Karthika Deepam 2 Today Episode: కార్తీక్ భార్య‌గా జ్యోత్స్న‌..గుడిలో క‌న్నింగ్ ప్లాన్‌..దీప‌తో పారిజాతం ఎంట్రీ ట్విస్ట్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఏప్రిల్ 9 లో జ్యోత్స్న కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. కార్తీక్ ను తన భర్తగా చెప్పి, గుడిలో అర్చన చేయించుకోవాలని అనుకుంటుంది. కానీ దీపతో ఎంట్రీ ఇచ్చిన పారు ఆ ప్లాన్ ను ఫెయిల్ చేస్తుంది. పారు, జ్యోత్స్న ఢీ అంటే ఢీ అంటూ వాదులాడుకుంటారు. 

Published on: Apr 9, 2026, 07:06:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 9 ఎపిసోడ్ లో.. బావను తీసుకుని గుడికి వెళ్తానని జ్యోత్స్న అంటుంది. ఈ రోజు కార్తీక్, దీప పెళ్లి రోజు అని అందరు చెప్పినా జ్యోత్స్న వినదు. అయితే దీపను కూడా తీసుకెళ్లమని దశరథ చెప్తే, ముగ్గురు గుడికి వెళ్లొద్దని జ్యో అడ్డుకుంటుంది. ఇక సుమిత్ర అడగడంతో చేసేదేం లేక కార్తీక్ వెళ్తాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

జ్యోత్స్న భర్త కార్తీక్

గుడి లోపలికి వెళ్దామని జ్యోత్స్న పిలిస్తే కార్తీక్ బయటే వెయిట్ చేస్తాడు. లోపలికి వెళ్లి పూజారితో తమ పెళ్లి రోజు అని జ్యోత్స్న అబద్ధం చెప్తుంది. మా ఆయన అలిగి బయటే ఉండిపోయాడు. ఆయన్ని లోపలికి రప్పిస్తా. భార్యాభర్తలకు చేయించినట్లు అర్చన చేయించండని జ్యోత్స్న అడుగుతుంది. కారులో ఉన్న పూల సజ్జ తీసుకు రమ్మని కార్తీక్ కు జ్యో ఫోన్ చేస్తుంది.

కార్తీక్ షాక్

కార్తీక్ రాగానే ఏమయ్యా ఈ రోజు నీ పెళ్లి రోజే అని పూజారి అడుగుతాడు. ఎన్ని కోపాలున్నా పెళ్లాన్ని దూరం పెట్టొద్దు బాబు, చూడు మీ ఆవిడ ఎంత బాధపడుతుందోనని జ్యోత్స్నను చూపిస్తూ పూజారి అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఈవిడ మా ఆవిడ ఏంటి అని కార్తీక్ అడుగుతాడు. పక్కనే ఉన్న ఆడవాళ్లు కూడా భార్య కాదని అంటావా అని కార్తీక్ పై కోప్పడతారు.

పారు ట్విస్ట్

ఆవిడ మెడలో తాళి ఉందా? అని కార్తీక్ అడుగుతాడు. లేదని పంతులు చెప్తాడు. మరి మీ అర్ధాంగి ఎవరు? అని పూజారి అడిగితే, అది నేను చెప్తానని దీపను తీసుకొని వచ్చి పారిజాతం ఎంట్రీ ఇస్తుంది. ఈవిడే మా ఆవిడ, ఈ రోజు మా పెళ్లి రోజు అని దీపను పూజారికి పరిచయం చేస్తాడు కార్తీక్. ఎందుకు అబద్ధం చెప్పావని పూజారి అడిగితే, జ్యోత్స్న ఏదో కవర్ చేస్తుంది.

దీప, కార్తీక్ పేరు మీద అర్చన, అభిషేకం చేయమని పూజారికి పారిజాతం చెప్తుంది. పెళ్లి యోగం లేదని జ్యోత్స్న గుళ్ల చుట్టూ తిరుగుతుందని పారు వెటకారంగా మాట్లాడుతుంది. గుడిలో కార్తీక్, దీప మధ్య ప్రేమ చూసి జ్యోత్స్నకు మండిపోతుంది.

దశరథకు సారీ

సీన్ శివ నారాయణ ఇంటికి మారుతుంది. దీపను పారిజాతం గుడికి తీసుకెళ్లిందని శివ నారాయణకు దశరథ, సుమిత్ర చెప్తారు. జ్యోత్స్న వద్దని చెప్పింది కదా అని శివ నారాయణ అడుగుతాడు. వీళ్లు సెపరేట్ గా వెళ్లారు కదా ఏం కాదులే నాన్న అని దశరథ అంటాడు. దశరథకు శివ నారాయణ సారీ చెప్తాడు. వీలునామా మార్చి రాసినప్పుడు కోప్పడ్డా. కానీ జ్యోత్స్నలో మార్పును చూసి నీ నిర్ణయం సరైందేనని అనిపిస్తుందని శివ నారాయణ అంటాడు.

ఇప్పుడు నా మనవరాలు నాకు నచ్చుతుంది. విచిత్రం ఏమిటంటే మీ పిన్ని కూడా నాకు నచ్చుతుంది. ఈ మంచితనం నమ్మొచ్చా అని శివ నారాయణ అంటే, నమ్మొచ్చని సుమిత్ర చెప్తుంది.

జ్యోకు వార్నింగ్

గుడిలో జ్యోత్స్నను కావాలని పారిజాతం రెచ్చగొడుతుంది. మెడలో తాళి లేదు, కాలికి మెట్టెలు లేవు. కార్తీక్ నీ మొగుడు అంటే పంతులు ఎలా నమ్మాడే అని పారిజాతం అడుగుతుంది. ఆడుకునే వయసులో బావను చూపించి నీ మొగుడు అంటే నమ్మలేదా అని జ్యోత్స్న తిరిగి ప్రశ్నిస్తుంది. ఇప్పుడు కార్తీక్ దీప మొగుడు. వాళ్ల మధ్యలోకి వెళ్లకు. దీప కాపురంలో నిప్పులో పోయకు అని పారు వార్నింగ్ ఇస్తుంది.

దిమ్మ తిరుగుతుందని

మేమంతా ఒకటే. నిన్ను భరించే ఓపిక నాకు లేదు. నీకు ఆఖరి సారి చెప్తున్నా, దీప జోలికి రాకుండా ఉంటావా లేదా? కామెడీ చేస్తున్నా అనుకుంటున్నావా? వార్నింగ్ ఇస్తున్నా. రెచ్చిపోకు జ్యోత్స్న. నేను ఫిక్స్ అయ్యానంటే బ్లైండ్ గా వెళ్లిపోతా. పారిజాతం అంటే ఫ్లవర్ కాదు క్లెవర్. నీకు త్వరలోనే ట్విస్ట్ ఇవ్వబోతున్నా. అప్పుడు నీకు దిమ్మ తిరుగుతుందని పారు చెప్తుంది.

దీప ఎవరంటే?

పిల్ల బాతు బచ్చావు నువ్వు నాకు చెప్తావా? నేను నీ దారికే అడ్డు వస్తా. నువ్వు ఓడిపోతావ్. దీప జోలికి మాత్రం రావొద్దని పారు కౌంటర్ మీద కౌంటర్ వేస్తుంది. అడ్రస్ లేని దాని కోసం సొంత మనవరాలికి అడ్డు తిరుగుతావా? అని జ్యోత్స్న అంటుంది. దీప ఎవరో తెలుసా? అని చెప్పబోయి పారు ఆగిపోతుంది. కార్తీక్ వైఫ్ దీప, నాకు మనవరాలు అని పారు చెప్తుంది.

జ్యోత్స్న, పారిజాతం ఢీ అంటే ఢీ కొడతారు. యుద్ధానికి సిద్ధమని వాదులాడుకుంటారు. మరోవైపు జ్యోత్స్నకు ఎంత ధైర్యం కాకపోతే తన భర్త అని అందరికి చెప్తుందని కార్తీక్ తో దీప అంటుంది. అందరికి నిన్ను భర్త అని చెప్తుంటే ఏం చేస్తున్నావని కార్తీక్ ను అడుగుతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More