Karthika Deepam 2 Today Episode: మళ్లీ ఒక్కటైన జ్యోత్స్న వైరా- జ్యో కిడ్నాప్, 30 కోట్లు డిమాండ్- అడ్డుగా అమ్మ సెంటిమెంట్

Karthika Deepam 2 Serial April 20th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఏప్రిల్ 20వ ఎపిసోడ్‌లో జ్యోత్స్న కారులో వెళ్తుంటే వైరా కిడ్నాప్ చేస్తాడు. ఇంటికి కాల్ చేసి సుమిత్రతో జ్యో మాట్లాడాలని చెబుతాడు. జ్యోత్స్న ప్రాణాలతో కావాలంటే 30 కోట్లు కావాలని డిమాండ్ చేస్తాడు. జ్యో 10 కోట్ల లాభం తీసుకుంటుంది.

Published on: Apr 20, 2026, 07:19:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న కారులో వెళ్తుంటే రోడ్డు మీద కారు అడ్డంగా పెట్టి వైరా కనిపిస్తాడు. జ్యోత్స్న మాట్లాడుతున్న పట్టించుకోకుండా వచ్చి కారులో ఎక్కి కూర్చొంటాడు. జ్యోత్స్న గన్ గురి పెడుతుంది. దీంట్లో వెరైటీ ఏం లేదు అని అదే గన్ లాక్కుని జ్యోత్స్నకు గురి పెట్టి ఇది వెరైటీ అంటే అని వైరా అంటాడు. నీతో చాలా పని ఉంది అని వైరా అంటాడు.

కార్తీక దీపం 2 సీరియల్ ఏప్రిల్ 20 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ ఏప్రిల్ 20 ఎపిసోడ్

తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి

నిన్ను మోసం చేసింది నేను కాదు మా బావ అని జ్యోత్స్న అంటే.. చెవులు నా చెవిలో పెట్టకు. నిజం చెప్పాంటే నిన్ను నేను కిడ్నాప్ చేస్తున్నాను. బుల్లెట్స్ ఉన్నాయిగా అని చెక్ చేస్తాడు వైరా. వద్దు షూట్ చేయకు చచ్చిపోతాను అని జ్యో అంటుంది. అయితే బుల్లెట్స్ ఉన్నాయి. నేను చెప్పిన చోటుకు పోని. నీతో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని వైరా అంటాడు. నేనేంటీ వీడికి ఇలా దొరికిపోయాను అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

కట్ చేస్తే జ్యోత్స్నను కుర్చీలో తాళ్లతో కట్టేసి ఉంచుతారు వైరా అండ్ గ్యాంగ్. నీకేం కావాలి అని జ్యో అంటే.. రూ. 20 కోట్లు కావాలి. పాకెట్ మనీ అని వైరా అడుగుతాడు. పిల్లలు చేసిన తప్పులకు పెద్దవాళ్లకు శిక్షలు వేయాలి. నీతో చేతులు కలిపి మీ డాడీ కంపెనీ మూయిద్దామనుకున్నా. కానీ, నా కింగ్‌డమ్‌నే కూల్చేశారు. మళ్లీ నా సామ్రాజ్యాం నిర్మించుకోవాలి. ఖర్చులకు 20 కోట్లు కావాలి. నువ్వు చస్తానంటే మీ డాడీ ఇవ్వడా అని వైరా అంటాడు.

నా పేరు చెప్పకుండా డబ్బులు అడిగితే బతుకుతావ్. లేదు అంటే చస్తావ్ అని వైరా బెదిరిస్తాడు. సరే అనకపోతే అని జ్యో అంటే.. చంపేద్దాం బాస్ అని అసిస్టెంట్ అంటాడు. దశరథ్‌కు వైరా కాల్ చేసి నీ కూతురుని మేము కిడ్నాప్ చేశాం అని వైరా చెబుతాడు. అదే బయటకు అంటాడు దశరథ్. ఆ మాటలు అంతా వింటారు. కానీ, దశరథ్ నమ్మడు. వీడియో పంపస్తాను అని వైరా కాల్ కట్ చేస్తాడు.

సుమిత్రతో కూతురు మాట్లాడాలంటా

జ్యోత్స్న గురించి ఇంట్లో అడిగితే ఉండదు. ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. ఇంతలో వైరా జ్యోత్స్నను కిడ్నాప్ చేసిన వీడియో పంపిస్తాడు. ఎవరు నువ్వు అని దశరథ్ అంటే.. ఇంకా అడ్రస్ కూడా కావాలా అని వెటకారంగా అంటాడు. ఇరిటేషన్ తెప్పిస్తే జ్యోని చంపేస్తానంటాడు. నీకు ఏం కావాలి అని దశరథ్ అడిగితే.. ఇది పెద్దమనిషి లక్షణం అన్న వైరా జ్యో తల్లి సుమిత్ర గురించి అడుగుతాడు. నీ కూతురు వాళ్ల తల్లితో మాట్లాడాలంటా రెడీగా పెట్టుకో. ఈ లోపు పోలీసులు, ట్రేస్ చేయడాలు వంటివి పెట్టుకోకు అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు వైరా.

సుమిత్రకు జ్యోత్స్న కిడ్నాప్ అయిందని ఎలా చెప్పాలి, నిజం చెబితే సుమిత్రనే హాస్పిటల్‌‌కు తీసుకువెళ్లాల్సి వస్తుందని దశరథ్ కంగారుపడతాడు. కార్తీక్, దీప పక్కకు వెళ్లి మాట్లాడుకుంటారు. పారిజాతం వచ్చి కిడ్నాప్ ఎవరు చేశార్రా అని అడిగితే కార్తీక్ సెటైర్లు వేస్తాడు. ఇంతలో కార్తీక్‌కు దాసు కాల్ చేస్తాడు. దాసుకు జ్యోత్స్న కిడ్నాప్ అయిన విషయం కార్తీక్ చెబుతాడు. దాంతో ఇంటికి వస్తానంటాడు దాసు.

కిడ్నాప్ ఎవరు చేసే అవకాశం ఉండి ఉంటుందని దశరథ్, శివ నారాయణ, కార్తీక్ ఆలోచిస్తారు. ముందు సుమిత్రకు ఎలా చెప్పాలో అది ఆలోచించండని దశరథ్ అనేలోపు ఏంటండి అది అని సుమిత్ర ఎంట్రీ ఇస్తుంది. సుమిత్రను కూర్చోబెట్టి నీకో విషయం చెబుతా కంగారు పడకంటాడు కార్తీక్. ఇంతలోనే జ్యోత్స్న ఎక్కడ అని అడుగుతుంది. దశరథ్ ఫోన్ తీసుకుని జ్యోత్స్న కిడ్నాప్ వీడియో చూపిస్తాడు కార్తీక్.

వీళ్లు నన్ను బతకనివ్వరు

అది చూసి సుమిత్ర కంగారుగా అడుగుతుంది. జ్యోత్స్న కిడ్నాప్ చేశారని కార్తీక్ చెబుతాడు. తనకు ఎలా ఉందిరా అని ఏడుస్తుంది సుమిత్ర. సుమిత్రతో జ్యోత్స్నను మాట్లాడిస్తాడు వైరా. ఎవరే నిన్ను కిడ్నాప్ చేసిందని సుమిత్ర అడిగితే.. వీళ్లెవరో తెలియదు. మొహానికి మాస్కులు వేసుకున్నారు. వీళ్లు నన్ను బతకనివ్వరు. బావ నన్ను కాపాడు. నా పెళ్లి చూడాలని నువ్వు అనుకున్నావ్. కానీ, అది నెరవేరుతుందో లేదో. నీ ప్రాణాలను మాత్రం నేను కాపాడగలిగాను. కన్నకూతురుగా నీ రుణం తీర్చుకున్నా అని ఎమోషనల్‌గా మాట్లాడుతుంది జ్యోత్స్న.

వీడియో కాల్ కట్ చేస్తాడు వైరా. దాంతో మరింత టెన్షన్ పడుతుంది సుమిత్ర. వైరా నార్మల్ కాల్ చేస్తాడు. కార్తీక్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. నీకు ఏం కావాలో చెప్పు అని సుమిత్ర అంటే.. ఒక 30 కోట్లు కావాలని వైరా డిమాండ్ చేస్తాడు. మొత్తమంతా క్యాష్ కావాలి. అది ఎక్కడికి తేవాలో చెబుతాను. నేను కాల్ చేసాక క్యాష్ రెడీ అని చెప్పాలి. లేకుంటే నీ కూతురుని చంపేసి పార్సల్ చేస్తాను అని వైరా బెదిరిస్తాడు.

తర్వాత అమ్మ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందంటావా అని వైరా అడిగితే.. నువ్వు 30 కాదు 50 అడిగిన ఇస్తారు అని జ్యో అంటుంది. నువ్వు నాకంటే జాదులా ఉన్నావ్. నిన్ను అడ్డం పెట్టుకుని 20 కోట్లు లాగుదామనుకున్నా. కానీ, నన్ను అడ్డం పెట్టుకుని నువ్వు (జ్యోత్స్న) 10 కోట్లు లాభం పొందుతున్నావ్ అని వైరా అంటాడు. నీకు నాకు ఇద్దరికి డబ్బులు కావాలి. నువ్వు కిడ్నాప్ చేశావని నేనెందుకు వర్రీ అవడం. నీతో కలిసిపోతే నాకు లాభమే కదా అని జ్యోత్స్న అంటుంది.

జ్యోత్స్న కక్కుర్తి

ఆస్తి అంతా నీదేగా నీకెందుకు ఈ కక్కుర్తి అని వైరా అడుగుతాడు. నీకు డబ్బు కావాలా సమాధానం కావాలా. ఈపాటికి అక్కడ డబ్బులు రెడీ అవుతుంటాయి. నువ్వు ఫోన్ చేయడానికి రెడీగా ఉండు. ఫోన్‌లో మన యాక్టింగ్ చూశాకా మా మమ్మీ మాములు వీరంగం చేయదు. పోలీసులకు కంప్లైంట్ చేసే ఛాన్స్ లేదు అని జ్యోత్స్న అంటుంది.

అలా మరోసారి జ్యోత్స్న వైరా ఒక్కటవుతారు. అమ్మ సుమిత్ర సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని జ్యోత్స్న 10 కోట్లు, వైరా 20 కోట్లు రాబట్టేలా ప్లాన్ చేస్తుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More