. జ్యోత్స్న ఇక భరించలేకపోతున్నా. శౌర్య దొరకని నీ సంగతి చెబుతాను అని కార్తీక్ శౌర్య కోసం వెతుకుతుంటాడు. మరోవైపు శౌర్య గురించి దీప ఏడుస్తుంది.

అదంతా పారిజాతం చూస్తుంది. కార్తీక్‌కు దాసు కాల్ చేసి శౌర్య ఉన్న ప్లేసులోనే ఉన్నాను అని, జ్యోత్స్నే ఇదంతా చేసిందని తెలుసు అంటాడు. దాసు లొకేషన్ పంపిస్తాడు. దాంతో కార్తీక్ అక్కడికి వెళ్తాడు. మరోవైపు పారిజాతంను శౌర్య కిడ్నాప్ అయింది నీకెలా తెలుసుని నిలదీస్తుంది. మరోవైపు దాసు దగ్గరికి కార్తీక్ వెళ్తాడు. అక్కడే శౌర్య ఉంది. నేను అన్ని చూడగలను. కానీ కాపాడలేను అని దాసు అంటాడు.

దాసు, కార్తీక్ ఫైట్

జ్యోత్స్న ఏం చేస్తుందో అనే అనుమానంతో మీ ఇంటి మీద కన్నేసి ఉంచాను. ఇద్దరు రౌడీలు శౌర్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. నేను ఫాలో అయ్యాను, గదిలో లోపల పెట్టారు అని దాసు చెబుతాడు. కిడ్నాపర్స్ దగ్గరికి దాసు వెళ్లి పాపను తీసుకురండని చెబుతాడు. కార్తీక్ వచ్చి పంచ్‌లు వేసి రౌడీలను కొడతాడు. దాసు, కార్తీక్ ఇద్దరు రౌడీలను చితకబాదుతారు.

ఇద్దరు కార్తీక్‌ను పట్టుకుంటే ఓ రౌడీ కత్తి తీస్తాడు. అప్పుడే మరోవైపు హోమం గుండంలో నుంచి మంట చాలా ఎత్తులో ఎగిసిపడుతుంది. రౌడీ కత్తితో పొడవబోతే దాసు కర్రతో కొడతాడు. దాంతో కార్తీక్‌కు ప్రమాదం తప్పుతుంది. లోపలికి వెళ్లి శౌర్యను లేపుతాడు. శౌర్యను శ్రీధర్ తీసుకెళ్తాడని దాసుకు చెబుతాడు కార్తీక్.

మరోవైపు దీప రూమ్ దగ్గర పారిజాతం ఉంటే శివ నారాయణ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఏదోటి మ్యానేజ్ చేస్తుంది పారు. సుమిత్ర, జ్యోత్స్న పక్క పక్కనే పడుకుని ఆపరేషన్‌కు పడుకుంటారు. డాక్టర్స్ అంతా రెడీ చేస్తారు. జ్యోత్స్నను అటు తిరగమని, ఇంజక్షన్ వేయాలని చెబుతుంది డాక్టర్ హారిక. ఇంజక్షన్ వేయడంతో మత్తుతో స్పృహ కోల్పోతుంది జ్యోత్స్న.

జ్యోత్స్నపై డౌట్

మరోవైపు శౌర్యను ఎక్కడికి వెళ్లిపోయావని కాంచన తిడుతుంది. శౌర్యను లోపలికి పంపించిన శ్రీధర్ కిడ్నాప్ గురించి చెబుతాడు. ఎవరు చేశారో కార్తీక్ చెప్పలేదు. కానీ వారు ప్రమాదంలో ఉన్నారని అర్థమవుతోందని శ్రీధర్ అంటాడు. జ్యోత్స్నపై కాంచన డౌట్ పడితే.. సుమిత్ర ఆపరేషన్ టైమ్‌లో జ్యోత్స్నను అనుమానించాల్సిన అవసరం లేదంటాడు శ్రీధర్.

దీపకు ఎవరో బలమైన శత్రువులు ఉన్నారని, దీపపై జరిగిన అటాక్స్, శౌర్య కిడ్నాప్ గురించి చెబుతుంది కాంచన. వాళ్లు ఎవరైనా కార్తీక్ వదిలిపెట్టడు. దీపకు బిడ్డ వల్ల సమస్య అన్నారుగా. ఆ ఆపరేషన్ కూడా ఇవాలే అని శ్రీధర్ అంటాడు. ఏం జరిగినా కూడా తట్టుకోడానికి సిద్ధంగా ఉండాలని కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతాడు శ్రీధర్.

మరోవైపు కార్తీక్ వచ్చి మా ఆవిడకు కాపాల కాస్తున్నావా అని పారిజాతంను అంటాడు. నేను వెళ్లిన పని పూర్తి చేశాను. అదంతా తర్వాత క్లియర్‌గా చెబుతాను. నీకు గుడ్ టైమ్ స్టార్ట్ అయింది అని వెళ్లిపోతాడు. దీపకు శౌర్య ఇంట్లో సేఫ్‌గా ఉంది. కిడ్నాప్ చేయించింది జ్యోత్స్న అని కార్తీక్ అంటాడు. దాంతో దీప కోప్పడుతుంది. ముందు అత్తయ్య ఆపరేషన్ జరగాలి. ఎవరిని వదిలిపెట్టను అని కార్తీక్ అంటాడు.

ఉక్కిరిబిక్కిరి అయిన డాక్టర్

డాక్టర్ వచ్చి అంతా అడ్డంగా ఉన్నారు, ఎలా అని టెన్షన్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. పారు వెళ్లిపోవాలి అంతేగా అని కార్తీక్ అంటాడు. వీళ్లంతా ఎందుకు ఇంత హైరానా పడుతున్నారు అని పారిజాతం అనుకుంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More