Karthika Deepam 2 Today Episode: సుమిత్ర కన్నకూతురా దీప- బాంబ్ పేల్చిన జ్యోత్స్న- నా మొగుడికి ముద్దా- జ్యోను కొట్టిన దీప

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 13 ఎపిసోడ్ లో దీప, జ్యోత్స్న మధ్య మాటల యుద్ధం ఇంట్రెస్టింగ్ గా మారింది. కార్తీక్ కు ముద్దు పెట్టబోయిన జ్యోత్స్నను దీప చెంపదెబ్బ కొడుతుంది. సుమిత్ర కూతురా అంటూ జ్యోత్స్న బాంబ్ పేలుస్తుంది.

Published on: Apr 13, 2026, 07:04:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ మంచి రసపట్టుగా సాగుతోంది. బావ కావాలంటూ జ్యోత్స్న పట్టుబడుతోంది. దీంతో జ్యోత్స్నపై దీప ఆవేశంతో ఊగిపోతోంది. కార్తీక్ కోసం దీప, జ్యోత్స్న మధ్య పోరు ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 13వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

కాంచన కంగారు

పెళ్లి రోజున సంతోషంగా ఉండకుండా కార్తీక్ ను జ్యోత్స్న ఎక్కడెక్కడ తిప్పుతుందోనని కాంచన ఆలోచిస్తుంది. అప్పుడే చూస్తే దీప ఇంట్లో ఉండదు. రాత్రి దీప ఎక్కడికి వెళ్లిందోనని కాంచన కంగారు పడుతుంది. మరోవైపు కార్లో కార్తీక్ కు జ్యోత్స్న కౌంటర్లు వేస్తుంది. దీప ఏడుస్తూ కూర్చుంటుందని జ్యో అంటుంది.

జ్యోత్స్నను కొట్టిన దీప

అదే టైమ్ లో కారుకు అడ్డంగా స్కూటీపై కూర్చుని దీప అదిరే ఎంట్రీ ఇస్తుంది. వీళ్లిద్దరి మధ్య యుద్ధం జరగకుండా చైనా వాల్ లా అడ్డుపడాలని కార్తీక్ అనుకుంటాడు. బంగారం నేను రావడం లేట్ అయ్యేసరికి బండి వేసుకుని వచ్చావా? నేనంటే ఎంత ప్రేమరా అని దీపతో కార్తీక్ అంటాడు. దీపకు సర్ ప్రైజ్ ఇవ్వాలని జ్యోత్స్న అంటుంది. కార్తీక్ ను ముద్దు పెట్టుకోబోతున్న జ్యోత్స్నను దీప లాగిపెట్టి కొడుతుంది.

దీప వార్నింగ్

అక్కడి నుంచి సీన్ ఆఫీస్ కు మారుతుంది. రోడ్డు మీద పంచాయతీ పెట్టుకుని ఇంటి పరువు తీయడం ఎందుకని ఆఫీస్ కు తీసుకొచ్చానని జ్యోత్స్నతో దీప అంటుంది. కావాలనే నన్ను రెచ్చగొట్టడానికి ముద్దు పెట్టాలనుకుంది. నన్ను బాధ పెట్టాలనుకుంది. అందుకే ఓ భార్య కోపం ఎలా ఉంటుందో రుచి చూపించా. ఇక మీదట అయినా ఇలాంటివి మానేస్తే మంచిదని దీప వార్నింగ్ ఇస్తుంది. మానకపోతే అంటూ జ్యోత్స్న అరుస్తుంది.

ఎప్పటికీ దక్కదు

బావ నువ్వు మధ్యలోకి రాకు. ఈ మనిషి పద్ధతి సరిగ్గా లేదు. అది మారుద్దామని దీప అంటుంది. ఇది నువ్వు నాశనం చేసిన జీవితం అని జ్యోత్స్న అర్థం లేకుండా మాట్లాడుతుంది. అమ్మానాన్నలను, ఆస్తిని దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ వదిలేసి నీకు దక్కని దాని వెంట మతి లేకుండా పరుగెడుతున్నావు. నువ్వు పొందాలనుకున్నది నీకు ఎప్పటికీ దక్కదని దీప చెప్తుంది.

సుమిత్ర కన్నకూతురా

నిన్ను అడ్డు తప్పించైనా దాన్ని దక్కించుకుంటాను. అది నా వల్ల అవుతుందే సుమిత్ర కన్న కూతురా అని జ్యోత్స్న బాంబ్ పేలుస్తుంది. ఆ మాటతో దీప, కార్తీక్ షాక్ అవుతారు. ఏంటీ షాక్ అయ్యావా? ఈ నిజం దీనికెలా తెలిసిపోయింది అనుకున్నావా? నీ కన్నతల్లికి వచ్చిన రోగాన్ని అడ్డుపెట్టుకుని నువ్వు, బావ, మా నాన్న దాసు ఆడిన డ్రామాలన్నీ నాకు తెలుసే. మా ఇంట్లో పార్టీ పెట్టిన రోజే ఈ విషయం బావకు తెలుసుని జ్యో ట్విస్ట్ ఇస్తుంది.

పెళ్లి చేసుకో

ఇప్పుడు చెప్పమ్మా బంగారం లాంటి కుటుంబం ఉందా? చేతికి సంచి వేసుకుని గాలికి తిరిగే నాన్న. పెళ్లాం దగ్గర డ్రైవర్ గా పని చేసే తమ్ముడు. సగం గుర్తుంచుకునే నానమ్మ. ఇది నా డంప్ యార్డ్ ఫ్యామిలీ అని జ్యోత్స్న అంటుంది. మనం డ్రామాలు ఆపేద్దాం. నీకు అన్యాయం జరగకూడదు కాబట్టి పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపో. నువ్వు సంతోషాన్ని కోల్పోవద్దని దీప అంటుంది. అప్పుడే దీప మెడలోని తాళిని పట్టుకుని ఇది నా మెడలో పడాల్సిన తాళి అని జ్యోత్స్న ఫైర్ అవుతుంది.

కారణం దీప

నీ మెడలో తాళి కట్టకపోవడానికి దీప కారణం కాదని కార్తీక్ అంటాడు. బావ నా మెడలో తాళి కట్టడానికి కారణం నేను కాదని దీప అంటుంది. కానీ నా మెడలో కట్టకపోవడానికి కారణం నువ్వే అని జ్యోత్న చెప్తుంది. సగం తప్పులు బావను నా భర్తను చేసుకోవాలని చేస్తే, సగం తప్పులు నా పుట్టుక గురించి బయటపడొద్దని చేశానని జ్యో అంటుంది.

జ్యోత్స్న డ్రామా

కాంచన అత్త కోరిక, మా నానమ్మ ప్రతీకారం అంటూ గతం గురించి జ్యోత్స్న మాట్లాడుతుంది. నేనేమైనా నీ స్థానం అడిగానా? మరో మనిషిని తల్లిని చేశారు. మనకు తెలియకుండానే మన తలరాతలు మారిపోయాయి. నేనూ నా కన్నతల్లికి దూరమయ్యా. అన్యాయం ఇద్దరికీ జరిగినట్లే కదా. నాకు నా కన్నతల్లి మీద ప్రేమ ఉండదా అని జ్యోత్స్న మొసలి కన్నీళ్లు కారుస్తుంది.

ఇష్టం లేదని

ఇప్పుడు నువ్వు కావాలనుకుంటే నీ తల్లి దగ్గరకు వెళ్లిపోవచ్చు. కానీ నాకు తల్లి లేదు. చచ్చిపోయిందని ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది జ్యోత్స్న. నేను పెరిగే సమయంలో బావను నా మొగుడు అని పరిచయం చేశారు. అప్పటి నుంచే బావే నా ప్రపంచం. కానీ ఈ పెద్ద మనిషి నాకెప్పుడూ నేనంటే ఇష్టం లేదని చెప్పలేదు. నేను తీసుకొచ్చిన తాళిని బావ నీ మెడలో కట్టాడని జ్యోత్స్న గతం గురించి చెప్తుంది.

పెళ్లి గురించే

బావ దక్కకపోవడంతో ఎంతో బాధపడుతున్నానని జ్యోత్స్న చెప్తూనే ఉంటుంది. అసలైన వారసురాలివి నువ్వు అని నిజం తెలిసిన తర్వాత లగేజీ సర్దుకుని నేను బయటకు వెళ్లాల్సిందేనని దీపతో జ్యోత్స్న అంటుంది. నీకు అన్యాయం జరగదు జ్యోత్స్న అని దీప చెప్తుంది. నీకో మంచి జీవితాన్ని నేనిస్తానని కార్తీక్ అంటే, అయితే పెళ్లి చేసుకోమ్మని జ్యోత్స్న అంటుంది.

జ్యోత్స్న, దీప ఒకరిపై ఒకరు అరుచుకోవడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More