Karthika Deepam 2 Today Episode: దీప సొంత కూతురు, నోరు జారిన జ్యోత్స్న- పుట్టింట్లో కాంచన చనిపోయినట్టే, కూలబడిన తండ్రి!
Karthika Deepam 2 Serial March 14th Episode: కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 14వ ఎపిసోడ్‌లో దీప బిడ్డను వద్దనుకుంటున్న విషయం దశరథకు తెలిసిన అని తెలియడంతో కాంచన తను అన్ని విధాలుగా మోసపోయినట్లు చెబుతుంది. పుట్టింట్లో నట్టింట్లో చనిపోయినట్లు, దశరథను చెల్లెమ్మా అని పిలవకూడదని చెబుతుంది.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బిడ్డను దీప వదులుకుంటున్న విషయం దశరథకు ముందే తెలుసు. తెలిసే నిజం దాచాడు అని పారిజాతం అంటుంది. ఈ నిజం ఎప్పుడు తెలుసు, ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదని నిలదీస్తాడు శివ నారాయణ.

ఇక నన్ను అలా పిలవద్దు
నాకు ఈరోజే క్లారిటీగా వచ్చింది. ఆరోజు మాట్లాడకుంటే పొడి పొడిగా విన్నాను అని పారు అంటుంది. ఆ మాట అడిగితేనే బిడ్డ వల్ల ప్రమాదమని చెప్పాడని కాంచన అంటుంది. నిన్ను కొడుకు, కోడలే కాదు మీ అన్న కూడా నిన్ను మతిలేని దాన్ని చేశాడన్నమాట అని పారిజాతం అంటుంది. చెల్లెమ్మా అని దశరథ అంటే నన్ను ఇక అలా పిలవద్దన్నయ్య, అన్ని భలే ఓపికగా నటించావన్నయ్య అని కాంచన అంటుంది.
నీ చేతిలో చేయి పెట్టి బిడ్డ జాగ్రత్త అన్నయ్య అని అడిగినప్పుడు అయినా నిజం చెప్పాలనిపించలేదా అని కాంచన అంటుంది. ఒక్కసారి నేను చెప్పేది విను అని దశరథ్ అంటుంటే.. కాంచన వినిపించుకోదు. శివ నారాయణ కూడా ఫీల్ అవుతాడు. డాడీ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పని అని జ్యోత్స్న అంటుంది. దాంతో దాసుతో జ్యో మాట్లాడింది గుర్తు చేసుకుంటాడు దశరథ్.
ఇక నాకు ఏ నిజం తెలియాల్సిన అవసరం లేదు. ఒక మోసపోయిన ఆడదానిలా మీ మేనత్త ఈరోజు పుట్టింట్లో ఈ నట్టింట్లో చచ్చిపోయినట్లే అని కాంచన అంటుంది. అందరా షాక్ అవుతారు. విధిరాత నాకు కాళ్లు లేకుండా చేస్తే మీరంతా కలిసి నన్ను చంపేశారు. కూతురుగా ఓడిపోయాను, చెల్లిగా మోసపోయాను, భార్యగా మోసపోయాను, ఒక తల్లిగా కూడా మోసపోయాను, అత్తగారిలా మోసపోయాను, ఒక మనిషిగా కూడా మోసపోయాను అని కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది.
కూలబడిపోయిన శివ నారాయణ
కార్తీక్ పిలిస్తే నాకు ఇక్కడి నుంచి దూరంగా పారిపోవాలని ఉందని బయటకు వెళ్లిపోతుంది కాంచన. వెంటే శ్రీధర్ వెళ్లిపోతాడు. దీప కూడా కోపంగా వెళ్లిపోతుంది. కార్తీక్ బాధగా వెళ్లిపోతాడు. తను అనుకుంది జరిగిందని జ్యోత్స్న సంతోషిస్తుంది. కాంచన తండ్రి శివ నారాయణ సోఫాలో కూలబడి కుమిలిపోతాడు. అలా జ్యోత్స్న కొట్టిన దెబ్బకు ఫ్యామిలీ అంతా అల్లకల్లోలం అవుతుంది.
మరోవైపు కాశీ, స్వప్న మాట్లాడుకుంటారు. ఇదివరకు స్వప్న వెంట పడిన విషయం కాశీ చెబుతాడు. నన్ను నడి సముద్రంలో వదిలేశావ్ అని స్వప్న అంటుంది. నడి సముద్రం వరకు వెళ్తేనే అన్ని తెలుస్తాయని కాశీ అంటాడు. నచ్చితే కలవడం, నచ్చకుంటే విడిపోవడం, ఇదే జీవితం అన్నట్లుగా స్వప్న చెబుతుంది. మరి నుదుటి పాపిటలో సింధూరం ఎందుకు పెట్టుకున్నావని కాశీ అడుగుతాడు.
స్వప్న సైలెంట్ అవుతుంది. సింధూరం చెడిపోసి నీ మనసులో నుంచి నన్ను మర్చిపోయినట్లే. అలా నువ్వు చేయలేవు. నువ్వు నన్ను చెడిపేసింది మాటల్లో నుంచే మనసులో నుంచి కాదు. తీసేయాలంటే నా మీద నీకున్న ప్రేమ అబద్ధం అని ఒప్పుకోవాలి. అలా నువ్వు ఒప్పుకున్నావంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే అని కాశీ అంటాడు.
కాశీ లాజిక్, మళ్లీ మొదలైన ప్రేమ
కాశీ లాజిక్‌తో కొట్టడంతో స్వప్న కన్‌ఫ్యూజ్ చేస్తున్నావా అని అడుగుతుంది. క్లారిటీగా చెబుతున్నా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, నిజంగా ఈరోజు మన పెళ్లిరోజు అని గుర్తులేదా. గుర్తుంది.. కాని ఒప్పుకోం. నాకు కూడా గుర్తుంది. అందుకే ఉదయం వెళ్లి గుడిలో మొక్కుకున్నా. ఈ విషయం నాన్నకు తెలియదు. నా ప్రేమ ఎవరికో ఎందుకు తెలియాలి. నీకు తెలిస్తే చాలుగా అని రెడ్ రోజ్ ఫ్లవర్ తీసి స్వప్నకు ప్రేమగా ఇస్తాడు కాశీ.
రోజ్ ఫ్లవర్‌ను స్వప్న చేతిలో పెడుతాడు కాశీ. తనకు తెలియకుండానే స్వప్న తీసుకుంటుంది. కాశీ వెళ్లిపోతాడు. స్వప్న ఆలోచనలో పడిపోతుంది. మళ్లీ కాశీ, స్వప్నల ప్రేమ మొదలైనట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత తెలియకుండానే ఫ్లవర్‌ను కింద పడేస్తుంది స్వప్న. మరోవైపు కాంచన అన్న మాటలు దీప గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ వచ్చి బాధపడాల్సిన అవసరం లేదు అని ఓదారుస్తాడు. దశరథ్ వచ్చి హాస్పిటల్‌కు వెళ్లారు అని నిలదీస్తాడు.
జ్యోత్స్నకు అనుమానం వచ్చింది. ఇదంతా తాతతో కలిసి ఇలా చేయించింది, అందరూ నా మీద రివర్స్ అయ్యారు. ఏం చేయలేకపోయాను. ఇంటికి వచ్చి ఇలా పంచాయితీ పెడతారనుకోలేదు. కానీ, అమ్మ దగ్గర నువ్వు మోసగాడిలా మిగిలిపోయావని కార్తీక్ అంటాడు. నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. దీపను తీసుకెళ్లు అని దశరథ్ అంటుండగా జ్యోత్స్న వింటుంది.
సొంత కూతురు కదా
జ్యోత్స్నకు మనమీద అనుమానం వచ్చింది. మన మాటలు ఎవరో ఒకరు వినేలోపు వెళ్లిపోవడం మంచిది అని దశరథ్ అంటాడు. వీళ్లు ముగ్గురు మీటింగ్ పెట్టారంటే దీప గురించే అని జ్యో అనుకుంటుంది. జ్యోత్స్నను కార్తీక్ చూసి దశరథకు చెపుతాడు. నేను చెప్పానుగా. తను ఓ కంట కనిపెడుతుందని అని దశరథ్ అంటాడు. వీళ్లు నన్ను చూశారు అని జ్యోత్స్న వెళ్లిపోతుంది.
అమ్మను చూసి వెళ్దామని దీప అంటుంది. మరోవైపు దీప చెప్పింది తలుచుకుని ఎంతకు తెగించి సమాధానం చెప్పిందే, భలే దీప గుట్టు బయటపెట్టావ్. ఈ విషయం నీకు ఎలా తెలిసిందే అని పారిజాతం కంగారుగా అంటుంది. నువ్వె చెప్పావుగా అని జ్యో అంటుంది. అందరికంటే ఎక్కువగా దశరథ్ కంగారుపడుతున్నాడు అని పారు అంటే.. ఎంతైనా సొంత కూతురు కదా అని జ్యోత్స్ననే నోరు జారుతుంది.
ఏంటే.. ఏం అన్నావని పారిజాతం అంటుంది. ఎంతైనా సొంత కూతురులా చూసుకుంటున్నాడుగా అని జ్యో అంటే.. దీప మీద కాదు. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద. కాంచనను ఇంకాస్తా రెచ్చగొడితే.. దీపను ఇంటికి రానివ్వదు. కార్తీక్ గాడు గిలగిల కొట్టుకుంటాడు అని పారిజాతం అంటుంది. దీప ఇప్పుడు తలదించుకుని వెళ్లాలిగా. మళ్లీ మనం మొదలుపెట్టాలిగా అని జ్యోత్స్న అని వెళ్లిపోతుంది.
మనసులో ఇంకేదో పెట్టుకుని
నాకు కావాల్సిన నిజం రాబట్టాలని జ్యో అనుకుంటుంది. దీపపై మనసులో ఇంకేదో పెట్టుకుని జ్యోత్స్న సాధిస్తుందనిపిస్తుంది. మనకు తెలియని కొత్త కథ ఏమైనా నడుస్తుందా అని పారిజాతం డౌట్ పడుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


