Karthika Deepam 2 Promo: జ్యోత్స్న దెబ్బకు కుటుంబమంతా అల్లకల్లోలం- కార్తీక్‌పై రివర్స్- సుమిత్రకు గుండెపోటు- పారు డౌట్!

Karthika Deepam 2 Serial Latest Episode Promo: కార్తీక దీపం 2 లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో సుమిత్రను దీప, కార్తీక్, దశరథ్ పలకరిస్తారు. దీప బిడ్డ గురించి సుమిత్ర అడుగుతుంది. కానీ, వారు ఏం మాట్లాడరు. ఇంతలో జ్యోత్స్న వచ్చి దీప బిడ్డను వద్దనుకుంటుంది అని చెప్పేస్తుంది. దాంతో సుమిత్ర ఆవేశపడుతుంది.

Published on: Mar 15, 2026, 16:10:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో దీప, కార్తీక్ విషయాన్ని జ్యోత్స్న బట్టబయలు చేస్తుంది. జ్యోత్స్న దెబ్బతో శివ నారాయణ కుటుంబం అంతా అల్లకల్లోలం అవుతుంది. దీప అంతా తనపై నింద వేసుకుంటుంది. అన్న దశరథ కూడా మోసం చేశాడని కాంచన బాధపడుతుంది.

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

చనిపోయినట్లే అని కాంచన

తాను పుట్టింట్లో నట్టింట్లో చచ్చిపోయినట్లే అని వెళ్లిపోతుంది. శివ నారాయణ కూలబడిపోతాడు. పారిజాతం, జ్యోత్స్న సంతోషిస్తారు. దీప గురించి కార్తీక్, దశరథ్ మాట్లాడుకుంటారు. జ్యోత్స్నకు అనుమానం వచ్చిందని, చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. అప్పుడు జ్యోత్స్న వారిని చూస్తుంది. కానీ, వారి మాటలు వినిపించవు.

దీప గురించే మాట్లాడుకుంటున్నారని జ్యోత్స్న అనుకుంటుంది. జ్యోత్స్నను చూసి కార్తీక్, దశరథ్ మాట్లాడుకోవడం ఆపుతారు. దాంతో జ్యో వెళ్లిపోతుంది. తల్లిని చూడాలని దీప పట్టుబట్టడంతో కార్తీక్ సరేనంటాడు. కార్తీక్, దీప, దశరథ్ ముగ్గురు సుమిత్ర దగ్గరికి వెళ్లిపోతారు. మరోవైపు దీప చేసిన పనికి పారిజాతం ఆశ్చర్యపోతుంది. షాక్ అవుతుంది.

ఇంట్లోంచి వెళ్లగొట్టేలా ప్లాన్

కాంచనతో దీపను ఇంట్లోంచి వెళ్లగొట్టేలా చేయాలని, దాంతో కార్తీక్ గాడు పిచ్చోడవుతాడని పారు అంటుంది. బావ సింపుల్‌గా దీపతో ఉండిపోతాడు. అది కాదు కావాల్సింది, దీపను ఇంకేదైనా చేయాలన్నట్లుగా జ్యోత్స్న అని వెళ్లిపోతుంది. చూస్తుంటే దీపపై దీనికి పగ కాదు ఇంకేదో మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నట్లు అనిపిస్తుందని పారిజాతం జ్యోపై డౌట్ పడుతుంది.

సుమిత్రను లేపి దీప ట్యాబ్లెట్స్ ఇస్తుంది. దీప హాస్పిటల్ నుంచి రావడం తెలిసి సుమిత్ర సంతోషిస్తుంది. దీప గురించి, కడుపులో బిడ్డ గురించి డాక్టర్ ఏమన్నారు, బిడ్డ క్షేమంగా ఉందని చెప్పారా అని అడుగుతుంది సుమిత్ర. దాంతో దీప, కార్తీక్, దశరథ్ సెలైంట్‌గా ఉంటారు. కానీ, ఇంతలో జ్యోత్స్న వస్తుంది.

ఎన్నిసార్లు అడిగినా చెప్పదు

వచ్చి బిడ్డ క్షేమం గురించి నువ్వు ఎన్నిసార్లు అడిగినా దీప సమాధానం చెప్పలేదు మమ్మీ అని అంటుంది జ్యోత్స్న. ఎందుకనీ అని సుమిత్ర అడుగుతుంది. అప్పుడే పారిజాతం కూడా వస్తుంది. దీప తన బిడ్డను వదిలేస్తుంది కాబట్టి అని జ్యోత్స్న చెబుతుంది. దాంతో సుమిత్ర షాక్ అవుతుంది.

తనకు పిల్లలు వద్దంటా.. పైగా తనకు మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు అని జ్యోత్స్న చెబుతుంది. దాంతో కార్తీక్ కోపంతో నా భార్యను ఏమైనా అంటే నేను ఊరుకునేది లేదు వార్నింగ్ ఇస్తాడు. ఊరుకోకపోతే ఏం చేస్తావ్ బావ అని కార్తీక్‌పై జ్యోత్స్న రివర్స్ అవుతుంది.

నేను బతుకుతానా

ఏంటీ దీప నువ్వు ఈ పని ఎలా చేయగలగుతున్నావ్. జ్యోత్స్న నా కూతురు దీన్ని ఎవరైనా దూరం చేస్తే నేను బ్రతుకుతానా.. ఎవరైనా నా కూతురును నాకు దూరం చేసే ప్రయత్నం చేసినా నా ప్రాణాలు పోయినట్లే అని ఆవేదనగా, ఆవేశంగా అంటుంది సుమిత్ర.

దీప గురించి, జ్యోత్న్స గురించి మాట్లాడుతూ.. సుమిత్ర గుండె పట్టుకుని కుప్పకూలిపోతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. సుమిత్రను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. అక్కడితో కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More