Karthika Deepam 2 Today Episode: ట్విస్టుల మీద ట్విస్టులు- దీపను కాపాడిన జ్యోత్స్న, షాక్ ఇచ్చిన కార్తీక్-చీర కట్టిన జ్యో
Karthika Deepam 2 Serial April 8th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఏప్రిల్ 8వ ఎపిసోడ్ ట్విస్టుల మీద ట్విస్టులతో సాగింది. దీపను చంపాలనుకుని నేలపై నూనే పోసిన జ్యోత్స్నే దీప పడబోతుంటే పట్టుకుని కాపాడుతుంది. అందరూ ఊహించేది చేస్తేది జ్యోత్స్న ఎందుకవుతుంది అనుకున్న జ్యోత్స్న చీర కట్టుకుని షాక్ ఇస్తుంది.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దీప ఇంట్లోకి వస్తూ నేలపై ఉన్న నూనే వల్ల జారి కిందపడబోతుంది. కానీ, ఊహించని విధంగా నేలపై ఆయిల్ పోసి చంపాలని చూసిన జ్యోత్స్నే దీపను కిందపడకుండా పట్టుకుని కాపాడి పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. దాంతో అంతా దీప అంటూ పరుగెత్తుతారు.

జాగ్రత్తగా చూసుకోవాలి కదా
ఫ్లోర్ తడిగా ఉన్నప్పుడు చూసుకుని నడవాలిగా అని జ్యోత్స్న తిడుతుంది. జ్యోత్స్న పట్టుకోకపోతే తల గుమ్మానికి తగిలేది అని శివ నారాయణ అంటుంది. ఏం కాలేదుగా అని అంతా అడిగితే.. కాలు కాస్తా బెణికినట్టు అనిపించిందని దీప చెబుతుంది. మా ఇంట్లో పడితే మా అత్త నన్ను అంటుంది. కడుపుతో ఉన్నవాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలిగా అని కార్తీక్‌ను మందలిస్తుంది జ్యోత్స్న.
దీపను కాపాడినందుకు జ్యోత్స్నకు థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్. దీపను తీసుకెళ్తాడు కార్తీక్. నా స్ట్రాటజీ వేరే ఉంది బావ. అందరూ ఊహించింది చేస్తే నేను జ్యోత్స్నను ఎందుకు అవుతాను అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. దీపంటే మండిపడే జ్యోత్స్న కాపాడటం ఏంటీ.. ఏమైనా నా కూతురుకు నాకు ఏం కాలేదు అని దశరథ్ అనుమానిస్తాడు. పైకి వెళ్లిన జ్యోత్స్న జరిగింది తలుచుకుంటూ నవ్వుతుంది.
అందరు నేను నిన్ను కాపాడాను అనుకుంటున్నారు. అసలు నువ్ పడబోయిందే నా వల్ల అని ఎవరికి తెలియదు అని బయటకు అనుకుంటుంది జ్యోత్స్న. అప్పుడే వచ్చిన కార్తీక్ పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరు చూడలేదనుకుంటుందట అని పెద్ద ట్విస్ట్ ఇచ్చిన జ్యోత్స్నకే షాక్ ఇస్తాడు. మా ఇంట్లో ఏ పిల్లి లేదే అని జ్యోత్స్న అంటే ఉంది. పేరుకే పిల్లి కానీ వేసేవన్నీ నక్క వేశాలు అని, కళ్లు మూసుకుని చిల్లర వేశాలు వేస్తుంది అని కార్తీక్ అంటాడు.
ఛాలెంజ్ చేయను
అక్కడ ఒలికింది నీళ్లు కాదు ఆయిల్ నాకు తెలుసు. పడేయాలని చూసి మళ్లీ కాపాడటం ఏంటో తెలుసుకుందామని వచ్చానని, మధ్యలో మనసు మార్చుకున్నావా అని కార్తీక్ అంటాడు. మనసు మార్చుకునేది ఉంటే ఛాలెంజ్ చేయను. ఇదంతా చేసింది నీకోసం అని జ్యో చెబుతుంది. దీపకు ఏం కాలేదు కాబట్టే ఇల్లు ప్రశాంతంగా ఉందని కార్తీక్ అంటాడు. ఈరోజు పడకుండా పట్టకున్నానని వదిలేస్తాననుకున్నావా, నేను ఇక్కడితో ఆగను అని జ్యో అంటుంది.
కార్తీక్, జ్యోత్స్న వాదించుకుంటారు. దీప అడ్డు తొలగించుకుని నిన్ను దక్కించుకుంటా. అడ్డు తొలగించడమంటే చంపడమే కాదు మనిద్దరి మధ్య లేకుండా చేయడం, నేను ఇంతకంటే కిందకు దిగజారడానికి, కోల్పోడానికి ఏం లేదు. నా గోల్ ఒక్కటే. నీతో నా మెడలో మూడు ముళ్లు వేయించుకోవడం. అలా అని నీ జీవితంలో ఎవరో ఉంటే నేను నెంబర్లు వేసుకుంటూ బాధపడను. జ్యోత్స్న ఎప్పుడు నెంబర్ వన్నే, నెంబర్ వన్‌గానే ఉంటుంది అని జ్యోత్స్న అంటుంది.
ఆ మాటలు విన్న పారిజాతం చెప్పు తెగుద్ది అని అరుస్తుంది. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. బరితెగించి మీద పడతానంటే ఉక్కుతాడు వేసి వాయించాలి, నాలో టాప్ గేర్ పడింది, టెంపర్ రేగుద్ది, నూనే ఒలకడానికి, ఒలికించావో కనిపెట్టకపోడానికి నేను రెండు కళ్లు ఉన్నదాన్ని కాదు నాలుగు కళ్లు ఉన్నదాన్ని. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని పారిజాతం అంటుంది. జ్యో సంగతి తాను చూసుకుంటానని కార్తీక్‌ను వెళ్లమంటుంది పారు.
కార్తీక్ వార్నింగ్
ఓర్పుకు ఉన్న ఓపిక తగ్గిపోయింది. ఏం చేసిన ఆలోచించుకుని చేస్తే అందరికి మంచిది అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు కార్తీక్. నేను వాడంతా క్లాస్ కాదు ఊర మాస్. వీధి గొడవల్లో నాకు రివార్డులు ఉన్నాయి. నీ మంచికే చెబుతున్నా దీప జోలికి రాకు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది పారిజాతం. సరే నీ మాటే వింటా. దీప జోలికి రాను, బావ జోలికి వస్తాను. మీ అందరికి చిన్న సర్‌ప్రైజ్ ఉందని జ్యోత్స్న అనుకుంటుంది.
తర్వాత దీప ఏ పని చేయొద్దని, తన పనులన్నీ పారిజాతం చేస్తానంటుంది. కార్తీక్, దీపకు దిష్టి తీస్తానంటుంది. దాంతో వాళ్ల మొదటి పెళ్లి రోజు అని చెబుతాడు కార్తీక్. ఇంట్లో అందరికి కార్తీక్, దీప పెళ్లి రోజు అని సంతోషంగా చెబుతుంది. ముందే చెప్పొచ్చుగా, మీకోసం ఏదోటి చేయాలని ఉంటుందిగా అని శివ నారాయణ తిడతాడు. శివ నారాయణ-పారిజాతం, దశరథ్-సుమిత్రల ఆశీర్వాదం తీసుకుంటారు కార్తీక్-జ్యోత్స్న.
ఇప్పుడు సంతోషమేనా మరదలా అని కార్తీక్ అంటే దీప తల ఊపుతుంది. కార్తీక్ సింపుల్ లైఫ్ కోరుకుంటే.. దశరథ్ పొగుడుతాడు. వెన్నెల లాంటి వీళ్ల కాపురంలో అమావాస్య ఎప్పటికీ రాకూడదు అని దశరథ్ అంటాడు. అప్పుడే జ్యోత్స్నను అమావాస్యల చూపిస్తారు. కార్తీక్, దీపలకు పనిష్‌మెంట్ కింద లీవ్, కారు, డబ్బులు ఇస్తున్నానని శివ నారాయణ చెబుతాడు. కారు, డబ్బులు వద్దంటాడు కార్తీక్.
చీర కట్టిన జ్యోత్స్న
పారిజాతం చెప్పడంతో సరేనంటాడు కార్తీక్. ఇద్దరు వెళ్తుండగా.. గ్రీన్ కలర్ సారీలో అందంగా రెడీ అయి వచ్చిన జ్యోత్స్న ఎక్కడికి అని అడుగుతుంది. ఇదేంటీ పెళ్లి కూతురులా ముస్తాబైందని పారు అనుకుంటుంది. ఉన్నట్టుండి చీర కట్టుకున్నావ్ అని సుమిత్ర అంటుంది. బావ గుడికి వెళ్దాం పదా. మొక్కుంది తీర్చుకోవాలని అంటుంది జ్యోత్స్న. ఇవాళ కార్తీక్, దీపల పెళ్లి రోజు అని శివ నారాయణ చెబుతాడు.
అవునా, పెళ్లి రోజు శుభాకాంక్షలు. ముందే చెప్పుంటే బొకే తీసుకొచ్చేదాన్ని, నో ప్రాబ్లమ్.. గుడిలో నుంచి వచ్చేటప్పుడు తీసుకుందాం. దీప ఈలోపు నువ్వు వంట చేస్తూ ఉండు నేను బావ గుడికి వెళ్తాం అని జ్యోత్స్న అంటుంది. ఈరోజు వాళ్ల పెళ్లి రోజు అంటే గుడి, వంట అంటావేంటని దశరథ్ అంటాడు. ఈరోజు గుడిలో పాలాభిషేకం చేస్తే పెళ్లి అవుతుందని పంతులు గారు చెప్పారు అని జ్యోత్స్న అంటుంది.
అయితే నేను తీసుకెళ్తాను అని శివ నారాయణ అంటాడు. పూజకు రూల్స్ ఉన్నట్లే సంకల్పానికి రూల్స్ ఉన్నాయి. నేను పెళ్లి చేసుకోవాలని సంకల్పించుకున్నా. నాకు పెళ్లికొడుకును చూసే బాధ్యత బావ తీసుకున్నాడు కాబట్టి బావను తీసుకెళ్లి మొక్కు తీర్చుకోవాలని సంకల్పించుకున్నా అని జ్యోత్స్న తిరకాసు పెడుతుంది. వాళ్ల పెళ్లి రోజు అని దశరథ్, పారిజాతం అంటారు.
సెంటిమెంట్‌తో కొట్టిన జ్యోత్స్న
అయినా జ్యోత్స్న వినదు. నాకు పెళ్లి జరగడం ఇష్టంలేదా. ఏం మమ్మీ అని సెంటిమెంట్ మీద కొడుతుంది జ్యోత్స్న. దాంతో సుమిత్ర కూడా జ్యోత్స్నతో కార్తీక్‌ను వెళ్లమంటుంది. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


