Karthika Deepam 2 Today Episode: జ్యోత్స్న కిడ్నాప్ డ్రామా-దీప‌ను గెంటేసిన సుమిత్ర‌-పోలీసుల‌ ఎంట్రీతో షాక్-కార్తీక్ మాట

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 21 ఎపిసోడ్ లో జ్యోత్స్న కోసం సుమిత్ర ఏడుస్తూనే ఉంటుంది. దీప మీద సీరియస్ అవుతుంది. జ్యోత్స్న కిడ్నాప్ విషయం పోలీసులకు దాసు చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. మరోవైపు జ్యోపై పారుకు డౌట్ వస్తుంది. జ్యోత్స్నను తీసుకొస్తానని కార్తీక్ చెప్తాడు.

Published on: Apr 21, 2026, 06:59:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ వైరా రీ ఎంట్రీతో రసవత్తరంగా మారింది. డబ్బు కోసం వైరాతో జ్యోత్స్న మళ్లీ చేతులు కలిపింది. జ్యోత్స్న కిడ్నాప్ విషయం తెలిసి సుమిత్ర బాధపడుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 21 ఎపిసోడ్ లో చూద్దాం.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

పోలీసులతో దాసు

జ్యోత్స్నను కాపాడుకోవాలని సుమిత్ర ఏడుస్తుంది. అప్పుడే పోలీసులతో దాసు రావడం చూసి అందరూ షాక్ అవుతారు. మామయ్య, పోలీసులను తీసుకొచ్చావేంటీ అని కార్తీక్ అడుగుతాడు. జ్యోత్స్నను ఎవరో కిడ్నాప్ చేశారన్నావ్ కదా అల్లుడు, అందుకే పోలీసులను తీసుకొచ్చానని దాసు చెప్తాడు. పోలీసులను బయట వెయిట్ చేయమని శివ నారాయణ అడుగుతాడు.

దీపపై సుమిత్ర కోపం

దాసుపై శివ నారాయణ అరిచేస్తాడు. నువ్వు ఎవడ్రా పోలీసులకు చెప్పడానికి అని సీరియస్ అవుతాడు. ఇక దీపపై సుమిత్ర కోప్పడుతుంది. దీపను బయటకు గెంటేయాలని లాక్కెళ్తుంది. నీ భార్యకు నా కూతురు అంటే ఇష్టం లేదురా. ఇలాంటి వాళ్లు పక్కన ఉంటే నా కూతురు ప్రాణాలతో రాదని దీప గురించి సుమిత్ర అంటుంది. నా కూతురిని నువ్వు అన్న ప్రతి మాట నాకు గుర్తుందని సుమిత్ర అరుస్తుంది.

పారుపైనా ఫైర్

దీపకు పారిజాతం సపోర్ట్ గా మాట్లాడుతుంది. దీంతో పారుపై కూడా సుమిత్ర కోప్పడుతుంది. దీప, పారును పక్కకు వెళ్లమంటుంది. దీపపై నాకు గౌరవం లేదు. ఫోన్లో మాట్లాడిన మాటలే జ్యోత్స్నపై దీపకు ఎంత కోపం ఉందో చెప్పాయి. నా కూతురికి ఇష్టం లేని వాళ్లు నాకూ ఇష్టం లేదు. ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావంటే దానికి కారణం నా కూతురు అని గుర్తుపెట్టుకో. ఆ రోజు హాస్పిట్లలో నా కూతురు నీ చేయి పట్టుకోకపోయి ఉంటే నీ అడుగు మా గుమ్మంలో పడేది కాదని దీపపై సుమిత్ర అరుస్తుంది.

శ్రీధర్ కు చెప్పిన దాసు

నీ కూతురికి ఏం కాదని కార్తీక్ అంటాడు. వెళ్లరా, వెళ్లి నా కూతురిని తీసుకురా అని కార్తీక్ తో సుమిత్ర అంటుంది. ఇక నా కూతురు రాదు. పోలీసులు వచ్చారు కదా. ఈ విషయం వాడికి తెలిస్తే నా కూతురిని చంపేస్తాడని సుమిత్ర బాధ పడుతుంది. అప్పుడే శ్రీధర్ వస్తాడు. జ్యోత్స్న కిడ్నాప్ గురించి దాసు చెప్పాడని శ్రీధర్ అంటాడు.

జ్యో నాటకం

జ్యోత్స్న కిడ్నాప్ గురించి పారు, దాసు మాట్లాడుకుంటారు. అక్కడ నా కూతురికి ఏమైందోనని భయంగా ఉందమ్మా అని దాసు అంటాడు. జ్యోత్స్న నీ కూతురు కాదు కదా అని పారు అంటే, దాసు ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. జ్యోత్స్న డబ్బు కోసం నాటకం ఆడుతుందేమో అని పారు అంటుంటే శివ నారాయణ వింటాడు.

శివ నారాయణ సీరియస్

కాస్తయినా బుద్ధి ఉండాలి. డబ్బు కోసం నాటకం ఆడుతుందని అంటావా? జ్యోత్స్న నీ సొంత మనవరాలు కాదు కదా. అదే దాసు కూతురు కనిపించకుండా పోతే ఇల్లంతా దొర్లుకుంటూ ఏడ్చేదానివి. డబ్బు కోసం నాటకం ఆడాల్సిన అవసరం జ్యోత్స్నకు ఏంటీ? ఈ ఆస్తి అంతా తనదే కదా. మరి ఎందుకు తప్పుడు కూతలు కూస్తున్నావ్? జ్యోత్స్నకు నువ్వే అలాంటి సలహా ఇచ్చావా? నిప్పు లేకుండా పొగ రాదు పారిజాతం అని శివ నారాయణ ఫైర్ అవుతాడు.

మరో వీడియో

కిడ్నాపర్ మరో వీడియో పంపిస్తాడు. మమ్మీ వీళ్లు నన్ను కొడుతున్నారు. ప్లీజ్ డాడీ నన్ను కాపాడండని జ్యో ఆ వీడియోలో అడుగుతుంది. జ్యోత్స్నను సేవ్ చేసేందుకు స్పెషల్ ఆఫీసర్ ను శివ నారాయణ పిలిపిస్తాడు. ఆ వీడియో చూసిన ఆఫీసర్.. కిడ్నాపర్ మీకు తెలిసిన వాళ్లు కాదని చెప్తాడు. అప్పుడే కిడ్నాపర్ నుంచి కాల్ వస్తుంది. డబ్బు రెడీనా? అని వైరా అడుగుతాడు. రెడీగా ఉందన్న దశరథ.. జ్యోత్స్నతో మాట్లాడాలంటాడు.

నంబర్ ట్రేస్ చేయాలంటే మాట్లాడాలి కదా. ముందే చెప్పా పోలీసులకు చెప్తే మీ కూతురు బతకదని, ఇక ఆశలు వదిలేసుకోండని చెప్పి వైరా కాల్ కట్ చేస్తాడు. దీంతో పర్ఫార్మెన్స్ అదరగొడుతున్నావ్ కదా అని జ్యో మెచ్చుకుంటుంది. మరోవైపు డబ్బులు ఇచ్చేస్తే నా కూతురిని వదిలేస్తాడు కదా, ఇవన్నీ ఎందుకు? అని సుమిత్ర ఏడ్చేస్తుంది.

జ్యోను చంపేస్తానని

జ్యోత్స్న హాయిగా ఫుడ్ లాగించేస్తుంది. అసలు డబ్బులు వస్తాయంటావా? అని జ్యోను వైరా అడుగుతాడు. అక్కడ నువ్వు ఇచ్చిన వార్నింగ్ కు మా అమ్మ గుండె పగిలిపోయేలా ఏడుస్తుంటుంది. వెంటనే మళ్లీ ఫోన్ చేస్తే విలన్ వీక్ అయిపోతాడు. రేపు మార్నింగ్ వరకు కాల్ చేయకపోతే డబ్బు సూపర్ ఫాస్ట్ గా రెడీ చేస్తారని జ్యో అంటుంది. అమౌంట్ రాకపోయినా, పోలీసులు పట్టుకున్నా జ్యోను చంపేస్తానని వైరా అంటాడు.

కార్తీక్ బాధ్యత

సుమిత్రను ట్యాబ్లెట్ వేసుకోమ్మని చెప్తే అసలు వినదు. జ్యోత్స్న కోసం సుమిత్ర ఏడుస్తుంది. నా వల్లే ప్రాబ్లం అంటున్నారు కదా జ్యోత్స్నను సేఫ్ గా తీసుకొచ్చే బాధ్యత నాదేనని కార్తీక్ చెప్తాడు. మరోవైపు కంగారు పడుతున్న కాంచన.. జ్యోత్స్న గురించి దీప, శ్రీధర్ ను అడుగుతుంది. జ్యోత్స్నను కిడ్నాప్ చేశారని, రూ.30 కోట్లు డిమాండ్ చేశారని జరిగిందంతా శ్రీధర్ చెప్తాడు.

సుమిత్ర తట్టుకోలేకపోతుంది. 24 గంటల్లో జ్యోత్స్నను తీసుకురాకపోతే సుమిత్ర చనిపోయేలా ఉంది. దీప మీద సుమిత్ర కోపంగా ఉందని శ్రీధర్ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More