Karthika Deepam 2 Today Episode: కార్తీక్ చేతిలో తాళి పెట్టిన జ్యోత్స్న.. పెళ్లి రోజు గిఫ్ట్ ఇదే బావ అంటూ ఊహించని షాక్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఏప్రిల్ 10 ఎపిసోడ్ లో పెళ్లి రోజున దీపతో కార్తీక్ ఉండకుండా జ్యోత్స్న మరో ప్లాన్ వేస్తుంది. తలనొప్పి అని, హాస్పిటల్ కు వెళ్లాలని కార్తీక్ ను కార్లో తిప్పుతుంది. ఆఖర్లో చేతిలో తాళి పెట్టి, మెడలో కట్టమని షాక్ ఇస్తుంది.

Published on: Apr 10, 2026, 06:56:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఏప్రిల్ 10 ఎపిసోడ్లో.. గుడిలో కార్తీక్, దీప మాట్లాడుకుంటుంటే జ్యోత్స్న చాటుగా నిలబడి వింటుంది. జ్యోత్స్న తన కూతురు కాదని తెలిసినా అత్త తట్టుకున్న రోజు మనం ఈ డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదని దీపతో కార్తీక్ అంటాడు. జ్యోత్స్నకు ఏదో తెలిసినట్లుందని దీప చెప్తుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

తల తిరుగుతుందని

జ్యోత్స్నలో తేడా కనిపిస్తుందని దీప అంటుంది. జ్యోత్స్న ఇలా మారడానికి కారణం నేనే అని కార్తీక్ చెప్తుండగా బావ అని జ్యో వస్తుంది. నాకు తల తిరుగుతోంది, హాస్పిటల్ వెళ్దాం బావ కారు తీయమని అడుగుతుంది. వాడి డ్యూటీ అయిపోయింది, నేను వస్తా పదా హాస్పిటల్ కు అని జ్యోత్స్నకు పారిజాతం షాక్ ఇస్తుంది. దీపను తీసుకొని ఇంటికి వెళ్లమని కార్తీక్ కు పారు చెప్తుంది.

దీప కౌంటర్

నీకు కొంచమైనా మానవత్వం ఉందా గ్రానీ. నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా. నేను దేన్నో దాన్ని గుద్దుకుంటానని జ్యోత్స్న అంటుంది. దీంతో పారు కంగారు పడుతుంది. దీపను తాను తీసుకొని వెళ్తానని, జ్యోత్స్నను హాస్పిటల్లో చూపించాలని కార్తీక్ కు చెప్తుంది. నేను కూడా వస్తానని దీప అంటుంది. మేమేమైనా పార్క్ కు వెళ్తున్నామా అని జ్యో అంటే, పార్క్ కు వెళ్తే నేను ఊరుకుంటానా? అని దీప కౌంటర్ వేస్తుంది.

జ్యోత్స్న యాక్టింగ్

కార్తీక్, జ్యోత్స్న కార్లో వెళ్తారు. తలనొప్పి అని జ్యోత్స్న తెగ నటిస్తుంది. ఏ హాస్పిటల్ కు వెళ్దామని కార్తీక్ అడిగితే, కారును పక్కకు ఆపమని అంటుంది. కొబ్బరి బోండాలు తాగితే డీ హైడ్రేషన్ తగ్గుతుందని చెప్తుంది. ఈ రోజు మా మొదటి పెళ్లి రోజు. అమ్మానాన్న ఆశీర్వాదం తీసుకోవాలని నా భార్య అడిగితే మా తాత ఇంటికి వచ్చామని కార్తీక్ అంటాడు. నన్ను పెళ్లి చేసుకుంటే మా ఇల్లు అత్తారిల్లే కదా అని జ్యోత్స్న చెప్తుంది.

ఈ రోజు మా పెళ్లి రోజు కదా తల ఆటోమేటిక్ గానే తిరుగుతుంది. ఇద్దరిని విడదీయాలని గుడికి తీసుకెళ్లావ్. కానీ అది కుదరలేదు కాబట్టి బయటకు తీసుకొచ్చావని కార్తీక్ ఫైర్ అవుతాడు. నువ్వు నా డ్రైవర్ వి, ఎక్కడికి తీసుకెళ్లమంటే అక్కడికి తీసుకెళ్లాలని జ్యోత్స్న అవమానించేలా అంటుంది. అప్పుడే దీప ఫోన్ చేస్తుంది.

తలకేసి కొట్టమని

నాకు ఇంకా తల తిరగడం ఆగలేదు దీప. డీ హైడ్రేషన్ రాకూడదు అని దార్లో కారు ఆపి కొబ్బరి బోండం తాగుతున్నానని జ్యోత్స్న అంటుంది. అదే కొబ్బరి బోండం దాని తలకేసి కొట్టమని కార్తీక్ తో దీప చెప్తుంది. దాన్ని వదిలేసి నువ్వు రా బావ అని కార్తీక్ కు చెప్తుంది దీప. బావ రాడు అని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఇంటికి వెళ్లు దీప అని చెప్పి కార్తీక్ కాల్ కల్ చేస్తాడు. మణికొండలోని హాస్పిటల్ కు వెళ్లాలని కార్తీక్ ను కార్లో తిప్పుతూనే ఉంటుంది జ్యోత్స్న.

సుమిత్ర కంగారు

మరోవైపు పారిజాతానికి శివ నారాయణ కాల్ చేసి ఇంకా ఎంత సేపు అని అడుగుతాడు. జ్యోత్స్నకు ఫోన్ ఇవ్వమని శివ నారాయణ అడిగితే, జ్యోత్స్న హాస్పిటల్ కు వెళ్లిందని పారు చెప్తుంది. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత తల తిరుగుతుందని అన్నది. కార్తీక్ ను తీసుకుని హాస్పిటల్ కు వెళ్లిందని పారు చెప్తుంది. దీంతో సుమిత్ర కంగారు పడుతుంది. కానీ జ్యోత్స్న కావాలనే చేస్తుందని దశరథ అనుమానపడతాడు.

బావే కావాలని

మనకు అసలు ప్రాబ్లెం ఉంటే కదా హాస్పిటల్లో ఓపీ దొరికేది. అగ్రిమెంట్ పై సంతకం పెట్టాను కాబట్టి వచ్చానని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు. అప్పుడే జ్యోత్స్నకు పారు కాల్ చేస్తుంది. జ్యోత్స్నను వదిలేసి రా అని కార్తీక్ తో పారు అంటుంది. నేను యాక్సిడెంట్ చేస్తానని జ్యో భయపెడుతుంది. నువ్వు హాస్పిటల్ వెళ్లగానే కార్తీక్ ను పంపించేయ్, వేరే డ్రైవర్ ను పంపిస్తానని పారు అంటుంది. కానీ నాకు బావే కావాలని జ్యో పదే పదే చెప్తుంది.

క్లైమాక్స్

జ్యో వెళ్లి పుల్ల ఐస్ తీసుకొని వస్తుంది. తినమంటే కార్తీక్ తినడు. క్లైమాక్స్ వేరే దగ్గర ప్లాన్ చేశా. అక్కడికిి వెళ్లనివ్వు బావ. నీ కోసం మ్యారేజ్ యానివర్సరీ గిఫ్ట్ ప్లాన్ చేశానని జ్యో చెప్తుంది. వేరే దగ్గరకు వెళ్లాక తమ మధ్య జరిగిన ఛాలెంజ్ గురించి జ్యోత్స్న మాట్లాడుతుంది. దీపనే అసలైన వారసురాలని చెప్తానని అంటుంది. దీపను శివ నారాయణ వారసురాలిగా చూడాలని నీకు భలే తొందరగా ఉంది బావ అని జ్యోత్న్స అంటుంది. అది నా లక్ష్యం అని కార్తీక్ చెప్తాడు.

తాళి కట్టమని

నీకు మాత్రమే ఇచ్చే గిఫ్ట్ ఇది బావ అని జ్యోత్స్న అంటుంది. నువ్వు త్వరగా ఆ గిఫ్ట్ ఇస్తే దీపనే వారసురాలు అని చెప్పే ప్రొగ్రామ్ చేద్దామని కార్తీక్ అంటాడు. మీ పెళ్లి రోజుకు నేను ఇచ్చే అందమైన, అపురూపమైన, అరుదైన కానున అని కార్తీక్ చేతిలో జ్యోత్స్న తాళి పెడుతుంది. ఈ తాళి నా మెడలో కట్టి నన్నే బహుమతిగా తీసుకో బావ అని జ్యో చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More