Karthika Deepam 2 Today Episode:జ్యోత్స్నకు సుమిత్ర బిగ్ షాక్-వీలునామా మార్పుపై అసలు నిజం-సొంత కూతురిని కాదా? జ్యో డౌట్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 27 ఎపిసోడ్ లో వీలునామా మార్చాల్సిందేనని జ్యోత్స్న అడుగుతుంది. మార్చడం కుదరదని దశరథ తెగేసి చెప్పేస్తాడు. సుమిత్ర కూడా భర్తకే సపోర్ట్ గా మాట్లాడటంతో జ్యో షాక్ అవుతుంది. దీప, కాంచనపై పారిజాతం నిందలు వేస్తుంది.

Published on: Mar 27, 2026, 07:20:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 27 ఎపిసోడ్ లో.. వీలునామాను మార్చి రాయాలని జ్యోత్స్న పట్టుబడుతుంది. నువ్వు నా కూతురివి కాదని చెప్పు, ఇప్పుడే వీలునామా మారుస్తానని దశరథ అంటాడు. మేనల్లుడి కుటుంబానికి చెందాలని ఎలా రాస్తావ్? అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. కాంచన కుటుంబాన్ని పారిజాతం నిందిస్తుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

శ్రీధర్ ఫైర్

నా భార్య కానీ కొడుకు కానీ ఆస్తుల కోసం ఆరాటపడేవాళ్లే అయితే ఈ పంచాయతీ ఇంట్లో కాదు ఎనాడో కోర్టులో జరిగేది. కాగితాలు తీసుకొని మరీ బతిమిలాడా. కానీ శివనారాయణ మీద కేసు వేసేందుకు నా భార్య కానీ కొడుకు కానీ ఒప్పుకోలేదు. ఇలాంటి మనుషుల మీదా మీరు నిందలు వేసేదని శ్రీధర్ ఫైర్ అవుతాడు.

దశరథ ఫైనల్

మామయ్య నువ్వన్నదే నిజం అయితే మేనల్లుడి కుటుంబానికి ఆస్తి అనే క్లాజ్ ను అత్తయ్య ప్రశ్నించేదే అని జ్యోత్స్న అంటుంది. మామకు వెన్నుపోటు పొడిచావని శ్రీధర్ ను ఉద్దేశించి పారిజాతం అంటుంది. ఈ వీలునామా మార్చినందుకు కారణం ఉంది నాన్న. అదే ఫైనల్ నాన్న అని దశరథ తెగేసి చెప్పేస్తాడు. దశరథ, జ్యోత్స్న కాసేపు వాదులాడుకుంటారు.

అగ్రిమెంట్ క్యాన్సిల్

దీనికి నేను ఒప్పుకోను. ఈ మాటలను డాడీ వెనుక ఉండి బావ మాట్లాడనిస్తున్నాడు. నేను ఈ క్షణమే అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేస్తున్నా. బావకు, అగ్రిమెంట్ కు సంబంధం లేదు. ఇప్పుడు మార్చు డాడీ వీలునామా అని జ్యోత్స్న చెప్తుంది. అగ్రిమెంట్ కు, వీలునామాకు సంబంధం లేదని కార్తీక్ అంటాడు. నాకూ సంబంధం లేదని చెప్తూనే ఉన్నా. మేం వచ్చింది ఆస్తుల కోసం కాదు. మామయ్య ముందు ఆ క్లాజ్ తీసేయండని కార్తీక్ అడుగుతాడు.

షాకిచ్చిన సుమిత్ర

నువ్వు ఎవర్రా చెప్పడానికి? నువ్వు చెప్తేనే నేను వీలునామా మార్చానా? అని దశరథ షాక్ ఇస్తాడు. మా మమ్మీ ఇక్కడ ఉంటే తప్పని చెప్పేదని జ్యోత్స్న అంటుంది. అప్పుడే వచ్చిన సుమిత్ర.. ఇది తప్పని చెప్పను అని జ్యోత్స్నకు దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది. వీలునామా మార్చడం గురించి నాకు తెలుసు. నా భర్త నాకు చెప్పే చేశారని సుమిత్ర అంటుంది.

జ్యోత్స్న పెళ్లి చేసుకుంటుందని

నీకు పుట్టబోయే పిల్లలకు అంటే నీకే కదా. 10 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? అన్నీ నీ ఇష్టం ప్రకారమే జరుగుతాయని అనుకుంటున్నావా? తల్లిదండ్రులుగా నీ మీద మాకు కలలు ఉండవా? చూడు జ్యోత్స్న జీవితాంతం పెళ్లి పెటాకులు లేకుండా ఇంట్లోనే ఉండిపోదామని అనుకుంటున్నావా? ఆ వీలునామా అలాగే ఉంటుంది. నా కూతురు పెళ్లి చేసుకుంటుంది. పిల్లలను కంటుంది. వాళ్లకు ఈ ఆస్తి దక్కుతుందని సుమిత్ర కూడా క్లారిటీగా చెప్పేస్తుంది.

దీపపై నిందలు

శివ నారాయణ కూడా దశరథకే సపోర్ట్ గా మాట్లాడతాడు. పారు మాత్రం మేనల్లుడి కుటుంబం అనే టాపిక్ ను చెప్తూ గొడవ కొనసాగేలా చేస్తుంది. ఈ పాయింట్ దీప చెప్తే కార్తీక్ చెప్పాడు. దీపది పని మనిషి స్థాయి కదా. అప్పుడప్పుడూ దశరథను నాన్న అని పిలుస్తుంది కదా. ఆ పిలుపును అడ్డుపెట్టుకుని ఆస్తి కొట్టేయాలని చూస్తోందని పారిజాతం నిందలు వేస్తుంది.

కాంచన వార్నింగ్

దశరథ దీప గురించి నిజం చెప్పబోతుంటే కార్తీక్ ఆపుతాడు. మేం ఎవరి ఆస్తుల మీద ఆశలు పెంచుకోవడం లేదు. అది నీకు, నీ కూతురికి మధ్య పెళ్లి ఒప్పందం అని తెలుస్తుందని దశరథతో కార్తీక్ అంటాడు. పారిజాతంపై శివ నారాయణ మండిపడతాడు. నా కొడుకుని కానీ నా కోడలిని కానీ ఏమైనా అంటే ఊరుకోను అని జ్యోత్స్న, పారిజాతానికి వార్నింగ్ ఇచ్చి కాంచన వెళ్లిపోతుంది.

పెళ్లికి స్వప్న ఓకే

మరోవైపు స్వప్న కోసం దాసు పెళ్లి చూపులు అరెంజ్ చేస్తాడు. వసంత్ అనే అబ్బాయిని తీసుకొస్తాడు. వసంత్ కు స్వప్న నచ్చుతుంది. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న కాశీకి మండిపోతుంది. నేను స్వప్న భర్తను. నా భార్య నాకు కావాలని కాశీ అంటాడు. అవన్నీ నాకు తెలుసు. తను నిన్ను కోరకోవడం లేదు కదా. తన మనసులో నేనుంటానని వసంత్ అంటాడు.

స్వప్న నువ్వు ఇంకొకరికి దగ్గరైతే మనం ఎప్పటికీ కలవలేం. పెళ్లి ఇష్టం లేదని చెప్పు అని కాశీ అడుగుతాడు. నాకు ఈ పెళ్లి ఇష్టమే అని స్వప్న షాక్ ఇస్తుంది. విడాకులు కాగితంపై ఎప్పుడైతే సంతకం పెట్టానో అప్పటి నుంచే అతను నాకు ఏం కాడు అని కాశీని ఉద్దేశించి స్వప్న అంటుంది. మా ఇద్దరికి పెళ్లి అయేంతవరకు మా ఆవిడను బాగా చూసుకో అని కాశీకి వసంత్ చెప్పి వెళ్లిపోతాడు.

జ్యోత్స్న టెన్షన్

మరోవైపు వీలునామా గురించి ఆలోచిస్తూ జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. తనే అసలైన సుమిత్ర కూతురా? కాదా? అని జ్యో ఆలోచిస్తుంది. దశరథ కన్నకూతురు దీపే కదా అనుకుంటుంది. అప్పుడే వచ్చిన దీప.. అమ్మానాన్నలను బాధపెట్టొద్దని జ్యోత్స్నకు చెప్తుంది. నువ్వే సొంత కూతురివి అని ఎందుకు బలంగా చెప్పలేకపోయావని దీప అడుగుతుంది.

దీప ముందు ఎప్పుడూ ఓడిపోతూనే ఉన్నానని జ్యోత్స్న చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More