Karthika Deepam 2 Today Episode: జ్యోత్స్న దిమ్మతిరిగేలా కార్తీక్ క్లారిటీ..కాంచన కల నిజం చేస్తానన్న జ్యో..దీప వార్నింగ్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 17 ఎపిసోడ్ లో దీపకు పారిజాతం నెక్లెస్ గిఫ్ట్ గా ఇస్తుంది. మళ్లీ మంట పుట్టించాలని జ్యోత్స్న ట్రై చేస్తుంది. కాంచన కల గురించి చెప్తుంది. పారు సీరియస్ అవుతుంది. కార్తీక్ కు ఎలివేషన్ ఇస్తుంది. భార్య గురించి కార్తీక్ గొప్పగా చెప్తాడు.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో కార్తీక్, దీపలతో జ్యోత్స్న ఆటాడుకుంటోంది. దీప మీద సుమిత్రకు కోపం వచ్చేలా జ్యోత్స్న చేసింది. కార్తీక్ ను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానంటోంది. మరి కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 17 ఎపిసోడ్ తో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.

పారు గిఫ్ట్
దీపకు సుమిత్ర సారె పెడుతుంది. కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలని దీప చూస్తే సుమిత్ర దూరంగా జరుగుతుంది. ఫర్వాలేదమ్మా, నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుందని సుమిత్ర కాస్త సీరియస్ లుక్ లోనే అంటుంది. దీప పెళ్లి రోజు కానుకు ఇవ్వాలనుకున్నా కానీ నిన్న కుదరలేదు. అందుకే ఈ రోజు ఇస్తున్నా అని పారిజాతం నెక్లెస్ తీస్తుంది.
దేవుడిచ్చిన మనవరాలు
దీప మెడలో జ్యోత్స్ననే ఆ నెక్లెస్ వేయాలని పారిజాతం చెప్తుంది. ముందు ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఎందుకంటే దీప నాకు.. అని పారిజాతం చెప్పబోతుంటే దాసు అడ్డుకుంటాడు. దేవుడిచ్చిన మనవరాలు అని చెప్తున్నా అని పారు కవర్ చేస్తుంది. అందరూ చెప్పేసరికి దీప మెడలో జ్యోత్స్న నెక్లెస్ వేస్తుంది.
మంట పుట్టించాలని
నా మనసులో ఏ కోపం లేదు. నిన్ను అర్థం చేసుకున్నా దీప. బావకు భార్య స్థానంలో నేనుంటే ఇలాగే బాధపడేదాన్ని. కోప్పడేదాన్ని అని జ్యోత్స్న మళ్లీ మంట పుట్టించాలని చూస్తుంది. నేను ఒక నిజం దాచా. పెరట్లో మిమ్మల్ని చూశా. మీరు మాట్లాడుకున్నది విన్నా. అదేం అంత పట్టించుకోవాల్సిన విషయం కాదు కదా అని వెనక్కి వచ్చేశా. బావను సరదాగా ఆట పట్టిద్దామని అలా చేశానని జ్యో చెప్తుంది.
అత్త కల
బావ నా మెడలో తాళి కట్టినట్లు అత్తకు తెల్లవారుజామున కల వచ్చిందంటా అని జ్యోత్స్న చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అది ఎక్కడ నిజమవుతుందేమోనని దీప భయపడుతుంది. అందుకే దీప నన్ను తిట్టిందని జ్యో అంటుంది. ఇంతకుముందు ఒకసారి అత్తకు వాళ్ల అమ్మ కలలోకి వచ్చింది. అప్పుడే దీప ప్రెగ్నెంట్ అని తెలిసింది. అలాగే ఈ కల కూడా నిజం అవుతుందేమోనని భయపడుతున్నారని జ్యో పుల్ల పెడుతుంది.
పారు సీరియస్
అప్పుడే పారిజాతం సీరియస్ అవుతుంది. నా కలలు కూడా నిజమవాలి. జ్యోత్స్న అన్ని సర్దేసుకుని అర్ధరాత్రి ఇంట్లో నుంచి పోతున్నట్లు నాకు తెల్లవారుజామున కల వచ్చింది. జ్యోత్స్న మాటలు వింటుంటే కార్తీక్ తాళి కట్టాలని ఉన్నట్లే ఉంది. మనల్ని ఒకరు తిట్టారంటే ఏదో కోతి పని చేసి ఉంటాం. అది చెప్పకుండా అత్తకు కల వచ్చింది, మామకు నిద్ర వచ్చిదంటే ఎలా అని పారు సీరియస్ అవుతుంది.
కార్తీక్ క్లారిటీ
కార్తీక్ వెళ్లి దీప చేయి పట్టుకుంటాడు. నేను ఊహించుకున్న జీవితం నాకు దీపతో దొరికింది. వచ్చింది కల అని మీరు అనుకుంటున్నారు. పీడకల అని నేను అనుకుంటున్నా. దీప మెడలో తాళి కట్టిన తర్వాత నా జీవితం సవ్యంగా ఏం సాగలేదు. భోజనానికి ఇబ్బంది పడ్డ రోజులూ ఉన్నాయి. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా నా పక్కన ధైర్యంగా దీప నిలబడిందని కార్తీక్ గొప్పగా చెప్తాడు.
హాస్పిటల్లో నేను ప్రాణాలతో పోరాడుతుంటే కొంతమంది బ్లడ్ ఇవ్వకుండా తప్పించుకున్నారని జ్యోత్స్న గురించి కార్తీక్ అంటాడు. కానీ దీప నన్ను బతికించింది. ఇలాంటి మనిషి ప్రతి జన్మకు భార్యగా ఉండాలని కోరుకుంటానని దీపను కార్తీక్ దగ్గరకు తీసుకుంటాడు. మా పెళ్లి స్వర్గంలో జరిగిందని కార్తీక్ అనడంతో జ్యోత్స్న మినహా అందరూ చప్పట్లు కొడతారు.
దాసు చెప్పినా
పారిజాతాన్ని దాసు పక్కకు తీసుకెళ్తాడు. నా మనవరాలికి గుమ్మడికాయతో దిష్టి తీయాలని పారు అంటుంది. ఇవే తగ్గించుకోవాలి. నీ ప్రేమ ఎక్కువ అవుతుందమ్మా అని దాసు చెప్తాడు. కార్తీక్ ను ఎగరేసుకుపోవాలని జ్యోత్స్న చూస్తుంది. దీప కంటే ముందు కార్తీక్ తో నాకు పెళ్లి అయేదనే ఫీలింగ్ లో ఉందని పారు చెప్తుంది. దీప పారిజాతం మనవరాలు. దానిపై ప్రేమ చూపించకుండా ఎవరూ ఆపలేరని పారు అంటుంది.
పారు ఎలివేషన్
ఇంట్లో అందరూ టిఫిన్ చేస్తారు. కార్తీక్ అందరికీ వడ్డిస్తాడు. దీపకు పొలమారితే తలపై కొట్టిన కార్తీక్ నీళ్లు తాగిస్తాడు. అది చూసి జ్యోత్స్నకు మండిపోతుంది. పారు ఏమో ప్రేమతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. పుట్టుకతోనే కోటీశ్వరుడు. ఐశ్వర్యంలో పెరిగాడు. లండన్ లో చదువుకున్నాడు. అలాంటి మనిషి ఆత్మాభిమానం చంపుకోలేక రోడ్డున పడ్డాడు. వేరే ఎవరైనా అయితే వారం రోజులకే బతకలేక వచ్చి తాత కాళ్ల మీద పడేవాళ్లు. కానీ కార్తీక్ ఆ పని చేయలేదని పారు చెప్తుంది.
ఇడ్లీ బండి నుంచి మొదలెట్టాడు. దీప లాంటి సాధారణ అమ్మాయికి జీవితాన్ని ఇచ్చాడు. అర్ధరాత్రి ఉదయించిన సూర్యుడిలా తను గెలవడం కోసం నిద్రలేని రాత్రులు గడిపాడు. త్యాగాలు, కన్నీళ్లు అంటూ కార్తీక్ కు వేరే లెవల్ ఎలివేషన్ ఇస్తుంది పారు.
దీప వార్నింగ్
జ్యోత్స్న, దీప బయటకు వెళ్లి మాట్లాడుకుంటారు. కాంచన అత్త కలను నేను నిజం చేస్తానని జ్యో అంటుంది. నోటికి వచ్చినట్లు వాగితే మరో చెంప పగులుతుంది. ఎక్కడ నా కన్నతల్లికి దగ్గరవుతానో అనే భయంతో చెడ్డదాన్ని చేయాలనుకున్నావ్. బావ మీద లేనిపోని ఆశలు పెట్టుకుంటే జీవితాంతం కుమారిగానే మిగిలిపోతావ్ అని దీప మాస్ వార్నింగ్ ఇస్తుంది.
జ్యోత్స్న రోజులు మంచిగా లేవు. అందరూ నా లాంటి వాళ్లు ఉండరు. ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారని దీప అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


