Karthika Deepam 2 Today Episode: బావ కావాలి, ఆస్తి కావాలి.. జ్యోత్స్న పగ..దీపను చంపేందుకు నేలపై ఆయిల్..పెళ్లి రోజే కుట్ర
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 7 ఎపిసోడ్ లో దీపకు కార్తీక్ దిష్టి తీయడంపై కాంచనకు అనుమానం వస్తుంది. కార్తీక్, పారు కలిసి జ్యోత్స్న తాట తీయాలనుకుంటారు. పెళ్లి రోజు దీపను చంపేందుకు జ్యో ప్లాన్ వేస్తుంది. నేలపై నూనె పోస్తుంది.
కార్తీక దీపం 2 సీరియల్ బావ, మరదలు మధ్య ఛాలెంజ్ తో హీటెక్కింది. కార్తీక్, దీప సవాలుతో రసవత్తరంగా మారింది. మరోవైపు కార్తీక్ పై కాంచనకు అనుమానం మొదలైంది. దీపకు దిష్టి తీయడంతో ఏదో జరుగుతుందని కాంచన డౌట్ పడుతుంది. మరి కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 7 ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం.

కాంచన అనుమానం
దీప నువ్వు వెళ్లి దీపారాధన చేయ్ అని కార్తీక్ చెప్తాడు. కానీ కాంచన మాత్రం కార్తీక్ నుంచి సమాధానం వచ్చేదాకా వదలేదు. ఏదైనా గండం నుంచి బయటపడితే దిష్టి తీస్తారు, అసలు దీపకు ఏమైందని కొడుకును కాంచన అడుగుతుంది. బయటకు వెళ్తే అసూయతో చూసే ఎన్నో కళ్లు దిష్టి పెడతాయని నువ్వే చెప్పావు కదా అమ్మ, అందుకే దిష్టి తీశానని కార్తీక్ చెప్తాడు.
మనమంటే నచ్చనివాళ్లు దిష్టి పెట్టారని శౌర్యతో కార్తీక్ అంటాడు. వీడు జ్యోత్స్న గురించి మాట్లాడుతున్నాడా? అని కాంచనకు డౌట్ వస్తుంది. బావ భయానికి జ్యోత్స్న చెప్పిన మాటలే కారణం అయి ఉంటాయని దీప అనుకుంటుంది.
దీప ప్రశ్నలు
రాత్రి బెడ్ మీద నిద్రపోకుండా కార్తీక్ ను దీప చూస్తూనే ఉంటుంది. జ్యోత్స్న నీతో ఏం మాట్లాడిందని కార్తీక్ ను అడుగుతుంది. పార్టీలో ఎందుకు కంగారు పడ్డావ్? అత్తయ్య, మామయ్య నీ ప్రవర్తన గురించే మాట్లాడారు అని దీప అడుగుతుంది. ఎప్పటిలాగే ఆస్తుల గురించి జ్యోత్స్న మాట్లాడింది. వీలునామాకు నాకు సంబంధం లేదు, తనే అసలైన సుమిత్ర కూతురని చెప్పానని కార్తీక్ కవర్ చేస్తాడు.
భార్యకు ప్రేమతో
జ్యోత్స్న లాంటి వాళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని దీపతో కార్తీక్ చెప్తాడు. ఏం ఆలోచించకుండా దీపను పడుకోమంటాడు. ఒడిలో పడుకోబెట్టుకుని భార్యను జో కొడతాడు. జ్యోత్స్న ఛాలెంజ్ చేసింది కదా చూద్దాం, ఎలా తట్టుకుంటుందోనని కార్తీక్ అనుకుంటాడు.
పారు, కార్తీక్ కలిసి
అప్పుడే కార్తీక్ కు పారిజాతం ఫోన్ చేస్తుంది. మనవరాలు నిద్రపోతుందా? అని పారు అడుగుతుంది. ఇదంతా నీతో జ్యోత్స్న ఆడిస్తున్న నాటకమని నాకు తెలుసని కార్తీక్ కావాలనే అంటాడు. నేను మీ పార్టీనే. దీపకు దిష్టి తీశావా? కడుపుతో ఉన్న ఆడదాని మీద ఎన్ని కళ్లు పడ్డాయో ఏంటో? జ్యోత్స్న నిన్ను వదిలిపెట్టేలా లేదు. వయసొచ్చి పెళ్లి కాని ఆడపిల్లలకు తిక్క కుదరాలంటే పెళ్లి చేయాల్సిందే. దానికో సంబంధం చూడు. నీకు పారు సపోర్ట్ గా ఉంటుందని పారు తెగ బిల్డప్ గా చెప్తుంది. మనం కలిసి జ్యో తాట తీద్దామని కార్తీక్ అంటాడు.
పెళ్లి రోజు
రేపు మన పెళ్లి రోజు బావ అని దీప నిద్రలో కలవరిస్తుంది. గుర్తుంది మరదలా, ఎలా మర్చిపోతానని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు కార్తీక్. మరోవైపు సరిగ్గా రేపటి రోజునే నా బావ నీ మెడలో తాళి కట్టాడు దీప అని ఫోన్లో కార్తీక్, దీప ఫొటోలు చూస్తూ జ్యోత్స్న మండిపడుతుంది. బావ మీద ఆశలు పెట్టుకుని బతికాను. కానీ నువ్వు వచ్చి ఒక్క పసుపు తాడుతో దూరం చేశావని దీప గురించి జ్యోత్స్న అనుకుంటుంది. నాకు ఈ ఆస్తి కావాలి, భర్తగా బావ కావాలి. రేపు మొదటి పెళ్లి రోజు కదా మర్చిపోలేని కానుక ఇస్తా దీప అనుకుంటూ జ్యో ఏదో ప్లాన్ చేస్తుంది.
ఆశీర్వాదం
పొద్దున కార్తీక్, దీప కలిసి శ్రీధర్, కాంచన ఆశీర్వాదం తీసుకుంటారు. కొడుకు తండ్రికి ఆదర్శంగా నిలబడ్డాడు. దీప మెడలో మూడు ముళ్లు వేసినప్పటి నుంచి మీ దంపతులు ఎన్ని ఇబ్బందిపడ్డారో మేం చూస్తూనే ఉన్నాం. కానీ మీరు ఒకరికొకరు కలిసే ఉన్నారని శ్రీధర్ గొప్పగా చెప్తాడు.
ఇది కార్తీక దీపం
కార్తీక్ అనే మూడక్షరాల పేరు చమురు అయితే, దీప అనే రెండు అక్షరాలు ప్రమిద. మా అనుబంధాన్ని వత్తిగా వేసి వెలిగించిన ఈ దీపం కార్తీక దీపం. దీనికి దేవుడి ఆశీస్సులు, నా తల్లిదండ్రుల ఆశీస్సులున్నాయి. ఈ కార్తీక దీపానికి ప్రతి వసంతం నవ వసంతమే అని కార్తీక్ ఎమోషనల్ గా చెప్తాడు. భార్య భుజాన్ని ప్రేమగా పట్టుకుంటాడు. శౌర్య వచ్చి అమ్మానాన్నకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ సందడి చేస్తుంది. తను గీసిన బొమ్మను చూపిస్తుంది.
జ్యోత్స్న ప్లాన్
డ్యూటీకి వెళ్తామని కార్తీక్, దీప అంటే.. ఈ రోజు మీ పెళ్లి రోజు కాబట్టి డ్యూటీకి వెళ్లొద్దని కాంచన, శ్రీధర్ ఆపుతారు. అత్త ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుని త్వరగా వస్తామని కార్తీక్, దీప వెళ్లిపోతారు. మరోవైపు దీపను చంపేందుకు గుమ్మం దగ్గర ఆయిల్ పోసి జ్యోత్స్న ఎదురు చూస్తుంటుంది. ఈలోగా పారిజాతం డ్యాన్స్ చేసుకుంటూ వస్తుంది.
దీప కాలు జారి
కార్తీక్ ఆ నూనె పక్క నుంచి వస్తాడు. పెద్ద సారు అప్పట్లో పారు ఎన్ని స్టెప్పులు వేసిందో ఏంటో అని కార్తీక్ అడుగుతాడు. ఇక పారు గురించి శివ నారాయణ వెటకారంగా మాట్లాడతాడు. ప్రేమ కవితల పోటీలు పెట్టుకుందామని కార్తీక్ అంటాడు. దీప రాక కోసం జ్యోత్స్న చూస్తుండగా దీప లోపలికి వస్తుంది. నూనె మీద కాలు పడి జారుతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


